టీడీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం పై వైసీపీ కొత్త కుట్రకు దారి తీసింది. పార్లమెంట్ లో ఆక్టివ్ గా ఉన్న తోట నరసింహం, గత రెండు నెలలుగా అనారోగ్యంగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్రం పై చేస్తున్న పోరాటంలో పాల్గున లేకపోయారు. దీంతో వైసిపీ హడావిడి మొదలు పెట్టింది. టీడీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం, మోడీకి లొంగిపోయారని, చంద్రబాబు పై తిరుగుబాటు చేస్తున్నారని, ఏ నిమిషం అయినా, ఆయనతో విభేదించి బయటకు వస్తున్నారని, పవన్ కళ్యాణ్ తో కలిసి పెద్ద గేమ్ ప్లాన్ చేసారని, ఇలా కధలు అల్లటం మొదలు పెట్టారు. ఒక పక్క ఆయాన ఆరోగ్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటే, వీళ్ళు ఇలా గేమ్ ఆడటం మొదలు పెట్టారు. దీంతో ఆయన రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

thota 29102018 2

అనారోగ్య సమస్యలతో రెండు నెలలపాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయలేకపోయా... ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నాను... నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం... ఢిల్లీలో చికిత్స పొందుతున్న నన్ను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మరో వారం, 10 రోజుల్లో వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలిసిన నా మద్దతుదారులను, కార్యకర్తలను స్వయంగా కలుస్తానని తెలిపారు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది, ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ, త్వరగా కోలుకోవాలని అభిలషించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు తోట నరసింహం.

thota 29102018 3

రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాలలో సభా ముఖంగా మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని... ఏపీపై కావాలని కక్షగట్టి మోడీ వ్యవహరిస్తోన్న తీరును ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రానికి చేయాల్సిన సహాయం చేయకపోగా, ఐటీ, సీబీఐ దాడులతో మోడీ ప్రభుత్వం టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. మరో పక్క నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, తోట నరసింహంను వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆదేశించారు. వైసీపీ ఆడుతున్న గేమ్స్ ఇలా ఉంటాయి మరి.

కోడి కత్తితో జగన్ ను గుచ్చిన కేసులో, పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. విచారణలోకి వెళ్ళే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పై కోడి కత్తి దాడి చేసిన శ్రీనివాస్‌కు నాలుగు సెల్ ఫోన్లతో పాటు, ఒక ట్యాబ్‌ ఉన్నట్టు విచారణలో తేలింది. ఇవన్నీ పోలీసులు సీజ్ చేసి, వాటిలో ఉన్న డేటాతో పాటుగా, కాల్ డేటా కూడా అనలైజ్ చేస్తున్నారు. అలాగే, శ్రీనివాస్ ఉంటున్న ఫ్లాట్ లో, వేరే గదిలు ఉండేవని, కొద్ది రోజుల క్రితం వరకు, వాటిలో ఇద్దరు అమ్మాయిలు ఉండే వారనే సమాచారం వస్తుంది. వాళ్ళు కొద్ది రోజుల క్రిందటే ఆ గది ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుస్తుంది. శ్రీనివాస్ తో పాటు అతనితో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు ఒక గదిలో, మరో గదిలో ఇద్దరు అమ్మాయులు ఉండేవారని సమాచారం రావటంతో, అది ఎంత వరకు నిజం అనే విషయం పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kodikathi 29102018 2

మరో పక్క, నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర అంశాలను చేర్చారు. తాను వైసీపీ అభిమానిగా విచారణలో చెప్పిన శ్రీనివాస్‌.. జగన్‌పై దాడి చేస్తే సానుభూతితో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. జగన్‌ 12 గంటల 30 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారని, 8 నిమిషాల తర్వాత.. అతనిపై దాడి జరిగినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు. దాడి సమయంలో జగన్‌ పక్కకు తిరగడంతో కత్తి భుజానికి తగిలిందని వెల్లడించారు. జగన్‌ ఈ నెల 25నే ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని ముందే తెలుసుకున్న శ్రీనివాస్.. కత్తులు ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చి సీసీ కెమెరాలు కవర్‌ చేయని ప్రాంతంలో దాచినట్లు పేర్కొన్నారు. అలాగే నిందితుడు శ్రీనివాస్‌ ఏడాది కిందటే దుబాయ్‌ నుంచి వచ్చినట్లు తెలిపారు.

kodikathi 29102018 3

జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు జనవరిలోనే కత్తి తీసుకొచ్చి వంటగదిలో ఉంచాడని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అతడు వాడిన మరో ట్యాబ్‌ స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. శ్రీనివాసరావు సహ ఉద్యోగిని విజయ 9 పేజీల లేఖను రాయగా, రేవతి అనే మహిళ మరో పేజీ లెఖ రాశారని వివరించారు. మరోవైపు అతడికి మూడు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించామన్నారు.. దాడి కేసులో విచారణ వేగవంతం చేశామని.. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తామన్నారు సిట్‌ అధికారి. నవంబర్ రెండు వరకు శ్రీనివాస్‌ను ఇంటరాగేట్ చేసేందుకు అనుమతి ఉందన్నారు. అతి త్వరలోనే ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది విచారణలో బయటపడుతోందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నాం. ఒక పక్క డబ్బులు ఇవ్వకపోగా, మరో పక్క కొన్ని ఆకృతుల డిజైన్లు కూడా ఆమోదించకుండా, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఖర్చు పై, రాష్ట్రానికి వడ్డీ భారం మళ్ళీ అదనం. అయితే కేంద్రం ఇలా ఇబ్బందులు పెడుతుంటే, రాష్ట్రంలో ప్రజలు మాత్రం, తమ వంతు సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి పోలవరం యాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం తెలిసిందే. అన్ని జిల్లాల నుంచి రైతులు, పోలవరం నిర్మాణం చూడటానికి వస్తున్నారు.

polavaram 29102018 2

ఈ క్రమంలో, గుంటూరు జిల్లా, పెదరావూరు రైతులు కూడా పోలవరం చూడటానికి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత, వాళ్ళు కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరు చూసి, వారి వంతుగా సహాయం చేసి, కేంద్రం సిగ్గు పడేలా, మీరు సహాయం చెయ్యకపోతే, మేము కట్టుకుంటాం అనే మెసేజ్ ఇస్తూ, కేంద్రం చెంప చెల్లు మనేలా, ఆ ఊరి రైతులు అందరూ కలిసి విరాళం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కోసం ఏకంగా రూ. 16,45,101 సీఎం చంద్రబాబును కలిసి ఇచ్చారు. తెనాలి మండలం, పెదరావూరి గ్రామానికి చెందిన రైతులు ఒకసారి ఇంత పెద్ద మొత్తాన్ని అందజేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంవల్ల తమ పంట పొలాలకు పంట నీరు అందుతోందని, అందుకు కృతజ్ఞతగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నామని రైతులు పేర్కొన్నారు.

polavaram 29102018 3

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి ఆదుకుంది చంద్రబాబేనని రైతులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడినా, విపక్షాలు రాద్దాంతం చేసినా తాము మాత్రం అండగా నిలుస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు. ‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్‌ఛానల్‌, స్పిల్‌వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు.

అభివృద్ధిలో ఆంధ్రా దూసుకుపోతోంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను అధిగమించి ఫస్ట్ ర్యాంక్ లోకి రావడం విశేషం. ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఏపీ 10.5 అభివృద్ధితో దేశంలోనే టాప్ వన్ రాష్ట్రంగా నిలిచింది. రెండంకెల వృద్ధి రేటును సాధించడం ద్వారా గతంలో టాప్ లో ఉన్న తెలంగాణ రెండో స్థానంలోకి, కర్నాటక-3, మహారాష్ట్ర-6, పంజాబ్-14 స్థానాల్లోకి వెళ్లిపోయాయి. 2014-15 విభజన జరిగిన సంవత్సరంలో ఏపీ గ్రోత్ 9.2 శాతంగా ఉంది. ఆ తరువాత రెండో స్థానానికి ఎగబాకింది.

gujarat 29102018 2

ఆ తుదపరి సంవత్సరమే డబుల్ డిజిట్ గ్రోత్ (10.6 శాతం) సాధించినా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అప్పట్నుంచి రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ లోనే కొనసాగుతోందని ప్లానింగ్ విభాగం అధికారులు చెప్పారు. ఇక తలసరి ఆదాయం కూడా రూ. 40 వేలకు పైగా నమోదు చేసిందంటున్నారు. 2014-15లో 6.8 శాతం అభివృద్ధి నమోదు చేసిన తెలంగాణ.. 2017-18లో 10.4 శాతం నమోదు చేసిందని అధికారులు పేర్కొన్నారు. మరో పక్క అమరావతి పై సమీక్షలో, అమరావతి భవిష్యత్‌ తరాల రాజధాని అని.. సాంకేతికత, నవకల్పనలు, సంస్కృతుల మేలి కలయిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని అత్యాధునిక మౌలిక సదుపాయాలకు కేంద్రంగా, ఉత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా, సాధారణ ప్రజానీకంతో పాటు మేధావులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

Advertisements

Latest Articles

Most Read