వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. ‘మళ్లీ టీడీపీ రావాలి’ అనే నినాదం మార్మోగాలని, మళ్లీ రాకుంటే అభివృద్ది ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

kcr 19122018 1

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కడా భేషజాలకు పోకూడదని, గ్రూపు విభేదాలు విడనాడాలని హితవు పలికారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యత భారీగా పెరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలని, ఈ నెల 30న ‘జయహో బీసీ’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లో ఎక్కడా భాజపా గెలవలేక పోయిందని, 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని, దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరిస్తోందని వెల్లడించారు.

kcr 19122018 1

ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని, మైనారిటీల్లో అభద్రత పెరిగిందన్నారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదని, అది భాజపాకి దొడ్డిదారిన మేలు చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఇది వరకే, థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేసామని, కాని అది సక్సెస్ అవ్వలేదు కాబట్టే, కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో కలుపుకుని వెళ్తున్నమాని అని అన్నారు. మాయావతి లాంటి వారికి కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది ఉన్నా, అందరినీ కలుపుకుని వెళ్తామని, అన్ని పక్షాలు ఇటు వైపు ఉండగా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ, చీలిక తెచ్చి, మోడీకి లబ్ది చేకూర్చే ప్రయత్నం అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పినందునే దాన్ని సాకుగా చూపి కేసీఆర్. సెంటిమెంట్ రెచ్చగొట్టారని చంద్రబాబు అన్నారు. తొలుత హోదాకు అంగీకరించిన తెరాస మళ్లీ అడ్డం తిరిగడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో తెరాస గెలిస్తే.. ఇక్కడ ప్రతిపక్ష నేతలు సంబరాలు చేస్తుకుంటున్నారని, వైకాపా నేతలకు పండుగలా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌కు ఓవైసీ ఎప్పుడు దోస్త్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌, ఓవైసీకి మోదీయే దోస్తీ కుదిర్చారా? అని నిలదీశారు.

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. రాజకీయాల్లో కూడా, అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోదీతో ఓ ఎన్నికల సన్నాహాసభ పెట్టేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. జనవరి 6న గుంటూరులో మోడీ సభ పెట్టనున్నారు. బీజేపీ వాళ్లకి, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లకి, ఏమి చెయ్యకపోయినా, అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం అని చెప్పటం అలవాటు. అందుకే ఈ ప్రచారం తిప్పికొట్టటానికి, ఏపీకి బీజేపీ చేసిన అన్యాయమేమిటో .. కేంద్రం సాయం లేకపోయినా సాధించిన ప్రగతి ఏమిటో శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసేందుకు, చంద్రబాబు కౌంటర్ ప్లాన్ చేసారు. అటు మోడీకే కాదు, ఇటు జగన్, పవన్ ల పిచ్చి ఆరోపణలకు కూడా చెక్ పెట్టే ప్లాన్ వేసారు. శ్వేతపత్రాలతో ప్రతిపక్షాలపై చంద్రబాబు అస్త్రాలను ఎక్కు పెడుతున్నారు.

modi 19122018 2

2014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్నికలకు నాలుగు నెలలు సమయం ఉండగానే.. ఎపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరం ప్రారంభమైంది. జనవరి ఆరో తేదీన ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు సభలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన సంస్థలు, నిధుల పై ఆయన ప్రజలకు వివరించడంతో పాటు, బీజేపీ ఎపీ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించబోతున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రాంతంలో సభ పెట్టి తెలుగుదేశం పై విరుచుకుపడ్డారు. పాదయాత్రలో జగన్ కూడా ప్రభుత్వం పై అదేపనిగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో వీటిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం ఎన్నికలకు ముందు పెద్ద కసరత్తే ప్రారంభించింది.

modi 19122018 3

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక పురోగతి, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమలో సాధించిన అభివృద్ది, రాజధాని, పోలవరం నిర్మాణం, రాయలసీమకు సాగు, తాగు నీరు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, రాయలసీమలో పరిశ్రమలు, విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు వంటి పలు అంశాల పై రాష్ట్ర ప్రభుత్వం తాజా గణాంకాలతో శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు కేంద్రం నుంచి సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీటన్నింటిపై ఎనిమిది శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు గణాంకాలతో సిద్దం కావాలని ఆయా శాఖల అధికారులను చంద్రబాబు ఆదేశించారు. పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను ఇచ్చి వాటిని ఆంధ్రప్రదేశ్ కు ఏదో ప్రత్యేకంగా ఇచ్చామని పేర్కొనడం పట్ల ప్రభుత్వం తీవ్ర అభ్యతంరం వ్యక్తం చేస్తోంది.ఇటువంటి అంశాలతో శ్వేత పత్రాన్ని విడుదల చేసి బీజేపీని, డిఫెన్స్‌లోకి నెట్టాలనేది తెలుగుదేశం ప్రయత్నంగా ఉంది. నాలుగున్నర సవంత్సరాల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇదే సమయంలో ప్రతిపక్షాల ఆరోపణలు కూడా తిప్పికొట్టినట్లువుతుందని సీఎం భావిస్తున్నారు. అదే సమయంలో.. ఏపీ సమస్యల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును కూడా... చంద్రబాబు ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే ఎవరేమిటో.. తేలిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు.

ఐటీ, ఐటీఈఎస్, క్రీడలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సాయాన్ని అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన వివిధ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఈ విషయాన్ని మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్‌బెర్గ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న 17 సంస్థల ప్రతినిధులను డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నానని ముఖ్యమంత్రికి చెప్పిన డెన్‌బెర్గ్, నెదర్లాండ్స్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉందని, వాటర్ వేస్, వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ వాటర్, యానిమల్ న్యూట్రిషన్, స్మార్ట్ సిటీ, సాఫ్ట్‌వేర్, ఇంథన రంగాల్లో ఈ సంస్థలకు అనుభవం ఉందని డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి తెలిపారు.

netherlanads 19122018 2

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను నెదర్లాండ్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. సమర్ధత, ఆకర్షణ, సులభతర వాణిజ్యం నెదర్లాండ్స్ సొంతమని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌లో భారతదేశంలోనే ముందుదని చెప్పారు. ఐటీ, ఐవోటీ, ఇంథన రంగాల్లో తమ రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. సాంకేతిక సాయంతో తుఫాన్ల గమనాన్ని ముందే పసిగట్టి నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉత్తమ మానవ వనరులు, సులభతర వాణిజ్య అవకాశాలు, సమృద్ధిగా విద్యుత్-నీరు ఆంధ్రప్రదేశ్‌కు కలిసొచ్చే అంశాలుగా చెప్పారు. సోలార్ విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టడం ద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించగలిగామని అన్నారు. ప్రాజెక్టులలో సెన్సర్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటినిల్వల గణాంకాలు తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు.

netherlanads 19122018 3

ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. పాక్వెస్ ఎన్విరాన్‌మెంటల్, కాబా ఇన్ర్ఫాటెక్, రాయల్ హాస్కోనింగ్ డీహెచ్‌వీ, వాన్ ఊర్ద్ ఇండియా, కంపేక్ ఐటీ, ఎకోబ్లిస్ ప్యాకేజింగ్, ట్రో న్యూట్రీషన్, ఎఫ్1 స్టూడియోజ్, స్విచ్ గేర్ అండ్ స్ట్రక్చర్స్, మావిటెక్, డీహ్యూస్ యానిమల్ ఫీడ్, డీఎస్‌ఎం, ప్లానాన్ ఇండియా, ఫోరమ్ రీసెర్చ్, అలార్ గ్రూప్, సోలిదరిదాద్, ఈ ఫ్రెష్ ఇండియా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రితో ముఖాముఖి చర్చించారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్‌ టెక్నాలజీని ఏపీకి అందిస్తామని నెదర్లాండ్స్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్ ఎకనామిక్ సెక్షన్ విభాగాధిపతి మైఖేల్ బైర్కెన్స్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, ఏపీఎన్ఆర్‌టీ వ్యవహారాల సలహాదారు వేమూరు రవికుమార్ పాల్గొన్నారు.

ఓవైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు భారీ ఉక్కు పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఉండవల్లిలోని ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యారు. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇందుకోసం ఏదైనా పోర్టు సమీపంలో రెండు వేల ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.

steel 19122018 2

చైనా-ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టు కింద తాము పెట్టుబడులు పెట్టదలిచామని చైనాకు చెందిన స్టీల్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆసియా దేశాలతో వాణిజ్యం, భారతదేశంలో స్టీల్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని, ఇందుకు అత్యంత అనుకూల ప్రాంతమైనందునే ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నామని వివరించారు. ముడి ఇనుము, బొగ్గు గనులకు సంబంధించి తాము ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నామని, వివిధ దేశాల్లోని పలు సంస్థలతో కూడా తమకు భాగస్వామ్యం ఉందని తెలిపారు.

steel 19122018 3

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికతో మళ్లీ రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయని, అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ పాల్గొన్నారు. మరో పక్క కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్న సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read