జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా) అమలులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ పది అవార్డులు సాధించింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర, మండల, గ్రామస్థాయి అవార్డులను ప్రదానం చేసింది. 15 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదింట పది పురస్కారాలను చేజిక్కించుకుంది. వీటిని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, కార్యదర్శి బి.రామాంజనేయులు, సంచాలకులు రంజిత్‌భాషా అందుకున్నారు.

awards 12092018 2

నరేగా అమలులో ఉత్తమ జిల్లాలుగా ఎంపికైన విశాఖపట్నం, చిత్తూరు తరఫున కలెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌చంద్‌, ఆయా జిల్లాల అప్పటి డ్వామా పథక సంచాలకులు ఎ.కల్యాణచక్రవర్తి, ఎన్‌.పోలప్ప అవార్డులు స్వీకరించారు. వ్యక్తిగత అవార్డుల్లో భాగంగా నూరు శాతం ఆస్తులు జియో ట్యాగింగ్‌ చేసిన కర్నూలు జిల్లాకు చెందిన జీఐఎస్‌ సహాయకుడు కె.షారోన్‌పాల్‌, డీబీటీ విధానంలో వేతన చెల్లింపులు చేసిన గ్రామీణ తపాలా సేవకుల అవార్డును డి.రాంబాబు అందుకున్నారు.

awards 12092018 3

ఉత్తమ గ్రామ పంచాయతీ కేటగిరిలో ఎంపికైన చిత్తూరు జిల్లా కోటబయలు తరఫున సర్పంచి ఎం.శ్రీనివాసులు, క్షేత్ర సహాయకుడు రెడ్డి బాషా అవార్డులు పొందారు. గత మూడేళ్లుగా వివిధ కేటగిరిల్లో వరుసగా మొదటి స్థానంలో రాష్ట్రం నిలవడంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అవార్డు విజేతలు అందరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు ప్రభుత్వానికి మరింత పేరు తేవాలని ఆకాంక్షించారు.

‘అమరావతిలో ఒక్క ఇటుక పెట్టలేదంటున్నారు.. శీతల గదుల్లో కూర్చుని మాట్లాడటం కాదు.. ఇక్కడికొచ్చి చూడండి. 2.10 కోట్ల చ.అడుగుల నిర్మాణాలు జరుగుతున్నాయి’ అని పురపాలక మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో రాజధాని నిర్మాణంపై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలకు 2016 ఫిబ్రవరి 16వ తేదీన రూ 185 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. జీ ప్లస్ వన్ కింద రూ 2318 కోట్లతో ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్‌కు 2016 జూలై 14వ తేదీన టెండర్లు ఖరారయ్యాయన్నారు. మొత్తం 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారని తెలిపారు. చదరపు అడుగుకు అయిన ఖర్చు రూ 2980 కాగా కార్యాలయాల్లో ఫర్నిచర్, ఇతర వసతులు , తుళ్లూరు నుంచి మంచినీటి పైపులైన్లు, రహదార్లతో కలుపుకుంటే ఎంతవుతుందని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

jagan 123092018

మాస్టర్‌ప్లాన్‌లో 320 కిలోమీటర్ల ట్రంక్‌రోడ్డు నిర్మాణాలను 240 కిలోమీటర్ల రహదార్లకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. కృష్ణానదిపై 9 ఐకానిక్ వంతెనల నిర్మాణంలో భాగంగా తొలిదశలో ఒక వంతెనకు రూ 11 వందల కోట్ల అంచనా సిద్ధం చేశామన్నారు. ఇవికాక అవుటర్, ఇన్నర్ రింగురోడ్లు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 5వేల 979 కోట్లతో 15 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, మిగిలిన 14 గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందించామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు ముంపు నియంత్రణకు నెదర్లాండ్స్‌కు చెందిన సంస్థతో పాటు టాటా కన్సల్టెంట్ గత వందేళ్ల వరద ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి డిజైన్లు రూపొందించిందని 16వేల క్యూసెక్కులు నీరు ప్రవహించే విధంగా ప్రతిపాదించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం 21వేల క్యూసెక్కుల నీటిని నిల్వచేయాలని నిర్ణయించిందని రాజధాని నగరం వెలుపల, అంతర్గతంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

jagan 123092018

రాజధాని ప్రాంతంలో రెండుకోట్ల పదిలక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. శాసనసభ డిజైన్లు ఖరారయ్యాయని నెలలోపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రూ 5676 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఎమ్మెల్యేలకు 288, ఐఏఎస్‌లకు 144, ఎన్జీవోలకు 134, ఇతరత్రా గృహనిర్మాణ సముదాయాలు ఇప్పటికే పూర్తి కావచ్చాయన్నారు. కేంద్రం పైసా ఇవ్వకపోయినా రాజధాని నిర్మాణంలో రాజీపడటంలేదన్నారు. రూ 48వేల కోట్లతో డీపీఆర్ ఇస్తే కేవలం 15 వందల కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్, హడ్కో, ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి రూ 29వేల కోట్లు రుణాలు సేకరిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన 16 వందల కోట్లకు యూసీలు సమర్పించామని నీతిఆయోగ్ సైతం రాజధానికి తక్షణం 666 కోట్లు విడుదల చేయాలని సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ప్రతిపక్షనేత డేటా తెలుసుకోకుండా కేవలం బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని అమరావతి వస్తే పరిస్థితి తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

మొన్న కేసీఆర్ అసెంబ్లీ రద్దు సమయంలో చెప్పిన సంగతి గుర్తుందా ? నవంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి అని మీడియాతోనే చెప్పేశారు. అదేంటి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ కదా, కెసిఆర్ కి యా ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అంటూ, చివరకి ఈ వ్యాఖ్యల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. కెసిఆర్, మోడీ/అమిత్ షా లతో అవగాహన చేసుకునే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా, జనవరిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడు. అదేంటి మే నెలలో ఎన్నిలు అయితే, ఈయన జనవరి అంటున్నారు అని అందరూ అవాక్కయ్యారు.

jagan 12092018

నిన్న జగన్ విశాఖలో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభకు జనవరి ఆఖరులో ఎన్నికలు వచ్చే సంకేతాలున్నాయని, మానకు దీని పై కచ్చితమైన సమాచారం ఉందని, పార్టీ నాయకులు, శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని జగన్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న నవరత్న పథకాల్ని, వాటి ప్రయోజనాల్ని ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖలోని ఓ ఫంక్షన్‌హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ మాజీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశంలో, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చెప్పేశారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేతలకు చెప్పారు.

jagan 12092018

ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారని, భాజపా నాయకుల నుంచి ఆయనకు హాట్‌లైన్‌లో సమాచారం వచ్చిందేమోనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికీ తెలియని విషయాలు ఆయనకు తెలుస్తున్నాయని అన్నారు. లోకేష్‌ మంగళవారం శాసనసభ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. యువనేస్తంపై శాసనమండలిలో లోకేష్‌ ప్రజంటేషన్‌ బాగుందని మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ అభినందించారు. బాగా పనిచేశారన్న ప్రశంసలు ముఖ్యమంత్రి చంద్రబాబునుంచి మొదటిసారి అందుకున్నామని లోకేష్‌ పేర్కొన్నారు. యువనేస్తం వెబ్‌సైట్‌ను కూడా ముఖ్యమంత్రి చూశారని అన్నారు.

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, పెను సంచలనం సృష్టించారు. కొందరు ప్రముఖుల మోసాల తీరును వివరిస్తూ ఓ జాబితాను ప్రధాని కార్యాలయానికి అప్పట్లో తాను గవర్నర్ గా వున్న సమయంలో పంపానని, అయినా ఫలితం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాజన్ ఆరోపించారు. భాజపా నేత మురళీ మనోహర్‌ జోషి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘానికి సమర్పించిన నివేదికలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రఘురామ్‌రాజన్‌.. 2016, సెప్టెంబరు వరకు మూడేళ్ల పాటు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేశారు. రుణాలు ఎగవేసి తప్పించుకుంటున్న పెద్ద తిమింగలాల గురించి ప్రధాని కార్యాలయానికి తెలియజేసినా పట్టించుకోలేదని చెప్పారు.

modi 12092018 2

‘‘బ్యాంకులను మోసం చేసే కేసులను ప్రారంభంలోనే గుర్తించేందుకు నేను రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉన్నప్పుడు మోసాల గుర్తింపు విభాగాన్ని ఏర్పాటు చేశాను. ప్రధాని కార్యాలయానికి పెద్ద స్థాయి కేసుల జాబితాను పంపించాను. కనీసం ఒకరిద్దరిపైన అయినా కేసు నమోదు చేసేందుకు సమన్వయంగా పని చేద్దామని విజ్ఞప్తి చేశాను. అయినా ఈ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. వాస్తవానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యవహారమిది.’’ అని రఘురామరాజన్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క అవినీతిపరుడిపై అయినా ఈ వ్యవస్థ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్కరిపైనైనా కేసు నమోదు చేయలేకపోయింది. దగాలను అడ్డుకోలేకపోయారు.’’ అని రాజన్‌ చెప్పారు.

modi 12092018 3

భారత్‌లో విద్యుత్తు కొరత ఉందని, అయినా విద్యుత్తు ప్రాజెక్టుల్లో ప్రతిష్టంభన కొనసాగడం చూస్తుంటే ప్రభుత్వం తగినంత వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతోందని స్పష్టమవుతోందన్నారు. నిరర్ధక ఆస్తులను గుర్తించడంలో విఫలమయ్యారంటూ తనపై వచ్చిన విమర్శలను రఘురామ్‌రాజన్‌ తిప్పికొట్టారు. ఈ విమర్శలు హాస్యాస్పదమన్నారు. రఘురామ్‌రాజన్‌ నివేదికను కాంగ్రెస్‌ అవకాశంగా మలుచుకుంది. ఆయన ప్రధాని, ప్రధాని కార్యాలయాన్నే తప్పుబట్టారని పేర్కొంది. రుణాలు ఎగవేసిన వారెవరో తెలిసినా ప్రధాని చర్య ఎందుకు తీసుకోలేదని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. యూపీఏ అధికారంలోంచి దిగినప్పుడు నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.83లక్షల కోట్లేనని, ఇప్పుడు ఎగవేసిన రుణాల విలువ రూ.12లక్షల కోట్లు అని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read