తెల్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు అర్హత ఆదాయ పరిమితిని పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసే వీలు ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం 60 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం 75 వేల రూపాయలు కలిగి ఉండాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా వార్షికాదాయ పరిమితిని పెంచలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల పేదల ఆదాయం కొంత మేరకు పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా 1.42 లక్షల రూపాయలకు చేరుకుంది.

whitecard 29122018

ఆదాయం పెరగడం వల్ల చాలామంది తెల్ల రేషన్ కార్డులను పొందేందుకు అనర్హులు అవుతున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. మరింత మందికి తెల్లరేషన్ కార్డు జారీకి అర్హత కల్పించేందుకు వీలుగా వార్షికాదాయ పరిమితిని పెంచే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం 1.2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల రూపాయలకు పెంచే అంశం పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావచ్చని భావిస్తున్నారు.

బీజేపీ కార్యకర్తల నుంచి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ బయటపడేశారు. కాలుష్యకాసారంగా మారిన యమునా నదిని ప్రక్షాళన చేయడం కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని గంగాప్రక్షాళన జాతీయ పథకం, దిల్లీ జలమండలి నిర్ణయించి ఒక సమావేశం నిర్వహించాయి. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ, కేంద్ర పర్యావరణమంత్రి హర్షవర్ధన్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, పలువురు భాజపా ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేజ్రీవాల్‌ ప్రసంగించడానికి ఉద్యుక్తులవ్వగానే, సభలోని భాజపా కార్యకర్తలు వేళాకోళంగా దగ్గడం ప్రారంభించారు.

kejri 29122018 2

వారిని వారించడానికి కేజ్రీవాల్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘‘మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను మాట్లాడతాను’ అని పదేపదే పేర్కొన్నా భాజపా కార్యకర్తలు పట్టించుకోలేదు. మరింత బిగ్గరగా దగ్గడం ప్రారంభించారు. దీంతో కేజ్రీవాల్‌ అసహనంతో మాట్లాడటం ఆపేశారు. వేదికపై ఉన్న గడ్కరీ కల్పించుకున్నారు. ‘‘ఇది ప్రభుత్వ కార్యక్రమం. అందరూ నిశ్శబ్దం పాటించాలి’’ అన్నారు. ఆ ఒక్క మాటతో భాజపా కార్యకర్తల నోళ్లు మూతపడ్డాయి. అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ‘‘మమ్మల్ని నితిన్‌జీ ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీకి చెందినవారిగా చూడలేదు. నాకు మిగతా నాయకుల గురించి పెద్దగా తెలియదు. ఆయన మాపై కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని కృతజ్ఞతలు తెలిపారు.

kejri 29122018 3

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కేజ్రీవాల్‌, 40 ఏళ్లుగా దగ్గుతున్నారు. 2016లో బెంగళూరులో శస్త్రచికిత్స సైతం చేయించుకున్నారు. కేజ్రీవాల్‌ సమస్యను ఎగతాళి చేసేలా భాజపా కార్యకర్తలు దగ్గారు. అయితే గడ్కారీ కలగచేసుకోవటంతో, సైలెంట్ అయ్యరు. కేజ్రీవాల్‌ అంటే, రాహుల్ గాంధీ కంటే ఎక్కువ శత్రువగా చూసే, బీజేపీ అధిష్టానికి, గడ్కరీ చర్య మింగుడు పడటం లేదు. ఎగతాళి చేస్తే ఏమవుతుందని, ఆప్ కార్యకర్తలకు లేని బాధ గడ్కరీ ఎందుకంటూ, అమిత్ షా కోటరీలోని ఒక నాయుకుడు వ్యాఖ్యానించారు. గడ్కరీ ప్రవర్తన చూసి, అమిత్ షా, మోడీ బ్యాచ్ గత కొన్ని రోజులుగా, గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల, గడ్కరీ చేసిన వ్యాఖ్యలతో, మోడీ, షా హార్ట్ అయిన సంగతి తెలిసిందే.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 12 రాష్ట్రాలు కీలకం కానున్నాయి. అవి హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఒడిషా, మహారాష్ట్ర, యూపీ, బిహార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక ఎందుకంటే ఇక్కడే గత ఎన్నికల్లో బహుముఖ పోటీలు జరిగాయి. అందంతా బీజేపీ విజయానికి కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు భుజాన వేసుకున్న బాధ్యత నెరవేరాలంటే ఈ రాష్ట్రల్లో బీజేపీ దాని మిత్రపక్షాలపై ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకుండా చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల మధ్య ఓట్ల బదిలీకావాల్సి ఉంటుంది. ఇందుకోసం చంద్రబాబు ప్రతిపక్షాలందరితో మాట్లాడి, ఒప్పించాల్సి ఉంటుంది. వారి మధ్య ఐక్యత సాధించాల్సి ఉంటుంది. ఇదేమంత తేలిక వ్యవహారం కాదు. ఎంతో చాకచక్యం అవసరం. ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్ పార్టీల మధ్య పొత్తు సాధ్యమని ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. అదే జరిగితే బీజేపీ గెలిచిన 70 స్థానాలకు చెక్ పెట్టొచ్చు.

cbn 29122018

బిహార్‌లో ఎలాగు ఆర్జేడీ, కాంగ్రెస్, ఎంసీపీ, జేడీయూ, శరత్ పవార్ వర్గం మధ్య పొత్తు సాధ్యంగానే ఉంది. ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌ను ఒప్పిస్తే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమవుతుంది. ఇందుకు కాంగ్రెస్ కూడా కలిసిరావాల్సి ఉంటుంది. తెలంగాణలో చంద్రబాబు ఇప్పటికే ప్రతిపక్ష ఐక్యతపై దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కర్నాటకలో దేవెగౌడ పార్టీ, కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి. నిజానికి బెంగళూరు నుంచే చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతకు శ్రీకారం చుట్టారు. హర్యానాలో చౌతాల పార్టీ ఐఎన్‌ఎల్‌డీని దారికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒడిషాలో నవీన్ పట్నాయక్ ఎవరితోనూ పొత్తుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ నవీన్ పట్నాయక్ పార్టీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ తప్పదు. కాకపోతే ఎన్నికల అనంతరం నవీన్ పట్నాయక్‌ను ప్రతిపక్షాల కూటమికి మద్దతిచ్చేందుకు ఒప్పించాల్సి ఉంటుంది.

cbn 29122018

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా అదే విధంగా ఒప్పించాల్సి ఉంటుంది. ఝార్ఖండ్‌లో కూడా బహుముఖ పోటీలుంటాయి. అక్కడ కూడా ద్విముఖ పోటీకి ప్రయత్నాలు జరగాలి. మహారాష్ట్ర వ్యవహారం కొంత సంక్లిష్టం. కాకపోతే శరత్ పవార్, శివసేనతో చంద్రబాబు తనకున్న పరిచయాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడ బహుముఖ పోటీలు ఎవరికి లాభిస్తాయన్నది ముఖ్యం. ఇక తమిళనాడు కీలక రాష్ట్రం. అక్కడ బీజేపీ ప్రయత్నాలను వమ్ము చేయడం ఒక అవసరం. బీజేపీ మద్దతిచ్చే పార్టీకి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు కావాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు తలకెత్తుకున్న పని సామాన్యమైనదేమి కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి నిమిషం రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టటమే ధ్యేయంగా పని చేసే విజయసాయి, తన వంకర బుద్ధి రాజ్యసభలో కూడా చూపిస్తూ ఉంటాడు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రానికి ప్రశ్నలు వేస్తూ, అవి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. కాకపోతే, అవి రివర్స్ అయ్యి, చివరకు సెల్ఫ్ గోల్ అవుతాయి. ఇలాంటి ప్రశ్నలు కేంద్రాన్ని అడగటానికి, కేంద్రాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టటానికి మాత్రం ఉపయోగించడు. ఎంత సేపు రాష్ట్రం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని, రుణ మాఫీ సరిగ్గా జరగలేదు కదా అంటూ, కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. అయితే, అవతల నుంచి వచ్చిన సమాధానంతో, పాపం అవాక్కయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భేష్ అంటూ జవాబు వచ్చింది.

vijaysaireddy 29122018 2

ఆంధ్రప్రదేశ్‌లో 2018లో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2014నుంచి 2017 వరకు, నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 394 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.బోర్‌వెల్స్‌ విఫలంకావడం, సాగు వ్యయం పెరగడం, ప్రైవేటు వడ్డీలు, ప్రకృతి వైపరీత్యాలు తదితర కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివిధ జిల్లాలకు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ తెలిపిందన్నారు. అయితే ఇది వరకు మనకు తెలుసు, వేలల్లో పాపం రైతులు, ఆత్మహత్యలు చేసుకునే వారు. కాని, చంద్రబాబు సకాలంలో నీళ్ళు ఇవ్వటం, వివిధ రకాలుగా ఆదుకోవటంతో, కొంత వరకు రైతుల కష్టాలు తగ్గాయి.

vijaysaireddy 29122018 3

మరో ప్రశ్న... 'ఏపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం 2014 నుంచి అమలు చేస్తోంది. వ్యవసాయ పంటలు, వ్యవసాయ అనుబంధ అవసరాల కోసం బంగారంపై తీసుకున్న రుణాలు కుటుంబానికి రూ.1.50 లక్షలు మించని వాటిని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు’ రూపాలా వివరించారు. కనీస మద్దతు ధరకే ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరణ జరుగుతోందని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి సీఆర్‌ చౌధరి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లర్లు, దళారులు దోచుకుంటున్నట్లు తమ శాఖ దృష్టికి ఏమీ రాలేదని పేర్కొన్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా, ఏపి ప్రభుత్వం భేష్ అని కేంద్రం చెప్పటంతో, A2 గారికి ఏమి చెయ్యాలో అర్ధం కాక, షాక్ లో ఉండిపోయారు.

Advertisements

Latest Articles

Most Read