ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్‌ పై కోడి కత్తి దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.

kodikatti 04012019

మరో పక్క ఈ కేసు పై విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా నిన్న మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వివరాలను బుధవారం వెల్లడించారు. విపక్ష నేతపై దాడికి సంబంధించిన కేసులో వాస్తవాలు ప్రకటించాలని భావించి, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ అనుమతితో వివరాలు వెల్లడిస్తున్నట్టు సీపీ పేర్కొన్నారు. దీనిలో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో పార్టీ నాయకుడు ధర్మశ్రీతో మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారమే కోడికత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడిలో జగన్‌కు భుజంపై గాయమైందన్నారు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేసినట్టు తెలిపారు.

kodikatti 04012019

విపక్ష నేతపై దాడికి సంబంధించి గతేడాది అక్టోబర్ 18 పథకం రూపొందించాడని, అయితే దసరా సందర్భంగా జగన్ 17నే హైదరాబాద్ వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. జగన్‌పై దాడికి యత్నించిన శ్రీనివాస్, హత్యాయత్నానికి ఉపయోగించిన ఆయుధం కోడికత్తికి రెండు సార్లు పదును పెట్టించాడని తెలిపారు. త్వరలోనే తాను టీవీల్లో కనిపిస్తానంటూ సహచరుల వద్ద పేర్కొన్నాడన్నారు. ఇదే విషయాన్ని హేమలత, షేక్ అమ్మాజీలకు చెప్పినట్టు తెలిపారు. దాడి చేసినప్పుడు శ్రీనివాస్ వద్ద లభించిన లేఖను విజయదుర్గతో పాటు మరో ఇద్దరితో రాయించి, జెరాక్స్ తీయించి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలనుకునే ఈ ఘటనకు పాల్పడినట్టు సీపీ తెలిపారు. దీనిలో భాగంగానే జగన్‌తో సెల్ఫీ తీయించుకుంటానని నమ్మబలికి వైసీపీకి చెందిన ఒక నాయకుని ప్రయేయంతో జగన్ బస చేసిన వీఐపీ లాంజ్‌కు చేరుకున్నట్టు విచారణలో వెల్లడైందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకోవలసి వచ్చిందని నవ్యాంధ్ర హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 24వ తేదీలోగా తగిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లపాటు ఇచ్చిన కేంద్రం.. 2017-18 సంవత్సరానికి కేటాయించిన రూ.350 కోట్లను గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్రప్రభుత్వ ఖాతాలో జమ చేసి.. అదే నెల 15వ తేదీన వెనక్కి తీసేసుకుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గత ఏడాది జూన్‌ 13వ తేదీన ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

court 04012019

ఈ పిటిషన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. కొణతాల తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 46 (2) (3) ప్రకారం.. వెనుకబడిన ఏడు జిల్లాలకు కేటాయించిన నిధుల్ని ఇచ్చినట్లే ఇచ్చి.. కేవలం రాజకీయ కారణాల వల్ల వెనక్కి తీసుకుందని, దీనివల్ల ఆయా జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలోని అంతరార్థం తెలియడం లేదన్నారు. అందువల్ల ఆ నగదును తక్షణం రాష్ట్రానికి ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

court 04012019

అదేవిధంగా ప్రజల కోసం పోరాడుతూ, కోర్టును ఆశ్రయించిన తమకు ప్రభుత్వం కూడా మద్దతివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు పిటిషనర్‌ వాదనను తాము సమర్థిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం.. ఆ రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలియజేస్తూ, అందుకు కారణాలను వివరిస్తూ.. హైకోర్టు సెలవులు ముగిసిన అనంతరం 24వ తేదీకల్లా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల క్రితం, మోడీ ఈ విషయం పై రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరి, ఇదే విషయం కోర్ట్ కి చెప్తారో, అసలు ఏమి చెప్తారో చూడాలి..

ఈ రోజు ఢిల్లీ వేదికగా ఆంధ్రా వారికి, రెండు అవమానాలు జరిగాయి. రెండూ మన హక్కులు అడిగినందుకు. ఇచ్చిన హామీలు, చట్టంలో ఉన్నవి అమలుపరచండి అని అడిగినందుకు, మోడీ ఇచ్చిన బహుమతి ఇది. సభ లోపల ఒకలా, సభ బయట ఒకలా అవమానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పార్లమెంట్‌ ముట్టడికి యత్నించింది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ తదితర డిమాండ్లతో ముట్టడికి బయలుదేరిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను దిల్లీ పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీ ఛార్జి చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు దిల్లీలో గత రెండ్రోజులపాటు నిరసనలు చేపట్టాయి. వీరి ఆందోళనలకు తెదేపా ఎంపీలు మద్దతు తెలిపారు.

delhi 03012019 2

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాయి. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రత్యేక సాధన సమితి, ప్రజా విద్యార్థి సంఘాల కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పలువురు కిందపడిపోయారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారు పీఎస్‌లో ఆందోళన కొనసాగించారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీసీ నేతలు పరామర్శించారు.

delhi 03012019 3

ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్ సభ సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్ షాకిచ్చారు. ఆందోళన విమరించి వెళ్లి తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని లేదంటే సస్పెండ్ చేస్తా అని హెచ్చరించారు. మా హక్కుల పై మాట్లడేదాకా మేము ఆందోళన విరమించం అని చెప్పటంతో, 12 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఈరోజు ఆదేశాలు జారీచేశారు. సస్పెన్షన్ నేపథ్యంలో సభ నుంచి బయటకు వెళ్లాలని కోరగా అందుకు టీడీపీ నేతలు నిరాకరించారు. లోక్ సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విధంగా, కేవలం మన హక్కులు అడిగినందుకు, ఢిల్లీలో ఆంధ్రా వాడికి జరిగిన అన్యాయం ఇది.

విభజన హామీలు అమలు చెయ్యలేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంది కేంద్రం. హామీలు అమలు గాలికి వదిలేసి, హక్కుగా వచ్చేవి కూడా ఇవ్వకుండా, కక్ష సాధిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్ట్ లను అడ్డుకుంది. కేంద్రం ఎంత అడ్డుకున్నా, చంద్రబాబు తనకు ఉన్న అనుభవం, పలుకుబడి, గుర్తింపుతో, ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నారు. ఇదే కోవలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తారు. అక్కడ పారిశ్రామిక వేత్తలను కలిసి, మన రాష్ట్రంలో పెట్టుబడులు గురించి వివరిస్తూ, పెట్టుబడులు తెస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం కన్ను పడింది. కక్ష సాధింపులకు ఇది పరాకాష్ట. చివరకు మన సొంతగా నిలబడతాం అంటున్నా, కేంద్రం కుదరదు అంటుంది.

davos 04012019 2

ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు పెట్టడం ఇదే తొలిసారి. దావోస్‌ పర్యటనను ఏడు రోజులకు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి వెంట 14 మంది ప్రతినిధులు వెళ్లేందుకు అనుమతి కోరగా... నలుగురికే అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ నెల 20న బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, ప్రభుత్వాల ప్రతినిధులతో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు.

davos 04012019 3

ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే దేశానికి లాభం కాదన్నట్లుగా ఉంది మోదీ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదన్నమాట అయితే..

Advertisements

Latest Articles

Most Read