అసెంబ్లీకి ఎన్ని సార్లు రమ్మన్నా, ఇప్పటి వరకు రాని వైసీపీ నేతలను, అసెంబ్లీ స్పీకర్ ఒక కోరిక కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే కోరికే, మరి వాళ్ళు ఒప్పుకొంటారో లేదో. అదేమిటంటే, శాసన మండలి, శాసన సభ సభ్యులు తరుఫున ఒక నెల జీతాన్ని తిత్లీ బాధితులకు సాయంగా ప్రకటించామని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసన మండలి, శాసన సభ సభ్యులను కూడా వారి ఒక నెల జీతం ఇవ్వాలని కోరుతున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు స్పందిస్తే మంచి పరిణామమేనని, లేకుంటే అధికార పార్టీ శాసన మండలి, శాసన సభ్యులు జీతాలు ఇస్తామని వెల్లడించారు. తిత్లీ తుపాను నష్టాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రిక్త హస్తమే చూపించిందని అన్నారు.

speaker 241020118 2

ఇంకా కేంద్రం సర్వే బృందాలు పరిశీలకు వచ్చి అంచనాలు వేసి, లెక్కలు కట్టి సాయం అందిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయని, ఆ ప్రక్రియ ఎంత త్వరగా చేస్తే, బాధితులకు అంత ఊరట కలుగుతుందన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలాస మండలం పెద్ద గురుదాసుపురంలో మాట్లాడారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతాంగం త్వరగా కోలుకోవాలంటే మొక్కలు పెంపకంతో పాటు అంతర పంటలు వేసుకోవడం చాలా ముఖ్యమంటూ అక్కడ రైతులతో మాట్లాడుతూ సూచించారు. తన కుటుంబం తరుఫున ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మూడేళ్ళలో ఫలసాయం ఇచ్చే మొక్కలు ఉపాధి హామీ పథకం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు.

speaker 241020118 3

సోంపేట మండలంలో నేలమట్టమైన కొబ్బరి తోటలు, జీడిమామిడి, పడిపోయిన ఇళ్లను స్పీకర్ శివప్రసాద్ పరిశీలించారు. ఉద్దానానికి తీవ్రమైన నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని మరింత వేగవంతంగా పూరించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్నారు. హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో తిత్లీ తుపానులో అపార నష్టాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలో పెట్టి చూపించిందన్నారు. ఎర్రముక్కాంలో తుపాను బాధితులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మండల ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరకులు, నీరు అందుతున్నదీ లేనిది ప్రజలను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. రాజాం దారిపోడవునా జీడితోటలు, కొబ్బరి తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తాను గుంటూరు వాసినేనని సముద్రం పక్కనే మా ఊరు ఉందని ఏనాడూ ఇంత నష్టం జరగలేదని బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో డెలాయిట్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విశాఖ ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ, డెలాయిట్‌ మధ్య ఒప్పందం జరిగింది. గ్లోబల్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌, గ్లోబల్‌ ఎంప్లాయిస్‌ సేవలను, కన్సల్టెంట్‌‌, ఆడిట్‌ సేవలను డెలాయిట్‌ అందిస్తోంది. త్వరలో అమరావతి తాత్కాలిక భవనంలో డెలాయిట్‌ కార్యకలాపాలను ప్రారంభించనుంది. విశాఖలో కూడా కార్యకలాపాలను సాగించాలని ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. విశాఖలో అవకాశాలపై అధ్యయనం చేస్తామని, త్వరిత గతిన కంపెనీ ఏర్పాటుపై దృష్టిపెడతామని డెలాయిట్‌ పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ట్యాక్స్ సర్వీసెస్,గ్లోబల్ ఎంప్లొయ్ సర్వీసెస్,కన్సల్టింగ్ సర్వీసెస్,ఆడిట్ సర్వీసెస్ అందిస్తున్న డెలాయిట్.

deloitte 24102018 2

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలు సంస్థల ప్రతినిధులు ఆయా ఒప్పందాల ప్రతులను మార్చుకున్నారు..ఆ ఒప్పందాలివే.. హెచ్‌.డి.ఎఫ్‌.సి.బ్యాంకు విశాఖలో ‘యాక్సెలరేటర్‌’ కార్యాలయాన్ని ప్రారంభించి అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, బ్యాంకింగ్‌ రంగ ఉత్పత్తుల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. డబ్ల్యు-హబ్‌ సంస్థ హాంకాంగ్‌లో ‘అంతర్జాతీయ ల్యాండింగ్‌ ప్యాడ్‌’ ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్‌ సంస్థలకు సహకారం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. .. సోసా అనే సంస్థ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో ఇజ్రాయెల్‌లో ల్యాండింగ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేయనుంది. సోసా సంస్థ విస్తృత యంత్రాంగం నుంచి ప్రయోజనాలు పొందడంతోపాటు మన రాష్ట్ర సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు సాగించడానికీ సహకరించనుంది. ..

deloitte 24102018 3

సింగ్‌ఎక్స్‌ సంస్థ రాష్ట్రంలో పలు అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. .. వాద్వాని, ఉద్యమ్‌ సంస్థలు అంకుర సంస్థలకు అవసరమైన సేవలు, శిక్షణ అందించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ..హాంకాంగ్‌ ఫిన్‌టెక్‌ సంఘం విశాఖ ఫిన్‌టెక్‌ వ్యాలీ అధికారులతో ఒప్పందం చేసుకుంది. .. విశాఖలో ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్మాణానికి అవసరమైన సేవలను బైజోఫోర్స్‌ సంస్థ రాష్ట్రప్రభుత్వ ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది. .. యు.కె.కు చెందిన అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ ‘ఛార్టడ్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌’(సి.ఐ.ఎస్‌.ఐ.) తరపున పలు కోర్సుల నిర్వహణకు, వివిధ కోర్సుల్లో నిపుణుల తయారీకి గీతం విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు కూడా లక్నో‌కు వెళ్లారు. బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ అయ్యేందుకే పవన్ కల్యాణ్ యూపీ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రత్యెక హోదా కోసమో, లేకపోతే మోడీతో పోరాటం కోసమో అనుకునేరు, అదేమీ కాదులేండి, మనోడు రాజకీయం చెయ్యటానికి వెళ్ళాడు. మొన్నా మధ్య, నువ్వు అవిశ్వాసం పెట్టు చంద్రబాబు, నేను దేశమంతా తిరిగి మద్దతు తెస్తా అని చెప్పి, ఇంట్లో కూర్చున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు మాత్రం, ఎదో రాష్ట్రానికి సేవ చేసే భాగంలో దేశ పర్యటన చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాడు.

pk lucknow 2410018 2

అసలు పవన్ ఎందుకు అక్కడకు వెళ్ళాడు అంటే, జనసేన చెప్తున్న కారణం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తుండడంతో భవిషత్ రాజకీయాలపై జాతీయ నాయకులతో చర్చించాలని పవన్ అక్కడకు వెళ్లినట్టు చెప్తున్నారు. మాయవాతే కాక, లక్నోలో పలు పార్టీల ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గుంటారని చెప్తున్నారు. అయితే, అసలు వ్యూహం మాత్రం వేరు. ఇప్పటికే ఎస్సీల పార్టీగా ముద్రపడ్డ బీఎస్పీ, ఏపి ఎన్నికల్లో పాల్గుంది కూడా. అయితే ఇప్పుడు కాపు, ఎస్సీ వోటు బ్యాంక్ కలిసేలా బీజేపీ వ్యూహం పన్నుతుంది. అందులో భగంగానే పవన్, ఇప్పుడు లుక్నో వెళ్ళాడు. నిన్న గవర్నర్ ను కలిసి, బీజేపీ నుంచి వచ్చిన తదుపరి ఆదేశాలతో, ఈ స్టెప్ తీసుకున్నాడు.

pk lucknow 2410018 3

బీఎస్పీ నేతలను కలిసి, అవసరం అయితే వారితో పొత్తు పెట్టుకుని, రాష్ట్రంలోని ఎస్సీలను పవన్ వైపు తిప్పుకునేలా ఐడియా వేసింది బీజేపీ. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో, మాయావతి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా చూస్తున్నాం. మరో పక్క 'దళిత - కాపు ఐక్య వేదిక' పేరుతో అంబేద్కర్ మనవడు, ప్రకాష్ అంబేద్కర్, ముఖ్య అతిధిగా, కాకినాడలో ఒక మీటింగ్ ప్లాన్ చేసారు, మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ మీటింగ్ లో జనసేన కూడా కీలకంగా వ్యవహరించనుంది. ఇవన్నీ చూస్తుంటే, కాపు + ఎస్సీ ఓటు బ్యాంకుతో ఎన్నికలకు వెళ్ళాలని పవన్, బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే ఈ పరిణామాలతో జగన్ మాత్రం ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంకు ప్రధానంగా జగన్ కు ఉంది. ఆ ఓటు బ్యాంకు మొత్తం పొతే, అది జగనే కు పెద్ద దెబ్బ అవుతుంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి మరింతగా లబ్ధి చేకూరనుంది.

నరేంద్ర మోడీ, అమిత్ షా.. వీళ్ళద్దరూ అధికారంలోకి వచ్చిన తరువాత, ది మోస్ట్ పవర్ఫుల్.. ప్రత్యర్ధి పార్టీలు, అధికారులు, వ్యవస్థలు అన్నీ వీళ్ళ ముందు మోకరిల్లాయి. మన రాష్ట్రంలో, ఇంతకే ముందు మోడీ, షా పై విమర్శలు చేసిన వాళ్ళు, ఎలా లొంగిపోయారో చూస్తున్నాం. ఏడాది క్రితం చంద్రబాబు మోడీ-షా పై తిరుగుతుబాటు చేసే దాకా, వాళ్లకి ఎదురు లేదు. చివరకు పార్లమెంట్ సాక్షిగా, ఉతికి ఆరేసారు టిడిపి ఎంపీలు.. నువ్వో పెద్ద ఆక్టర్ వి అని అనేసారు. అప్పటి నుంచి, కొంచెం తిరుగుబాటు మొదలైంది. ప్రాంతీయ పార్టీలు ఏకం అవుతున్నాయి. రాహుల్ పుంజుకుంటున్నాడు. ఈ తరుణంలో, మోడీ-షా మరింతగా రెచ్చిపోతున్నారు. రాఫెల్ డీల్ పై సిబిఐ ఎంక్వయిరీ వేస్తే ఇబ్బంది అవుతుందని, సిబిఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, మన మాట వినడాని, మనకు అనుకూలమిన ఆస్థానాను అందలం ఎక్కించటానికి ప్లాన్ చేసారు.

moditransfer 24102018

చివరకు అలోక్ వర్మ పై తప్పుడు ఆరోపణలు మోపి, ఇదే కేసులో సియం రమేష్ ని కూడా ఇరికించి, అటు అలోక్ వర్మని, ఇటు తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టె ప్రయత్నం చేసారు. ఇవన్నీ పసిగట్టిన అలోక్ వర్మ, ఆస్థానా తన పై పన్నిన కుట్రను భగ్నం చేసి, అతన్ని, అతని కింద ఉన్న డీఎస్పీని అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయం రచ్చ రచ్చ అవ్వటంతో మోడీ అనూహ్యంగా, అలోక్ వర్మను, ఇటు ఆస్థానా పై కూడా వేటు వేసి, కొత్త డైరెక్టర్ ని నియమించారు. ఆ కొత్త డైరెక్టర్ కూడా మోడీ మనిషిగా పేరు ఉంది. కొత్త డైరెక్టర్ ను నియమించగానే సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సిబిఐలో తనకు అనుకూలంగా లేని అధికారులు మొత్తాన్ని కేంద్రం ట్రాన్స్ఫర్ చేపించింది.

moditransfer 24102018

అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే, ఆస్థానా కేసులో దర్యాప్తు చేస్తున్న డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీని అండమాన్ లోని, పోర్ట్‌బ్లయర్‌కు బదిలీ చేశారు. తక్షణమే ఈ బదిలీలు, మార్పులు అమల్లోకి వచ్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరో 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా కేసు విచారిస్తున్న ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. అంతేగాక.. ఆస్థానాపై ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్న బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరన్నా అధికారి చెప్పిన మాట వినకపోతే, అండమాన్ ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరిస్తారు. ఇక్కడ అచ్చంగా అలాగే జరిగింది. మోడీ మనిషి, ఆస్థానా పై విచారణ చేస్తున్న అధికారిని, అండమాన్ ట్రాన్స్ఫర్ చేసారు. మోడీ పగబడితే ఇలాగే ఉంటుంది మరి.

Advertisements

Latest Articles

Most Read