ఇదేదో ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసింది అని, వాటి మీద బురద చల్లి వెళ్ళిపోవటానికి లేదు. పవన్ అనుకూల మీడియాలో వచ్చిన వార్తా కాబట్టి నమ్మాల్సిందే. వైసీపీ, జనసేన మధ్య రహస్య చర్చలు జరిగాయనే కధనాలు, పవన్ అనుకూల మీడియాలో వచ్చాయి. చంద్రబాబుని ఓడించటమే లక్ష్యంగా, ఇరు పార్టీల మధ్య పొత్తు కుదుర్చించేందుకు జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ తరపున ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి చర్చలు జరిపారని వార్తలు నిన్నటి నుంచి గుప్ప మన్నాయి. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లుగా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా పవన్ అనుకూల మీడియాలో ఈ వార్తలు వచ్చాయి.

janasena 20122018

నిన్న నాగబాబు, విజయసాయిరెడ్డి మధ్య హైదరాబాద్‌లోని ఓ రిటైర్డ్ అధికారి నివాసంలో ఈ ఇరువురు చర్చలు జరిపారని సమాచారం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జనసేనకు 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు వైసీపీ సూత్రప్రాయంగా అంగీకరించిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరు పక్షాలకు చెందిన నేతలు గోప్యంగా ఉంచుతున్నారు. ఇరు పార్టీలు ఈ విషయం మాత్రం దృవీకరించలేదు. అయితే ఈ భేటీ కేసీఆర్ సూచన మేరకే జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి రాగానే కేసీఆర్ తో భేటీ కానున్నారని, జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఏపి రాజకీయాల్లో వేలు పెడతా అని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

janasena 20122018

ఈ నేపధ్యంలో, కేసీఆర్ సూచనలను పవన్ కళ్యాణ్ తీసుకుని, ఏపిలో రాజకీయం చేయ్యనున్నారు. ఇక ఇప్పటికీ వైసీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, వారి మధ్య రాజకీయ సఖ్యత కుదురుతుందా లేదా అన్నది సందేహంగానే ఉన్న సమయంలో, కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. రాజకీయ అవసరాల కోసం పార్టీలు వెనక్కి తగ్గడం సర్వసాధారణం కావడంతో, వైసీపీ, జనసేన కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే, ఏపీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ స్కెచ్ అంతా నడిపిస్తున్న మోడీ, అమిత్ షాలు ముందు ముందు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.

మళ్ళీ వరుస సెలవలు ప్రజలను పలకరించనున్నాయి. క్రిస్మస్ పండుగ కోసం షాపింగ్ చెయ్యటానికి డబ్బులు డ్రా చెయ్యాలంటే, ఈ రెండు రోజుల్లోనే డ్రా చేసుకోండి. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, సమ్మెలతో బ్యాంకులు మూతబడనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం డిసెంబరు 21న (శుక్రవారం) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపు బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబరు 22 నాలుగో శనివారం, డిసెంబరు 23 ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు.

bank holidays 20122018 2

మళ్ళీ మధ్యలో డిసెంబరు 24 సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. ఆ తర్వాత 25న క్రిస్మస్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం మినహా డిసెంబరు 21 నుంచి 26 వరకు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. రేపు సమ్మె జరిగినా ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. దీంతో శుక్రవారం నగదు సమస్య ఉండకపోవచ్చు. డిసెంబరు 26 వరకు మాత్రం నగదు కొరత ఏర్పడే అవకాశముంది. అన్ని స్థాయిల్లో వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు దిగాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తామే గెలిచినంతగా సంబరపడిపోవడం.. టీడీపీ ఓడిపోవడం తమ విజయమేనన్న రీతిలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకోవడం ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకతకు దారితీసిందని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మెడకు చుట్టుకుంటోందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రత్యర్థి, సీఎం చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రశంసించడం.. కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం.. క్షీరాభిషేకాలు చేయడం.. రాష్ట్రంలో పర్యటించాలంటూ వారిని తమ పార్టీ నేతలు, శ్రేణులు ఆహ్వానించడం వారికి మింగుడుపడడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని కేసీఆర్‌ బహిరంగంగానే చెబుతున్నారు. మన రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

jagan 201222018

సుప్రీంకోర్టులో ఇంప్లీడయ్యారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేసీఆర్‌నూ, కేటీఆర్‌నూ ప్రత్యేకంగా కీర్తిస్తూ.. ఏకంగా టీఆర్‌ఎస్‌ జెండాలను భుజాన వేసుకుని వైసీపీ వర్గాలు రోడ్లపైకి రావడం చూసి జనం ఆగ్రహిస్తున్నారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు ప్రతిరోజూ జగన్‌పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. పోలవరం వద్దా.. ఇవి రావడం వైసీపీకి ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

jagan 201222018

టీడీపీ ఎదురుదాడి ఇలాగే కొనసాగితే.. అది ప్రజల్లోకి చేరితే మున్ముందు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమకు రాష్ట్రమే ప్రధానమనే ధోరణిలో ప్రజల్లో ‘సెంటిమెంటు’ రగిలించి ఎన్నికల్లో విజయం సాధించారు. అందుకు భిన్నంగా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడే టీఆర్‌ఎ్‌సకు మద్దతు పలకడం రాజకీయంగా ఏమాత్రమూ వాంఛనీయం కాదని అంతర్గతంగా ఆ నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో కేసీఆర్‌, చంద్రబాబు మధ్య పోలికలు, తేడాలపై చర్చలు జరగడం పరిపాటేనని.. కానీ దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలే చర్చకు వస్తాయని వైసీపీ ముఖ్యనేతలు కొందరు అంగీకరిస్తున్నారు. జగన్‌ను, చంద్రబాబును పోల్చి చూసుకుని.. సీనియర్‌ నేతగా, పాలనాదక్షుడిగా చంద్రబాబు వైపే మొగ్గుతారని అంటున్నారు.

 

 

రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. ఢిల్లీ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఫిబ్రవరి 25న, అటు లోక్‌సభ కు, ఇటు, ఏపీ శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. మన రాష్ట్రంలో చివరి విడతలో ఏప్రిల్‌లో పోలింగ్‌ ఉండవచ్చనే చర్చ జరుగుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకున్న చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతి సారి, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత టీడీపీ అభ్యర్ధిని ప్రకటించే వారు. కొన్ని ఇబ్బందులు వల్ల నామినేషన్‌క చివరి రోజు కూడా అభ్యర్ధిని వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మల్యేలలో టెన్షన్‌ మొదలైంది. మొదటి జాబితాలో ఎవరి పేరు ఉంటుందో, ఏ నియోజకవర్గంలో మార్పు ఉంటుందో అనే టెన్షన్ సిటింగ్‌ ఎమ్మెల్యేలలో మొదలైంది.

ticket 20122018 2

ఈ విషయం పై చంద్రబాబు కూడా ఇప్పటికే స్పష్టం చేసారు. ఈ విషయం బుధవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో కూడా పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ నేపధ్యంలో కర్నూల్ జిల్లాలో రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు చంద్రబాబు 2014 నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఆ దిశగా, ఎప్పటికప్పుడు నాయకులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలతో పాటు అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించేందుకు ఇప్పటికే చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

 

ticket 20122018 3

గెలిచే వారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ముందుగానే అభ్యర్థులను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈసారి కొందరికి సిటింగ్‌లకు అవకాశం ఉండకపోవచ్చనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. చంద్రబాబు వివిధ సర్వేల ఆధారంగా నంద్యాల, కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలో ఇద్దరు, ముగ్గురు సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు పేర్కొన్నారు. అయితే పేర్లు బయటికి చెప్పడం లేదు. చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఆధారంగా ప్రజల్లో వ్యతిరేకత వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిలు ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో అక్కడ ఇన్‌చార్జికి అవకాశం ఉండదు. మిగిలిన ఐదు స్థానాల్లో తమకే అవకాశం ఉంటుందని ఇన్‌చార్జిలు ధీమాగా ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read