పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును ఉపసంహరించుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం మరింత బలం చేకూర్చింది. రూ.2 వేల నోట్ల వల్ల మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్నట్టు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను ఆదేశించినట్టు తెలుస్తోంది. 2016 నవంబరులో చివర్లో ఈ నోట్లను ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ముద్రణను నిలిపివేసినా నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

modi 03012019 2

రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించింది. అటువంటిదేమీ లేదంటూ లోక్‌సభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, తాజాగా వాటి ముద్రణను నిలిపివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నోట్ల ముద్రణను నిలిపిస్తున్నట్టు తెలిపిన ఆర్బీఐ నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని, ఈ విషయంలో అనవసర భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే అసలు పెద్ద నోట్లు తేవటం ఎందుకు, ఇప్పుడు ముద్రణ ఆపివేయ్యటం ఎందుకో ప్రజలకు అర్ధం కావటం లేదు. మొదటి నుంచి చంద్రబాబు లాంటి వాళ్ళు, పెద్ద నోట్లు వద్దు అని పోరాటం చేస్తున్నారు.

అయితే 500, 1000 నోట్లు రద్దు చేసి, రెండు వేల నోట్లు తీసుకోవచ్చి, దోపిడీదారులకు మరింత సులువుగా పనయ్యేలా చేసారు. 2018 మార్చి నాటికి 18.03 ట్రిలియన్ల రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.6.78 ట్రిలియన్లుగా ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.7.73 ట్రిలియన్ల రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. రోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేయడం కూడ రాజకీయంగా బీజేపీ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ నిమిషాణ మోడీ మీడియా ముందుకు వచ్చి, మిత్రోం అంటారో అని ప్రజలు ఖంగారు పడుతున్నారు.

మొదట నుంచి టీఆర్ఎస్ - వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు అందరికీ తెలిసిందే. తెలంగాణాలో మిషన్ భాగీరధ కాంట్రాక్టులు జగన్ మనుషులకి ఇవ్వటం దగ్గర నుంచి, మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్, టీఆర్ఎస్ సపోర్ట్ గా చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. అయితే, మొన్నటి నుంచి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ కేసీఆర్ పదే పదే చెప్తూ, కవ్విస్తున్నారు. టీఆర్ఎస్‌తో జగన్ కుమ్మక్కయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విమర్శలు ఇలా కొనసాగుతుండగానే చిత్తూరు జిల్లాలో బయటపడిన వ్యవహారం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. నిజంగానే వైసీపీ నుంచి టీఆర్ఎస్‌కు రిటర్న్ గిప్ట్‌లు అందాయని భావించేలా ఆ వ్యవహారం ఉంది. రాబోయే ఎన్నికల్లో, కేసీఆర్, జగన్ కు ఎలా సహకరిస్తాడో చెప్పే ఉదాహరణ ఇది.

kcr 03012019 2

వైసీపీ నేతలు పంచిన గోడ గడియారాల్లో కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతల ఫోటోలు ఉండడం ఇప్పుడు రాజకీయంగా ధుమారం రేపుతోంది. రాబోయే ఎన్నికల కోసం వైసీపీ నేతలు ఇప్పటి నుంచే తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు ఇంటింటికి గోడ గడియారాలు పంచుతున్నారు. మదనపల్లి నియోజకవర్గాల్లో పంచిన గడియారాల కవర్‌పై జగన్‌తోపాటు మాజీ ఎంపీ మిధున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఫోటోలు ఉన్నాయి. వైసీపీ నేతల ఫోటోల కింద మరో స్టిక్కర్ ఉందని గుర్తించారు. ఫోటో అడుగున ఇంకోదో ఉందని భావించారు. వెంటనే కవర్ తీసి చూడగా అవాక్కవడం వారి వంతైంది. కేసీఆర్, టీఆర్ఎస్ నేతల ఫోటోలు కనిపించాయి. ఇది రాజకీయంగా కలకలం రేపింది.

kcr 03012019 3

గత కొంతకాలంగా టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చెప్పారు. ఏ పార్టీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందో బయటకు చెప్పలేదు. ఇదే సమయంలో టీఆర్ఎస్, వైసీపీ ములాఖత్ అయ్యాయని టీడీపి ఆరోపిస్తోంది. దీనికి తగ్గట్టే అక్కడ అసలు పోటీనే చెయ్యని వైసిపీ, కేసీఆర్ గెలిస్తే, ఇక్కడ సంబరాలు చేసుకుంది. వైసీపీ ఆధ్వర్యంలో,కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసారు. ఆంధ్రాలని కుక్కలు, రాక్షసులు, ఆంధ్రులు తినేది పెంట అంటూ అవమానించిన కేసీఆర్ కు, ఏపి ప్రతిపక్ష నేతగా ఉంటూ, కేసీఆర్ భజన చేస్తున్నాడు జగన్.

విజయవాడ నగర ప్రజలకు నెలాఖరులోగా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ముందుగా ఎంజీ రోడ్డులో ఎంపిక చేసిన 55 ప్రాంతాల్లో దీన్ని ప్రారంభిస్తారు. దశల వారీగా అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అనిల్‌చంద్ర పునేఠా సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఉచిత వైఫై ప్రణాళికను అధికారులు వివరించారు. అలాగే రాష్ట్రంలో 110 పురపాలక సంఘాల పరిధిలో 970 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు ఫిబ్రవరి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో ఏపీ డిజిటల్ ఇన్ఫా, ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం సమీక్ష నిర్వహించారు.

freenet 03012018 2

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నాటికి 1000 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా ఏపీ ఫైబర్ నెట్ పెట్టుకుందన్నారు. 53 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టులో గూగుల్ సంస్థ పాలుపంచుకోనుంది. గూగుల్ సంస్థ నెట్ సేవలను ఉచితంగా అందచేస్తుంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం ప్రభుత్వానికి గూగుల్ చెల్లించనుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇంటర్నెట్ సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ప్రజా ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా 4000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు సీఎస్‌కు అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి రోజులో పలు విడతలుగా 40 నిమిషాలపాటు 15 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఉచిత వైఫై సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వైఫై బాక్సులు అమర్చే ప్రాంతం నుంచి 40 మీటర్ల విస్తీర్ణం వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

freenet 03012018 3

ఏపీ డిజిటల్ ఇన్‌ఫ్రాతో జాయింట్ వెంచర్‌తో ఒప్పందం చేసుకున్న కంపెనీకి ప్రభుత్వ స్థలాలను న్యాయమైన ధరలకు అద్దెకు ఇవ్వాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం 30.33 శాతం ప్రభుత్వానికి సమకూరుతుందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 5జి సేవల కోసం 12000 టవర్లు అవసరం ఉంటుందని, ప్రైవేట్ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థలకు, వివిధ శాఖలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, భవనాలపై ఏర్పాటు చేసే టవర్లకు ఎంత అద్దె వసూలు చేయాలనే దానిపై పొరుగు రాష్ట్రాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.

మొన్నటి దాక అమరావతి అంటే భ్రమ్రావతి అని, అక్కడ ఏమి జరగటం లేదని, అన్నీ బొమ్మలే అంటూ, జగన మోహన్ రెడ్డి, సాక్షి చేసిన విష ప్రచారం చూసాం. అయితే వీరి నోర్లు ముపిస్తూ, చంద్రబాబు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉచితంగా అమరావతిలో జరుగుతున్న పనులు చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు అమరావతిలో, అమ్మో ఇంత పని జరిగిందా, ఇంత పని జరుగుతుందా, ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారా అంటూ, ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్ర రాజధాని అమరావతిని సందర్శించాలనే ఉత్సాహంతో ఉన్న వారందరినీ తీసుకువెళ్లి, తీసుకురావడమే కాకుండా ఉచిత భోజన వసతిని కల్పించనుంది. విద్యార్థులకు సెట్‌వెల్‌ అధికారులు, రైతులకు వ్యవసాయ అధికారులు, పాత్రికేయులకు జిల్లా పౌర సంబంధ అధికారి బాధ్యత వహిస్తారు. వీరే ఎంపిక చేసి తీసుకెళతారు.

amaravati 03012019 2

ప్రపంచ శ్రేణి రాజధానిని నిర్మించాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. దీనికి తగ్గట్టుగా ఇటీవలే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తాత్కాలిక భవనాలు ఉండనే ఉన్నా యి. ఇవి కాకుండా హైకోర్టు దగ్గర నుంచి సచివాలయం వరకు డిజైన్లను ఆమోదించారు. అంతర్జాతీయ ర్యాంకు కలిగిన డిజైన్లను ప్రభు త్వం ఆమోదించింది. ఇంకా కొత్త రాజధాని ఇంకెన్నాళ్ళు? ఎప్పటిలోపు పూర్తి చేస్తారు ? అనే ప్రశ్నలకు సమాధానంగా చలో అమరా వతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్షంగా నిర్మాణ పనులను వీక్షిస్తే.. ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాస్తా తేలిపోతాయని, రాజధాని నిర్మాణం సజావుగా సాగుతుందన్న భావన ప్రజల్లో మరింతగా బలపడగలదని అంచనాకు వచ్చారు.

amaravati 03012019 3

ఒక రోజు యాత్ర!.. అమరావతి యాత్రికులకు బస్సులు, భోజనం సమకూర్చే పనిని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, యాత్రకు అవసరమైన నిధులను ఏపీసీఆర్డీయే నుంచి వెచ్చించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాత్ర ఒక రోజు ఉంటుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్తోంది. ప్రాజెక్టు పనులను రైతులు, యువత, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేలా యాత్రలు నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల నుంచీ ప్రతిరోజూ బస్సులు, ఇతర వాహనాల్లో జనం అక్కడికి వెళ్తున్నారు. వారి నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. వేల మంది కార్మికులు, అధికారులు, నిపుణులు పడుతున్న శ్రమను, భారీ యంత్ర పరికరాలను, నిర్మాణ సామగ్రిని కళ్లారా చూసి మరిచిపోలేని అనుభూతిని చెందుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read