ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో వర్నిలో తెలంగాణ కమ్మ సేవా సమితి ఆత్మీయ సమేళనం నిర్వహించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కేవలం కమ్మ వారిని మాత్రమే జగన్ అణగతొక్కాలని చూస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ వైసిపి పార్టీ నేతలందరూ అమరావతిని కమ్మరావతిగా మాట్లాడటం సరికాదని ఆమె విమర్శించారు. జగన్ కి నిజంగా దమ్ముంటే అమరావతికి కమ్మరావతి అనే పేరు పెట్టాలని, రేణుకా చౌదరి చాలెంజ్ విసిరారు. కేవలం కమ్మ సామజిక ఒక్క వర్గాన్ని మాత్రమే తక్కువగా చూడటం జగన్ ప్రభుత్వానికే నష్టమని ఆమె చెప్పారు. ఏపిలో ఇన్ని కులాలు ఉన్న కేవలం ఇలా ఒక్క కులాన్నే టార్గెట్ చేయడం, కరెక్ట్ కాదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. మీ అధికారం ఏమి శాశ్వతం కాదని, ప్రజలు వైసిపి కి జగన్ కు బై చెప్పే రోజు త్వరలోనే ఉందని కూడా ఆమె అన్నారు. జగన్ ప్రభుత్వం కేవలం ఒక్క కమ్మ కులాన్నే టార్గెట్ చేస్తున్నారని, ప్రజలకు కూడా అర్ధమవుతుందని , ఆమె అన్నారు. జగన్ కేవలం ఒక్క కులం ఓట్లు తోనే గెలవలేదని, అన్ని కులాల వోట్లు వేస్తె నే గెలిసిందని ఆమె వైసిపి ని తీవ్రంగా విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాల పై, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నార లోకేష్ విరుచుకు పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలకు, జగన్ మోసపు రెడ్డి అంటూ, నారా లోకేష్ విమర్శల దా-డి పెంచారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా మూడేళ్ళు పూర్తి చేసుకోవటం, మరో ఏడాదిలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి అనే అభిప్రాయాల నేపధ్యంలో, నారా లోకేష్ దూకుడు పెంచారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అమ్మఒడి పధకం పైన పెట్టిన ఆంక్షలను, లోకేష్ తప్పు బడుతూ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి సతీమణి, వైఎస్ భారతి వీడియోని, లోకేష్ పోస్ట్ చేసి, భారతిని టార్గెట్ చేసారు. 2019 ఎన్నికల ప్రచారంలో, వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేసారు. ఆ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసారు. అందులో భారతి మహిళలతో మాట్లాడుతూ, "మీ మహిళల కోసమే జగన్ జగనన్న అమ్మఒడి పధకం పెట్టారు. ఒక పిల్లోడు ఉంటే రూ.15 వేలు, మరో పిల్లడు ఉంటే ఇద్దరికీ కలిపి రూ.30 వేలు ఇస్తారు అంటూ" భారతి చెప్పిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసి, జగన్ ని టార్గెట్ చేసారు. అమ్మకు అన్నం పెట్టటం చేతాకాడు కానీ, పిన తల్లికి మాత్రం బంగారు గాజులు చేపిస్తాడు అనే విధంగా జగన్ అమ్మ ఒడి పధకం ఉందని లోకేష్ విమర్శలు గుప్పించారు.

lokesh 15042022 2

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, కేవలం ఒక్కరికి మత్రమే అమ్మ ఒడి ఇస్తున్నారని, అందులో రూ.1000 మరుగుదొడ్లు కోసం అని ఎగ్గొట్టి ఇస్తున్నారని, అలాగే ఇప్పటికే తేదీలు మార్చేసి ఒక ఏడాది ఎగ్గొట్టారు అంటూ లోకేష్ విమర్శించారు. ఇప్పుడు తాజాగా అమ్మ ఒడి పై కొత్త నిబంధనలు పెట్టారని, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే కట్ చేస్తాం, 75% అటెండెన్స్ ఉండాలి, ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు ఉండాలి, కొత్త బియ్యం కార్దు ఉండాలి అంటూ, రకరకాల నిబంధనలు, ఆంక్షలు పెట్టారని, ఇది కేవలం ఎక్కువ మందికి అమ్మ ఒడి ఎగనామం పెట్టటానికే అంటూ లోకేష్ విరుచుకు పడ్డారు. దీనికి తోడుగా వైఎస్ భారతి మాట్లాడిన వీడియోని లోకేష్ పోస్ట్ చేసారు. అందులో స్పష్టంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి వస్తుంది, మీరు ఫ్యాన్ కు ఓటు వేసి గెలిపించాలి అంటూ, వైఎస్ భారతి మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు తరువాత ఒక మాట చెప్పి, జగన్ మోహన్ రెడ్డి ఎలా మోసం చేసారో చెప్తూ, జగన్ మోహన్ రెడ్డిని, లోకేష్ ఎక్ష్పొజ్ చేసారు.

నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంఆలో చోరీ జరిగింది. నెల్లూరు జిల్లాలోని 4వ అదనపు జడ్జి కోర్టు భవనంలోనే ఈ చోరి జరిగింది. ఒక కేసుకు సంబంధించిన ఆధారాలను కొంత మంది ఎత్తుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు ఒక బ్యాగులు  పెట్టి భద్రపరిచారు. అయితే ఆ ఆధారాలు ఉన్న బ్యాగ్ ను కొంత మంది ఎత్తుకు పోయారు. నకిలీ స్టాంపులతో పాటుగా, పాసుపోర్టులు, కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్న 2 బ్యాగులను దొంగలు ఎత్తుకుని వెళ్లారు. ఆ రెండు బ్యాగులో ల్యాప్‌టాప్‌, 4 సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు వెంటన్ పడటంతో, వాటిని కాలువలో పడేసి పారిపోయారు. కాలువలో పడేసిన ఆ బ్యాగ్ ని కీలక ఆధారాలను, సేకరించారు. ఈ అంశం పైన కేసు కూడా నమోదు చేసారు. అయితే అందులో ఫోన్, ల్యాప్ టాప్ లాంటివి ఉండటంతో, అవి ఎలా పని చేస్తాయో చూడాలి. ఇక ఆ కేసు ఎవరిదీ అంటే, కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన, కాకాణి గోవర్దన్ రెడ్డిది. ఈ కేసులో ఉన్న ఆధారాలను ఎత్తుకెళ్ళారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారు అని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించారు అంటూ, సిబిఐ ప్రాధమిక దర్యాప్తు చేసి, జగన్ పైన కేసులు పెట్టిన విషయం తెలిసిందే. తరువాత పూర్తి స్థాయి విచారణ చేసి, జగన్ చేసిన అవినీతికి దిమ్మ తిరిగిన సిబిఐ, ఈడీని కూడా రంగంలోకి దించింది. మొత్తం జగన్ మోహన్ రెడ్డి పైన, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులు పై జగన్ మోహన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆయన కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే 2012 నుంచి ఈ కేసుల విచారణ ఇంకా ట్రైల్స్ కు రాలేదు అంటే ఆశ్చర్య పోక తప్పదు. ఇప్పటికీ ఈ కేసులో, ఆ పిటీషన్ అని, ఈ పిటీషన్ అని, సాగదీస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసుల పై విచారణ మొదలు కాలేదు. అయితే ఇదే విషయం పైన నాంపల్లిలో ఉన్న సిబిఐ స్పెషల్ కోర్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, సాక్షి కేసు పైన కోర్టు, ఈడీ పైన ఆగ్రహం వక్తం చేసింది. కేసు విచారణ ఆలస్యం కావటానికి ఇందిరా టెలివిజన్ కావాలని కోర్టులో డిశ్చార్ పిటీషన్లు వేస్తూ, కేసులు ఆలస్యం అయ్యేలా చేస్తూ ఉండటంతో, కోర్టు ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చింది. అయితే ఇలాంటి పిటీషన్లు వెంటనే కోర్టు కొట్టేస్తుందని, విచారణ సంస్థలు కౌంటర్ దాఖలు చేస్తే చాలు అని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు.

court 15042022 2

అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , తెలిసో తెలియకో కానీ, ఈ కేసుల్లో కౌంటర్ దాఖలు చేయటానికి సమయం తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఇందిరా టెలివిజన్, గత ఏడాదిలో డిశ్చార్జ్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో మొన్న జరిగిన విచారణ సందర్భంగా, సిబిఐ స్పెషల్ కోర్ట్ ప్రిన్సిపల్ జడ్జి మధుసుధన రావు సీరియస్ అయ్యారు. ఈడీకి చివరి చాన్స్ ఇచ్చారు. అసలు ఈడీ ఇబ్బంది ఏమిటో అర్ధం కావటం లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ, ఇదే లాస్ట్ చాన్స్ అని, ఈ కేసుని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నాం అని, ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, తాము ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ కోర్ట్ పేర్కొంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఈ 16 కేసుల్లో , అనేక డిశ్చార్జ్ పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లు క్లియర్ అయితే కానీ, అసలు కేసు విచారణకు రాని పరిస్థితి ఉండటంతో, ఇలా పిటీషన్లు వేసి, కేసుని సాగదీస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read