ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఖరీదైన వైద్య చికిత్సగా మారింది. ఓ మాదిరి సౌకర్యాలు కల్గిన ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లోనూ సుఖ ప్రసవానికి రూ.15 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఇక సిజేరియన్‌ చేస్తే రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా చెల్లించాల్సిందే. దీంతో పేద, మధ్య తరగతి గర్భిణులు ప్రైవేటు వైద్యానికి దూరమవుతున్నారు. ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులపై ఆధార పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ప్రసవం పొందే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లించనుంది. దీన్ని జనవరి నుంచి అమలు చేయనున్నారు.

garbhini 29122018

ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పేదలు కాకుండా, మధ్య తరగతి ప్రజలు కూడా వస్తున్నారు. ఇక్కడ వైద్య చికిత్స మెరుగ్గా ఉండటం, ఎన్టీఆర్‌ బేబి కిట్‌, రానుపోను అంబులెన్స్‌ ఏర్పాటు, జేఎస్‌వై పంపిణీ.. వంటి సౌకర్యాలు కల్పిస్తుండటం, ప్రైవేట్‌లో ఫీజులు చెల్లించలేక పోవడం.. వంటి కారణాలతో గవర్నమెంట్ హాస్పిటల్స్ కే ఎక్కువమంది వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ఉచిత ప్రసవాలను జత చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. గురువారం విడుదల అయిన ఉత్తర్వుల ప్రకారం, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం కింద లబ్ధిదారులైన గర్భిణులకు నిర్వహించే వైద్య పరీక్షల నుంచి కాన్పు వరకు అన్నీ ఉచితంగా నిర్వహిస్తారు. పూర్తి ఉచితంగా లభించే ఈ సేవలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య గురువారం జీవో జారీ చేశారు. ఈ సేవలకు సంబంధించిన ప్యాకేజీలను కూడా జీవోలో పొందుపరిచారు.

garbhini 29122018

ప్రసూతి కాన్పు సేవలను ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం పరిధిలోకి చేర్చడంతో ప్రతి నెల గర్భస్థ శిశువు ఎదుగుల పరీక్షలతో పాటు గర్భిణులకు రక్త పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తారు. కాన్పు కోసం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు తరలించేందుకు 108 వాహన సదుపాయం, డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్లడానికి తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సేవలు అందిస్తారు. ప్రైవేటు వైద్యశా లల్లో ఉచితంగా కాన్పు, సిజేరియన్‌ ఆపరేషన్‌ పొందేందుకు గర్భిణులకు ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్డు లేదా తెలుపు రంగు రేషన్‌ కార్డు ఉండాలి. ఏ ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలనుకుంటున్నారో అక్కడ పేరు నమోదు చేయిం చుకోవాలి. సాధారణ ప్రసవంతో పాటు సిజేరియన్‌ కాన్పు చేసేందుకూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది పక్కాగా అమలైతే తల్లీ బిడ్డ సంరక్షణకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. మరణాల రేటు కూడా గణణీ యంగా తగ్గుతుందని ప్రసూతి వైద్య నిపుణులు చెబుతున్నారు.

కనకదుర్గా ఫ్లై ఓవర్‌ భవితవ్యంపై నెలకొన్న చిక్కుముడి వీడింది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ను ఒడ్డున వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. కేంద్రం నుంచి నిధుల విడుదలకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు చెల్లించేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరు కావటంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు తిరిగి పట్టాలెక్కాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దుర్గా ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టు సంస్థ కొద్దినెలలుగా కార్మికులకు సరిగా జీతాలు చెల్లించలేకపోతోంది. వరుసగా నాలుగునెలల నుంచి జీతాలను చెల్లించకపోవటంతో ఓపిక పట్టిన కార్మికులు మెరుపు సమ్మెకు దిగటంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి.

flyover 29122018

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో సోమా ప్రతినిధులను ఆగమేఘాల మీద గురువారం సాయంత్రం సచివాలయానికి పిలిపించారు. రాజధానిలో శంకుస్థాపనలు ఉన్నందున సీఎం వారితో సమావేశం కాలేకపోయారు. సీఎం పాల్గొనలేకపోయినా వ్యక్తిగత కార్యదర్శి రాజమౌళి సమక్షంలో అధికారులతో సమావేశం కావాలని సూచించారు. సోమా ఆర్థిక ఇబ్బందుల గురించి సీఎంవో అధికారులు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.6 కోట్ల బిల్లులకు సంబంధించి నిలిచిపోయాయని సోమా ప్రతినిధులు తెలిపారు. దీనిపై రీవాల్యుయేషన్‌ త్వరగా పూర్తిచేసి కేంద్ర స్థాయిలో మాట్లాడి త్వరగా బిల్లు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

flyover 29122018

శనీశ్వరాలయం దగ్గర చేపట్టిన వయాడక్ట్‌ పనులకు సంబంధించిన రూ.6.50 కోట్ల బిల్లులకు కూడా తమకు స్పష్టత లేదని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ పనుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని గతంలో నిర్ణయించటంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణం బిల్లులు పెట్టి క్లెయిమ్‌ చేసుకోవాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. దీంతో సోమా సంస్థకు గొప్ప ఊరట లభించినట్టు అయింది.అతి త్వరలో కాంట్రాక్టు సంస్థకు అటు కేంద్ర బిల్లులు, ఇటు రాష్ట్ర బిల్లులు కలిపి రూ.12 కోట్లు సర్దుబాటయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు మరో ఊరట లభించింది. మెరుపు సమ్మెలోకి దిగిన కార్మికులు కూడా పట్టు సడలించారు. సోమా ప్రతినిధులు పండుగ లోపు అంటే జనవరి 10 వ తేదీన రెండు నెలల జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో పూర్తి స్థాయిలో 450 మంది కార్మికులంతా సమ్మె విరమించారు.

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ ప్రయాణాల కోసం వెచ్చించిన డబ్బు వివరాలను నిన్న పార్లమెంటులో వెల్లడించారు. 2014 జూన్‌ నుంచి నుంచి మోదీ విదేశీ పర్యటనల కోసం, ఛార్టెర్డ్‌‌ ఫ్లైట్స్‌, విమానాల నిర్వహణ, సదుపాయాల ఏర్పాటుకు రూ.2,021 కోట్లు ఖర్చైనట్లు ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 2014 నుంచి 2018 మధ్యలో ప్రధాని మోదీ పర్యటించిన దేశాల జాబితాను కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు. అందులో భారత్‌కు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందిస్తున్న తొలి పది దేశాలు ఉన్నాయి.

foreiginvisits 29122018 2

భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతంతో పోలిస్తే పెరిగాయని వీకే సింగ్‌ వెల్లడించారు. 2014లో 30,930.5మిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, 2017లో 434 78.27మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్ విదేశీ పర్యటనలకు 2009 నుంచి 2014 వరకు రూ.1,346కోట్లు ఖర్చైందని వెల్లడించారు. కాగా 2014 నుంచి 2018 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ.2021కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మోదీ 2014 మే నుంచి 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను సందర్శించారని వెల్లడించారు.

foreiginvisits 29122018 3

2015లో అత్యంత ఖరీదైన చార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో 9రోజుల పాటు పర్యటించారు. మరో విదేశీ పర్యటన చేస్తే ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాసినట్టవుతుంది. మన్మోహన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పదేళ్ల కాలంలో 93 విదేశీ పర్యటనలకు వెళ్లారు. ప్రధాని మోదీ కేవలం నాలుగేళ్ల ఏడు నెలల కాలంలోనే 92 పర్యటనలకు వెళ్లారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల లోపు మోదీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళితే.. ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన రెండో ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశముంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన 15ఏళ్ల పదవీ కాలంలో 113 విదేశీ పర్యటనలు చేశారు.

ఫిబ్రవరి లో ఎన్నికల నోటిఫి కేషన్‌ వెలువడుతుందని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఇరు ప్రధాన పార్టీలు ప్రకాశం జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేయడంలో తలమునకలై ఉన్నాయి. వివిధ సర్వేలు నిర్వహించిన ప్రధాన పార్టీలు అందుబాటులో ఉన్న నాయకులలో మెరుగైన అభ్యర్థులను ఎంపికచేసుకునే ప్రక్రియను వేగవ ంతం చేస్తున్నాయి. జనవరి 15 వతేదీ నాటికి ఇరుపార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. అను హ్య పరిణామాలు జరిగితే తప్ప తెలుగుదేశం పార్టీలో అధికశాతం ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే లు, నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవారే తిరిగి పోటీచేసే అవకాశాలు కనిపిస్తుండగా వైసీపీలో మాత్రం కొత్త అభ్యర్థుల ను తె రమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలుఉండగా, గత ఎన్ని కలలో వైసీపీ ఆరు స్థానాలలోనూ తెలుగుదేశం పార్టీ 5 స్థానాలలోనూ విజయం సాధించగా చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణ మోహన్‌ ఇండింపెండెంట్‌గా గెలుపొందారు. తదనంతర పరిణామాలలో ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు నలుగురు వైసీపీ ఎమ్మె ల్యేలు తెలుగుదేశం పార్టీలోకి మారారు. మార్కాపురం సంతనూతలపాడు నియోజక వర్గాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిలు ఉండగా మిగిలిన 10 స్థానాలలో శాసన సభ్యులే తెలుగుదేశం పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కూడా సిట్టింగ్‌లందరికి తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించవచ్చునని ఊహాగానాలే వినపడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్పు చేసే అవకాశం ఉందని ప్రచారం ఉన్నా చెప్పుకోదగిన స్థాయిలో కొత్త అభ్యర్థులు కూడా ఇంతవరకు రంగంలోకి రాలేదు. జనవరిలో తెలుగుదేశం పార్టీ ప్రకటించే మొదటి జాబితా అభ్యర్థులలో ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్థన్‌, దర్శినుంచి మంత్రి శిద్ధా రాఘవరావు, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్‌, కొండేపి నుంచి బాల వీరాంజనేయస్వామి, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, పేర్లు దాదాపు ఖరారయ్యాయి.

ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చంద్రబాబు స్వయంగా ప్రకటించి ఉన్నారు. ఇక మిగిలిన 8 స్థానాలలో గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నుంచి డేవిడ్‌రాజు, చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ పేర్లు మినహా మరోపేరేది చర్చలో కూడాలేదు. మార్కాపురం నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డితోపాటు ఇమ్మడి కాశీనాధ్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త అశోక్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి పోతుల రామారావుతోపాటు మాజీ జడ్పీ చైర్మన్‌ నూకసాని బాలాజీ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సంతనూతలపాడునియోజకవర్గం నుంచి బీఎన్‌ విజయ్‌కుమార్‌తోపాటు లీడ్‌క్యాప్‌ చైర్మన్‌ ఎరిక్షన్‌బాబు టిక్కెట్టుకోసం పోటీపడుతున్నారు. కనిగిరి నియోజకవర్గం విషయంలో కదిరి బాబురావు మినహా మరేపేరు ప్రతిపాదనలో లేనప్పటికీ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పా ర్టీ బీసీలకు కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా తెలుగుదేశం పార్టీలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడంలేదు. మరోవైపు వైసీపీలో మాత్రం కొత్తముఖాలే అధికంగా రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ నుంచి గెలిపిచి న నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవడంతో సమన్వయకర్తలను నియమించుకున్న వారిని కాదని కొత్త నాయకులకు వైసీపీ సీట్లు కేటాయిస్తోంది. కొండపి నియోజకవర్గం నుంచి రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన ప్రముఖ వైద్యుడు మాదాసి వెంకయ్యను రంగంలోకి దింపింది.

గతంలో సమన్వయకర్తగా ఉన్న వరికూటి అశోక్‌బాబును పార్టీ నుంచి బహిష్కరించి వెంకయ్యకు పోటీచేసే అవకాశం కల్పించింది. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. ఆయన కందుకూరు నుం చి పోటీ చేయనున్నారు. మాజీ శాసన సభ్యులు అన్నా రాంబాబు ఇటీవలే జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన గిద్దలూరు నుంచి వైసీపీ తరపున పోటీచేయనున్నారు. వైసీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న మార్కాపురం శాసన సభ్యుడు జంకె వెంకటరెడ్డి అదే స్థానంలో పోటీ చేయనుండగా, గత ఎన్నికలలో సంతనూతలపాడు నుంచి గెలుపొందిన ఆది మూలపు సురేష్‌ రానున్న ఎన్నికలలో యర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసినా బుర్రా మధుసూదనయాదవ్‌కు పోటీచేసే అవకాశం లభించనుంది. దర్శి నియోజకవర్గంలో గతంలో ప్రజా రాజ్యంపార్టీ నాయకులుగాఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో బాచిన చెంచుగరటయ్య, చీరాల నుంచి ఎంఎం కొండయ్య పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న రావి రామనాధం బాబు పేరు వినిపిస్తోంది. ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పోటీచేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒం గోలు పార్లమెంట్‌ నుంచి కూడా గత ఎన్నికలలో పోటీచేసిన వైవీ సుబ్బారెడ్డి పేరే ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. మొత్తంమీద చాలా నియోజకవర్గాల్లో గత ఎన్నికలలో పోటీచేయని అభ్యర్థులే అధికశాతం వైసీపీ నుంచి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read