రహదారుల్లో ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలు తొలగించాలని ఇప్పటికే కోర్ట్ వైసిపి ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిన సంగతి తెలిసిందే. కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రభుత్వం విగ్రహాలు తొలగించడం మొదలు పెట్టింది. కానీ ప్రభుత్వం, విగ్రహాలు తొలగించడం పై కూడా వివక్ష చూపుతుంది. దీని పై కోర్ట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో పెట్టిన అన్ని విగ్రహాలు తొలగించి, ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మాత్రం తొలగించలేదు. విగ్రహాల తొలగించే విషయం పై కూడా ఈ వివక్ష ఏంటని, ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించేదే లేదని కోర్ట్ హెచ్చరించింది. ఈ విషయం పై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కూడా కోర్ట్ ఆదేశించింది. తాము ఈ విషయంలో కల్పించుకునే పరిస్థితి తీసుకురావద్దని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ఈ విగ్రహాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే వెంటనే కోర్ట్ తమ ఆదేసాలను ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి వివక్ష ధోరణి వదలకపోతే కోర్ట్ నుంచి వచ్చే తీవ్రమయిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్ట్ తెలిపింది . న్యాయ వ్యవస్థలకు ఆగ్రహం తెప్పించే లాగా ప్రభుత్వం వ్యవహరించ కూడదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పింది.

hc 08042022 2

విగ్రహాల తొలగింపు విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గం చూపక పోతే, ఈ అంశం పై తామే ఒక కమీషనర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ అంశం ప్రభుత్వం మూడు వారాల లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. ఈ మేరకు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ , జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు అంటూ, అన్ని విగ్రహాలు తొలగించారు కానీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహం మాత్రం తొలగించలేదు. దీంతో కోర్ట్ కు వెళ్లారు. అయతే ప్రభుత్వం వైపు నుంచి, పిటీషన్ వేసింది తెలుగుదేశం వాళ్ళని, అది రాజకీయం పిటీషన్ అని, దాని గురించి పట్టించుకోవద్దని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, వాళ్ళు రాజకీయ నాయకులా ఎవరూ అనేది తమకు సంబంధం లేదని, సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించారా లేదా అనేదే తమకు కావాలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పు పై సమీకరణలు మారుతూ ఉన్నాయి. నిన్నటివరకు కేవలం ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే కొనసాగిస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ కూడా, సీనియర్లు అదే విధంగా మరికొంత మంది మంత్రుల అలకల నేపధ్యంలో, జగన్ కు మంత్రి వర్గ కూర్పు తలనొప్పిగా మారింది. ప్రధానంగా సీనియర్లు అయిన పెదిరెడ్డి , బొత్సా లను కొనసాగించి, మిగతా అందరి మంత్రులను మార్చేస్తారని వైసిపి వర్గాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇందులో బాగంగానే జగన్ బందువైన , ఒంగోలు MLA బాలినేని శ్రీనివాస రెడ్డి గతంలో జగన్ ను కలిసినప్పుడు అందరినీ తీసేస్తున్నామని చెప్పటంతో , శ్రీనివాస రెడ్డి సాటిస్ ఫై అయ్యారు. అయితే ఆ తరువాత శ్రీనివాస రెడ్డి ని తొలగించి అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మాత్రం అలాగే ఉంచుతాం అని వార్తలు ఉండటంతో, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్త పరచటమే కాకుండా హైదరాబాద్ వెళ్లి అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తుంది. దీనితో మళ్ళీ సజ్జల జ్యోక్యం చేసుకొని ఆయన్ను పిలిపించి జగన్ తో భేటి ఏర్పాటు చేసారు. జగన్ ను కలిసిన తరువాత కూడా బాలినేని తన పట్టు వీడకుండా అదే మూడ్ లో ఉన్నారు. ఈ రోజు ఒంగోల్ లో మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ, ప్రారంబోత్సవాలు అన్నీ, ఈ రోజు పెట్టేయాలని అనుచరులకు చెప్పటంతో ,అక్కడకు వెళ్లి ఆయన ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. అయితే బాలినేని పట్టు వీడక పోవడంతో జగన్ కు ఇది తల నొప్పిగా మారింది.

jagan 08042022 2

అదే విదంగా ఇక సంవత్సరం క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ ,అప్పలరాజు వీరిద్దరిని కూడా కొనసాగిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రత్యేకంగా వేణుగోపాల కృష్ణను మాత్రం కులసమీకరణ నేపధ్యంలో తప్పకుండా కొనసాగిస్తారని చెబుతూ ఉన్నారు. సీదిరి అప్పలరాజుకు బదులు, సతీష్ కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, తానూ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమే అవుతుందని తనను కొనసాగించాలని అప్పలరాజు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇక కులసమీకరణ నేపధ్యంలో ఆదిమూలపు సురేష్, గుమ్మనూరి జయరాం వీరిద్దరిని కూడా కొనసాగిస్తారని కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, నిన్నటి వరకు కేవలం నలుగురు పాత మంత్రులు ఉంటారని ప్రచారం జరగగా, నిన్నటి నుంచి మారిన పరిస్థితులు, సీనియర్ మంత్రులు వేస్తున్న ఎత్తులతో, జగన్ క్యాంప్ అలెర్ట్ అయ్యింది. కనీసం పది మంది పాత మంత్రులను కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనే కసరత్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం, జగన్ మెడకు చుట్టుకుని తీరుతుందని, మంత్రి వర్గ విస్తరణ తరువాత, వేగంగా మార్పులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంపీ రఘురామకృష్ణ రాజు పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసిన సందర్భంలో, సిఐడి రిమాండ్ లో, ఎంపీ రఘురామ పై పోలీస్ రిమాండ్ లో ఉన్న సమయంలో,ఆయన పై కొంత మంది ముసుగులు వేసుకుని వచ్చి, దా-డి చేసారు అంటూ, ఎంపీ రఘురామ కొడుకు భారత్, సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దానికి సంబంధించి, సిబిఐ విచారణ జరిపించాలని కూడా భరత్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసు దాదపుగా ఏడాది నుంచి విచారణ రాకుండా ఆగిపోయింది. సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రాలేదు. ఎందుకు రావటం లేదు అనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. అయితే ఎట్టకేలకు ఈ కేసు విచారణ సుప్రీం కోర్టు ముందుకు వస్తుంది. న్యాయమూర్తులు వినీత్ శరన్ ధర్మాసనం, ఈ రోజు కేసు విచారణ సందర్భంగా, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఈ కేసులో ఎందుకు జాప్యం జరిగింది ? కేంద్రం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు ? సిబిఐ కూడా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు అని చెప్పటం జరిగింది. అంతే కాకుండా, ఇటువంటి కీలకమైన కేసులకు సంబంధించి, త్వరతిగతిన విచారణ జరిగితే బాగుటుంది, త్వరతిగతిన కౌంటర్ కూడా దాఖలు చేస్తే బాగుటుందని, ధర్మాసనం అభిప్రాయపడింది.

supreme 08042022 2

దీంతో పాటు, కేంద్రానికి, సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయలని కూడా, కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత రెండు వారాల్లో సిబిఐ, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పైన, రీజాయిండర్ దాఖలు చేసేందుకు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్‍కు అవకాశం ఇచ్చింది. ఆ తరువాత నాలుగు వారాలకు ఈ కేసుని మళ్ళీ లిస్టు చేయాలని రిజిస్ట్రీని కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి పైన జరిగిన పోలీస్ దా-డి విషయం పై సిబిఐ విచారణ చేపించాలి అనేది భరత్ తన పిటీషన్ లో పేర్కొన్న ప్రధానమైన డిమాండ్. ఈ పిటీషన్ పైనే ఈ రోజు విచారణ జరిగింది. ఈ పిటీషన్ చాలా రోజులగా పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాన్ని కూడా త్వరతిగతిన తేల్చాల్సిందే అని సుప్రీం కోర్టు ఈ రోజు అభిప్రాయపడింది. ఈ కేసు కనుక సిబిఐ విచారణకు వస్తే, ఆ రోజు ఎవరు కొట్టారు, వాట్స్ అప్ లో ఆ కొట్టటం చూసింది ఎవరు ? ఎందుకు కెమెరాలు పని చేయలేదు లాంటి అనేక అంశాలు బయటకు వస్తాయి.

 

అమరావతిలో రోడ్ల అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని అమరావతి జేఏసీ నేతల వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన అభిప్రాయాన్ని తెలియ చేసారు. కాంగ్రెస్ నాయకురాలైన పద్మశ్రీ , కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, అమరావతి జేఏసీ నాయకులు గురువారం గడ్కరీని కలిసారు. అమరావతిలో కేంద్ర ప్రాజెక్ట్ లు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, బెంగుళూరు- అమరావతి వయా అనంతపురం వరకు ఉన్న హైవే రోడ్డును వైసిపి ప్రభుత్వం చిలకలూరుపేట వరకే పరిమితం చేసారని, దానిని అమరావతి వరకు కొనసాగించాలని ఈ సందర్బంగా వారు గడ్కరీని కోరారు. అమరావతికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా ఏర్పాటు చెయ్యాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ, జగన్ ప్రభుత్వం, తమకు ఏ మాత్రం సహకరించడం లేదని, వాళ్ళ సహకారం లేకుండా తాము ముందుకు వెళ్ళలేమని ఆయన వారితో చెప్పారు. ఈ విషయం పై గడ్కరీ సలహా ఇస్తూ , వారిని కోర్టులో అపీల్ చేయమని సహ్లా ఇచ్చారు. అ తరువాత కోర్టే ఈ రహదారులను అభివృద్ధి చేయమంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుందని గడ్కరీ సూచించారు.

Advertisements

Latest Articles

Most Read