శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తిత్లి తుపాను అతలాకుతలం చేసిన నేపధ్యంలో ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యలు, చంద్రబాబు కష్టం పట్ల ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ మూడు రోజుల క్రిందట సంతృప్తి వ్యక్తం చేస్తూ, చంద్రబాబుని అభినందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు ముందు చూపును ప్రదర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణలో అధికార యంత్రాంగంతో చురుకుగా పనిచేయించారని అభినందించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందన లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇదే పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందిగా మారింది. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి, గోదావరి వచ్చి, కారులో కవాతు చేసి, ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి, ఇంకా కరెంటు ఎందుకు ఇవ్వలేదు, అదెందుకు అవ్వలేదు, ఇది ఎందుకు చెయ్యలేదు అంటూ, పవన్ కొడుతున్న ఫోజులు చూస్తున్నాం. నిన్నటితో ఆ కాల్ షీట్లు అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే, నేను ఇన్ని తిట్లు తిడుతుంటే, ఇప్పుడు గవర్నర్, చంద్రబాబుని పొగడటం ఏంటి అంతో పవన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుని ఎవరూ పొగడకూడదని, తనలా అనవసరంగా తిట్టాలి అనే సంకేతాలు ఇస్తున్నారు.
గవర్నర్ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ "చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ గవర్నర్ గారు కూడా సహాయక చర్యలు బాగున్నాయని పొగిడారని ఎద్దేవా చేశారు. సీఎంకు, గవర్నర్‌కు పడదని, కానీ అదే గవర్నర్‌తో పొగిడించుకున్నారని చెప్పారు". మరో పక్క రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లోని అధికారులని కూడా పవన్ ఎద్దేవా చేసారు. తుఫాను ముందు రోజు, చంద్రబాబుతో పాటు, రియల్ టైం గవర్నెన్స్ లోని అధికారులు పని చేసారు. తుఫాను హెచ్చరికల కేంద్రం ఒరిస్సాలో తీరం దాటుతుంది అని చెప్తే, కాదు శ్రీకాకుళంలోనే తీరం దాటుతుంది అని కచ్చితంగా రియల్ టైం గవర్నెన్స్ ఉద్యోగులు చెప్పి, ముందే ప్రజలను అప్రమత్తం చేసారు. అయితే వీరిని కూడా పవన్ ఎద్దేవా చేస్తున్నారు. అన్నీ ల్యాప్‌టాప్‌లలో తెలుసుకునే ముఖ్యమంత్రికి టిట్లీ తుఫాను గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఇదండీ పవన్ కళ్యాణ్ తెలివి..