పోలవరం పై ఏపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటానికి, స్నేహితులు ఇద్దరూ అయిన, కేవీపీ, విజయసాయి, పోలవరం పై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. కేంద్ర సహాయం గురించి కాదండోయి, ఏపి ప్రభుత్వం, అవినీతి చేసిందా, కాంట్రాక్టు ఇచ్చిందా, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు. అయితే వీళ్ళకు దిమ్మ తిరిగే సమాధానం లభించాయి. ఏపి ప్రభుత్వం భేష్ అనే సమాధానం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతాపరమైన లోపాలేవీ ఇప్పటి వరకు గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక చెలింపులు జరిపినట్టు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ)తో పాటు కాగ్‌ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం మంత్రి రాతపూర్వకంగా పైవిధంగా జవాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను వారి నుంచి తిరిగి రాబట్టాలని కూడా పీపీఏ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయించే హడావుడిలోనే భూ సేకరణ, స్టీల్‌ కొనుగోలుతో పాటు మరికొన్ని పనుల్లో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా తెలిపారు.

polavaramquestion 18122018 2

పోలవరం హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ను ఏదైనా కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు మంత్రి మేఘ్‌వాల్‌ జవాబిస్తూ 2016 సెప్టెంబర్‌ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపట్టినట్లు వివరించారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టులైనా ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ఒక లక్షా 5 వేల 601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని, అందులో ఇప్పటి వరకు 3 వేల 922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు.

polavaramquestion 18122018 3

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం, భూసేకరణ, పరిహారం, పునరావాసంపై విడిగా అడిగిన ప్రశ్నలకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణ, పరిహారం, పునరావాసం కోసం రూ. 57,940.86 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపింది. 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పరిహారం, పునరావాసం అంచనాలు రూపొందించడం వల్లనే ఈ అంచనా వ్యయం భారీగా పెరిగిందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భూ సేకరణకు మొత్తం 1.66 లక్షల ఎకరాలు గుర్తించగా, అందులో 1.10 లక్షల ఎకరాలను ఇప్పటికే సేకరించినట్టు వెల్లడించింది. అలాగే మొత్తం 1,05,601 నిర్వాసిత కుటుంబాలున్నాయని, ఇందులో 3,922 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరందుకున్నప్పుడు ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపించి జీడీపీ వృద్దిరేటు మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. తాను పెద్దనోట్ల రద్దును చూడటంతో పాటు అధ్యయనం కూడా చేశానని, పెద్దనోట్ల రద్దుతో వృద్ధిరేటు పై గణనీయమైన ప్రభావం చూపించిందన్నా రు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరం దుకుందని, అదే సమయంలో భారత్‌ లో వృద్దిరేటు మందగించిం దని ఆయన ఇంగ్లీషు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దే కాకుండా జీఎస్టి అమల్లోకి తేవడం వల్ల కూడా వృద్ధిరేటు పై ప్రభావం చూపించిందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు 6.7 శాతంగా నమోదైంది.

rbi 1812018 2

రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే ఆర్‌బీఐ రేటింగ్‌కు భారీ గండి పడుతుందని రఘురాం రాజన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక వేళ ఆర్‌బీఐ రేటింగ్‌ ‘ఏఏఏ’ నుంచి కిం దికి దిగివస్తే సెంట్రల్‌ బ్యాంకు నిధులు సేకరించడం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీని ప్రభావం ఆర్థికవ్యవస్థపై పడుతుందని ఆయన వివరించారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే రేటింగ్‌లో కోత పడుతుందా అని ప్రశ్నించగా.. ఎంత మొత్తం బదిలీ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతా నికి ఇది పెద్ద అంశం కాదని..అయితే రాబోయే రోజుల్లో ఇదే కీలక అంశంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

rbi 1812018 3

మీరు గవర్నర్‌గా ఉన్న ప్పుడు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా.. ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దమొత్తంలో నగదు బదిలీ చేయాలని ఆర్‌బీఐ పై ఒత్తిడి పెంచుతుంటుందన్నారు. తాను ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐకి లేఖ రాసి ఎంత మొత్తం మీరు మిగులు నిల్వలు ఉంచుకోవాలను కుంటున్నారని లేఖలో పేర్కొనేవాడినని, తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక కమిటిని ఏర్పాలు చేసి..పెద్ద మొత్తంలో మిగులు నిధులు తమ వద్ద ఉంచుకొని మొత్తం లాభాలను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసామని చెప్పారు. మూడు సంవత్సరాల పాటు తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్‌ను చెల్లించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లాభాల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటోందన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత పెథాయ్‌ తుపానును ఎలా ఎదుర్కొన్నామో వివరించిన ముఖ్యమంత్రి చివర్లో విలేకరులు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించగా స్పందించారు.

ballot 18122018 2

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ప్రపంచంలో ఎవరూ వినియోగించటంలేదని తెలిపారు. అది చిప్ ఆధారిత మిషన్.. దాన్ని సులభంగా ఏ మార్చే అవకాశం ఉంది.. ప్రజాస్వామ్యం కొంత మంది చేతిల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కేసు 3, 4 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈవీఎంలో డేటా అన్ని రోజులు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్‌కు వెళుతుంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు ఎందుకెళ్లాలని నిలదీశారు. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా ఈవీఎంల గురించి చెబుతున్నా.. ఈ విధానం ఫలితాన్ని తేలిగ్గా తారుమారు చేసేందుకు వీలయ్యేదని తెలిపారు. పేపర్ బ్యాలెట్ వల్ల నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికలను కూడా ఇదే తరహాలో నిర్వహించేందుకు ఉద్యమిస్తామని తెలిపారు.

ballot 18122018 3

ఒక్క తెలంగాణలోనే కాదు, ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్‌ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. ఓట్లు కొనే ఆస్కారం లేకుండా చేసేందుకే తాను రూ.2,000 నోటు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.2,000 నోటు తీసుకువచ్చిందన్నారు. డిజిటల్‌ కరెన్సీ వల్ల ఓట్ల కొనుగోలు అనేది లేకుండా పోతుందని చెప్పారు.

నిన్న తిత్లీ.. నేడు పెథాయ్ తరచు తుపాన్లు ముంచుకొస్తున్నా కేంద్రంలో చలనంలేదు.. మనం చెల్లించే పన్నులతో ఆదాయం వస్తున్నా బాధితులను ఆదుకోవటంలో వివక్ష చూపుతోంది.. ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పెథాయ్ తుపాను నష్టం అంచనాలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, కేసీఆర్‌ ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్నారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. వైకాపాపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.

kcrcbn 18122018

తానేదో తెరాసతో పొత్తు కోసం వెంపర్లాడినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను గతంలోనే తెరాసతో కలిసి వెళదామనుకున్నానని చెప్పారు. తెలుగువాళ్లు కలిసి ఉంటే సమస్యలు జాతీయస్థాయిలో పరిష్కరించుకోవచ్చని భావించానన్నారు. తర్వాత ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా తెరాస మాట్లాడింది, కాంగ్రెస్‌ మద్దతు పలికిందని గుర్తుచేశారు. అందుకే ప్రజాకూటమి కట్టి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడలేదని, అడ్డం తిరగటంవల్లే వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు.2014లో అక్కడ పోటీ చేసిన వారు ఇప్పుడు ఎందుకు పోటీ చేయలేదని వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

kcrcbn 18122018

తెరాస గెలిచినందుకు ఇక్కడ వీరు సంబరాలు చేసుకుంటున్నారు, డబ్బులు పంపిస్తారని సంతోషపడుతున్నారని విమర్శించారు. భాజపా ఎదురుదాడి తప్ప ఏమీ చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడిన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇక్కడి ప్రతిపక్ష వైసీపీ, జనసేన అక్కడ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో 8 అంశాలపై శ్వేతపత్రాలు ఇచ్చామని, మళ్లీ త్వరలో ఆ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం సాధించిందో శ్వేతపత్రాలు విడుదలచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీర్ఘకాలంలో ఏం సాధించామో, స్వల్ప వ్యవధిలº ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో, విభజన హామీల పరిస్థితి తదితర విషయాలన్నీ శ్వేతపత్రాల్లో వివరిస్తామన్నారు.

Advertisements

Latest Articles

Most Read