సీబీఐలో తలెత్తిన అంతర్యుర్ధం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో తనను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ డెరెక్టర్ అలోక్‌ వర్మ బుధవారంనాడు సవాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. వర్మ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈనెల 26న ఆయన పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను తొలగించడంపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పదవి కాలం ముగియకుండానే సస్పెండ్ చేయడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

cbi 24102018 1

ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అలోక్ వర్మ పిటిషన్‌ను స్వీకరించింది. బుధవారం ఉదయం అలోక్ వర్మ తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించడానికి అంగీకరించింది. అలోక్ వర్మ పదవీకాలం ఇంకో రెండు నెలలు ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వం మధ్యలో తొలగించడానికి వీల్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, తన క్లయింట్‌‌ను, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను సెలవుపై వెళ్లాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించడం వల్ల అనేక సున్నితమైన కేసుల విచారణ విషయంలో రాజీపడే అవకాశాలుంటాయని వర్మ తరఫు హాజరైన న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టు విన్నవించారు.

cbi 24102018 1

మరోవైపు, తాత్కాలిక సీబీఐ డెరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావును కేంద్రం నియమించడంతో ఆయన నియామకం వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో ఆయన అలోక్ వర్మ పనులన్నీ స్యయంగా చూసుకుంటారు. సీబీఐ తనపై పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆస్థానా ఆశ్రయించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు సైతం తదుపరి విచారణ తేదీ (ఈనెల 29) వరకూ ఆస్థానాపై ఎలాంటి చర్య తీసుకోరాదని ఆదేశించింది. కాగా అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానా మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరినీ ప్రభుత్వం సెలవులపై పంపిన విషయం తెలిసిందే.

రెండు రోజుల క్రితం బెజవాడలో బీజేపీ నేతలు, ఆగ్రిగోల్ద్ పేరుతొ చేసిన హడావిడి చూసాం. అందులో అన్నీ అవాస్తవాలు మాట్లాడుతూ, అందరినీ తప్పుదోవ పట్టించారు. ఒక పక్క కోర్ట్ లో కేసు ఉన్నా, అన్నీ అబద్ధాలు చెప్పారు. దీంతో, ఈ కేసు విచారణ చేస్తున్న సిఐడి స్పందించింది. అగ్రిగోల్డ్‌ మోసాలపై అయిదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. అగ్రిగోల్డ్‌పై వస్తున్న ఆరోపణలకు, దర్యాప్తునకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్థ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణల పై మాట్లాడుతూ విమర్శించే వారికి ఆధారం ఉండాలని, సబ్‌రిజిస్ట్రార్‌ విలువ ప్రకారమే ఆస్తులను చూపామని వివరించారు.

cid 24102018 2

అంతా నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ సంస్థ మోసాలపై నమోదైన 14 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశాం. మరో కేసులో వారంలో అభియోగపత్రం దాఖలు చేస్తాం. ఈ సంస్థపై ఐదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బాధితుల వివరాల సేకరణ పూర్తయింది. తెలంగాణ, కర్ణాటకల్లో ఇలా జరగలేదు. న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సాగుతున్నందున విభాగం పనితీరు, దర్యాప్తుపై ఆరోపణలకు ఆస్కారం లేదు. మేము వేసిన అభియోగపత్రాలు, ఆస్తుల అటాచ్‌మెంట్లే విమర్శలకు సమాధానం. నిందితుల్లో బెంగళూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు.

cid 24102018 3

జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించేందుకు 366 ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టుకు సమర్పించామని, త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేయగా రూ.47.42కోట్లు వచ్చిందని తెలిపారు. మృతి చెందిన అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు రూ.7కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. సీబీఐ విచారణ కావాలని కొందరు కోరారని, సీఐడీ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని వివరించారు. జైల్లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారని, మిగతా వారికి బెయిల్‌ వచ్చిందని తెలిపారు.

ప్లెక్సీలు కట్టే అభిమానులు లేరు... ఫ్యాన్సీ షో అని 500 లు పెట్టి టికెట్ కొనే వారు లేరు.. చేతిలో అర డజన్ల సినమాలు లేవు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే... అసలు ఆయనది మన ఆంధ్రానే కాదు.. అయినా తన సినిమాలను ఏదో సమయంలో, ఆదరించారనే మంచి హృదయం... రాజశేఖర్ దంపతులు తిత్లీ తుఫాను భాదితులకు పది లక్షల విరాళం ఇచ్చారు... జీవిత, రాజశేఖర్ రూ.10 లక్షల చెక్కును సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అందజేశారు. తుఫాను బాధితులకు మా వంతు సాయం ఇది అంటూ ఇచ్చారు. ఇప్పటికే కొంత మంది సినీ స్టార్స్ ముందుకొచ్చినా, చాలా మంది టాప్ హీరోలు, కనీసం రూపాయి ఇవ్వలేదు. బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, విజయ్ దేవరకొండ, నిఖిల్, మనోజ్, సంపుర్నేష్ బాబుతో సహా కొంత మంది చిన్న హీరోలు విరాళం ఇచ్చారు, ఇంకా ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నా, వాళ్ళు మాత్రం అడ్రస్ లేరు. ప్రతి సినిమా టికెట్ కొనే ముందు, వీడు మన ఆంధ్రుల కు ఏమైనా ఉపయోగ పడ్డాడ, లేదా అని ఒక్క నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి..

speaker 241020118 2

మరో పక్క, చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం విశాఖ పర్యటనలో ఉండ‌గా తిత్లీ తుఫాను బాధితుల సహయార్థం వివిధ సంస్థల యజమానులు, ప‌లువురు ప్రముఖులు చెక్కు రూపంలో రూ.35 లక్షల విరాళాలను సీఎం చంద్ర‌బాబు నాయుడుకి అందజేశారు. చెక్కులు అందించిన వారిలో… సరనివాస విద్యా పరిషత్ రూ.2 లక్షలు, వాల్తేరు క్లబ్ రూ.7 లక్షలు, ఆర్కే ఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.10 లక్షలు, సీయోన్ ఫార్మా లిమిటెడ్ రూ.2 లక్షలు, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ రూ1.50 లక్షలు, వైభవ్ రూ.1.06 లక్షలు, సీన్ లియో సిస్టమ్స్ రూ.1 లక్ష, విశాఖ ఇన్ఫ్రా సర్వీసెస్ రూ.1 లక్ష, దజకో ఇండియా లిమిటెడ్ రూ.1లక్ష, కంకటలా టెక్స్ టైల్స్ విశాఖ రూ.1 లక్ష, సన్ ఎడ్యుకేషల్ ఇనిస్టిట్యూట్ రూ.1 లక్ష

speaker 241020118 3

కొరమండల్ ప్రాజెక్ట్స్ రూ.1 లక్ష, కుమారరాజ ప్రైవైట్ లిమిటెడ్ రూ.1 లక్ష, ఎస్‌విబిసి గోల్డ్ రూ.1 లక్ష, పివిఎస్ జేమ్స్జూలియర్స్ రూ.1లక్ష, ఏ.వెంకట ప్రసాద్ రూ.50వేలు, మనోజ్ వైభవ్ రూ.50.వేలు, పళని ఎవెన్యూస్ లిమిటెడ్ రూ.50.వేలు, నోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రూ.25.వేలు, అస్ర్జిన్ ఫార్మా లిమిటెడ్ రూ.20వేలు, వి.శ్రీనివాసరావు రూ.20 వేలు, విశాఖ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ రూ.20 వేలు, అభిషేక్ పవర్ సిస్టమ్ రూ.15 వేలు అంద‌జేశారు. అదేవిధంగా హైద‌రాబాద్‌కు చెందిన భవ్య సిమెంట్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ అధినేత ఆనందప్రసాద్ తిత్లీ తుఫాను బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును మంగ‌ళ‌వారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడిని క‌లిసి అందజేశారు. అలాగే ఎంఎస్ విశాఖ ఫిలింనగర్ సెంటర్ రూ.5 లక్షల విరాళం ఇచ్చారు.

వచ్చేనెల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (66).. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన తన భార్య వీణా సింగ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, భాజపా ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జీ అనిల్‌ జైన్, ఇతర పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌ వద్దకు వెళ్లారు. అయితే, నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన.. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ (46) కాళ్లను మొక్కారు. రాజకీయ రంగంలోనూ ఆయన కన్నా రమణ్‌ సింగ్‌ చాలా సీనియర్‌. 2003 నుంచి ఆయన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఉంటోన్న విషయం తెలిసిందే.

up 24102018 2

ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1970లో భారతీయ జన సంఘ్‌లో చేరారు. అనంతరం 1976-77 కాలంలో ఆ పార్టీ యువ విభాగ అధ్యక్షుడయ్యారు. మరోవైపు, యోగి ఆదిత్యనాథ్‌ 1972లో జన్మించారు. ‌ ‌కాగా, రాజ్‌నందగావ్ నుంచి రమణ్‌ సింగ్‌ ఇప్పటికి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మేనకోడలు కరుణా శుక్లాను పోటీకి దింపనుంది.

up 24102018 3

నామినేషన్‌ వేసిన అనంతరం రమణ్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి భాజపాను రాష్ట్రంలో నాలుగోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, ఆ రాష్ట్రంలో నవంబరు 12న జరగనున్న మొదటి దశ ఎన్నికలకుగానూ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజే చివరిరోజు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు నవంబరు 20న జరుగుతాయి. ఈ ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.

Advertisements

Latest Articles

Most Read