సమాచార సంకేతిక రంగం ఒక విప్లవం అని, దానితో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని, ఈ స్థాయిలో ఐటీ, ఐవోటీలను ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. బుధవారం ఇక్కడ ‘ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్’‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భూగర్భ జలాల నుంచి పిడుగులు పడే సమాచారం వరకు రియల్‌టైమ్‌లో సమాచారాన్ని అందించే వ్యవస్థలని ఏర్పరచుకున్నామని చెప్పారు. కలుషితాహారం నుంచి బయటపడేందుకు.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

e raithu 12092018 2

సహజసిద్ధ సేద్యపు విధానాలు కచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు. మనం తినే తిండిలో సగానికిపైగా రసాయనాలు ఉంటున్నాయని, తినే తండి, పీల్చే గాలి, ఉండే వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోతుండటం ఆందోళనకరమన్నారు. ఈ పరిస్థితిని గమనించి ముందే మేల్కొన్నామని, ప్రకృతి సహజసిద్ధ వ్యవసాయం దిశగా అడుగులువేశామని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులను ఆశ్రయిస్తున్నామని సీఎం వివరించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్దఎత్తున చేపట్టామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్‌ను ఏపీలో నెలకొల్పబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇ-రైతు డిజిటల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం ఒక విప్లవం అని పేర్కొన్నారు.

e raithu 12092018 3

మాస్టర్ కార్డ్ నిర్వాహకులు ఎప్పుడు కలిసినా రైతాంగానికి ప్రయోజనకారిగా వుండే సాంకేతికతను తీసుకురావాలని కోరేవాడినని సీఎం గుర్తుచేశారు. ఆర్థిక సాంకేతిక రంగంలో వారు ఉద్దండులని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగం ఉండే డిజిటల్ వేదికను వారు పరిచయం చేస్తుండటం గర్వకారణం అన్నారు. ఈ విధానం మొట్ట మొదట ఏపీలోనే ప్రారంభం కావడం మరింత విశేషం అన్నారు. సాగు వివరాలు, ఉత్పత్తుల వివరాలను ‘ఇ-రైతు’ డిజిటల్ మార్కెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా విక్రయంచుకునే అవకాశం రైతులకు దక్కుతుందన్నారు. రైతులకు మార్గదర్శిగా, సలహాలిచ్చే స్నేహితునిగా ‘ఇ-రైతు’ వుంటుందని చెప్పారు. వ్యవసాయదారులకు ప్రపంచ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వారికి రెట్టింపు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ మరో ప్రచారం మొదులు పెట్టింది. తన అనుకూల మనుషులు, మీడియా చేత, ఆంధ్రప్రదేశ్ లో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయి అంటూ, హడావిడి మొదులు పెట్టారు. ఇందుకోసం మొదటిగా ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నేత, జగన్ మోహన్ రెడ్డిని వాడారు అమిత్ షా. అమిత్ షా ఆదేశాలు ప్రకారం, నిన్న జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో ముందుస్తు ఎన్నికలు వస్తున్నాయి, జనవరిలో ఎన్నికలు వస్తున్నాయి అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అదేంటి మే నెలలో ఎన్నిలు అయితే, ఈయన జనవరి అంటున్నారు అని అందరూ అవాక్కయ్యారు. మొన్న కెసిఆర్ కూడా ఇలాగే, అసెంబ్లీ రద్దు సమయంలో, నవంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి అని మీడియాతోనే చెప్పేశారు.

arnab 12092018 2

కెసిఆర్, మోడీ/అమిత్ షా లతో అవగాహన చేసుకునే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా, జనవరిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడు. జగన్ విశాఖలో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభకు జనవరి ఆఖరులో ఎన్నికలు వచ్చే సంకేతాలున్నాయని, మానకు దీని పై కచ్చితమైన సమాచారం ఉందని, పార్టీ నాయకులు, శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని జగన్‌ అన్నారు. అయితే ఇలా జగన్ నిన్న ఈ మాట చెప్పారో లేదో, ఈ రోజు బీజేపీ అనుకూల జాతీయ మీడియా రిపబ్లిక్ ఛానెల్ లో అర్నాబ్ గోస్వామి కూడా ఇదే వార్తా బ్రేకింగ్ బ్రేకింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

arnab 12092018 3

కెసిఆర్ లాగే, చంద్రబాబు కూడా ముందస్తుకి వెళ్ళిపోతున్నాడు అంటూ దేశ వ్యాప్తంగా చర్చ లేపారు. పాలన పై పట్టు పోక ముందే, చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు అంటూ, తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది బీజేపీ. అయితే, ఈ వార్తల పై ఏపి మంత్రి స్పందించారు. ముందస్తుకు వెళ్ళే ఆలోచనలు మాకు లేవని, ఇదంతా అమిత్ షా కనుసన్నల్లో ఆడుతున్న నాటకం అని అన్నారు. అంతకు ముందు జగన్ చేసిన వ్యాఖ్యల పై, లోకేష్ కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారని, భాజపా నాయకుల నుంచి ఆయనకు హాట్‌లైన్‌లో సమాచారం వచ్చిందేమోనని మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు.

అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిధులివ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే ఈ గడ్డపై పుట్టిన వారిగా మీకు అడిగే బాధ్యతలేదా అని బీజేపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలదీశారు. మంగళవారం శాసనసభలో రాజధాని అమరావతి నిర్మాణంపై లఘు చర్చ సందర్భంగా కేంద్రం వైఖరిని టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా నిరసించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు, చాంద్‌బాషా, గొల్లపల్లి సూర్యారావు, వీరాంజనేయులు మాట్లాడుతూ గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, శివాజీ విగ్రహానికి 300 కోట్లు కేటాయించిన కేంద్రం రాజధాని నిర్మాణానికి మాత్రం 15 వందల కోట్లు విదిలించిందని ధ్వజమెత్తారు.

cbnbjp 12092018 2

దీనిపై బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సభ్యులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పటేల్ విగ్రహానికి రూ 300 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్రం గుజరాత్‌కు ఎంతిచ్చిందో మనకు ఇచ్చిన హామీలేమిటో చెప్పమంటారా! అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసినప్పుడు ఈ గడ్డపై పుట్టిన వారిగా మీకూ బాధ్యత ఉంది కదా అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మీరు తలెత్తి చూడలేని విధంగా భవనాలు వెలుస్తాయని స్పష్టంచేశారు.

cbnbjp 12092018 3

నేను బీజేపీలో ఉంటానో..లేదో..! విష్ణుకుమార్‌రాజు... కేంద్రం నిధులు మంజూరు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తూ తమ ప్రభుత్వం ప్రపంచ రాజధాని నిర్మాణాలు చేపట్టిందని ఆ ప్రగతి ఏమిటో మీరే చూస్తారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోపు నేను బీజేపీలో ఉంటానో..లేదో.. ఏ పార్టీలో ఉంటానో..ఎక్కడ ఉంటానో అని వ్యాఖ్యానించటం కొసమెరుపు. తాజ్‌మహల్ కట్టినట్లుగా రాజధాని నిర్మాణం చేపట్టారని రాజధానికి తగిన నిధులపై కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉందని సమర్థించారు. అయితే ఇప్పటి వరకు తమను ఈ విషయంలో ప్రభుత్వం భాగస్వాముల్ని చేయలేదని చెప్పారు.

ఇది ఎన్నికల ఏడాది. మరో ఎనిమిది నెలల్లో చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు. ఇదే సమయం అనుకున్నారో ఏమో, చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి, తమ డిమాండ్లు నెరవేర్చుకుంటానికి ప్రభుత్వ ఉద్యోగులు రెడీ అయ్యారు. ఒక పెద్ద కోరికల చిట్టా ఇచ్చి, ఇవి నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు 63 శాతం ఫిట్మెంట్‌తో రూ. 25వేల కనీస వేతనం చెల్లించాలని, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను తక్షణం క్రమబద్ధీకరించాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్ పాలసీని అమలు పరచాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

employees 12092018 2

రాష్ట్రంలోని 94 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాల కనీస అవసరాలను ప్రతిబింబిస్తూ బొప్పరాజు నాయకత్వంలో దాదాపు 62 సంఘాల ప్రతినిధులతో కలిసి మంగళవారం సచివాలయంలో 11వ పీఆర్‌సీ కమిషనర్ అశుతోష్ మిశ్రాను కల్సి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితులను, పెరుగుతున్న ధరలను, సాంకేతిక అంశాలను, జాతీయ ధరల ఇండెక్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిష్ణాతులు సుదీర్ఘ అనుభవం కల్గిన నేతలతో చర్చించి తమ నివేదిక అందించామన్నారు.

employees 12092018 3

ఇప్పటికే రాష్ట్రం పై భారం అయినా, 43 శాతం ఫిట్మెంట్‌ ఇచ్చారు చంద్రబాబు. ఇది వరకు లాగా కాకుండా, ఒత్తిడి లేకుండా పని చేసేలా చేస్తున్నారు. సచివాలయంలో పని చేసే వాళ్ళకి అయితే, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాగా 5 డేస్ వీక్. హైదరాబాద్ కి స్పెషల్ ట్రైన్. ఇలా అనేక విధాలుగా, ప్రభుత్వ ఉద్యోగులని ఆడుకుంటున్నా, వీరు ఇప్పుడు వచ్చి 63 శాతం ఫిట్మెంట్‌ అడుగుతున్నారు. రాష్ట్రం ఉన్న పరిస్థితి తెలిసినా, ఇది ఎంత భారమో తెలిసినా, వీళ్ళు కోరటం న్యాయమా ? పోనీ వీరి జీతాలు సామాన్య ప్రజలు జీతాలు లాగా, 10 వేలు, 20 వేల జీతాలా ? సామాన్యుడు ఒక పక్క అల్లాడి పోతుంటే, మళ్ళీ వచ్చి, ఉద్యోగులు 63 శాతం ఫిట్మెంట్‌ అడిగితే, పడే చిల్లు ప్రభుత్వానికి, అంటే ప్రజలకి. ఈ డిమాండ్ ను మన ఉద్యోగులు వెనక్కు తీసుకుంటారని ఆశిద్దాం...

Advertisements

Latest Articles

Most Read