గుడిని మింగే వాడు ఒకడు అయితే .. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాడు మరొకరు.. ఈ సామెత, కెసిఆర్, మోడీలకు చక్కగా సరిపోతుంది. మొన్నటి వరకు బూతులు తిట్టుకున్న వాళ్ళు, సడన్ గా కలిసిపోయారు. రాజకీయం ఇలాగే ఉంటుంది కాబట్టి, మనం ఏమి మాట్లాడలేం కాని, ఈ కలియికలో మనం బలపడదాం అనే దానికంటే, వాడిని ఎలా తోక్కేద్దాం అని ఇద్దరూ చూస్తుంటే, ఈ కలియిక ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మనకు, తెలంగాణా రాజకీయాలతో సంబంధం లేకపోయినా, కెసిఆర్, మోడీ కలిసి, ఆంధ్రా పై పన్నిన కుట్రలకు, వెళ్ళు చేసే పనులు కూడా ప్రజల ముందు చెప్పాల్సిన పరిస్థితి. కెసిఆర్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. ఒక రోజు సోనియా గాంధీని దేవత అన్నాడు, ఆవిడతో అవసరం తీరగానే దెయ్యం అన్నాడు. ఇప్పుడు మోడీ వంతు..

kcr 03092018

గత 15-20 రోజులుగా తెలంగాణా రాజకీయం మొత్తం మారిపోయింది. కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసేస్తున్నారు అని, మోడీ దానికి అంగీకరించారు అని, సెప్టెంబర్ 2 న అసెంబ్లీ రద్దు చేస్తారని, ఇలా చాలా మాటలు విన్నాం. కాని, నిన్న సభకి అంత హంగామా చేసిన కెసిఆర్, సభ పూర్తియిన తరువాత, తుస్సు మానిపించారు. గవర్నర్ అప్పాయింట్మెంట్ కూడా కోరారు అని, అసెంబ్లీ రద్దు అయిపోతుంది అంటూ, హంగామా చేసారు. కాని, నిన్న కెసిఆర్ మాత్రం, రద్దు ప్రకటన చెయ్యలేదు. దీని వెనుక అసలు స్టొరీ ఏంటి అని, రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తుంది.

kcr 03092018

అసెంబ్లీ రద్దు చెయ్యి, నేను డిసెంబర్ లో ఎన్నికలు వచ్చేలా చేస్తా అని మోడీ హామీ ఇచ్చారు. కాని అసెంబ్లీ రద్దు అయిన వెంటనే, గవర్నర్ పాలన పెట్టి, పార్లమెంట్ ఎన్నికలతో పాటే (మే నెల) చేసేలా మోడీ, షా ప్లాన్ చేసారని, తద్వారా ఈ టైంలో కెసిఆర్ ని బలహీన పరిచి, బీజేపీ తెలంగాణలో పుంజుకునేలా మోడీ/అమిత్ షా ప్లాన్ చేసారని సమాచారం. ఈ విషయం కెసిఆర్ గ్రహించి, నిన్న అసెంబ్లీ రద్దు ప్రకటన చెయ్యలేదు అని తెలుస్తుంది. అయితే, మోడీ, కెసిఆర్ ని బురిడి కొట్టిద్దాం అనుకుంటే, కెసిఆర్ కూడా మోడీ దగ్గర మంచిగా ఉండి, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం పొందారు. ఇప్పుడు కెసిఆర్, మోడీ/షా లను బురిడీ కొట్టించారా ? లేక మోడీ/షా, కెసిఆర్ ను బురిడీ కొట్టించారా అనేది చూడాలి ? గుడిని మింగే వాడు ఒకడు అయితే .. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాడు మరొకరు అంటే ఇదేనేమో..

ఈ రోజు జనసేన అధినేత పవన కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు, శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. దానికి పవన్ కళ్యాణ్ స్పందించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ అఫీషియల్‌గా ఓ ప్రెస్ నోట్‌ ద్వారా తెలిపారు. చిన్నప్పటి నుంచి పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అలవాటు లేనందున.. ఈ రోజు (సెప్టెంబర్ 2) కూడా ఎటువంటి వేడుక జరుపుకోలేదని తెలిపారు.

pk 02092018 2

అభిమానంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరిపిన తెలుగు రాష్ట్రాల అభిమానులకు, విదేశాల్లో ఉన్న అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, అభిమానులకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పుష్పగుచ్చం పంపి శుభాకాంక్షలు తెలిపిన రామోజీరావుకు, ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

pk 02092018 3

నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా అనేక సందర్భాల్లో చాలా మందికి విషెస్ చెప్పారు... ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు... పండగలప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు.... పోయిన ఏడాది, ఏకంగా అందరూ టీవీలో లైవ్ చూస్తూ ఉండగా, అసెంబ్లీ సమావేశాలు జారుతూ ఉండగా, జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు విషెస్ చెప్పారు... చంద్రబాబు స్వయంగా జగన్ సీట్ దగ్గరకు వెళ్లి విషెస్ చెప్పారు... ఈ రోజు పవన్ కి విషెస్ చెప్పటం, దానికి పవన్ కృతజ్ఞతలు చెప్పటం మంచి విషయం. వ్యక్తిగత దూషణలకు పోకుండా, గౌరవప్రదంగా రాజకీయాలు ఉండాలని కోరుకుందాం...

మన రాష్ట్రానికి జరిగిన అన్ని అవమానాలకంటే, ఇది ఎంతో దారుణమైనది. డబ్బులు మన ఎకౌంటులో వేసి మరీ వెనక్కు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఈ సంఘటన గురించి, చంద్రబాబు నేషనల్ మీడియాతో చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వెనుకబడిన జిల్లాలకు రావలసిన 350 కోట్ల నిధులు గురించి పార్లమెంట్ లో నిలదీశారు తెలుగుదేశం ఎంపీలు. వెనుకబడిన జిల్లాల కోసం గతంలో విడుదల చేసిన రూ.350 కోట్లకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు రాలేదని, అందుకే ఆ సొమ్మును వెనక్కు తీసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమాధానమిచ్చారు.

modi 02092018 2

ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇలా డబ్బులు వేసి మరీ, వెనక్కు తీసుకోవటం ఎక్కడన్నా చూసారా ? ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది...

modi 02092018 3

అయితే మోడీ ఈ డబ్బులు ఇవ్వకపోవటంతో, మన రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో పనులు ఆగిపోకుండా, చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు. మన విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన హక్కు, మోడీ ఇవ్వకపోయినా, చంద్రబాబు మాత్రం చూస్తూ కూర్చోలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు 350 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. ఆ జిల్లాలలో మొదలు పెట్టిన పనులు ఆగిపోకుండా, ఈ డబ్బులు ఇచ్చి, వెనుకబడిన 7 జిల్లాలకు సపోర్ట్ ఇచ్చారు. మోడీ ఇవ్వకపోయినా, చంద్రబాబు మాత్రం, ఎక్కడా కాంప్రోమైజ్ అవ్వకుండా, వారిని ఆడుకున్నారో. ఇప్పటికైనా మోడీ లాంటి వారు మన బాధ ఆలకిస్తారేమో ఆశిద్దాం...

ప్రగతి నివేదన సభ అంటూ, గత 15 రోజుల నుంచి తెలంగాణాలో చేసిన హంగామా, మన హైదరాబాద్ మీడియా చానల్స్ చేసిన హడావిడి చూస్తూనే ఉన్నాం. మన ఖర్మకి, మన ఆంధ్రలో కూడా ఇవే వార్తలు చూడాల్సిన పరిస్థితి. అయితే, ఇంత హైప్ చేసి కెసిఆర్ సాధించింది ఏంటి అంటే ? కెసిఆర్ పార్టీకే, ఈ రోజు సభ ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు. సారే వాళ్ళ చావు , వాళ్ళు చస్తారు కాని, ఇప్పటికీ కెసిఆర్ ఆంధ్రా వాళ్ళని బూచిగా చూపించి, తెలంగాణాలో పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ రోజు ప్రసంగం మొదలు పెట్టటంతోనే, చంద్రబాబు పై ఏడుస్తూ మొదలు పెట్టాడు.

kcr 02092018 2

నువ్వేమి చేసావో చెప్పుకోరా అయ్యా అంటే, ఆంధ్రోళ్లు అలా చేసారు, ఇలా చేసారు అంటూ, సగం ప్రసంగం, ఇప్పటికీ ఆంధ్రా వాళ్ళ పై, తెలంగాణా సమాజంలో విష బీజాలు నాతుతున్నాడు. ఇప్పటికే తెలంగాణాలో ఒక జనరేషన్, ఆంధ్రా వాళ్ళు అంటే విలన్లు లాగా చూస్తుంది. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంతగా రాష్ట్రం వచ్చినా ఇప్పటికీ, ఆంధ్రా వాళ్ళని బూచిగా చూపించటం ఏంటి ? మీకు సొంత రాష్ట్రం వచ్చి 4 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్నా, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం.

kcr 02092018 3

అయినా, ఇప్పటికీ, నాలుగు ఏళ్ళు అయినా, మీరు ఏమి చేసారో చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళాలి కాని, ఇంకా ఆంధ్రా వాళ్ళ పై పడితే ఏమి వస్తుంది ? అయినా ఈ రోజు కెసిఆర్ మీటింగ్ చూస్తూనే, అర్ధమవుతుంది. కెసిఆర్ ప్రసంగం ఇంత బోరింగ్ ఎప్పుడూ లేదు. ఇదే కెసిఆర్ ఫెయిల్యూర్ కి ఒక సంకేతం. మోడీతో కలిసి, కుట్రలు చెయ్యటం తప్ప, కెసిఆర్ చేసింది ఏమి లేదు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి, ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అలాగే, దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం అయ్యి, మోడీ పై యుద్ధం చేస్తుంటే, కెసిఆర్ మాత్రం, వారినికి ఒకసారి వెళ్లి మోడీని కలుస్తాడు. ఇప్పటికైనా మా మీద ఏడుపులు ఆపి, మీ ఇబ్బందులు ఏవో మీరు పడండి...

Advertisements

Latest Articles

Most Read