పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. రెండు రోజుల నుంచి చింతమనేని పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్, కొంచెం రూటు మార్చి లగడపాటి రాజగోపాల్ పై పడ్డారు. జనసేన ఓట్ బ్యాంక్ గురించి జనసేన బలం గురించి లగడపాటి సర్వే లు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పవన్ కళ్యాణ్. మాజీ ఎంపీ లగడపాటిలాంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని, కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.

pk 28092018 2

జనసేన పార్టీకి కేవలం 4 శాతం, లేదంటే 5 శాతం మాత్రమే ఓట్లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు పవన్ కళ్యాణ్. అలాగే కొంతమంది లగడపాటి సీక్రెట్ సర్వేలు అంటూ, జనసేన బలాన్ని కించపరిచే విధంగా వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. లగడపాటి కొన్ని నెలల క్రితం తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి తన ఇంటికి వచ్చాడు అని, ఆ సందర్భంలో జనసేన పార్టీ బలం గురించి ఆయనతో చర్చించడం జరిగిందని, జనసేన పార్టీ సహాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో 2019 లో ఏ ప్రభుత్వం ఏర్పడ లేదని, జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి గా ఉంటుంది అని తనతో చెప్పారని, ఇప్పుడు మాత్రం 4 శాతం అంటున్నారని అని పవన్ అన్నారు.

pk 28092018 3

జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం తామే చేశామని అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకున్నారని, ఇలాంటివి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాని, అని అన్నారు. ధ్వజమెత్తారు. రౌడీయిజం చెలాయిస్తే సహించేది లేదని, కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామంటూ హెచ్చరించారు. నేను 16 ఏళ్ళ వయసులోనే గుండాలని కొట్టాను అనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారు పవన్. తాను లండన్‌ వెళ్లినప్పుడు వ్యాపారవేత్తలను కలిశానన్నారు. ఏపీకి ఎందుకు రావడం లేదని వ్యాపారవేత్తలను అడిగితే.. మీ రాజకీయ నేతలు వాటా అడుగుతున్నారని వాళ్లు తనకు చెప్పారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక తెలంగాణలో పోటీపై ఆలోచిస్తామని పవన్ వెల్లడించారు.

దేశాన్ని ఏలుతున్న ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాజ్యసభ సభ్యుడు.. ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా మాట్లాడాలి.. కాని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇవేమీ పట్టవు, అడ్డగోలుగా రెచ్చిపోండి అని చెప్తున్నారు.. ఏ సోషల్ మీడియా వల్ల, తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారో, అదే సోషల్ మీడియాలో, ఈ సారి కూడా మరిన్ని తప్పుడు ప్రచారాలు చేసి, అధికారం నిలబెట్టుకోవాలని, పార్టీ వాళ్లకి పిలుపు ఇస్తున్నారు. సోషల్‌ మీడియా సాయంతోనే గత ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అబద్ధాలైనా సరే ప్రచారం చేయండని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆ పార్టీ సోషల్‌మీడియా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాజస్థాన్‌లోని కోటలో బీజేపీ సోషల్‌ మీడియా వాలంటీర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

amit 28092018 1

'వాస్తవమో, అబద్ధమో.. ఏదైనా సరే ప్రచారం చేయండి. అందులో మంచీ, చెడు ఎంత ఉందో చూడొద్దు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్‌ చేయండి' అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'గతంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, తన తండ్రి ములాయం సింగ్‌ను కొట్టినట్టు బీజేపీ కార్యకర్త ఒకరు పోస్ట్‌ చేశారు. కొద్ది సమయంలోనే ఇది వైరలయ్యింది. నేను కూడా ఆ పోస్ట్‌ చూశాను. తరువాత అది నకిలీ పోస్ట్‌ అని తేలింది. అయినా, ఈ పనిని మీరు మానకండి. యూపీలోని సోషల్‌ మీడియా వాలంటీర్లు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులో 32 లక్షల మంది సభ్యులున్నారు. ప్రతీ ఉదయాన్నే వారికి సందేశాలు అందుతాయి' అని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

amit 28092018 1

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న సమాచారానికి అడ్డుకట్ట వేయాలని కోర్టులు ఆదేశాలు జారీ చేస్తుంటే మరోవైపు అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరో వైపు, అమిత్ షా వ్యాఖ్యల పై వివిధ పార్టీలు వారి భగ్గు మంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారం మితిమీరిందని, ఇప్పుడు అమిత్ షా నే, ఇలా పిలుపు ఇస్తుంటే, ఇక బీజేపీ కార్యకర్తలకు అడ్డు అదుపూ ఉండదని, ఒక బాధ్యత గల వ్యక్తి ఇలా చెప్పటం ఏంటి అని మండి పడుతున్నారు. ఇప్పటికే రాఫెల్ లాంటి కుంబకోణాల్లో, అబద్ధాలు చెప్పి బ్రతికేస్తున్నారని, ఎద్దేవా చేస్తున్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన మావోయిస్టులు మరికొందరిపై దాడుల కోసం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అరకు, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్‌ జరుగుతున్నా లెక్క చేయకుండా ముగ్గురు మావోయిస్టులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరానున్న బెంజిపూర్‌కు వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కనున్న బస్‌షెల్టర్‌ వద్ద ఒక యువకుడు నిల్చొని వుండగా, ముగ్గురు వెళ్లి...అరకు ఎంపీపీ, టీడీపీ నాయకుడు అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా? అంటూ ప్రశ్నించారు. వారి చేతిలో వాటర్‌ బాటిల్‌, వీపునకు బ్యాగులు, చేతిలో ఆయుధాలు వంటివి వుండడంతో భయపడిన ఆ యువకుడు తనకు ఇక్కడ ఎవరూ తెలియదని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు.

araku 2809218 2

వెంటనే ఊళ్లోకి వెళ్లి ఎంపీపీ అరుణకుమారికి, ఆమె భర్త అప్పాలుకు విషయం తెలియజేశాడు. చెమటలు కక్కుతూ ఆందోళనగా వచ్చిన ఆ యువకుడిని చూసి ఏమైందని వారు ప్రశ్నించగా, మీ కోసం మావోయిస్టులు వచ్చారని, తప్పించుకొని పారిపోవాలని సూచించాడు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు వున్నారని వివరించాడు. దీంతో భయపడిన ఎంపీపీ అరుణకుమారి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన అరకు సీఐ వెంకునాయుడు, ఏఎస్పీ రస్తోగి హుటాహుటిన బెంజిపూర్‌లోని ఎంపీపీ ఇంటికి వెళ్లారు. జరిగిందేమిటో తెలుసుకొని, ఆమె భర్త అప్పాలును, విషయం అందజేసిన యువకుడిని అరకు తీసుకువెళ్లారు. మరో పక్క, విశాఖ మన్యంలో గ్రామదర్శిని కార్యక్రమాల నిర్వహణపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న వారి పేర్లను విడుదల చేసి వారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

araku 2809218 3

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఈశ్వరికి భద్రతను పెంచారు. ముందస్తు అనుమతి లేకుండా గ్రామాల్లో పర్యటనకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షలు మన్యంలో గ్రామదర్శిని కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రజాప్రతినిధులను గ్రామాల పర్యటనకు వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేస్తుండటంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రామదర్శిని కార్యక్రమాలు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో నిర్వహించాల్సిన గ్రామదర్శిని కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది. పెదబయలు మండలం రూడకోటలో గురువారం జరగాల్సిన గ్రామదర్శిని కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. పాడేరు మండలం గొండెలిలో గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈశ్వరి వెళ్లాల్సి ఉంది.

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాడేరు చేరుకున్నారు. కిడారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. సర్వేశ్వరరావు కుమారులను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుమారులు సందీప్, శ్రవణ్ లను ఒదార్చిన చంద్రబాబు, మాకు ఈ చిన్న వయసులోనే అండ పోయింది సార్ అని చెప్పిన మాటలకు, మీకు నేనున్నా అంటూ, భావోద్వేగంతో వారిని దగ్గరకి తీసుకుని ఓదార్చారు.

kidari 28092018 2

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఎనలేని సేవలందించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం బాధాకరం. ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా. కిడారి ఆశయాల సాధనకు తెదేపా కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం."

kidari 28092018 3

"మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌ గనులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన జరగడం బాధాకరం. వైఎస్‌ హయాంలో కేటాయించిన గనులను మా ప్రభుత్వం రద్దు చేయించింది. ఈ విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారు.’ అని అన్నారు. కిడారి కుటుంబాన్ని ఓదార్చిన చంద్రబాబు అనంతరం అరకులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సివేరి సోమ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు.

Advertisements

Latest Articles

Most Read