జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన ప్రచారం కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించారు. హైదరాబాద్‌లో దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాహనంలో కొద్దిమందితో కూర్చుని సమావేశం కావచ్చు. వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు ఆయనకు కొంత స్థలం ఇందులో కేటాయించారు. ఈ వాహనంలోనే స్పీకర్లు, సౌండ్‌కు సంబంధించిన వ్యవస్థ ఉంది. ఒక వేళ ఎక్కడయినా వెలుతురు సరిగా లేని పరిస్థితుల్లో అందుకు ప్రత్యామ్నాయంగా వెలుగులు పంచే ఏర్పాటు కూడా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మలి విడత పర్యటన ప్రారంభం కానుంది. ఆ పర్యటన నాటికీ ఈ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.

pk 22082018 2

మరికొన్ని రోజుల్లో జనసేనానికి ఇది అందుబాటులోకి వస్తుంది. కారవాన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రముఖులతో సమావేశాలు జరుపుకోవచ్చు. కావాల్సినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. టీవీ, ఇంటర్నెట్ లాంటి సకల సౌకర్యాలు ఈ ప్రచార రధంలో ఉన్నాయి.ప్రస్తుతం ఏపీ రాజకీయ నాయకుల్లో అత్యంత ఖరీదైన ఇలాంటి వాహనం ప్రభుత్వం వద్ద ఉంది. ఎప్పుడన్నా పర్యటనలు చెయ్యటానికి చంద్రబాబు దీని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాహనం తర్వాత సకల హంగులు సంతరించుకున్న ఇసుజు కంపెనీకి చెందిన ఫుల్లీ-లోడెడ్ వాహనం ఇదే.

pk 22082018 3

వైఎస్ఆర్సీ అధినేత జగన్ వద్ద కూడా ఇలాంటి ఓ వాహనం ఉన్నప్పటికీ, అది కాస్త పాతది. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు చాటిచెప్పేలా ఈ బస్సుపై పోస్టర్లు అతికించారు. ఇకపై తన పర్యటనల్లో ఈ బస్సుపై నుంచే పవన్ ప్రసంగిస్తారు. అయితే ఈ బస్సు ఖరీదు 5 కోట్లుగా తెలుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పే పవన్ కళ్యాణ్, డబ్బులు లేక, కార్ కిస్తీ కట్టలేక అమ్మేసాను అని చెప్ప పవన్ కళ్యాణ్, ఇంత ఖరీదు పెట్టి, ఇలాంటి బస్సు కొనటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇప్పటికే హైదరాబద్ లో రెండు పెద్ద ఆఫీస్ లు తీసుకున్నారు. విజయవాడలో రెండు ఎకరాల్లో ఇల్లు, పార్టీ ఆఫీస్, మళ్ళీ ఇది కాక, పటమటలో , రెండు లక్షల పెట్టి అద్దెకు ఒక ఇల్లు, ఇలా అనేక విధాలుగా ఈ మధ్య పవన్ ఖర్చు పెడుతున్నారు.

వైసిపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ ని, హిట్లర్ తో పోలుస్తూ ఒక కధ చెప్పారు. హిట్లర్ తన చేసే దుర్మార్గాలు కోసం గోబెల్స్‌ను పెట్టుకుంటే, ఈ తరంలో జగన్‌ తన అవినీతి పత్రిక సాక్షిని పెట్టుకున్నాడని అన్నారు. అబద్ధాలు, దుష్ప్రచారంలో సాక్షి గోబెల్స్‌ను మించిపోయిందని మండిపడ్డారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న మరునాడే గోబెల్స్ కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని.. 2019 ఎన్నికల తరువాత జగన్, ఆయన మీడియా రెండూ కనిపించవని యనమల అన్నారు. బీజేపీ పంచన చేరి జగన్‌ తెదేపాపై దుష్ప్రచారం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.

jaganhitlder 22082018 2

జాతీయ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో యథాలాపంగా చర్చించారని, దానికి చిలవలు పలవలుగా ప్రచారం చేయడం అతి హేయమని దుయ్యబట్టారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా జగన్, అతని మీడియా సాక్షి దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీలను ఏకం చేయగల శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని, ఇది ఇప్పటికే చరిత్రలో రుజువైందన్నారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ఏర్పాటు వెనుక కీలక భూమిక తెలుగుదేశందే అని యనమల గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. 2019లో అఖండ మెజారిటితో తెలుగుదేశం గెలుపు ఖాయమని, అది గ్రహించే జగన్ భయపడి తప్పుడు ప్రచారానికి తెగబడ్డారని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు.

jaganhitlder 22082018 3

భాజపా చుట్టూ, పీఎంవో చుట్టూ తిరిగింది జగన్‌ కాదా? తండ్రి శవం ఉండగానే సోనియా కాళ్లు పట్టుకుంది జగన్ కాదా? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ఇప్పుడు మళ్లీ భాజపా కాళ్లు పట్టుకోవడం నిజం కాదా? అంటూ నిలదీశారు. తెదేపాని విమర్శించే నైతిక అర్హత జగన్‌కు లేదన్నారు. రాష్ట్రం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్న యనమల.. రాష్ట్రం కోసమే ఎన్డీఏ నుంచి బైటకొచ్చి పోరాడుతున్నామన్నారు. జగన్‌ చంద్రబాబుకు ఆరు పెళ్లిళ్లు, పవన్ కళ్యాణ్‌కు నలుగురు పెళ్లాలు అంటూ.. ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌, ఆయన మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కన్ను వేయాలని యనమల కోరారు.

ఇప్పటికే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తిప్పలు పెడుతున్న కేంద్రం, ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా అవమానించే పనిలో పడిందా అనే సందేహాలు వస్తున్నాయి. "స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ " అనే జాతీయ సంస్థ నిర్మాణం విజయవాడలో జరుగుతుంది. పనులు దాదాపుగా చివరకు వచ్చాయి. అయితే, దీని ప్రారంభోత్సవం రేపు, అనగా ఆగష్టు 23 న జరగనుంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ కార్యక్రమానికి, ముఖ్యమంత్రికి ఆహ్వానం లేదు. ఈ కార్యక్రమానికి ఉపరాస్ట్రపతి వెంకయ్య, గవర్నర్ నరసింహన్ వస్తున్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి పేరు లేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రం కావాలనే ఇలా అవమానపరుస్తుంది అంటూ, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వేస్తున్నారు.

cbn 22082018 3

రాష్ట్రంలో, అదీ రాజధాని ప్రాంతంలో జరిగే, ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ మీద బిజెపి ప్రభుత్వం ఎంత కక్షకట్టి వస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ముఖ్యమంత్రి పేరు కాని, సహచర క్యాబినెట్ మంత్రుల పేర్లు కాని, రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే ఎవరి పేరు లేదు. మరి, ఈ విషయం వెంకయ్య నాయుడు గారికి, గవర్నర్ గారికి తెలుసో తెలియదో మరి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా, రాష్ట్రం భూమి ఇవ్వకుండా, తగిన సహకారం ఇవ్వకుండా, నిర్మాణం జరిగేదా ? ఇలా ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తించటం దారుణం.

cbn 22082018 4

23న ఉదయం 10 గంటలకు వెంకయ్యనాయడు, నరసింహన్‌లు విజయవాడలో నిర్మించిన స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ పరిపాలన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలోను, అనంతరం 10.50 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ మూడో వార్షికోత్సవంలో పాల్గొంటారు. మరి రాష్ట్రం తరుపున, కనీసం ప్రోటోకాల్ గా కూడా ఎవరినీ పిలవకపోవటం ఎంత వరకు సమంజసం ? ఇక్కడ ఉన్న బిజెపి నాయకులు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా మరి ఇప్పుడేమి మాట్లాడుతారు కనీసం ప్రోటోకాల్ను పాటించాలన్న జ్ఞానం లేని ప్రభుత్వం నడుపుతున్న అంత అజ్ఞానం గా ఉన్నారా కేంద్రంలో అధికారులు.

జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటుపై ‘స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ (ఎంవోఎ్‌సపీఐ)’ శాఖకు చెందిన ఒక ఉపకమిటీ రూపొందించిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010-11ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని జీడీపీ వృద్ధి రేటును లెక్కిస్తే.. ప్రస్తుత ఎన్డీయే హయాం కన్నా యూపీఏ హయాంలోనే అధిక వృద్ధి రేటు ఉన్నట్టు ఆ నివేదిక సారాంశం. దీంతో బీజేపీ-కాంగ్రె్‌సల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ కథేంటంటే.. జీడీపీ వృద్ధి రేటు లెక్కింపునకు నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషిన్‌ ఒక ఉపకమిటీని నియమించింది. ‘కమిటీ ఆన్‌ రియల్‌ సెక్టార్‌ స్టాటిస్టిక్స్‌’ పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ 2004-05కు బదులు 2010-11ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని వృద్ధి రేటును లెక్కించి నివేదికను ఎంవోఎ్‌సపీఐ వెబ్‌సైట్‌లో పెట్టింది.

modi 22802018 2

కొత్త లెక్క ప్రకారం 2007-08లో, 2010-11లో 10 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైనట్టు అందులో పేర్కొంది. అది ప్రస్తుత ఎన్డీయే హయాం కన్నా ఎక్కువ. జూలై 25న ఆ కమిటీ ఈ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టగా.. కొద్దిగ ఆలస్యంగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త లెక్కల ప్రకారం తమ పదేళ్ల పాలనలో సగటున 8.1 శాతం వృద్ధిరేటు నమోదుకాగా.. ప్రస్తుత ఎన్డీయే పాలనలో కేవలం 7.3 శాతం సగటు వృద్ధిరేటు నమోదయినట్టు కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. ఆధునిక భారతదేశ చరిత్రలో రెండంకెల వృద్ధి రేటు నమోదైంది తమ పాలనలోనేనని గుర్తుచేసింది. మరోవైపు.. ‘‘సత్యమే గెలిచింది. యూపీఏ పాలించిన 2004-14 సంవత్సరాలే ఆర్థిక వృద్ధికి ఉత్తమమైనవని కొత్త లెక్కలతో తేలిపోయింది’’ అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్‌ చేశారు.

modi 22802018 3

ప్రస్తుత హయాంలో నాలుగేళ్లు ముగిశాయని.. కనీసం ఐదో సంవత్సరంలోనైనా మోదీ సర్కారు తన పాలన బాగా కొనసాగిస్తుందని భావిస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు. మోదీ సర్కారు యూపీఏ-1ను ఎప్పటికీ అందుకోలేదని.. కనీసం యూపీఏ-2ను అందుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో మాటల యుద్ధం మొదలైంది. యూపీఏ హయాంలో నమోదైన వృద్ధి అంతా.. అంతకుముందు అద్భుతంగా పాలించిన వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చలవేనని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బ్లాగులో రాశారు. ఆ సంస్కరణల ఫలాలు రావడం ముగిశాక యూపీఏ హయాంలో వృద్ధిరేటు దిగజారడం ప్రారంభించిందని విమర్శించారు. 2014లో యూపీఏ ఓడినా ఆ ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయని ఎదురుదాడి చేశారు. ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగానే.. ఎంవోఎ్‌సపీఐ వెబ్‌సైట్‌ నుంచి ఆ నివేదిక ఉన్న పేజీ మాయమైంది. అది తుది నివేదిక కాదని.. సంప్రదింపులు, చర్చల కోసం మాత్రమే దాన్ని సైటలో పెట్టామని ఎంవోఎ్‌సపీఐ వివరించింది.

Advertisements

Latest Articles

Most Read