శుక్రవారం కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని చంద్రబాబు ట్విట్టర్‌లో కోరారు. జమ్మూకశ్మీరు అసెంబ్లీ రద్దును ఫాసిస్టు చర్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇది పరాకాష్ఠగా పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తోందని గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. నియంతృత్వ పెత్తందారీ పోకడలకు బీజేపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు. సీబీఐ కార్యాలయాన్ని సీబీఐ అధికారులే సీజ్‌ చేసే వరకూ వచ్చిందని..ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు ఐటీ దాడులు చేయిస్తూ.. ప్రతి వ్యవస్ధను దుర్వినియోగం చేస్తూ.. బీజేపీ నేతలు వాటి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వారికి తగిన పాఠం చెప్పడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

jammu 23112018 2

చంద్రబాబు ట్వీట్ చేస్తూ, "Spoke with @MehboobaMufti ji over the phone today. Expressed solidarity with all the leaders fighting against injustice to save and protect democracy. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నాం. గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికం. కేంద్రంలో @narendramodi ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఇది పరాకాష్ట. రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. దానికి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేస్తూ "Thank you for your support Naidu ji at this juncture when J&K is going through a difficult phase." అని అన్నారు.

jammu 23112018 3

జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతంపై చంద్రబాబు జోరు పెంచుతున్న విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను... ఇతర పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. నాలుగేళ్ల పాలనలో ఎన్డీయే దేశంలోని పలు వ్యవస్థలను నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐ లాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలను దెబ్బతీశారని కేంద్రంపై ఆయన నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నారు. బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని ప్రమాదం నుంచి బయటపడేసేందుకే... తాను బాధ్యత తీసుకున్నాను. 40ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలు చూశానని, ప్రధాని మోదీ, అమిత్‌షా ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని ఆయన పదేపదే స్పష్టం చేస్తున్నారు.

భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాను చూసిన మీకు, మహిష్మతి రాజ్యాన్ని మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదేమో. మహిష్మతి పేరుతో అద్భుతమైన నగరాన్ని కళ్లకు కట్టారు, దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా దర్శకుడే అయినా.. రాజమౌళిలోని సృజనాత్మకతతో పాటు, దేశ చరిత్ర, సంస్కృతులపై మంచి పట్టు ఉందని నమ్మిన చంద్రబాబు ఆయనలోని ఆ నైపుణ్యన్ని అమరావతి కోసం వాడుకున్నారు. దీంతో రాజమౌళి, నార్మన్ ఫోస్టర్ టీంతో కలిసి పని చేసారు. బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని ఆయన చెప్పిన సూచన, అందరికీ నచ్చింది.

amaravati 23112018

అయితే ఈ విషయం పై, అమరావతి ద్వేషి అయిన జగన్ పార్టీ, వేరే రకంగా సృష్టించి, రాజమౌళి చేత రాజధానిలో సినిమా సెట్టింగ్ వేస్తున్నారు అనే ప్రచారం చేసారనుకోండి అది వేరే విషయం. అయితే అమరావతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రాజమౌళి తాజాగా వెల్లడించారు. రాజధాని నిర్మాణ విషయమై తనను సంప్రదించినప్పుడు ఆరు నెలలపాటు తప్పించుకు తిరగడానికి ట్రై చేశానన్నారు. అర్కిటెక్చర్ గురించి తనకేం తెలుసని తనని సంప్రదిస్తున్నారనే విషయం అర్థం కాలేదన్నారు.

amaravati 23112018

కానీ చంద్రబాబు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదని.. ఇక కలవక తప్పలేదని రాజమౌళి తెలిపారు. అనంతరం చంద్రబాబుకి, లండన్‌లో ఉన్న ఆర్కిటెక్‌లకు వారధిగా పనిచేశానన్నారు. తాను ఒక డిజైన్‌ను సూచించానని.. కానీ అది ఓకే కాలేదన్నారు. అప్పటికే రెడీగా ఉన్న ఒక డిజైన్ ఓకే అయిందన్నారు. ఆ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని సూచించానని ఆ ప్రతిపాదనను మాత్రం అంతా ఆమోదించారని రాజమౌళి తెలిపారు. మళ్ళీ ఈ ప్రకటన పై, జగన్ బ్యాచ్ మళ్ళీ ఏ హడావిడి చేస్తుందో..

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని అవినీతి ఉద్యోగులపై కేసుల నమోదుకు ఏపీ ఏసీబీ సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు లేదా లంచం అడిగినట్లు ఫిర్యాదులు అందితే వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది. విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ, ఏసీబీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.

ap police 23112018

 ప్రధానంగా సీబీఐకి సాధారణ సమ్మతి నిరాకరించిన అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేందుకు ఏసీబీకి ఉన్న అధికారాలు, తదుపరి దశలో విచారణకు అనుమతి తీసుకునేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశాలను పరిశీలించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టొచ్చని తేల్చారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించేందుకు అవకాశం లేనందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ap police 23112018

ఇప్పటివరకు కేంద్ర ఉద్యోగులపై సీబీఐ మాత్రమే దాడులు నిర్వహించేది. అయితే... సీబీఐకి సాధారణ అనుమతి రద్దు నేపథ్యంలో ఏసీబీ చర్యలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే దాడులకు సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశమైనట్లు తెలుస్తుండగా ఈ సమావేశంలో న్యాయపరమైన ఇబ్బందులపైనా చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడటం, లంచాలు అడగటం చేస్తే, నిరభ్యంతరంగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తే, వాళ్ళ తాట తీస్తారు.

వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు. శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది.

wa 23112018 2

ఇది ఆ వాట్స్ అప్ సారంశం "రాజన్న భక్తులకు, జగనన్న సైనికులకు మనవి..24 అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సీమంధ్రుల ఐక్యత పేరుతో నిర్వహించే కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు. ప్రతి జగనన్న సైనికుడు, పాల్గుని సంఘీభావం ప్రకటించండి. కూకటపల్లిలో టీఆర్ఎస్ ను మనం గెలిపిద్దాం. మన ధ్యేయం మహాకూటమి ఓటమి, కేసీఆర్ గెలుపు. మన ఐక్యత చూసి టిడిపి భయపడాలి, అలా కేసీఆర్ ను గెలిపిద్దాం. మనం టీఆర్ఎస్ ను గెలిపించాలి, మహాకుటమిని ఓడించాలి. తరువాత టీఅరఎస్, మన వైసీపీకి తోడుగా, అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రావటానికి, జగన్ అన్న సియం అవటానికి ఎంతో సహకరిస్తుంది." అంటూ సందేశాలు పంపించారు.

wa 23112018 3

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులకు భద్రత ఉండదని కొందరు భయపెట్టించారని, నాలుగేళ్ల కాలంలో తాము ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదని పలువురు వైసీపీ కార్యకర్తలు అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తాము బాగానే ఉన్నామని, సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలపడానికి ఈ నెల 24న కూకట్‌పల్లిలోని ఎన్‌ గార్డెన్స్‌లో సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్‌ సీఎం కావాలన్నది సీమాంధ్రుల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణాలో కెసిఆర్ కు వైసీపీ నమ్మిన బంటో ఈ ప్రకటనే సాక్ష్యం.

Advertisements

Latest Articles

Most Read