ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలో జీతాలు, పెన్షన్లు, ఫస్ట్ తారీఖు వచ్చినా ఇంకా జమ కాలేదు. దీనికి కారణం, రిజర్వ్‌ బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం అని తెలుస్తోంది. ప్రతి సారీ, ప్రతీ నెల 30, 31 అర్ధరాత్రిలోగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు డిపాజిట్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎమ్‌ఎస్ ద్వారా మూడు రోజుల క్రితమే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఫైళ్లను రిజర్వ్ బ్యాంక్ అధికారులకు అందజేశారు. 4.5లక్షల మంది ఉద్యోగులు, 3.6లక్షల మంది పెన్షనర్ల ఫైళ్లను అందుకున్నట్లు రిజర్వ్‌బ్యాంకు ధృవీకరించింది.

pension 01092018 2

కాగా 31 అర్ధరాత్రి జీతాలు డిపాజిట్ అవకపోవడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు సంప్రదింపులు జరిపారు. కాగా నిన్న సాయంత్రం నుంచి రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన అధికారులు ఈ లోపాన్ని సరిచేసి ఉదయం పది గంటలలోపు జీతాలు డిపాజిట్ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మధ్యాహ్నం వరకు జీతాలు డిపాజిట్ అవకపోవడంతో మరోసారి ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు... రిజర్వ్‌బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

pension 01092018 3

అయితే ఆర్బీఐ సర్వర్లు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయని ఈరోజు రాత్రి వరకు లేదా రేపు ఉదయానికి పెన్షన్లు, వేతనాలు పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. అయితే రేపు ఆదివారం కావడంతో ఆర్బీఐ సాంకేతి సిబ్బంది విధులు నిర్వహిస్తుందా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలింది. సోమవారానికి అయినా, ఈ సమస్య పరిష్కారం అవుతుందో, మరింత లేట్ అవుతుందో అని ఉద్యోగస్తులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృధ్యాప్య పెన్షన్లు, మిగిలిన పెన్షన్లు మాత్రం, ఈ రోజే ఇచ్చేసారు. ప్రతి నెల ఒకటవ తేదిన, పెన్షన్లు ఇచ్చే సంగతి తెలిసిందే.

విజయవాడ నగరంలో ఉద్యోగుల సభలో వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. వైసీపీ అసెంబ్లీకి వెళ్లి పోరాడాలంటూ ఉపాధ్యాయుల నినాదాలు చేశారు. అంతేకాకుండా ఈ సభలో వైసీపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరుపార్టీల నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామంటున్న వైసీపీ అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అధికారంలోకి వస్తే చేస్తామనడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు.

ycp 01092018 2

రఘువీరా వ్యాఖ్యలపై వైసీపీ నేత పార్థసారథి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంపై పోరాటం దున్నపోతుపై వర్షపడటంతో సమానమని విమర్శించారు. అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆయన జవాబిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై పోరాడాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. దీనిపై రాజకీయం చేయవద్దని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగులు ఎంత చెప్పినా వైసిపీ నేతలు వెనక్కు తగ్గలేదు. వాళ్ళు తిడుతున్నా, అక్కడే ఉన్నారు.

ycp 01092018 3

ఈ రోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో ఆందోళనకు దిగారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. 13 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు జింఖానా గ్రౌండ్‌లో ధర్నా నిర్వహించారు. తమ పెన్షన్ డబ్బుకు రక్షణ లేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలంటో ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు.

కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. కడప ఉక్కు సెగ తగిలింది. కడప ఆర్‌అండ్‌బీ వద్ద అనంతకుమార్‌ను రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కడప ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద మంత్రి అనంతకుమార్ హెగ్డే కారు ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంతకుమార్ కదలకుండా కారు లోపలే ఉండిపోయారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఓ మహిళా కార్యకర్త అనంతకుమార్‌ ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరారు.

kadapa 01092018 2

దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. అనతకు ముందు అయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే పేర్కొన్నారు. శనివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే యుద్దభూమిని వదలం.. అంటూ ఆయన అన్నారు.

బీహార్‌లోని ఎన్డీయే మిత్రపక్షాలు మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చిందనుకుంటున్న తరుణంలో.. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మళ్లీ ప్లేటు తిరగేసింది. సీట్ల పంపకంపై రాజీపడే ప్రసక్తే లేదనీ.. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెగేసి చెప్పింది. కాగా బీహార్‌లోని అన్ని స్థానాల్లోనూ ఎన్డీయే విజయం తథ్యమనీ... సీట్ల పంపకంపై ఇప్పటికే మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరిందని బీజేపీ వర్గాలు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. బిహార్‌లో ఉన్న 40లోక్‌సభ స్థానాలకు గానూ 20 సీట్లు భాజపాకు ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని తెలుస్తోంది.

nitish 01092018 2

నితీశ్‌ కుమార్‌ పార్టీకి 12 సీట్లు, రామ్‌ విలాస్ పాసవాన్‌‌ పార్టీ అయిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎస్‌జేపీ) ఆరు సీట్లు, ఉపేంద్ర కుశ్వాహా పార్టీ అయిన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి రెండు సీట్లు ఇచ్చేలా భాజపా ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను జీర్ణించుకోలేని జేడీయూ ఒంటరిగానే బరిలోకి దిగాలని యోచిస్తోందట. దీనిపై జేడీయూ నేత కేసీ త్యాగి స్పందించారు. "సీట్ల పంపకం ఇంకా జరగలేదని ఇవి పుకార్లు మాత్రమే అని తేల్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘సీట్ల పంపకం విషయం ఇంకా చర్చల దశలోనే ఉంది. "

nitish 01092018 3

"మరి ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు. అయితే, ఈ లెక్కలు ఎంతమాత్రం మాకు ఆమోద్యయోగ్యమైనవి కావు. జేడీయూకి 25 సీట్లు, ఇతర పార్టీలకు 15 సీట్లు కేటాయించాలనేది మా డిమాండ్‌. భాజపా ఇందుకు అంగీకరించకపోతే కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తాం. " అని అన్నారు. అయితే, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల్లో భాజపా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ దాదాపు ఇదే ఘట్టం పునరావృతమైంది. 100కు పైగా సీట్లు సాధించినప్పటికీ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోయే సరికి ప్రతిపక్షంగానే మిగలాల్సి వచ్చింది. ఈ అవకాశాలన్నింటినీ జేడీయూ తమకు అనుకూలంగా మార్చుకుని మరిన్ని సీట్లు రాబట్టకునేందుకు గట్టుగా పావులు కదుపుతోంది.

Advertisements

Latest Articles

Most Read