హైదరాబాద్ లో ఉమ్మడి హై కోర్ట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిర్మాణం ఇప్పటికే మొదలైంది. మరో 5 నెలల్లో నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. ఈ లోపే తెలంగాణా ప్రభుత్వం, కేంద్రం కలిసి, మరో కుట్ర పన్నాయి. హైదరాబాద్ లోనే ఏపికి మరో హైకోర్ట్ కోసం, చోటు ఇస్తాం అంటూ తెలంగాణా ప్రకటించటం, దానికి కేంద్రం అంగీకారం చెప్పటం జరిగిపోయాయి. విచిత్రం ఏమిటి అంటే, 90 వేల కోట్లకు సంబంధించి, హైదరాబాద్ లో ఉన్న వివిధ ఉమ్మడి ఆస్తుల పై మాత్రం, అటు తెలంగాణా కాని, ఇటు కేంద్రం కాని, నోరు మెదపటం లేదు. కాని హైకోర్ట్ విషయంలో మాత్రం, ఎందుకో మరి తొందర పడుతున్నాయి. ఏ కుట్ర దాగి ఉందో మరి.

highcourt 04092018 2

ఇదే విషయం పై నిన్న విలేకరుల సమావేశంలో చంద్రబాబు స్పందించారు. అమరావతిలో హైకోర్టు భవనం తయారవుతుండగా... ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ మరో హైకోర్టు భవనం ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘‘డిసెంబరు లేదా జనవరి నాటికి హైకోర్టు భవనాన్ని అప్పగించేస్తాం. మేం స్పష్టతతో ఉన్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు నాలుగు నెలలకు మరో భవనం హైదరాబాద్‌లో అవసరం లేదని అనుకొంటున్నాం. సుప్రీం కోర్టుకు అదే సమాధానం ఇస్తాం’’ అని ఆయన తెలిపారు.

highcourt 04092018 3

మరో పక్క, ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎ‌‌స్‌‌‌‌‌‌)పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ఇది మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అప్పట్లో దాదాపు 20 రాష్ట్రాలు ఇందులో చేరాయి. ఇది వద్దనుకొంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగలిగే అధికారం లేదు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర పరిధిలోని అంశాలు పరిష్కరిస్తున్నాం. కానీ... సీపీఎస్‌ మా చేతిలో లేకపోవడమే సమస్య. పరిస్థితి ఇలా ఉండగా... సీపీఎ‌‌స్‌పై ఉద్యోగులను కొందరు మభ్యపెడుతున్నారు’’ అని చంద్రబాబు తెలిపారు.

నేను క్రమశిక్షణతో ఉండండి అంటే, నన్ను నియంత అంటున్నారు అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై, చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మీరు చేసిన పనులు క్రమశిక్షణతో చేసినవి కావు, చేతకానితనంతో చేసినవి అంటూ, దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం మీ క్రమశిక్షణా అంటూ ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. తాను సూచించిన వాటికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని విమర్శించారు. పెట్రోల్‌ రూ.100కు చేరుతుందేమోనని ఎద్దేవాచేశారు. నీటి ప్రాజెక్టుల అంశంపై సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

cbn 04092018 2

‘‘రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం వంద రూపాయలు అవుతుందేమో! పెట్రోల్‌ ధర కూడా రూ.100కు చేరుతుందేమో. ఎక్కడికి పోతున్నారో అర్థం కావడం లేదు. డీమానిటైజేషన్‌ చేసి ఏం సాధించారు? అందర్నీ ఇబ్బంది పెట్టడం తప్ప! ఇప్పటికీ ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదు. రూ.2000, రూ. 500 నోట్లు రద్దు చేసి రూ.100, రూ.200 రూపాయల నోట్లను పెట్టండి అని అప్పట్లో కేంద్రానికి సూచించా. డిజిటల్‌ కరెన్సీని ప్రోత్సహించాలని చెప్పా. నేను చెప్పినదానికి వాళ్లు రివర్స్‌ చేశారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం.. ఆర్థిక క్రమశిక్షణ కాదు.. చేతకానితనం. ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక వృద్ధి ఆగిపోయింది. బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పోయింది. స్విస్‌ బ్యాంకుల్లో అకౌంట్లు పెరిగాయి. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగాయి. జగన్‌లాంటి అవినీతి పరులను పక్కన పెట్టుకున్నారు. నీతి, నిజాయతీ గురించి మాట్లాడే అర్హతను ప్రధాని కోల్పోయారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

cbn 04092018 3

"ఇప్పుడు డిజిటల్‌ కరెన్సీ వాడకం వెనక్కు వెళ్లిపోయింది. డిజిటల్‌ కరెన్సీ పెరిగితే అవినీతి తగ్గుతుంది. దానివల్ల దేశం అభివృద్ధి అవుతుంది. కానీ, చేతగాని విధానాలతో ప్రజలను తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికీ ఏటీఎంల ముందు పడిగాపులు తప్పడం లేదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బ్యాంకులపై విశ్వాసం తగ్గిపోయి డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అవినీతి తగ్గకపోగా ఇంకా పెరిగిందని, అందుకే ఎగవేతదారులు ధైర్యంగా దేశం విడిచి పారిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అవినీతిపరులతో కొత్తగా దోస్తీ మొదలు పెట్టారని విమర్శించారు. వారితో దోస్తీ చేస్తూ ఇక అవినీతిపై ఏం పోరాటం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలకు ఎలా వెళ్తారో అందరికీ తెలిసిందే. తమకు అనుకూలమైన అధికారులని ఉన్నత పదవుల్లో పెట్టి, పనులు చక్క దిద్దికుంటారు. ఎన్నికల వేళల్లో ఇబ్బంది లేకుండా, తమ పనులు చేసుకుపోతారు. అయితే, చంద్రబాబు మాత్రం, వీరికి భిన్నం. చంద్రబాబు ఈ సారి పోజిటివ్ ఫీల్ తోనే ఎన్నికలకు వెళ్తున్నారు. తాను చేసిన పనులు, ప్రజలకు సరైన విధంగా చెప్తే చాలని, చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తనకు అనుకూలమైన అధికారులని కాకుండా, ప్రజలకు చేరువగా.. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేరవేయగలిగే జట్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు. అధికారులు నిజాయితీగా ఉండడం కీలకం. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ప్రధానమే. ఈ రెండూ ఉన్న జట్టుతో ముందడుగు వేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని భావిస్తున్నారు.

cbn 03092018 2

పాలనకు రథచక్రాల్లాంటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు సమర్థంగా వ్యవహరించలేకపోవడం, ఇతరత్రా ఆరోపణలు రావడం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదే సమయంలో మరికొందరు అధికారులు నిక్కచ్చిగా ఉంటున్నా.. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారం ఉంది. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి రావడం.. ప్రభుత్వంపై సంతృప్తి శాతం కొంత తగ్గిపోవడానికి కారణమవుతోందని అంటున్నారు. ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల సమయం ఉన్నందున.. ఈ లోపు ప్రజలకు మరింత సేవ చేసేలా ఎన్నికల జట్టు కూర్పు ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో కసరత్తు ప్రారంభించారు.

cbn 03092018 3

జిల్లా ఎస్పీలు, అర్బన్‌ ఎస్పీల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశాలున్నాయని సమాచారం. ఉన్నతాధికారుల వ్యవహార శైలి ఆ నోటా ఈ నోటా ప్రజలకు కూడా చేరిపోతోంది. దీంతో వాళ్లు బాగా పనిచేస్తున్నారా లేదా అన్న చర్చ వాళ్లలోనూ నడుస్తోంది. ఈ వివరాలన్నీ సేకరించి.. ఆశించిన మేరకు పనిచేయని వారిని బదిలీలు చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మరోవైపు.. ప్రజలతో నిరంతరం సంబంధాలుండాల్సిన కొన్ని శాఖల అధిపతులనూ బదిలీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన శాఖలమీద కొంత దృష్టిపెట్టారని అంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డి అనే వాడు ఎక్కడ ఉన్నాడో కూడా ఏపి ప్రజలు మర్చిపోయారు. ఎప్పుడో శుక్రవారం కోర్ట్ కు వస్తే తప్పితే, ఎక్కడా పెద్దగా వార్తలు కూడా లేవు. చంద్రబాబు పై విమర్శలు చేసినా వర్క్ అవుట్ అవ్వకపోవటంతో, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి, ఒక రెండు రోజులు వార్తల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలవటానికి, ప్రజల్లో చర్చ లేవనెత్తటానికి, మరో ఐడియాతో ముందుకు వస్తున్నాడు జగన్. ఇందుకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే వేదిక కాబోతోంది.

jagan 03092019 2

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది కాలం నుండి ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి విదితమే. ఈ అంశంపై ఆ పార్టీ నిర్ణయంపై అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాటికి పట్టించుకోలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సెప్టెంబర్ 6న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు మొత్తంమూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

jagan 03092019 3

దీనికి ప్రత్యేక హోదాతో లింక్ పెట్టి, రాజీనామా చెయ్యనున్నారు. ఎలాగూ అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం లేదు కాబట్టి, ఇలా అయితే, ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అని జగన్ నమ్మకంగా తెలుస్తుంది. ఒక పక్క తెలుగుదేశం కేంద్రం పై పోరాడుతుంది అంటూ ప్రజల్లో అభిప్రాయం ఉండటంతో, తమ పోరాటాన్ని మరోమారు నిరూపించు కొనేందుకు వైకాపా ఈ రాజీనామాల అంశాన్ని ప్రయోగించనుంది. ఈ విధంగా, అయినా కొన్ని రోజులు వార్తల్లో ఉండవచ్చు అని, జగన్ ప్లాన్.

Advertisements

Latest Articles

Most Read