రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగడాలు పెంచుతూ, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరును తీవ్రతరం చేస్తున్నది. ఇప్పటికే పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన ఆయన చివరి ఘట్టంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ప్రజా సంకల్పయాత్రకు ఈ నెల 14న శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్ట వద్ద నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు జగన్‌ లక్ష్యానికి, పార్టీ పటిష్ఠానికి అడ్డంకిగా మారుతున్నాయని కొంతమంది నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ పాదయాత్రకు ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో తీవ్రస్థాయిలో నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా వున్న అభిప్రాయ భేదాలు పార్టీ అధినేత రాకకు ముందు, తర్వాత కూడా బయటపడుతున్నాయి.

jagan vizag 22082018 2

రెండు రోజుల క్రితం (శనివారం) పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం కోటవురట్ల మండలం తంగేడులో జరిగింది. ఆ సమావేశంలో పార్టీ కోటవురట్ల మండల అధ్యక్షుడు పైలా రమేష్‌కు, తంగేడు రాజులకు మధ్య వున్న విభేదాలు బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి సమక్షంలోనే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడడం గమనార్హం. వైసీపీ నాయకుల గొడవను చిత్రీకరించిన పత్రికా విలేఖరుల వద్ద నుంచి విజయసాయిరెడ్డి వర్గీయులు కెమెరాలు లాక్కొని బలవంతంగా ఆ చిత్రాలను తొలగించారు. అదేవిధంగా ఆదివారం జరిగిన ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైసీపీ నాయకులు కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్‌ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో విజయసాయిరెడ్డి కంగుతిన్నారు. ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీ అధినేత జగన్‌ను కూడా ఇందులోకి లాగడం, తాను ఆయనకు భారీగా డొనేషన్‌ ఇచ్చానంటూ కన్నబాబురాజు పేర్కొనడం కలకలం రేపింది.

jagan vizag 22082018 3

వైసీపీలో విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టి అని, కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఈ నెల 13న నర్సీపట్నంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల సమావేశాలతో ఆయనకు వాస్తవమేమిటో అర్థమయ్యిందని పార్టీ నేతలు అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో తొలుతగా పాదయాత్ర ప్రారంభించి ఏకంగా వారం రోజులు పాటు జగన్‌ సమయం కేటాయించిన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా పాదయాత్ర అనంతరం పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేవిగా మారాయి. పాదయాత్రలో జగన్‌ గానీ, పార్టీ సీనియర్లుగానీ తమకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నాయకులు బహిరంగంగా, మరికొందరు నిగూఢంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకు గట్టి పోటీ ఇచ్చిన గణేష్‌కే మళ్లీ టిక్కెట్టు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే నియోజకవర్గంలో వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్‌ కనీసం నర్సీపట్నం బహిరంగ సభలో కూడా గణేష్‌ను అభ్యర్థిగా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.

 

కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామంలో నిర్మిస్తున్న లేల్యాండ్ ప్లాంట్ ఉద్యోగాలకు, ఉపాధి కల్పనా కార్యాలయం, ప్రకటన విడుదల చేసింది. అశోక్ లేల్యాండ్ ప్లాంట్ లో, ట్రైనీ ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ITI విద్యార్హత ఉన్న వారికి 150 ఖాళీలు ఉన్నాయని, నెలకు 12 వేల జీతం అని చెప్పారు. వయుసు, 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. దీనికి సంబంధించి ఈ నెల 25న గుంటూరులో, 27న తెనాలిలో ఇంటర్వ్యూ లు ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు, సర్టిఫికేట్ జెరొక్ష్ కాపీ, రేషన్ కార్డు, ఆధర్ కార్డు, మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోతో, ఉదయం 9 గంటలకు, ఇంటర్వ్యూ వేదికకు చేరుకువాలి.

ashok 22082018 2

మల్లవల్లి గ్రామంలో రూ. 135కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఏటా 2400 బస్ బాడీలు తయారు చేసే బిల్లింగ్ యూనిట్సు రూ.90 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండు దశలో మరో రూ.45 కోట్లతో 2400 బస్ బాడీలను తయారు చేసే మరో యూనిటీను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్లలో 2400 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది.

ashok 22082018 3

మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది... భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి..

భద్రాచలం దగ్గర అంతకంతకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. వరద భారీగా ఉండడంతో ఏ క్షణాన్నైనా మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. దరిమిలా గోదావరి పరివాహక ప్రాంతమంతటా అప్రమత్తత ప్రకటించారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే వరద ముంపునకు గురికాకుండా అధికారులు ముందుచూపుతో ప్రవాహం అటురాకుండా చకచకా అడ్డుకట్టలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మట్టిగోడలు నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని.. గోదావరిలో నీటి మట్టం 55 అడుగులకు చేరితే వరద యావత్తు స్పిల్‌వేను చుట్టిముట్టే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

polavaram 22082018 2

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నాటి నుంచీ ఇప్పటి వరకు వరద రూపంలో ఎలాంటి అవాంతరం తలెత్తలేదు. కానీ ఈసారి గోదావరి పోటెత్తుతోంది. పేరూరు నుంచి ఒకవైపు, శబరి నుంచి మరోవైపు అఖండ గోదావరిలోకి వరద వచ్చి పడుతూనే ఉంది. ఇది మంగళవారం పెరిగి ప్రాజెక్టు ప్రాంతంలో అలజడి సృష్టించింది. రాబోయే 24 గంటల్లో ప్రాజెక్టు ప్రాంతం వైపు చొచ్చుకొస్తుందేమోనన్న కలవరం సిబ్బందిలో కనబడుతోంది. నిర్మాణ పనులకు అడ్డంకులు సృష్టిస్తుందేమోనన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఒక్క పైలట్‌ చానల్‌లోకే వరద చేరింది. స్పిల్‌ చానల్‌కు దిగువన ఉన్నదే పైలట్‌ చానల్‌. గోదావరిలో ఉధృతి పెరిగాక ఈ చానల్‌కు ఉన్న గట్టు.. వరద తాకిడికి కొట్టుకుపోవడంతో వరద నీరు లోపలికి ప్రవేశించింది.

polavaram 22082018 3

ఎట్టి పరిస్థితుల్లోనూ వరద తగ్గుముఖం పడుతుందని తొలుత అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. భద్రాచలం వద్ద ప్రమాదస్థాయిలో నీటిమట్టం నమోదవుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి నీటిమట్టం 48.7 అడుగులకు చేరింది. ఇది మరింతగా పెరిగి రాబోయే 24 గంటల్లో 52 అడుగులకు చేరవచ్చని అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకుని స్పిల్‌వే పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా కాంట్రాక్టు సంస్థలు అప్రమత్తమయ్యాయి. వెంటనే యంత్రాలను రంగంలోకి దించాయి. కొద్ది గంటల వ్యవధిలోనే మట్టి కట్టడాన్ని అడ్డుగా నిర్మించారు. వరద ఈ దిశగా రాకుండా స్పిల్‌వే భాగం నుంచి కుడివైపున ఈ అడ్డుకట్టను నిర్మించారు. గోదావరి మట్టం 27-28 మీటర్లకు చేరినా స్పిల్‌వేకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ మట్టికట్ట కాపాడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ప్రస్తుతానికి 14 లక్షల క్యూసెక్కులు ఉందని.. మరో 2 లక్షలకు పెరిగినా మట్టికట్టకు నష్టం లేదని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ఇటీవల కాలంలో విజయవాడ రూట్‌లో వారంలో ఏడు రోజుల పాటు నడపాల్సిన విమానాలను నాలుగు రోజుల చొప్పున కుదించి నడుపుతోంది. మరో నెల రోజుల్లో ఈ సమస్య నుంచి బయట పడతామని ఎయిర్‌ ఇండియా ప్రకటిస్తూ వస్తోంది. ఇదే తరుణంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే ఢిల్లీకి విమాన సర్వీసు నడిపే విషయంలో తమ బృందం చేత అధ్యయనం చేయించింది. ఢిల్లీకి ముందుగా ఒక సర్వీసు ఎక్కడా స్టాప్‌ లేకుండా నేరుగా నడపాలని నిర్ణయించింది.

indigo 22082018 2

ఈ మేరకు అక్టోబర్‌ 1 నుంచి బుకింగ్స్‌ కూడా ఇప్పటి నుంచే చేపడుతోంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ప్రారంభ ధర రూ.5,316గా ప్రకటించింది. నూతన సర్వీసును ప్రారంభిస్తున్న సమాచారాన్ని ఇంతవరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విజయవాడ విమానాశ్రయ అధికారుల దృష్టికి అయితే తీసుకు రాలేదు. రోజూ సాయంత్రం 4 గంటలకు..రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి విమానాన్ని నడపాలని ఇండిగో విమానయానసంస్థ నిర్ణయించింది. సాయంత్రం 3.45 గంటలకు విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి 4 గంటలకు ఈ విమానం బయలు దేరుతుంది. సాయంత్రం సమయంలో ముందుగా ఢిల్లీకి బయలుదేరాలనుకునే వారికి ఈ విమాన సర్వీసు సౌకర్యవంతంగా ఉంటుంది.

indigo 22082018 3

విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిచే విమాన సర్వీసుల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. ఎయిర్‌ ఇండియా సంస్థ మొత్తం మూడు సర్వీసులను నడుపుతోంది. ఉదయం 9.10 నిమషాలకు ఒకటి, సాయంత్రం 5.20 గంటలకు ఒక సర్వీసు, రాత్రి 9.10 గంటలకు మరో సర్వీసు చొప్పున నడుపుతోంది. ఈ సర్వీసులకు తోడు ఇండిగో విమాన సర్వీసు కూడా జతకూడటంతో విజయవాడ నుంచి ఢిల్లీకి నాలుగు సర్వీసులతో మెగా రూట్‌గా ఉంది.

Advertisements

Latest Articles

Most Read