మొన్నా మధ్య నారా - హమారా మీటింగ్ లో, చంద్రబాబు మాటలను మార్ఫింగ్ చేసి, కట్, పేస్టు చేసి, ఆయన అనని మాటలు, అన్నట్టు, ఎలా ప్రచారం చేసారో చూసాం. సాక్షి పత్రిక ముసుగులో, వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇలా ఉంటాయి. అయితే, ఈ రోజు ఇలాంటి పనే చేసింది, జగన్ ప్రియ శిష్యురాలు రోజా.. తన అన్న, జగన్ మోహన్ రెడ్డి పేరు నిలబెడుతూ, అసెంబ్లీ వీడియోనే సగం వరకు కట్ చేసి, కావాల్సింది తీసుకుని తప్పుడు ప్రచారం చేసింది రోజా.. అసెంబ్లీకి వచ్చి, అక్కడ ప్రజా సమస్యలు గురించి పట్టించుకోని వైసిపీ, అక్కడ జరిగే విషయాలు మాత్రం, తీసుకుని, వారికి కావలసిన విష ప్రచారం చేస్తున్నారు.

paritala 07092018 2

ఇదే కోవలో, మంత్రి పరిటాల సునీత, డ్వాక్రా రుణాల గురించి అడిగిన ప్రశ్నకు, చెప్పిన సమాధానం తీసుకుని, విష ప్రచారం చేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది రోజా. ఇది తీసుకుని సాక్షి కూడా తన టీవీలో వేసింది. అసలు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు, ఒక్క రూపాయి కూడా సహయం చెయ్యలేదు అని, అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటూ, ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం పై మంత్రి పరిటాల సునీత సీరియస్ అయ్యారు. వెంటనే, గంటలోపే వివరణ ఇచ్చారు. "డ్వాక్రా ఋణాల రద్దుపై అసెంబ్లీలో ఇచ్చిన సమాదానాన్ని వక్రీకరించి సాక్షి ఛానల్ లో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. DWCRA రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఒక కమిటిని నియమించి ప్రతి DWCRA మహిళకు రూ. 10,000/- లను పసుపు కుంకుమ గా ఇచ్చినట్లయితే అందరికి సమానంగా లబ్ది చేకూరుతుందని నిర్ణయించినది."

paritala 07092018 3

" నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వము 86,04,304 లక్షల మందికి రూ. 10,000/- చొప్పున మంజూరు చేయటం జరిగింది. ఇప్పటికే రూ.6,883.44 కోట్లు 3 విడతలలో వారి సంఘం పొదుపు ఖాతాలకు వెయ్యటం జరిగింది. దీనికి తోడు ఆ 15 నెలల వడ్డీ రూ. 1,338 కోట్లు (ఫిబ్రవరి 2014 నుండి ఏప్రిల్ 2015 వరకు) కూడా గ్రూపులకు అందించటం జరిగింది. ఆ తరువాత కాలానికి కూడా వడ్డీ రాయితీ క్రింద రూ.1,176 కోట్లు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వము తరపున మహిళలకు 9,397.44 కోట్లు ఆయా సంఘాల ఖాతాలకు జమ చేయటం జరిగింది. సాక్షి పత్రిక మరియు శ్రీమతి రోజా DWCRA మహిళలకు ఏ సహాయం అందలేదని అసత్య ప్రచారానికి పూనుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.ప్రతి సంవత్సరం 98% రికవరీ తో ఇప్పటి వరకు రూ. 51,745 కోట్లు బ్యాంకు రుణాలను వడ్డీ రాయితి తో ఇవ్వటం జరిగింది. శ్రీమతి రోజా చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని గ్రహించాలి." అంటూ మంత్రి పరిటాల సునీత ప్రజలకు వివరణ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయ స్థితిగతుల్ని దగ్గర నుండి గమనిస్తే చాలా వింతగా కనిపిస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే రకమైన సమస్య, కానీ వేరు వేరు పరిస్థితుల్లో కనిపిస్తుంటాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపి ఎంతసేపు, ఎంత తొందరగా అధికార పీఠం ఎక్కుదామని యావ తప్ప ప్రజా సమస్యలు పట్టవు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చించాల్సి ఉందని, ఏదో ఒక సాకుతో అసెంబ్లీ సమావేశాలకు రారు. వచ్చిన ఏదో ఒక చిన్న విషయం చూపించి గోల గోల చేసి అసెంబ్లీని వాయిదా పడేట్టు చేస్తారు. గత నవంబరు నుంచి అయితే వారి అధినేత పాదయాత్ర చేస్తున్నాడని, అధినేత లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఎవరికి ఏమి మూడుతదో అని అధినేతతో సహా అందరూ అసెంబ్లీని బహిష్కరించారు. అసెంబ్లీకి రావడం ప్రజాసమస్యలు చర్చించటం వీరికి బహు బహు బద్ధకం.

kcr 07092018 1

ఇక తెలంగాణకు వస్తే వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం. నోరులేని ప్రతిపక్షాలు. చేతి నిండా డబ్బు, అధికారం, పరపతి, ఇవి అన్ని ఉన్న టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ పాలన. ముఖ్యమంత్రి అవ్వాలని దశాబ్దాలపాటు కలలుగన్న ఈయన, ముఖ్యమంత్రి అయ్యాక, పాలించ లేక నాలుగేళ్ళకే మల్ల ఎన్నికలు అని బయలుదేరాడు. అధికారం ఉన్న పరిపాలించడానికి ఈయనకు బద్ధకం. ఈ నాలుగేళ్లు సచివాలయం కంటే ఫామ్ హౌస్ పదిలం అనుకున్నాడు. ప్రజలు ఇచ్చిన అధికారం తో పాలించడానికి ఈయనకు బద్ధకం.

kcr 07092018 1

ఇక మూడు ఆయన ఉన్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈయన అధికారంలో ఉంటే యంత్రం లాగా పని చేస్తాడు. అడిగిన అడగకపోయినా, ఈయన పొద్దున నాలుగు గంటల నుంచి అర్థ రాత్రి 12 వరకు పని పని పని అంటూ పని మీదే తిరుగుతుంటాడు. ప్రజలు.. ప్రజలు.. వాళ్లకు ఏంకావాలో చూస్తూ, చేస్తూ ఉంటాడు. ఈయన కసలు విసుగు విరామం ఉండవా అని ఆంధ్ర ప్రజలు ముద్దుగా విసుక్కుంటారు. ఇప్పుడు రాజకీయాలు పక్కనపెట్టి మామూలుగా మనుషులుగా ఆలోచిస్తే మనం ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేయాలి ?

ఆంధ్రప్రదేశ్ లో చాలా వింత పరిస్థితి నెలకొంది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతిపక్షం, అటు పార్లమెంట్ కి వెళ్ళదు, ఇటు అసెంబ్లీకి వెళ్ళదు, ప్రజల తరుపన పోరాటం అనేది చెయ్యదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పక్షం హాయిగా ఎంజాయ్ చెయ్యవచ్చు. కాని చంద్రబాబు మాత్రం, ఇందుకు భిన్నం. ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా, ఆ బాధ్యత కూడా అధికార పక్షం వైపే వేసారు. మీరు మొహమాటం లేకుండా ప్రభుత్వానికి మీ సమస్యలు అసెంబ్లీలో చెప్పండి, ప్రభుత్వం స్పందించక పొతే మీకు ఉన్న సమస్యల పై నిలదీయండి, అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు.

ap cabinet 07092018 2

అంతే ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులను నిలదీస్తున్నారు. వెళ్ళు నిలదీసే విధానం చూసి వైసీపీ వల్లే నయం అని మంత్రులు అనుకుంటున్నారు. ఎందుకంటే, వాళ్ళు సభలో ఉన్నా ఇలాంటి అర్ధవంతమైన చర్చలు చెయ్యరు, మంత్రులకు పనే ఉండదు. టిడిపి వాళ్ళు అయితే, పని అయ్యే దాకా వదలరు. అందుకనే వైసిపి వాళ్ళే నయం అని సరదాగా మంత్రులు అనుకుంటున్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతగా మంత్రుల్ని నిలదీయటంతో, చంద్రబాబు కూడా మెచ్చుకుంటూ, ఆ పనులు అయ్యే విధంగా, మంత్రుల్ని ఆదేశిస్తున్నారు.

ap cabinet 07092018 3

తెలుగుదేశం అడిగిన కొన్ని ప్రశ్నలు... ప్రశ్నోత్తరాల సమయంలో బనగానపల్లె మైనింగ్ బ్లాస్టింగ్‌పై ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు 150 మీటర్ల దూరంలో మైనింగ్ ఉండాలన్న నిబంధన అమలు కావడం లేదన్నారు. పోలీస్, మైనింగ్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. పేద ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సిటీ అంతా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మొదలుపెట్టారు. ఇంకా పూర్తవలేదు. దాదాపు 8 లక్షలమంది ప్రజలు రోజూ ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు పూర్తి చేస్తారు ? డెడ్‌లైన్ చెప్పండి ? అంటూ, మంత్రి నారాయణని ప్రశ్నించారు గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే. 4800 డ్వాక్రా సంఘాలున్నాయి నా నియోజకవర్గంలో. వాళ్ళలో కొందరి ఎకౌంట్లలో డబ్బులు పడలేదు. టెక్నికల్ ఇష్యూ అని చెబుతున్నారు. డబ్బులు వచ్చి కూడా మురిగిపోతున్నాయి. ఇమ్మీడియెట్‌గా డబ్బులు విడుదల చేయండి - మంత్రి సునీతమ్మని ప్రశ్నించినవిజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే. సాగర్ కుడికాల్వ వాటర్ రిలీజ్ షెడ్యూల్ చెప్పండి. టెయిల్ ఎండ్ ఆయకట్టుకి ముందు నీరు అందేలా షెడ్యూల్ తయారు చేయండి. నా నియోజకవర్గంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్ కింద 80 వేల ఎకరాలు సాగుకి సిద్ధంగా ఉన్నాయి. - మంత్రి దేవినేనిని ప్రశ్నించిన పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే.

రజినీకాంత్.. ఆ పేరే దక్షిణాదిన ఓ సంచలనం.. ప్రభంజనం అంటే అతిశయోక్తి కాదేమో.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్న రజినీ, తమిళనాడులో ప్రభావం చూపించగల నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన రాజకీయ ఆరంగేట్రం పై స్పష్టత ఉన్న పరిస్థితుల్లో రజినీ మక్కల్ మండ్రం పేరుతో ఆయన ఓ పార్టీని స్థాపించారు. ఇందులో చేరేందుకు ఆయన అభిమానులు క్యూ కట్టారు. ఇంతలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

rajini 07092018 2

పూర్తిస్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. 2019 లోకసభ ఎన్నికలు టార్గెట్‌గా బీజేపీ వెళ్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల పైన అమిత్ షా పావులు కదుపుతున్నారు. బీజేపీకి ఉత్తరాదిన పట్టు ఉంది. దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఆ లోగా పార్టీని అక్కడ బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అవసరమైన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తన రాజకీయ ఆరంగేట్రం పట్ల ఎప్పుడు మౌనం వహించే రజనీకాంత్‌ను తమ పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది అని తెలుస్తోంది.

rajini 07092018 3

బీజేపీ నేతలు కొంతమంది రజనీకాంత్ ఇంటికి స్వయంగా వెళ్లి కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే దానిపై ఇంకా స్పష్టత రావ్వాల్సి ఉంది. మరో పక్క కేరళాలో టాప్ సినీ హీరో మోహన్ లాల్, రెండు రోజుల క్రిందట మోడీని కలిసారు. కేరళాలో మోహన్ లాల్ ద్వారా, బీజేపీ అదుగుపెదుతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఏపిలో కూడా పవన్ తో పట్టు సాదించడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. తమిళనాడులో రజినీకాంత్, కేరళాలో మోహన్ లాల్ లాగా, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కూడా అభిమానులు ఉన్న మాట నిజమేకాని, అది ఆయనకు ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి. ఇప్పటికే పవన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నారు అనేది స్పష్టం. ప్రస్తుతం చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అంటే, పవన్ కు బీజేపీ అండ లేదు అనే కలరింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన తన అన్న లాగే, బీజేపీలో పార్టీ విలీనం చేస్తారనే వార్తాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎన్నికల తరువాత అయినా పవన్, బీజేపీలో విలీనం చెయ్యటం ఖాయంగా కనిపిస్తుంది. దక్షిణాదిన ఇలా సినీ ఆక్టర్ లను అడ్డు పెట్టుకుని, బీజేపీ అడుగు పెట్టాలని చూస్తుంది...

Advertisements

Latest Articles

Most Read