తెలంగాణ సీఎం కెసిఆర్ చేతకాని మాటలకు.. సోయలేని మాటలకు.. అయన అన్న లఫంగి మాటలకు భయపడేవాళ్లు ఎవరు లేరన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 2009 లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న లఫంగి ఎవరని ప్రశ్నించిన అయన గెలిచి క్యాబినెట్ వేయను చేతకాక.. పిరికిపందలాగా సోయ లేకుండా మాట్లాడుతున్నావా? కాలం కలిసివచ్చి గెలిచిన సీఎం నక్షలైట్లకు భయపడి విజయవాడ ఆటో నగర్ లో దాక్కున్న సంగతి మర్చిపోయావా? ఐదేళ్లు ఎలాగూ తిరిగి వస్తుంది.. నువ్వు అన్న ప్రతిమాట నీకే వర్తిస్తుంది అన్న సంగతి తెలుసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు తెరిస్తే పీకుతా పీకుతా అనే మాటలకు భయపడేవాళ్లు ఎవరు లేరన్న దేవినేని ఏం పీకుతావు? అని ప్రశ్నించారు.
అప్పులలో కష్టాలలో ఏపీ ప్రభుత్వం ఒకటిన్నరలక్ష రుణమాఫీ చేస్తే నువ్వు చేసింది బోడి లక్ష. అప్పుల్లా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి చూసి నేర్చుకో.. బాధ్యత లేకుండా మాట్లాడితే చెల్లవన్నారు. కెసిఆర్ పోలింగ్ అక్రమాలు బయటకు వస్తాయన్న దేవినేని.. రంకు, బొంకు దాగవని తెలుసుకో.. పార్లమెంటు ఎన్నికల వరకు ఓపికగా మంచిగా.. బాధ్యతగా మాట్లాడ్డం నేర్చుకోవాలన్నారు. దేశంలో ఏ నాయకుడిని అడిగినా నీ స్థాయి ఏంటో.. చంద్రబాబు స్థాయి ఏంటో చెప్తారు.. తెలుసుకొని మాట్లాడాలన్నారు. మా నాయకుడు నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నిబద్దత నేర్పించారని.. నీలా నీతిమాలిన మాటలు నేర్పలేదన్నారు.
డబ్బు మదంతో అధికారం తలకెక్కి కేసీఆర్ సోయ లేకుండా మాట్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గెలిచానన్న అహంకారంతో ఎగిరెగిరిపడుతున్నావ్ అంటూ విమర్శించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ నిలదీశారు. దొంగనోటు కేసులో జైలుకెళ్లబోతున్న నిన్ను కాపాడి మంత్రిని చేసిన విషయం మరచిపోయావా అంటూ నిలదీశారు. కేసీఆర్ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని సూచించారు. ఒకప్పుడు నక్సలైట్లకు భయపడి బెజవాడ వచ్చి దాక్కుంది గుర్తులేదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. తాను హైదరాబాద్ వెళ్లనని బెజవాడలోనే ఆటో తిప్పుకుని బతుకుతానన్నది మరచిపోతే ఎలా అంటూ నిలదీశారు. ఏదోకాలం కలిసి వచ్చింది రెండోసారి సీఎం అయ్యావ్ అధికారంతో మిడిసిపడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఏదో పీకుతానని బెదిరిస్తున్నావ్ ఏం పీకుతావ్ పీక్కో అంటూ సవాల్ విసిరారు.