జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి దాడి చేసింది, తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అన్న సుబ్బరాజు టీవీ9తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 'నా తమ్ముడు శ్రీనివాస్ చాలా మంచి వాడు. జగన్ కు అభిమాని. ఎలాంటి గొడవలు కూడా పడేవాడు కాదు. ఎలాంటి నేర చరిత్ర లేదు. జగన్ పై నా తమ్ముడు దాడి చేశాడంటే నమ్మలేకపోతున్నాం. సెల్ఫీ దిగుతానని చెప్పి, దాడి చేసినట్టు టీవీలో చూశాం. నా తమ్ముడు 10 వ తరగతి చదివి, ఆ తర్వాత ఐటీఐ చేశాడు' అంటూ చెప్పాడు.

jagandaadi 25102018 2

మరో పక్క ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. హోటల్ లో పని చేసే వాళ్ళు కూడా, ఆటను ఎప్పుడూ జగన్ గురించే చెప్తూ ఉండేవాడని, చంద్రబాబుని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడని, ఈ సారి మా అన్నకు తిరుగు లేదని చెప్తూ ఉండేవారని అంటున్నారు.

jagandaadi 25102018 3

జగన్‌పై దాడి ఘటనను ఏపీ ప్రభుత్వం ఖండించింది. విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికి దాడులకు ఈ సమాజంలో తావు లేదని లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా.. ఉంటే ఏపీ ప్రభుత్వంతో పాటు పలువురు మంత్రులు ఘటనపై స్పందించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావని పేర్కొన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ శ్రీనివాస్ అన్న చెప్పిన వీడియో చూడవచ్చు https://www.facebook.com/SaahoChandrababu/videos/274358636525989/

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగింది జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయన పై దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు.

srinu 25102018 2

అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో ఏడాదికాలంగా వెయిటర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ను అమలాపురం వాసిగా గుర్తించారు. దాడి ఘటనపై నిఘా వర్గాల ఆరా తీస్తున్నాయి. ప్రాథమిక విచారణ తర్వాత నిందితుడు శ్రీనివాసరావు, వైకాపా అభిమాని అని, 2014 లో వైకాపా అధికారం లోకి రాకపోవటంతో నిరుత్సాహానికి గురయ్యాడని, ఇప్పుడు హత్యా యత్నం లాంటిది జరిగితే వచ్చే సింపతీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెరుగుఅయ్యే ఆలోచనతో హత్యా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

srinu 25102018 3

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పందించారు. జగన్‌పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ విచారణ ప్రారంభించిందని సురేశ్‌ ప్రభు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ స్పందించారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి వెంటనే తనకు పూర్తిస్థాయి నివేదిక పంపించాలని గవర్నర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, యార్లగడ్డ వెంకట్రావులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. డీజీపీని కలిసి జగన్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయనున్నారు.

2016 వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా నత్త నడకన నడిచిందో చూసాం. ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ రాష్ట్రం చేతికి వచ్చిందో, చంద్రబాబు వేగంగా మార్పులు చేసారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా నవయుగ కంపెనీని రంగంలోకి దించారు. కేంద్రం మొదట్లో ఒప్పుకోకపోయినా, ఇలా అయితే ప్రాజెక్ట్ అవ్వదు, నవయుగ లాంటి వారికి ఇస్తేనే అవుతుందని, ఒప్పించి నవయుగకి ప్రాజెక్ట్ ఇప్పించారు. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా, నవయుగ రాత్రి పగలు తేడా లేకుండా, పనులు పరిగెత్తించింది. ఇప్పటికీ పనులు వేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్ వెయ్యటంలో, వరల్డ్ రికార్డు కు కూడా చేరువయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో పెద్దగా లాభం లేకపోయినా, పాత రేట్లకే ప్రాజెక్ట్ ఇచ్చినా, మాతృభూమి మీద మమకారంతో, వాళ్ళు పని చేస్తున్నారు.

navyuga 25102018

అయితే ఇది కేంద్రం తట్టుకోలేక పోతుంది. కేంద్రం సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోయినా, సొంత డబ్బులుతో రాష్ట్రం పనులు చేపిస్తుంది. నవయుగ కూడా పేమెంట్లకి ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా, డబ్బులు ఇవ్వటం లేటైనా, పనులు పరిగెత్తిస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దలకు కన్ను కుట్టింది. పోలవరం ప్రాజెక్ట్ కు ఇబ్బంది రావటానికి, నవయుగ పై కక్ష పెంచుకున్నారు. ఇంత బాగా పని చేస్తున్న వారిని అభినందించకుండా, ఐటి దాడులతో సత్కరించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో ఐటి సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, హైదరబాద్ లోని నవయుగ కంపెనీ పై కూడా ఐటి దాడులు చేస్తున్నారు.

navyuga 25102018

జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం నుంచి 6 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. నవయుగకు చెందిన 47 కంపనీల వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్‌ లిమిటెడ్, నవయుగ రోడ్‌ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ , కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్‌ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. మొత్తంగా, ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పుర్తిచేస్తున్న కంపెనీని, ఈ విధంగా ఇబ్బంది పెట్టి, లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వైసిపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌, రేపు శుక్రవారం కావటంతో అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ రోజు ఉదయం కొంచెం సేపు తిరిగి, హైదరబాద్ బయలుదేరారు జగన్. దీని కోసం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వెయిటర్‌ ఫోర్క్‌తో జగన్‌ పై దాడి చేశాడు. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

jagan 2510208

అయితే వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు. జగన్‌కు వెంటనే చికిత్స అందించారు. ఈ దాడిలో జగన్‌ భుజానికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

jagan 2510208

దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కత్తితో లోపలకి ఎలా వచ్చాడు అనే దాని పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఫోర్సెస్ ఆధినీంలో ఉంటుంది. లోకల్ ఏపి పోలీసు ఎవరూ అక్కడ ఉండరు. ఇవన్నీ చూస్తుంటే, ఎమన్నా కుట్ర ఉందా, ఆపరేషన్ గరుడలో ఒక భాగమా అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఆ కత్తి లోపలకి వెళ్తుంటే, అక్కడ ఎయిర్ పోర్ట్ సెంట్రల్ సెక్యూరిటీ ఏమి చేస్తుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా, ఇలాంటి భౌతిక దాడులను ఎవరైనా ఖండించాలి. పోలీసు ఎంక్వయిరీలో అన్ని విషయాలు బయటకు రావాలని కోరుకుందాం...

Advertisements

Latest Articles

Most Read