గత కొన్ని రోజులుగా, వైసీపీకి చెందిన ఫేక్ బ్యాచ్ ఎన్నో ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తుంది. సామాన్య ప్రజలు మాట్లడిస్తున్నట్టు, వారే మాట్లాడించి, చంద్రబాబు పై, లోకేష్ పై బురద జల్లుతున్నారు. తద్వారా, న్యూట్రల్ ఓటర్స్ ను ప్రభావితం చేసేలా ప్లాన్ చేసారు. గత రెండు రోజులుగా ఒక పెద్దావిడ, నన్ను అధికారులు, లోకేష్ అన్యాయం చేసారంటూ ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో కులం ప్రస్తావన కూడా ఉంది. మొత్తానికి, అది చూసిన ఎవరైనా, పాపం నిజమే అనుకుంటారు. లోకేష్ ఎదో చేసాడు అనే అనుకుంటారు. కాని వాస్తవం వేరు. ఇదే విషయం పోలీసులు విచారణలో తేల్చారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కావాలని పెడితే ఊరుకునేది లేదని చెప్పారు. ఇలాంటివి షేర్ కూడా చెయ్యవద్దు అని చెప్పారు. వీడియోలో మాట్లాడిన ఆ మహిళ పై కూడా సైబర్‌ క్రైం కింద కేసు నమోదైంది. ఇది ఈ వీడియో వెనుక అసలు విషయం.

ఈ కేసు సంబంధించి వివరాలను గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ స్నేహిత తెలిపారు. వేమూరు నియోజకవర్గం పోతుమర్రుకు చెందిన వెంకటేశ్వర్లు, జి.పద్మావతి భార్యభర్తలు. భర్త హైకోర్టు న్యాయవాదిగా పనిచేసేవారు. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో 2005 నుంచి విడిగా ఉంటున్నారు. వెంకటేశ్వర్లు తన స్వగ్రామం పోతుమర్రులో, పద్మావతి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో పిల్లలతో కలిసి ఉండేవారు. ఈ క్రమంలో 2011వ సంవత్సరంలో వెంకటేశ్వర్లు తన స్వార్జితమైన 7.5 ఎకరాలను శివారెడ్డికి విక్రయించగా, ఆయన దానిని బంధువు చంద్రశేఖర్‌రెడ్డికి అమ్మారు. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటున్నారు. 2016లో అనారోగ్యంతో వెంకటేశ్వర్లు మృతి చెందారు. అనంతరం పిల్లలతో కలిసి పోతుమర్రు వచ్చిన పద్మావతి భర్త ఇంట్లోనే ఉంటున్నారు. భర్త నుంచి ఆమెకు 7.5 ఎకరాల భూమి వచ్చింది. తనకు రావాల్సిన ఆస్తి మొత్తం 15 ఎకరాలని, భర్త అమ్మిన ఆస్తి కూడా తనకు చెందేలా తహశీల్దార్‌, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌, డీఎస్పీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులను కలిశారు. ఒంటరి మహిళ కావడంతో అందరూ ఆమె ఆవేదనను వింటూ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించారు.

అధికారుల పరిశీలనలో ఆమె భర్త ఆస్తిని విక్రయించినట్లు దస్తావేజులు ఉండటంతో రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని సంప్రదించారు. వారు కూడా పక్కా దస్తావేజులని నివేదిక ఇవ్వడంతో ఆమెకు విషయాన్ని వివరించి సమస్య పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని సంప్రదించాలని సూచించారు. ఆధారాలు లేకపోవడంతో క్రయవిక్రయాలపై న్యాయస్థానం ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 21న పద్మావతి దాదాపు 30 మంది కలిసి పొలంలో ఉన్న శివారెడ్డి, మరో ఇద్దరిని కిడ్నాప్‌ చేసి పోతుమర్రు చర్చిలో బంధించారు. వారిని హింసించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవాలని ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని విడిపించి కిడ్నాప్‌, ఇతర కేసులు నమోదు చేశారు. తాను అనుకున్నట్లు ఆస్తి దక్కక పోవడంతో ఆమె రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు మోసం చేశారంటూ వారి పేర్లతో కూడిన స్వీయ వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో అవాస్తవాలతో కూడినది కావడంతో ఎవరూ షేర్‌ చేయవద్దని డీఎస్పీ సూచించారు.

అవిశ్వాస తీర్మానం పెట్టి మోడీని ఉతికేసిన తెలుగుదేశం ఎంపీలు, ఆ వేడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి రోజు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఢిల్లీలో వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి, సమస్యల పై నిలదీస్తున్నారు. మొన్న రాష్ట్రపతిని కూడా కలిసి మోడీ పై ఫిర్యాదు చేసారు. ఒక పక్క సొంత రాష్ట్రంలో ధర్మ పోరాట దీక్షలు పెడుతూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ఢిల్లీ పై పోరాటాలకి ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో, కేంద్రం పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే దేశంలో అన్ని పార్టీలని కలిసి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు విభజన హామీలే కాక, రాష్ట్రానికి చెయ్యవలసిన అనేక పనులను కేంద్రం ఎలా తొక్కి పెట్టింది అనే దాని పై కూడా పోరాటాలు చేస్తున్నారు.

modi 03082018 2

ఇందులో ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశం. ఇప్పటికే రాష్ట్రం నుంచి, ఈ బిల్ కేంద్రానికి వెళ్ళింది. కేంద్రం ఆమోదిస్తే అయిపోయే దానికి, ఇప్పటి వరకు స్పందన లేదు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, చంద్రబాబు మోసం అంటూ నాటకాలు ఆడుతున్నారు. అందుకే అసలు కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకుని ప్రజల ముందు చూపించటానికి, తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహంతో ముందుకొచ్చింది. అదే కాపు రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు. కాపు రిజర్వేషన్లపై ఈరోజు లోక్ సభలో టీడీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ఆమోదముద్ర వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు.

modi 03082018 3

కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతోంది. కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని తాము ఏమీ చేయలేమని చెప్పిన వైసీపీ అధినేత జగన్... తాము అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జనసేన ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. అనకాపల్లి టిడిపి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలోనే కాపుల కష్టాలను చూసి బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేశారని,ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ లోక్‌సభలో పెడుతున్న ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

అనంతపురం ఎస్పీ, సీఐని ఫోన్లో బెదిరించిన కేసులో టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడైన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌ ఓ చర్చి విషయంలో తాను చెప్పిన వారికి అనుకూలంగా చేయాలంటూ అనంతపురం ఎస్పీ, సీఐని ఫోన్‌లో బెదిరించాడు. 4 రోజుల క్రితం కేంద్రమంత్రి ఓఎస్డీని అంటూ పోలీసులపై ఆయన బెదిరింపులకు దిగాడు. అసలు ఇతనెవరు..? బ్రాక్‌గ్రౌండ్ ఏంటి అని ఆరాతీసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందం ఆయనకోసం గాలించి గుంటూరులో అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించింది.

borugadda 03082018

అనిల్ అనే వ్యక్తి టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడని తెలిసింది. రమణదీక్షితుల ఆరోపణలకు మద్దతుగా కోర్టులో పిల్‌ వేస్తానని చెప్పాడని సమాచారం. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు.. అనిల్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. అనిల్‌పై ఐపీసీ 120(బి), 506,185, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది.

borugadda 03082018

అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు. అనిల్‌ గుంటూరులో తనకు తాను ప్రముఖుడిగా చెప్పుకుంటూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని పంచాయితీలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తన కారుపై ఎంపీల స్టిక్కర్‌ వేసుకొని తిరుగుతూ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు తనకు బంధువులని చెప్పుకుంటారని తెలుస్తోంది. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.

ఏపి ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెస్తున్న నిరుద్యోగ భృతి పథకానికి తన పేరు పెట్టాలన్న మంత్రుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. ఈ పథకానికి ఏ పేరుపెట్టాలన్న విషయమై కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగింది. ఈ పథకానికి 'యువ నేస్తం' అనే పేరును మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించగా... 'చంద్రన్న యువ నేస్తం' అని పెట్టాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. అయితే ప్రతి కార్యక్రమానికీ తన పేరు పెట్టడం సరికాదని, ఆ అవసరం లేదని సీఎం చంద్రబాబు ఆ ప్రతిపాదనను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్ల కు కేబినెట్ ఓకే చెప్పింది.

cbn 03082018 2

నిరుద్యోగ భృతి పై ఎంతో కసరత్తు జరిగింది. నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందేందుకు... పరిశ్రమ వర్గాలు తమకు అవసరమైన వారిని ఎంచుకునేందుకు.. మూడు సేవలు, ఒకే పోర్టల్‌ లో రానున్నాయి. ఈ పోర్టల్‌ రూపకల్పనలో ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ కీలకపాత్ర పోషించారు. పలు శాఖలు, విభాగాలు, కార్పొరేషన్‌లు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు అనేక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు సమీక్షించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పోర్టల్‌ను అత్యంత పకడ్బందీగా తయారీకి లోకే శ్‌ సుమారు 600 గంటలు శ్రమించారు. నిరుద్యోగ భృతి కోరే యువతీ యువకులు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. వారికి ఒక ఓటీపీ నంబరు వస్తుంది. అది ఎంటర్‌ చేసి.. ఇదే వెబ్‌పోర్టల్‌లోనే దరఖాస్తు నింపాలి. పాలిటెక్నిక్‌, డిగ్రీ సమానార్హత ఉండి... 22 నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న వారే దీనికి అర్హులు. అర్హత లేకపోతే అప్పటికప్పుడే ‘రిజెక్ట్‌’ చేస్తారు. అన్నీ ఓకే అయితే... అప్పటికప్పుడే భృతిని మంజూరు చేస్తారు.

cbn 03082018 3

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో క్రమం తప్పకుండా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జాబ్‌ పోర్టల్‌ను కూడా నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తారు. ఎక్కడ ఎలాంటి కొలువుల ప్రకటనలు వెలువడినా దీని ద్వారా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పలు శాఖల్లోని పథకాలు, కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కసరత్తు చేశారు. దీనికోసం ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతోపాటు సంబంధిత మంత్రులతోనూ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటించి, దానిని విజయవంతంగా అమలు చేయలేని రాష్ట్రాల అనుభవాలను తెలుసుకున్నారు. లోటుపాట్లను ముందుగానే గుర్తించారు. అలాంటి పొరపాట్లు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read