కొత్త సంవత్సరం తొలిరోజే ప్రధాని మోదీ మీడియాకు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్‌కు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. 95 నిమిషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూ సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ప్రత్యేకత సంతరించుకుంది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సమస్యలను మోదీ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అయితే ఇది ఒక ప్లాన్ చేసి, ఎడిట్ చేసిన ఇంటర్వ్యూ. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పటి వరకు మోడీ ఎదుర్కోలేదు అనే విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం ఇలా, ఒక ప్లాన్డ్ ఇంటర్వ్యూ ఇచ్చి, కావాల్సిన ప్రశ్నలు అడిగి, అలాగే కావలసిన సమాధానాలు ఎడిట్ చేసి, అది మీడియాకు ఇచ్చి, నేను చాలా ధైర్యవంతుండిని, 56 అంగుళాల ఛాతీ, అంటూ బిల్డ్ అప్ లు ఇవ్వటం తప్ప, ప్రెస్ ను ఎదుర్కునే దమ్ము లేని మొదటి ప్రధాని. అయితే, ఇదే ఇంటర్వ్యూ లో చంద్రబాబు పై మోడి విమర్శలు చేసారు.
ఈ ఇంటర్వ్యూ లో, కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు పై ప్రశ్న అడగగా, ఒక ప్రధాని హోదాలో ఉండి కూడా, ఎబ్బే అసలు అదేంటో నాకు తెలియదు, అసలు ఆయన ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయం కూడా నాకు తెలియదు అని మోడీ చెప్పారు. ఇదే సందర్భంలో చంద్రబాబు పై విమర్శలు చేసారు. ఒక పక్క కేసీఆర్ ఫ్రంట్ తెలియదు అంటూనే, మోడీ కోసమే కేసిఆర్ ఫ్రంట్ పెడుతున్నాడు అంటూ, చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు తెలంగాణ పై చంద్రబాబు ద్వేషంతో రాజకీయం చేయాలనుకున్నారు అంటూ, ఒక ప్రధాని అని సోయ కూడా లేకుండా, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి, ఆ ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదు,అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదు అంటూ మోడీ మాట్లాడారు. అయితే ఇక్కడ చంద్రబాబు పోటీ చేసింది 13 స్థానాలు, అదే చోట 119 స్థానాల్లో పోటీ చేసి, 103 చోట్ల డిపాజిట్ లు కోల్పోయిన బీజేపీ గురించి మాత్రం ప్రధాని గారు మర్చిపోయారు. వాళ్లకు బలం ఉన్న హిందీ బెల్ట్ లో మూడు రాష్ట్రాల్లో ఘోర పరాజయం మర్చిపోయారు.
అయితే ఇదే విషయం పై చంద్రబాబు అదే స్థాయిలో స్పందించారు. ఈ రోజు శ్వేత పత్రం విడుదల సందర్భంగా, విలేకరులు ఈ ప్రస్తానవ తేగా, చంద్రబాబు స్పందించారు. ప్రధాని మాటలు వింటుంటేనే తెలుస్తుంది కదా, ఎవరూ ఏంటో అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణాలో మేము ఓడిపోయాం అంటున్నారు, ఈయన గెలిచాడా ? డిపాజిట్ లు పోయాయి, అయినా కేసీఆర్ గెలిస్తే ఈయన సంబరం ఏంటి ? తెలంగాణాలో ఈయనే వచ్చి ప్రచారం చేస్తే, 103 చోట్ల డిపాజిట్ పొతే, దాని గురించి చెప్పకుండా, కేసీఆర్ గెలుపును ఈయన ఎంజాయ్ చేస్తూ, మమ్మల్ని విమర్సిస్తున్నాడు, మహా కూటమి ఉనికే లేదు అన్నప్పుడు, ఎందుకు భయం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాల పై దండ యాత్ర చేస్తూ, కేసులు పెట్టి విదేస్తూ, దేశంలో అన్ని వ్యవస్థలని బ్రస్టు పట్టిస్తూ, దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళ్తు, ప్రతి రోజు ప్రజలని ఇబ్బంది పెడుతుంటే, ఇలాంటి ప్రధానిని దించటానికి అందరం ఏకం అవుతున్నాం, దీంట్లో తప్పు ఏంటి ? 22 పార్టీలు మద్దతు పలికితే, కేసీఆర్ ఈ ఫ్రంట్ లో ఎందుకు లేడు అంటూ, చంద్రబాబు ప్రశ్నించారు. మోడీ గాడు, సన్నాసీ అంటున్నా, కేసీఆర్ ను ఒక్క మాట అనరు అని, ఇదేమి లాలూచీనో ప్రజలే ఆలోచించలాని అన్నారు.