నీటిని సంరక్షించాలి, పొదుపుగా వాడుకోవాలి అంటూ, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే సూక్తులు, కేవలం ప్రచారం వరుకే పరిమితం అని తేలిపోయింది. నీటి సంరక్షణ, పొదుపు కోసం, మన రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి ముఖ్యంగా, కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌షెడ్ల పధకం నుంచి, ఎప్పటి నుంచో నిధులు వస్తున్నాయి. బీజేపీ లేక ముందు కూడా ఈ స్కీం ఉంది. అయితే, తాజగా, రాష్ట్రాల్లో అమలవుతున్న వాటర్‌షెడ్లకు కేంద్రప్రభుత్వం నిధులు ఆపేసింది. దీంతో నీటి సంరక్షణ, పొదుపు కోసం వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. కొత్తగా మంజూరు అయిన ఆరో బ్యాచ్‌ వాటర్‌షెడ్లను సొంత నిధులతో నడుపుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

cm letter 19082018

దేశవ్యాప్తంగా వాటర్‌షెట్లను నిర్వహిస్తున్నా, ఈ పథకం మన రాష్ట్రంలోనే ఎక్కువగా సత్ఫలితాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం దెబ్బ ఏపీపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో వాటర్‌షెడ్ల పథకంలో పనిచేస్తున్న సిబ్బంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడం, ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు ఆగిపోవడంతో వీరిలో ఆందోళన ఎక్కువైంది. ప్రస్తుతం 790 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వాటర్‌షెడ్‌ పథకంలో పని చేస్తున్నారు. మొదట్లో ప్రారంభమైన ప్రాజెక్టులు 90 శాతం దాకా పూర్తయ్యాయి. దీంతో ఈ ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మంజూరయితేనే వీరి పని ఉంటుంది. అయితే, తాము కొత్త పథకాలను కేటాయించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వీరిలో ఎక్కవమంది అభద్రతకు గురవుతున్నారు.

cm letter 19082018

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటికి ఆరు బ్యాచ్‌ల్లో వాటర్‌షెడ్లు మంజూరుచేసింది. 2009 నుంచి 2014-15 వరకు.. రూ.2,900 కోట్లతో 432 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఒకటో, రెండో తప్ప అన్నీ దాదాపు పూర్తి కావొస్తున్నాయి. అయితే కొత్తగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను మంజూరుచేసేది లేదని, ఉపాధి హామీ పథకంలో భాగంగానే నీటి సంరక్షణ పనులూ చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్నీ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా మరికొన్ని వాటర్‌షెడ్లు నవ్యాంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసినప్పటికీ, కేంద్ర మంత్రి నుంచి ఇదే సమాధానమొచ్చింది.

జనవరి 2018 వరకు మోడీ అంటే ఒక మహా శక్తి... అమిత్ షా అంటే అభినవ చాణిక్య అంటూ ఆకాశానికి ఎత్తారు... మోడీని ఎదుర్కునే వారే లేరని, 2019 ఎన్నికల్లో గెలుపు ఖయాం అనే ధీమాతో ఉన్నారు.. నోట్ల రద్దు, జీఎస్టీ అన్నీ మోడీ బ్రాండ్ తో పక్కకు పోతాయని అనుకున్నారు... కాని, ఇక్కడే మోడీ, షా కు ఆంధ్రోడు బ్రేక్ వేసాడు. మా విభజన హామీలు, హక్కులు నెరవేర్చండి అని అడిగితే, నమ్మించి మోసం చేసిన మోడీ పై, ఆంధ్రుడు ఎదురు తిరిగాడు. 5 కోట్ల ఆంధ్రుల తరుపున, చంద్రబాబు ముందుండి, మోడీ పై యుద్ధం ప్రకటించారు. మిత్రపక్షంగా ఉంటూనే, బడ్జెట్ సమావేశాల్లో, ఆందోళన చేసారు.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో దులిపెసారు. ఎన్డీఏ నుంచి బయటకు రావటం, మంత్రుల రాజీనామా, అవిశ్వాసంతో, ఢిల్లీలో సీన్ ఒకేసారి మారిపోయింది. ఫిబ్రవరి నెలలో, తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి, అన్ని విపక్ష పార్టీలు మద్దతు ఇవ్వటంతో, మోడీ పతనం మొదలైంది.

modi 19082018 2

56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మోడీ, ఈ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేక, నెల రోజులు పార్లమెంట్ వాయుదా వేసుకుని వెళ్ళిపోయారు. తరువాత కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటిమి, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ అధికారంలోకి రావటం, అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకతాటి పైకి రావటం, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మోడీని, నీతి అయోగ్ సమావేశంలో నిలదియ్యటం, ఇలా అన్ని విధాలుగా, మోడీ పై ఒత్తిడి పెరిగింది. మోడీని ఎదుర్కోవాలి అంటే, ప్రాంతీయ పార్టీలు అన్నీ కలవాలి అనే వాదం బలపడింది. ఇలా మోడీ పతనానికి, ఆంధ్రోడు నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు సర్వేల్లో కూడా తేలింది. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే, మోడీ పని అయిపోయినట్టే అని ఇండియా టుడే సర్వే చెప్తుంది.

modi 19082018 3

జేపీకి మెజారిటీ సీట్లు రావని.. వచ్చినా మోడీకి ప్రధాని ఛాన్స్‌ రాదని ఇటీవల ఓ సర్వే పేర్కొనగా.. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీకి, మోడీకి షాకిచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే ఎన్డీయేకు కష్టం తప్పదని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ కూటమికి 224 స్థానాలు వస్తాయని, ఎన్డీయే బలం 228కు పరిమితమవుతుందని తేల్చింది. బీజేపీ 194 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, తెలుగుదేశం వంటి పార్టీలు ఏకమైతే, బీజేపీకి 194 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ మిత్ర పక్షాలకు 34 సీట్ల వరకూ రావచ్చని, మొత్తంగా 228 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది.

modi 19082018 4

ఇదే సమయంలో మహాకూటమికి 224 సీట్ల వరకూ వస్తాయని, ఇతర చిన్న పార్టీలు అత్యంత కీలకమవుతాయని తెలిపింది. ఇక మహాకూటమి ఏర్పడకుంటే బీజేపీ సొంతంగా 245 సీట్ల వరకూ గెలుస్తుందని, ఎన్డీయేకు 281 సీట్లు రావచ్చని పేర్కొంది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు లభిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 281కి పడిపోవడం గమనార్హం. మొత్తానికి అన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే, ఇక మోడీ గుజరాత్ వెళ్ళాల్సిందే అని సర్వే తేల్చి చెప్పింది. ఇక మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా 52 శాతం నుంచి 49 శాతానికి తగ్గింది. నిరుద్యోగం అతిపెద్ద సమస్యని 34 శాతం మంది, ధరలు పెరుగుతున్నాయని 24 శాతం మంది, అవినీతి పెను సమస్యని 18 శాతం మంది వెల్లడించడం గమనార్హం.

ఐక్యరాజ్య సమితి మాజీ చీఫ్ కోఫీ అన్నన్‌ మృతిపై మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు సంతాపం తెలిపారు. 2001లో తాను సీఎంగా ఉన్నప్పుడు అన్నన్ హైదరాబాద్‌ను సందర్శించిన అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన మానవాళికి చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోఫీ అన్నన్ శనివారం దివంగతులైన విషయం తెలిసిందే. ఆయన వయసు 80 ఏళ్ళు. ఆయన స్వల్ప అస్వస్థతతో బాధపడుతూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌‌లో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

kofi 18082018 2

2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని కోఫీ అన్నన్ సందర్శించారు. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐక్య రాజ్య సమితి వలసల విభాగం ట్విటర్‌ ద్వారా అన్నన్‌కు నివాళులర్పించింది. ఐరాస నుంచి తప్పుకొన్న తర్వాత కూడా కోఫీ అన్నన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, నెల్సన్‌ మండేలా స్థాపించిన ది ఎల్డర్స్‌ గ్రూప్‌లో సభ్యుడిగా ప్రపంచ శాంతి కోసం తన వంతు కృషి చేశారు.

వరదలతో సతమతమవుతున్న కేరళకు ఆర్థిక సాయంతో పాటు సహాయక సేవలు కూడా అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు శనివారం గన్నవరం నుంచి పలు బృందాలు ప్రత్యేక విమానంలో బయలుదేరాయి. ఏడుగురు అధికారులు సహా 66మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక అధికారితో పాటు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం, బోట్‌ మెకానిక్‌, స్విమ్మింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, 12మోటారు బోట్లు, ఇతర రక్షణ పరికాలతో బృందాలు కేరళకు పయనమయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ఈ చర్యలు చేపట్టింది. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌తో చంద్రబాబు మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు.

kerala 19082018 2

చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణశాఖ, అగ్నిమాపకశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు శనివారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి వాయుసేన విమానాల్లో కొచ్చి తిరువనంతపురంకు వెళ్లాయి. విపత్తు నిర్వహణశాఖ కమిషనరు ఎంవీ.శేషగిరిబాబు, అగ్నిమాపకశాఖ డైరెక్టరు జనరల్‌ కె.సత్యనారాయణ తదితరులు కేరళ అధికారులతో మాట్లాడారు. వారితో సమన్వయం చేసుకుని ఈ బృందాలను పంపించారు. కేరళ వెళ్లిన బృందంలో 79 మంది సిబ్బంది ఉన్నారు. 12 బోట్లు, 100కుపైగా లైఫ్‌ జాకెట్లు, ఇతర సహాయక సామగ్రిని పంపించారు.

kerala 19082018 3

మరో పక్క, కేంద్రం, రాష్ట్రాన్ని ఒక విజ్ఞప్తి కోరింది. కేరళలో వరదలతో అల్లాడుతున్న పశువులకు కోసం గడ్డిని పంపించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ విజ్ఞప్తికి రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. త్వరలో పశువుల మేత కోసం పాతర గడ్డిని పంపించనుంది. వరద బాధితులకు విరాళం ఇచ్చేందుకు రైస్‌ మిల్లర్లూ ముందుకు వస్తున్నారు. మరోవైపు కేరళకు సహాయం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిస్తూ కలెక్టర్లు జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read