ఇది విశాఖ వేదికగా జరగబోతున్న ‘ఫిన్‌టెక్‌ చాలెంజ్‌’ఫిన్‌టెక్‌ రంగంలో విశాఖపట్నంను ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఐటీ శాఖ...అందుకోసం ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనుంది.ఇందులో భాగంగా ఏడు కోట్ల రూపాయల బహుమానాలు ఇవ్వనున్నారు. కోటి రూపాయలు చొప్పున 3 ప్రధమ బహుమతులు, రెండవ బహుమతిగా రూ.70 లక్షలు, ఫైనల్ కి చేరిన వారందరికీ భారీగా నజరానాలు ఇవ్వనున్నారు. ఇది ఏపీలో ఉన్న విద్యార్థులకు, టాలెంట్ నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్. ఈ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ అక్టోబరు 22 - 26మధ్య ఐదు రోజులపాటు నిర్వహిచానున్నారు. అత్యుత్తమ ఆలోచనలకు, ఆర్థిక సేవల సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రొడక్ట్‌, టెక్నాలజీలకు భారీ బహుమానం అందిస్తారు.‌

it 05092018 2

ఫిన్‌టెక్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, అగ్రిటెక్ అనే ఈ మూడు కేటగిరిలకు కోటి రూపాయలు చొప్పున ప్రధాన బహుమతిగా అందిస్తారు. 70 లక్షలు రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన కంపెనీకి అందిస్తారు. అలాగే ఫైనల్ కు చేరిన వారికి 7లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఈ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనటానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు, 75 మంది ఆర్ధిక నిపుణులు, 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ విశాఖను ఫిన్‌టెక్‌ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుందన్నారు. స్టార్టప్‌ కంపెనీలకు కూడాఈ ఫిన్‌టెక్‌ సవాల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ కంటేముందు.

it 05092018 3

ఈ నెల 17నుంచి అక్టోబర్‌ 12వరకు హ్యాకథాన్‌ నిర్వహిస్తాం అని, దీనిలో ఆలోచనలు, టెక్నాలజీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కు ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో బహుమతులు అందచేస్తామని అన్నారు. ఈ రోజుల్లో బ్లాక్‌చైన్ , బిగ్‌ డాటా, ఫిన్‌టెక్ టెక్నాలజీలు వేగంగా దుసుకుపోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత అన్ని కంపెనీలు తెలంగాణలో ఉండిపోయాయి. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతికి కంపెనీలు వస్తున్నాయి అని ఆయన తెలిపారు. ఇలా ఒకే రాష్ట్రంలో మూడు నగరాలకు ఐటీ పెట్టుబడులు వస్తున్న రాష్ట్రం మనదే అన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే 36వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్క ఫిన్‌టెక్‌ రంగంలోనే 600ఉద్యోగాలు వచ్చాయి. మరో వెయ్యి ఉద్యోగాలు వచ్చే నెలలో వస్తాయి. ఫెడరల్‌ బ్యాంకు కూడా త్వరలోనే ఏపీకి రానుందని ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం చింతల పూడి మండలం, బోయగూడెం గ్రామంలో గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్య టిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం గ్రామదర్శిని సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అధికారుల పనితీరు తెలుసుకొంటు న్నామన్నారు. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తృప్తికరమైన జీవితం గడిపే పరిస్థితులు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు 15 లక్షల మందికి ఫోన్‌ చేసి ప్రభుత్వం పని తీరు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలో 2వేల మంది పనిచేస్తున్నారన్నారు. నా కార్యాలయంలో 100 మంది పనిచేస్తున్నారన్నారు.

ap 05092018

అంగన్‌వాడీ కార్యకర్తలకు, #హోంగార్డులకు, విఆర్‌ఏ, ఆశా కార్యకర్త లకు వేతనాలు పెంచామన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు పిీఆర్‌సీ ఇచ్చామని, మరో కొత్త పిీఆర్‌సీ వేశామని తెలిపారు. ఇలా అందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. అందరూ సుఖ సంతో షాలతో ఉండాలని, పేద ప్రజలకు అభివృద్దికి అండగా నిలబడాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సంపాదన సృష్టించుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంతంగా, సమర్థ వంతంగా పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన మెరుగైన సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు రేషన్‌ అందించే సేవలు సక్ర మంగా చేయకపోతే అటువంటి డీలర్లను తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చింతలపూడిలో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చింతలపూడి మండలంలో డ్రైనేజి, రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయని, 4,5 నెలల్లో నాణ్యత ప్రమాణాలతో కూడి నిర్మాణపనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ap 05092018

చింతలపూడి నియోజవర్గానికి 1000, దెందులూరు నియోజకవర్గానికి 1000 పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పిింఛ న్ల పంపిణీ విధానంలో ప్రజలు సంతృప్తి 79శాతం ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో 77 శాతం, చింతలపూడి నియోజకవర్గం 74శాతం ఉండగా, బోయగూడెం గ్రామంలో 80 శాతం ఉందని, ఇందుకు అందరి అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. వారానికి 2సార్లు క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఉన్నత అధికారులు పర్యటించేవిధంగా అధికారులను ఆదేశించామని, ఈ నేపథ్యంలో వారు గ్రామంలో ఉండి వాస్తవాలు తెలుసుకొని పథకాల అమలులో లోటు పాట్లు ఉంటే సవరించుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఏ రాజకీయపార్టీ అయిన తమ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, కాని ఏపీలో విచిత్రం ఏమంటే బీజేపీ నేతలు ప్రతిపక్షం నేత ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటన చేయడంతో అంతర్గతంగా బీజేపీ,వైసీపీ ఎన్నికల తరువాత కలుస్తాయని స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికలు ముందు పొత్తు పెట్టుకుంటే కేంద్రం విభజన హామీలు అమలు చేయక పోవడంతో వైసీపీ పై ప్రజల్లో తప్పుడు సంకేతం కలుగుతుందని అందు కోసం బహిరంగ చెప్పడం లేదని రాజకీయ వర్గాలలో చర్చజరుగుతుంది.

ap bjp 04092018

ఈ మధ్య కాలంలో తెలుగు దేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుపై బీజేపీ శాసనపక్షనేత విష్ణుకుమార్ రాజు టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని, దీంతో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్లో ఇబ్బందులు తప్పవని విజయవాడకు మకాం మార్చారని ఘాటుగా విమర్శించారు. ఈతరుణంలో వైఎస్ జగన్ గ్రాప్ పెరిగిందని, 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్ సీఎం అవుతారని చెప్పడంతో రాజకీయ వర్గాలు అవాక్కయ్యాయి. గత రెండు సంవత్సరాల క్రితం బీజేపీని పొగిడిన నోటితోనే చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేస్తున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం గురించి మాత్రం, మాట్లాడటం లేదు.

ap bjp 04092018

అవినీతలో పూర్తిగా కూరుకుపోయిన టీడీపీ బండారాన్ని బయట పెడతామని విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యాలు చేశారు. వచ్చే సార్వత్రి ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అని చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని అన్నారు. అదే సమయంలో వైసీపీ,జనసేన గ్రాఫ్ పెరిగిందని చెప్పడంతో రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈనేపధ్యంలో చూస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ,జనసేనాతో కలిసి పోటీ చేయకపోయిన ఎన్నికల తరువాత కలిసి పోయే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రం అమలు చేయవాల్సిన విభజన హామీలు గురించి నిలదీయడం లేదని ఏపీ బీజేపీ నేతలపై వివిధ రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థి సీఎం కావాలి అని చెప్పకుండా ప్రతి పక్షనేత సీఎం అవుతాడని చెప్పడంలో అంతర్యం ఏమిటీ అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. బీజేపీ నేతలు కేంద్రం చేసిన విభజన హామీలు అమలు చేయడంలేదని మాట్లాడకుండా అధికార పార్టీ నేతలను విమర్శించడం ఎంతవరకు న్యాయం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర అన్యాయం చేసిందని ఏపీ ప్రాజానీకం వ్యతిరేకిస్తుంటే ఏపీ బీజేపీ నేతలు కేంద్రం న్యాయం చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పారిశ్రామకవేత్తలు, అందునా బిజినెస్ టైకూన్ లాగా పేరు ఉన్న టాటాలు, అంబానీలు, రాజకీయ నాయకులతో అంతగా, బహిరంగగా కనిపించటానికి ఇష్టపడరు. దానికి అనేక కారణాలు ఉంటాయి అనుకోండి. కాని చంద్రబాబు విషయంలో మాత్రం అలా కాదు. ఎంత పెద్ద బిజినెస్ టైకూన్ అయినా, చంద్రబాబుకి ఇచ్చే గౌరవం వేరు. అంబానీ లాంటి వాడు, ముంబై నుంచి అమరావతి వచ్చి, చంద్రబాబుతో ఒక పూట ఉన్నారు అంటేనే, ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు, బిజినెస్ టైకూన్ రతన్ టాటా, చంద్రబాబుకి పర్సనల్ గా రాసిన లెటర్ చూస్తే, చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుంది.

cbn letter 04092018 2

ఈ లెటర్ చూస్తే, ఒక మేధావిని ఇంకో మేధావే గుర్తించగలడు అంటారు... ఇది చుస్తే నిజమే అనిపిస్తుంది... అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.140 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటుకు గత శుక్రవారం శంకుస్థాపనకు, రతన్ టాటా వచ్చారు. ఆ శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యామంత్రి చంద్రబాబు కూడా వెళ్లారు. రతన్ టాటా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో ఇస్తున్న తోడ్పాటుకి, చంద్రబాబు తగు గౌరవం ఇచ్చారు. అంతకు ముందు కూడా ముంబై పర్యటనలో, రతన్ టాటా, చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం అందరూ చూసారు. ఆయనే స్వయంగా వచ్చి, చంద్రబాబుని తన ఆఫీస్ లోకి తీసుకువెళ్ళారు.

cbn letter 04092018 3

అయితే, నిన్న రతన్ టాటా చంద్రబాబుకి ఒక లేఖ రాసారు. సామాన్యంగా ఇలాంటి పర్యటనలు అక్కడితో అయిపోతుంది. కాని టాటా మాత్రం, చంద్రబాబు ఇచ్చిన గౌరవానికి, ఆయనకు కృతజ్ఞతగా లేఖ రాసారు. మీరు చూపించిన గౌరవానికి ధన్యవాదాలు అని చెప్తూనే, మీతో నాకు కొన్నేళ్ళుగా మంచి అనుబంధం ఉంది. మీరు కూడా నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. మీకు, మీ రాష్ట్రానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, నేను మీకు సహాయం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారటానికి, మీకు సహకారం అందిస్తాను అంటూ ఆయన లేఖ రాసారు. మేటి వ్యాపార దార్శకుడు..మరొక మేటి పరిపాలనా దార్శకుడికి రాసిన ఉత్తరంతో, ఇద్దరూ ఎంతటి ఉన్నతమైన వ్యక్తులో అర్ధమవుతుంది.

Advertisements

Latest Articles

Most Read