మంత్రి నారా లోకేష్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక ఆహ్వానం పంపిచింది. చైనా లో సెప్టెంబర్ 18 నుండి 20 వరకూ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు హాజరు కావాలి అని మంత్రి లోకేష్ కి ఆహ్వానం వచ్చింది.  దేశంలో ఇద్దరు మంత్రులకు మాత్రమే ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో మన దేశం తరపున మంత్రి నారా లోకేష్ కి మాత్రమే మాట్లాడే అవకాశం.

lokesh 12092018 2

3 రోజుల పాటు 11 ముఖ్య సమావేశాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డ్ మెంబెర్స్ తో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. సెప్టెంబర్ 17 నుండి 22 వ తారీఖు వరకూ మంత్రి నారా లోకేష్ చైనా లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడంతో పాటు, పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలతో ఒప్పందం..పలు కీలక ప్రకటనలు ఉండబోతున్నాయి.

రాజధానిపై భాజపా, వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయంలో నీరు లీకవుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాణ్యతలో తేడా ఎక్కడుందో చూపాలని సవాలు విసిరారు. రాజధానిపై భాజపా ఎందుకంత విషం కక్కుతోందని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ‘రాజధాని నగర నిర్మాణం, ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి’పై మంగళవారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు.

jagand 12092018 2

‘రాజధాని ఆకృతులను తీసుకెళ్లి చూపించినా ప్రధాని మోదీ ఆసక్తి కనబరచలేదు. మోదీ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అహ్మదాబాద్‌ అలాగే ఉంది. నేనుతొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సరసన సైబరాబాద్‌ను తయారుచేశా.. సిటీ కోర్టు భవనం డిసెంబరు నాటికి పూర్తవుతుంది. ఆ సమయానికి హైకోర్టు ఇక్కడకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే లేఖ రాశా. అయినా కోర్టు విషయంలో రాజకీయం చేస్తారా? అదే హైకోర్టులో పెడతాం అని సుప్రీంకోర్టులో కౌంటరు దాఖలు చేస్తారా? దీన్నేమనాలి?

jagand 12092018 3

అమరావతి మ్యాపులు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అంటున్నారు.. ఇక్కడేమో భవనాలు అంతస్తులకు అంతస్తులే పైకి లేస్తున్నాయి. తలెత్తి చూడాల్సి వస్తోంది. రాజధాని నిర్మాణంవల్ల కేంద్ర ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. మేం పన్నులు కట్టాలి.. మీరు పెత్తనం చేస్తారా? అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి, ఇప్పటి కేంద్రానికి తేడా ఏమైనా ఉందా? రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాలు సృష్టించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ అమరావతిపై ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. కొండవీటివాగు, పాలవాగు వరదతో మునిగిపోతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. సీలింగ్‌ పైపులను వాళ్లే తొలగించి నీరు లోపలకు వచ్చిందన్నారు. పంటలకు నిప్పు పెట్టి తెదేపా చేసిందని చెబుతున్నారు.’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజ మెత్తారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజలే ముందు’ (పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదమని ఇందులో భాగంగానే పెట్రోడీజిల్ ధరలు తగ్గించామన్నారు. వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రజలకు 11 వందల కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పించామన్నారు. లీటరుకు రెండు రూపాయలు తగ్గించటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందన్నారు.

modishah 12092018 2

ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులే కృతజ్ఞతలు తెలిపారన్నారు. కేంద్రం ఆ మాత్రం ఉదారంగా వ్యవహరించక పోవటం దురదృష్టకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజకీయంగా టీడీపీని ఒంటరి చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణలో ఏకపక్షంగా పొత్తులు ఉండవని ప్రకటించిన బీజేపీ రాష్ట్రంలో మాత్రం వైసీపీతో అంటకాగుతోందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్‌చేసిన వాళ్లే సమావేశాలకు గైర్హాజరయ్యారని, ఢిల్లీలో మకాం వేస్తామని చెప్పిన నేతలు పత్తాలేరని పరోక్షంగా పవన్‌కల్యాణ్‌పై మండి పడ్డారు. కేంద్రం వైఫల్యాలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ నోరు తెరవరని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, పెట్రో డీజిల్ ధరల పెంపు దలపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ప్రజా వ్యతిరేక చర్యలవల్లే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిందని స్పష్టం చేశారు.

modishah 12092018 3

బీజేపీయేతర పార్టీలు ఏకం కావటాన్ని జగన్ సహించలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో సమర్థనాయకత్వాలు లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని ఎందుకు పూడ్చరని ప్రశ్నించారు. సాయం చేయకపోగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 50 కోట్లు కూడా వెనక్కు తీసుకున్నారు.. మన ఖాతాలో వేసిన రూ 350 కోట్లు ఎలా మళ్లిస్తారని నిలదీశారు. నాలుగేళ్ల రాష్ట్భ్రావృద్ధి మన కష్టం.. మన తెలివితేటలతోనే సాధించామన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అందుకు అసెంబ్లీ, కౌన్సిల్‌ను వేదికగా ఎంచుకోవాలని ఉద్బోధించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా గృహనిర్మాణంలో పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చామని, ఎస్సీలకు 10 రెట్లు, ఎస్టీలకు 12 రెట్లు మేలు చేశామన్నారు. పట్టణాల్లో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ 4 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు స్పల్ప గాయాలయ్యాయి.

polavaram 12092018 2

మంత్రి పుల్లారావు ఘటనాస్థిలి పరిశీలించారు. సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదం గురించి పుల్లారావును అడిగితెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు.

polavaram 12092018 3

పోలవరం గ్యాలరీ వాక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు గ్యాలరీ వాక్‌కు ముహూర్తం నిర్ణయించారు. 20 నిమిషాలు ముందుగా, 9.45 గంటలకల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం ప్రాంతానికి చేరుకోవాలని సీఎంవో మంగళవారం ఆహ్వానాలు పంపింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 8 బస్సుల్లో పోలవరం యాత్రకు బయల్దేరారు.

Advertisements

Latest Articles

Most Read