తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజల్లో పార్టీల ప్రభావం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లభించే స్థానాలపై ఊహాగానాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు భాజపా నుంచి కాంగ్రెస్‌ చేతికి వెళ్లిపోయాయి. ఇటు తెలంగాణలో తెరాస జెండా ఎగరగా, మరో రాష్ట్రమైన మిజోరంలో ప్రాంతీయ పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా అయిదు రాష్ట్రాల్లోనూ భాజపా ప్రభావం ఏమీ లేదు. అయితే ఈ ఫలితాలను బట్టి చూస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

modishah 29122018

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించింది. అయితే ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంఖ్య సగానికి సగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2014లో ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా భాజపాకు 62స్థానాలు దక్కాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్య 30కి తగ్గనుందని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభావం బాగా పెరిగినందున ఆ పార్టీకి సీట్ల సంఖ్య పెరగనుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అటు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ఇతర భాజపా ముఖ్యమంత్రులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించకపోవడం గమనార్హం.

modishah 29122018

రాజస్థాన్‌లో గతంలో 25కు 25సీట్లు భాజపాకే దక్కగా, ఈసారి 13 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 29ఎంపీ స్థానాలు ఉండగా, గతంలో భాజపా 27చోట్ల గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో 11 ఉండగా పదింటిలో విజయం సాధించింది. 65లో మిగిలిన మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. అయితే ఈసారి ఇందులో చాలా సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోగా కమలదళం పుంజుకోకపోతే ఎంతో ముఖ్యమైన మూడు రాష్ట్రాల్లో చాలా నష్టపోవాల్సి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఈ ఏడాది కౌలు రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్ల కింద ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు రూ.4,621 కోట్లు పంట రుణాలు ఇచ్చాయి. గత నాలుగేళ్లలో కౌలు రైతులకు రూ.4,662 కోట్ల పంట రుణాలు ఇవ్వగా, ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటి వరకే దాదాపు అంత ఇవ్వడం విశేషం. కౌలు రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగు అనుకూలత లేక ఖరీఫ్‌లో రైతులు పూర్తి స్థాయిలో పంటలు వేయలేకపోయారు. అలాగే, రబీ సీజన్‌ ముగింపు దశకు వస్తున్నా, 44% మాత్రమే పంటలు పడ్డాయి. దీంతో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.

farmers 29122018

ఖరీఫ్‌లో 97% లక్ష్యం సాధించగా, రబీలో ఇప్పటి వరకు 46% మాత్రమే రుణాలిచ్చారు. అయితే, బ్యాంకర్ల కమిటీ లక్ష్యంలో 61% పైగా రుణాలిచ్చారు. పంటల సాగులో ఏటా కౌలురైతుల సంఖ్య పెరుగుతున్నందున, వీరికి కూడా వ్యవసాయానికి పెట్టుబడి రుణాలివ్వాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల కమిటీని ఆదేశించారు. దీంతో రైతులతో పాటు కౌలురైతులకూ బ్యాంకర్లు రుణాలిచ్చారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల్లో దాళ్వా వరి సాగు పూర్తయ్యే నాటికి కౌలు రైతుల రుణ లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్ల కమిటీ భావిస్తోంది. ఈ ఏడాది కృష్ణా జిల్లాలో అత్యధిక సంఖ్యలో కౌలు రైతులకు పంట రుణాలు లభించాయి.

farmers 29122018

అయితే, రుణ మొత్తంలో పశ్చిమ గోదావరి జిల్లా కౌలురైతులకే అధికంగా దక్కింది. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఎల్‌ఈసీ, సీవోసీ కార్డులన్న కౌలురైతులు, రైతు మిత్ర, జాయింట్‌ లైబిలిటీ గ్రూపులకు చెందిన 10,46,420 మందికి రూ.4621.8 కోట్లు పంపిణీ చేశారు. అందులో పశ్చిమగోదావరి జిల్లాలో 2,87,995 మందికి రూ.1550.4 కోట్లు ఇవ్వగా, కృష్ణా జిల్లాలో 3,41,151 మందికి రూ.1360.2కోట్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,49,012 మందికి రూ.856.8 కోట్లు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో అతితక్కువగా 408 మందికి రూ.4.3కోట్లు అందాయి.

ఏపి ప్రజల పై నిలువెత్తు విషం చిమ్మే కేసీఆర్, కళ్ళు మళ్ళీ మన పై పడ్డాయి. హైదరాబాద్ మన కష్టంతో నిర్మిస్తే, దాని ఫలాలు అనుభవిస్తూ, మనలను బయటకు గెంటినా, రాజధాని లేకపోయినా, కంపెనీలు లేకపోయినా, జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా, నవ్యాంధ్ర ప్రయాణంలో ఎలాంటి కష్టం లేకుండా చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారు. సంక్షేమం పరుగులు పెడుతుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. రాజధాని నిర్మాణం జరుగుతుంది. పట్టిసీమతో నీళ్ళ చింత తీరి, పోలవరంతో సాస్వత పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నాం. ఇన్ని జరుగుతుంటే, చంద్రబాబు ఇంతలా మన రాష్ట్రాన్ని పరిగెత్తిస్తుంటే, హైదరాబాద్ ముఠా మన పై కక్ష కట్టింది. ముందుగా అక్కడ నుంచి జగన్, పవన్ లని పార్ట్ టైం రాజకీయాలు చెయ్యటం కోసం ఇక్కడ దించారు.

kcrmodi 29122018 2

వీరికి కేసీఆర్ తోడు. వీరందరికీ పెద్దన్న, మోడీ. ఏపి రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలి, అభివృద్ధి ఆగిపోవాలి, చంద్రబాబుని దించాలి అనే కుట్ర బీజేపీ ఎప్పుడో పన్నింది. కాని పాత్ర దారులు, జగన్, పవన్ సరిగ్గా పండిచలేకపోయారు. వీరి ప్లాన్ లు అన్నీ బెడిసికొట్టాయి. అందుకే ఇప్పుడు కొత్త పాత్ర దారిని రంగంలోకి దించారు ఢిల్లీ పెద్దలు. ఆ పాత్ర దారుడే కేసీఆర్, అతని చెంచా ఒవైసీ. వీరిద్దరినీ తెలంగాణా నుంచి ఏపి రాజకీయాల్లో, జగన్, పవన్ లకు తోడుగా దింపే ప్లాన్ వేసారు. దీనికి తగ్గట్టుగానే, స్క్రిప్ట్ అంతా అందించటానికి మోడీ, కేసీఆర్ ని ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీ నుంచి రాగానే, తెలంగాణా రాష్ట్రం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకుండా, కేవలం ఏపి నాశనం కోసం, ప్రెస్ మీట్ పెట్టారు.

kcrmodi 29122018 3

ఇదంతా మోడీ, అమిత్ షా ఇచ్చిన స్క్రిప్ట్. ఇప్పటికే ఏపికి ప్రత్యెక హోదా గురించి, కేసిఆర్ కుదరదు, నేను అడ్డం పడతా అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు స్క్రిప్ట్ ప్రకారం, ఏపిలో అడుగు పెట్టాలి, జగన్ కు తోడు ఉండాలి కాబట్టి, ఈ రోజు మేము ప్రత్యెక హోదాకు అనుకూలం, మోడీకి ఉత్తరం రాస్తా, కాని ఇండస్ట్రీస్ కి ఇచ్చే రాయతీలు మాత్రం, మాకు ఇవ్వాలి అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. అంటే, ప్రత్యేక హోదాకి అనుకూలం అని ఇప్పుడు కేసిఆర్ చెప్పగానే, స్క్రిప్ ప్రకారం జగన్, పవన్, కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తి, ఆయన్ను ఏపి తీసుకువచ్చి, ఇక్కడ ఆ బూతులు, చంద్రబాబు పై తిట్టించాలని, తద్వారా రాజకీయంగా చంద్రాబాబుని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేసారు. ఇలాంటి నీచ రాజకీయం చేస్తున్న వీళ్ళకి, ఏపి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.

బీజేపీయేతర పార్టీల ఐక్యఫ్రంట్‌తో ప్రధాని మోదీని ఢీకొనేందుకు ఇకపై వ్యూహాత్మక అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. చంద్రబాబు నేతృత్వంలో రూపొందించిన 17 జాతీయ స్థాయి అంశాలతో కూడిన 29 పేజీల అజెండానే ముఖ్యాంశంగా, నేతలతో చర్చలు జరిగాయి. ‘సేవ్ నేషన్- సేవ్ డెమోక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష, బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు చంద్రబాబు అందించారు. ఇందులో ప్రధానంగా స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో బీజేపీ విఫలమైన తీరును వివరించారు. గత నాలుగేళ్లుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా కంపెనీల కొమ్ముకాస్తూ రైతులకు క్లయిమ్‌ల విషయంలో ఏ రకమైన అవకతవకలు జరిగాయనేది విశదీకరించారు.

modi paiyuddham 29122018 2

గత నాలుగేళ్లుగా రైతులు చెల్లించిన ప్రీమియం విలువ రూ 17వేల 796 కోట్లు కాగా 2,767 కోట్లు మాత్రమే క్లెయిమ్‌లు చెల్లించారని, 15029 కోట్ల మేర బీమా కంపెనీలు లబ్ధి పొందిన తీరును లేవనెత్తారు. లాభాలనార్జించే ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)ను నిర్వీర్యం చేసి విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, జాతీయ స్థాయిలో ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రధానమంత్రికి అనుకూలమైన గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారులను సీబీఐ వంటి సంస్థల్లో పదోన్నతిపై నియమించిన వైనంతో పాటు అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సర్కారియా కమిషన్ నివేదికకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు.

modi paiyuddham 29122018 3

ఆరోపణలపై స్పందించని, మీడియా సమావేశాలు నిర్వహించని మొదటి ప్రధానిగా మోదీ నిలిచారని విమర్శించారు. రూపాయి విలువ పతనం, రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష, పీఎన్‌బీ స్కాం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా, సీబీఐపై అవినీతి ఆరోపణలు, ప్రధానమంత్రి భాగస్వామ్యం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, జీడీపీలో వ్యత్యాసం తదితర అంశాల్లో మోదీ సర్కార్ వ్యవహారశైలిని గణాంకాలతో సహా వివరిస్తూ భారతదేశం సౌర్వభౌమాధికారం, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనకు మద్దతివ్వాలని కోరుతూ అజెండాకు రూపకల్పన చేశారు.

Advertisements

Latest Articles

Most Read