ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో, రాహుల్ గాంధి ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టు గానే, అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో, కేవలం రెండు రోజుల్లోనే రుణ మాఫీ చేసి చూపించారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేశ్‌ బఘేల్‌లు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ‘మాఫీ’ నిర్ణయాలను ప్రకటించారు. తాజాగా రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ సర్కారు కూడా అదే బాట పట్టింది. రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని రైతులందరి వ్యవసాయ రుణాలు మాఫీ చేసేంతవరకు మోదీని నిద్రపోనివ్వబోమని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ఈ విషయంలో తాను, ఇతర ప్రతిపక్ష నేతలు ఒక్కటై పోరాడుతామన్నారు.

rahulgandhi 20122018 2

రైతుల దురవస్థలను ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ప్రభుత్వానిది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోతే 2019లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 100% తప్పనిసరిగా ఆ పని చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల విజయం సాధించిన రాష్ట్రాల్లో దీన్ని నిరూపించామన్నారు. ప్రధాని మోదీ నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా రైతుల రుణం మాఫీ చేయలేదని రాహుల్‌గాంధీ విమర్శించారు. 15మంది పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము 10 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 6 గంటల్లోనే ఆ పని చేసి చూపించామని గుర్తు చేశారు. రాజస్థాన్‌లో రెండు రోజుల్లో రుణమాఫీ చేసామని వెల్లడించారు.

rahulgandhi 20122018 3

దేశంలో వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయలేకపోతున్నారని ప్రధానిని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఆ పని ఎప్పుడు చేయబోతున్నారో హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఈ దేశం రైతులు, పేదలదే తప్ప కొద్దిమంది పెద్ద పారిశ్రామికవేత్తలది కాదు. రాత్రింబవళ్లు చమటోడ్చి, రక్తం ధారపోసి అన్నం పెడుతున్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి గొంతు ప్రధానికి వినిపించడం లేదు. ఇప్పుడు మేం రైతుల వాణి వినిపించే పనిలోనే ఉన్నాం.’’ అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్‌ ఒప్పందం, పెద్దనోట్ల రద్దు ద్వారా దేశ ప్రజల సొమ్ము దోచుకున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ రెండు భారతదేశాలు తయారు చేశారని, ఒకవైపు పేదలు, కార్మికులు, రైతులు, బలహీనవర్గాలు, చిన్న వ్యాపారులు ఉండగా.. ఇంకోవైపు 15-20 మంది పెద్ద వ్యాపారవేత్తలున్నారని అన్నారు. రఫేల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్రమాణపత్రంలో ‘అచ్చుతప్పు’ పడినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించగా ఇలాంటి మరెన్నో ‘అచ్చుతప్పులు’ బయటకొస్తాయని రాహుల్‌గాంధీ అన్నారు.

ఈవీఎంలపై పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయంటూ గతంలోనూ పలుమార్లు జాతీయ స్థాయిలో ఉద్యమించిన తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ అంశంపై మరోమారు ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని.. ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావనే అంశంపై వివిధ పార్టీలతో కలిసి పోరాడేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈవీఎంల టాంపరింగ్‌కు అవకాశం ఉందని.. అందుకే అవి నమ్మకమైనవి కావన్నది చంద్రబాబు వాదన. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

cbn 200122018 2

ఈ నేపధ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో జీరో హౌర్ లో ఈవీఎంల పై చర్చ చేపట్టాలని నోటీస్ ఇచ్చారు. ఎంపీలు మురళీ మోహన్, రవీంద్ర బాబు, ముత్తంసెట్టి శ్రీనివాసరావు ఈ నోటీస్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాతపద్ధతిలోనే ఓటింగ్‌ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. ఈవీఎంలలో రెండు మూడు నెలల్లోనే రికార్డు మొత్తం చెరిగిపోతుందన్న విషయాన్ని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్తున్నారు. తన పోరాటానికి సన్నాహాకంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు రావడాన్ని తెదేపా పరిశీలిస్తోంది.

cbn 200122018 3

తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నారు. ఈ ఓట్ల తొలగింపుపై కుట్ర ఉందని తెదేపా భావిస్తోంది. ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను అప్రమత్తం చేసే బాధ్యతను పార్టీ నాయకులకు చంద్రబాబు అప్పగించారు.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి మంగళవారం వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్టు 2019 ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పొందే నైపుణ్యాలు ఉన్న యువత ఉన్న రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తు న్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ అధికారుల బృందం వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది.

orissa 19122018

తాజాగా ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల బృందం రెండు రోజుల పర్యటనకు విజయవాడకు వచ్చింది. ఈ బృందానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కృతిక శుక్లా పవర్ పా యింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం గుంటూరు జిల్లా నంబూరులోని గూగుల్‌కోడ్‌ ల్యాబ్‌, సీమెన్స్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం, నాగార్జున వర్సిటీలో డస్సాల్ట్‌ మదర్‌ హబ్‌ త్రీడీ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీలతో కలసి పని చేయడాన్ని వివరించారు. వివిధ రంగాలకు అవసరమైన విధంగా యువతకు శిక్షణ ఇస్తున్న తీరు, విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన గురించి బృందానికి తెలిపారు.

orissa 19122018

ముఖ్యమంత్రి యువనేస్తం కింద భృతి పొందుతున్న వారికి 522 కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు అకడమిక్‌ పాఠ్యాంశాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడాన్ని ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారుల బృందం కొనియాడింది. విద్యార్థులు కళాశాలల నుంచి వచ్చేసరికే పూర్తి నైపుణ్యతతో ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఉద్యోగావకాశాలు పొందే నైపుణ్యాలు కలిగిన యువత అధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఇక్కడి విధానాలను తెలుసుకునేందుకు ఒడిశా అధికారుల బృందం వచ్చింది. ఒడిశాలో ప్రధానంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైనే దృష్టిసారించినట్లు తెలిపారు.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీసీఎల్ కార్యకలాపాలు అతి త్వరలోనే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రారంభం కానున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ నెల 20 తేదీన టీసీఎల్ భూమిపూజ నిర్వహించనున్నారు.ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం జరగనుంది.ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు కానుంది. శ్రీవారి ఆలయంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి... టీసీఎల్ రాకతో ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారనుంది.టీసీఎల్ రాకతో 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో టీసీఎల్ 2,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.డిసెంబర్ 2019 కి కంపెనీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి అని టీసీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమంలో టీసీఎల్ ఛైర్మెన్ లీ డాంగ్ షెన్గ్ (LI Dongsheng) పాల్గొననున్నారు

tcl 19122018 2

టీసీఎల్ కంపెనీ ఏపీకి తీసుకురావడం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ అలుపెరుగని కృషి ఉంది. లోకేష్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో టీసీఎల్ యాజమాన్యాన్ని ఒప్పించగలిగారు. దీనికి చాలా రోజుల ముందే టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు ఇండియా వచ్చారు. అప్పుడే వీరిని కలిసిన మంత్రి లోకేష్..ఏపీలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరించారు. అప్పటి నుంచీ టీసీఎల్ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నారు. కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న టీసీఎల్.. ఇండియాలో ఏపీయే తమ సంస్థ కార్యకలాపాలకు అనువైన ప్రదేశమని నిర్ణయం తీసుకునేలా మంత్రి ఇక్కడి పరిస్థితులను వారికి వివరించారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ టీసీఎల్ ప్రతినిధులతో చర్చించి, ఒప్పందం జరిగే వరకూ అంతా తానై వ్యవహరించారు.

tcl 19122018 1

సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో దేవదేవుడు కొలువుదీరిన తిరుపతి నగరంలో టీసీఎల్ భూమిపూజకు జరిగిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. టీవీలు,స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మేషిన్లు, ఫ్రిజ్ వంటి కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా టీసీఎల్ కంపెనీకి మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టివి ప్యానల్స్ తయారీ లో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది.ఇప్పుడు తిరుపతిలో ఏర్పాటు చేసే టీసీఎల్ కంపెనీతో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు..ఉపాధి పొందనున్నారు. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన కంపెనీలు లేవు.నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకున్న అనేక నిర్ణయాలు,తీసుకొచ్చిన పాలసీలు,ఏపీ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం వలన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది.ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి గా దేశంలోని అనేక నగరాలు,అనేక దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ప్రపంచంలోనే ప్రఖ్యాత కంపెనీల అధిపతులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.దీనితో అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి. ఒక్క ఫ్యాక్స్ కాన్ కంపెనీ లోనే 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దేశంలో తయారు అవుతున్న ఫోన్లలో 30 శాతం ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు అయ్యే స్థాయికి చేరుకున్నాం.సెల్ కాన్,డిక్సన్,కార్బన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

tcl 19122018 1

585 కోట్ల పెట్టుబడితో 6,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ త్వరలోనే కంపెనీ నిర్మాణం ప్రారంభించబోతుంది.ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో అతి పెద్ద పెట్టుబడి పెట్టనుంది 15 వేల కోట్ల పెట్టుబడితో, 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ జియో ఎలక్ట్రానిక్స్ పార్క్ ని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే రిలయన్స్ జియో భూమి పూజ కూడా జరగనుంది.సన్నీ ఓపోటెక్ కూడా 500 కోట్ల పెట్టుబడి,4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 75 ఎకరాల్లో 1400 కోట్ల పెట్టుబడితో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కెమెరా మాడ్యూల్స్,స్క్రీన్స్ తయారీ కంపెనీ హోలీ టెక్ కూడా తిరుపతి లో కంపెనీ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది.కేవలం అసెంబ్లీ తో ఆగిపోకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్ నుండి సర్క్యూట్ బోర్డ్ తయారీ వరకూ అన్ని కంపెనీ లను ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read