ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నిన్నటి నుంచే ఇలాంటి ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ తాజాగా సీఎం చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ రోజు మహారాష్ట్ర పోలీసులు అమరావతి వచ్చి, నోటీసులు ఇస్తారనే సమాచారం ప్రభుత్వానికి అందింది.

cbnwarrent 13092018 2

అయితే, చంద్రబాబు ప్రస్తుతం తిరపతి పర్యటనలో ఉన్నారు. నిన్న శ్రీవారకి పట్టు వస్త్రాలు ఇవ్వటానికి తిరుమల వెళ్లారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తిరిగి అమరావతి వస్తారు. తరువాత నిరుద్యోగ బృతి ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అయితే చంద్రబాబుకి నోటీసులు ఇవాళ అందజేస్తారా, రేపు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మహరాష్ట్ర పోలీసులు సమాచారం అందించారు. అయితే అప్పట్లోనే కేసును ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పుడు ఎందుకు తెరమీదకు తెచ్చారనే చర్చ మొదలైంది.

cbnwarrent 13092018 3

2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, తెదేపా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కేసుల్లో ఇరికించడానికి అన్ని దారులూ వెతికారు. ఏ విధంగానూ ఆయన అందనంత ఉన్నత స్థాయిలో ఉన్నారు, అని తెలుసుకుని, ఆయన్ను ఏ అవినీతి కేసులో ఇరికించలేము అని నిర్ధారించుకుని, చివరికి తేలిపోయే బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన కేసును తిరిగి తోడారు. ప్రజల కోసం పోరాటం చేసిన విషయంలో అరెస్టు కావడానికి ఆయన వంటి వాళ్లకు పెద్ద ప్రాబ్లమ్ లేదు, కాదూ. ఆ రోజుల్లోనే ఆయన ఆ కేసులో కనీసం బెయిల్ కూడా నిరాకరించారు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని పట్టుబట్టారు.

cbnwarrent 13092018 2

నిజానికి ఇది 2010లో చేసిన పోరాటం. అప్పట్లో తెలంగాణా కోసం చంద్రబాబు చేసిన వీరోచిత పోరాటం అది. అయితే ఎప్పుడో 8 ఏళ్ళ కేసు పై, ఎవరో వచ్చి కోర్ట్ లో పిటీషన్ వేసి, దీని సంగతి ఏంటో తేల్చండి అని అన్నారు. మరి ఇది ఎవరి ఒత్తిడితో చేసారో మరి. నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. వారెంట్ ఎందుకు అమలు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అరెస్ట్ చెయ్యాలని ఆదేశించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు మాత్రం, ఇది పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయని, ఒక వేళ కక్ష సాధించటానికి ఎమన్నా చేస్తే మాత్రం, లీగాల్ గా ప్రొసీడ్ అవుతామని అంటున్నాయి.

cbnwarrent 13092018 3

ఎన్నికల వేడి రాజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తేనెతుట్టు కదుపుతున్నారు. బూమరాంగ్ అయ్యి తమకే చుట్టుకుంటాయ్ అని మరచిపోతున్నారు. దీని వెనకాల పనిచేస్తున్న ఢిల్లీ పెద్దలు, తెలంగాణాలో ఉన్న ఢిల్లీ పెద్దల స్నేహితులు, జనం అన్నీ గమనిస్తున్నారు అనే విషయం మర్చిపోకండి....తమకు రాజకీయంగా అడ్డు వచ్చిన వాళ్ళను అడ్డు తొలగించుకునేందుకు ఇలా వ్యవస్థలను వాడుకుంటున్న ఢిల్లీ పెద్దలు, దాన్ని సమర్ధిస్తున్న గులాబీలను నలిపి పారేయక మానరు.

"కొందరు అయ్యప్ప దీక్ష చేస్తారు. మరికొందరు భవానీ దీక్ష చేస్తారు. రాష్ట్రంలో కరవు నివారణకు నేను జల దీక్ష చేస్తున్నా. కొందరు శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. సోమవారం శివాలయానికి వెళ్తారు. అలాగే సోమవారం నేను పోలవరం సందర్శిస్తా. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అవగాహన లేని వ్యక్తి. దొంగ లెక్కలు రాసి దొరికిపోయి ఎవరు బెదిరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటున్నాడు. ఆయన తండ్రి హయాంలోనే డబ్బుల కోసం జలయజ్ఞంలో అనేక అవకతవకలు చేశారు. టెండర్లు కూడా రద్దు చేశారు. నేను విఫలమైతే అది ప్రతిపక్ష విజయం కాదు. 5 కోట్ల ప్రజల అపజయం. ఓటమి నా జీవితంలోనే లేదు. సాధించి తీరతా. చరిత్రను తిరిగి రాయడానికే పని చేస్తున్నా" నిన్న పోలవరం సందర్శించిన సమయంలో చంద్రబాబు చెప్పినా మాటలు ఇవి..

cbn polavaram 13092018 2

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ పోలవరం నిర్మాణానికిప్పటికే ఎన్నో అవరాధాలు కల్పించారు. నిర్మాణాన్ని నిలిపేసేందుకు కుట్రలు సాగిస్తున్నారు. గతంలో పట్టిసీమ నిర్మాణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తయితే రాజకీయాల్నుంచి తప్పుకుంటామంటూ కొందరు అప్పట్లో సవాల్‌ విసిరారు. పది నెలల్లోనే పట్టిసీమను పూర్తి చేసి చూపించాం.. ఇప్ప టికీ వారికి గొంతు పెగలడంలేదంటూ చంద్రబాబు దుయ్య బెట్టారు. ఒకప్పుడు పోలవరం నిర్మాణ వేగాన్ని ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

cbn polavaram 13092018 3

బుధవారం పోలవరం ప్రాజెక్టు గ్యాలరీని ఆయన ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల్తో గ్యాలరీలో నడిచారు. కేంద్రం సహకరించక పోయినా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామని ఆ తర్వాత జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. ఇందుకోసం కోసం మహాసంకల్పం పట్టామన్నారు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చి తీరుతామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం కుడికాలువ నిర్మాణం 90శాతం పూర్తయిందన్నారు. ఎడమకాలువ నిర్మాణం 63శాతం పూర్తికావొచ్చిందన్నారు. పోలవరం నిర్మాణంలోని ప్రధాన ఘట్టాలన్నీ అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించాయన్నారు. ప్రపంచంలో ఇంతవేగంగా నిర్మితమౌతున్న ప్రాజెక్టు ఇదొక్కటేనన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రవేశపెడుతున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ఇప్పటికే అనధికారికంగా మొదలైంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 57,151 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రారంభించనుంది. ఈ వెబ్‌సైట్‌ను పరిశీలనార్థం ఇప్పటికే అందుబాటులోకి తేవడంతో చాలామంది పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇంతవరకు నమోదు చేసుకున్నవారిలో 11,280 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనా పూర్తి చేసినట్టుగా అందులో పేర్కొన్నారు. 3,714 మంది నుంచి వివిధ ఫిర్యాదులు రాగా, వాటిలో 150 పరిష్కరించినట్టు కూడా ఉంది. ఈ పథకానికి అర్హతలు, అప్‌లోడ్‌ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాల సమాచారాన్నీ ఇందులో పొందుపరిచారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రభుత్వం యాప్‌నూ రూపొందించింది.

bruti 13092018

నిరాశా నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగుల కలల సాకారానికి ముహూర్తం కుదిరింది. ఉపాధి శిక్షణతో పాటు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం యువనేస్తం వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులకు అక్టోబర్ నుంచి ప్రతినెలా ఆన్‌లైన్‌లో భృతి జమ అవుతుంది. నిరుద్యోగ భృతి అంటే పింఛన్‌లా ప్రతినెలా అందించేది కాకుండా ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల్లో మెరుగైన పనితీరు కనబరచి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేయూతనివ్వటం యువనేస్తం పథకం ముఖ్య ఉద్దేశ్యం. భృతితో ఆర్థికంగా చేయూతనందిస్తూ నైపుణ్యతలో నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.

bruti 13092018

రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ చేశారు. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్ జోడిస్తే చాలు భృతికి అర్హులవునా, కాదా? అనే విషయం తేలిపోతుంది. యువనేస్తం పోర్టల్ ఒక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలా పనిచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నిబంధనలకు లోబడి నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి యువతకు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read