ఏ రాష్ట్రమైనా ఈ రోజు ఉన్న దాని కంటే, రేపు బాగా ఉండాలని అనుకుంటుంది. దీన్నే అభివృద్ధి అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అభివృద్ధి అనేది మర్చిపోయి చాలా రోజులు అయ్యింది. ఈ రోజులా ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అయితే ప్రభుత్వ చర్యలు మాత్రం, ఈ రోజు కంటే ఘోరంగా 20 ఏళ్ళు వెనక్కు తీసుకుని వెళ్ళే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా దేశమంతా కరెంటు విషయంలో దూసుకుని పోతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం, రివర్స్ లో వెళ్తుంది. 20 ఏళ్ళ నాడు కరెంటు కోతలతో, ప్రజలు ఎలా ఇబ్బందులు పడేవారో, గత వారం రోజులుగా ఏపి పరిస్థితి అలా తయారయ్యింది. అయితే దీని పైన ఇన్నాళ్ళు బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొన్ని షాకింగ్ వాస్తవాలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమరాలకు పవర్ హాలిదీ ప్రకటించారు. 5 జిల్లాల్లో ఉన్న పరిశ్రమలకు వారానికి 2 రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇది అమలులో ఉంటుంది. రెండు వారల పాటు ఈ పవర్ హాలిడే ఉంటుంది. విద్యుత్ దొరికితే, అప్పుడు పవర్ హాలిదీ ఎత్తేస్తాం అని ప్రకటించారు. ఇక గృహాలకు ఇచ్చే కరెంటు విషయంలో ఏమవుతుందో చూడాలి.
news
గాలి జనార్ధన్ రెడ్డి రికమెండేషన్ తో, మంత్రిగా ఆయన ఒక్కడే కొనసాగింపు ?
ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందరూ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేసారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో, రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందచేసారు. ఆ రాజీనామా లేఖలు గవర్నర్ కార్యాలయానికి కూడా చేరాయి. ఈ రాత్రికి గవర్నర్ వాటిని ఆమోదిస్తారు. మరి కొద్ది సేపట్లో ఈ మంత్రులు అందరూ ఇక మాజీ మంత్రులుగా మిగిలిపోతారు. ఇప్పటికే క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత, మంత్రులు అందరూ ప్రోటోకాల్ వెహికల్స్ లేకుండా, తమ వాహనాల్లోనే వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆసక్తి మాత్రం, కొత్త క్యాబినెట్ లో ఎవరికి అవకాసం దక్కుతుంది ? కొత్త క్యాబినెట్ లో కొనసాగే మంత్రులు ఎవరు ? దీని పైనే సస్పెన్స్ నడుస్తుంది. ఇప్పటికే పాత మంత్రులు నలుగురు వరుకు కొత్త క్యాబినెట్ లో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో సీనియర్ నేతలు బొత్సా, పెద్దిరెడ్డి, బాలినేని ఉంటారని అందరూ భావించారు. కానీ వారికి ఇప్పటికే వారు కొనసాగరు అని సంకేతాలు వెళ్లాయని చెప్తున్నారు. దీంతో ఆ నలుగురు మంత్రులు ఎవరూ అనేది చర్చ నడుస్తున్న వేళ, ఇప్పుడు కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. కర్ణాటక మైనింగ్ డాన్ గాలి జనర్ధర్ రెడ్డి, ఒక మంత్రి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డిని నా పెద్ద కొడుకు అంటూ వైఎస్ఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అయితే జగన్ తో, గాలి జనర్ధర్ రెడ్డికి ఉన్న సంబంధాల నేపధ్యంలో, గుమ్మనూరు జయరాం తన మంత్రి పదవి ఊడకుండా ఉండటానికి లాబీయింగ్ చేసారు అంటూ వార్తలు వస్తున్నాయి. జయరాంతో పాటుగా, ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ మంత్రులు కూడా కొనసాగుతారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త మంత్రులు విషయంలో, కూడా సస్పెన్స్ నెలకొంది. కొత్త మంత్రులుగా ఎవరు వస్తారు అనే విషయం పై, జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పై దారుణమైన వ్యతిరేకత ఉందని, ప్రశాంత్ కిషోర్ పెద్ద రిపోర్ట్ ఇచ్చారని, దాని ఆధారంగా ఈ మంత్రి వర్గంలో చోటు ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువగా బలహీన వర్గాలను నింపేసి, కేవలం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనే వాదనను కొద్దిగా చెక్ పెట్టటానికి ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఇక దీని పై సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారు, వారిని ఎలా బుజ్జగించాలి అనే దాని పై కూడా వైసీపీలో చర్చ జరుగుతుంది.
వివేక కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులకు షాక్ ఇచ్చిన ఏపి ప్రభుత్వం..
జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు విషయంలో, సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు ఈ కేసు దర్య్పాటు చేస్తున్నారు. దాదాపుగా రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేస్తుంది. ఈ నేపధ్యంలోనే వారు కడపలో, ప్రభుత్వానికి చెందిన ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ లో ఉంటూ, ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఇందు కోసం, ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ లో మూడు గదులను సిబిఐ అధికారులు అద్దెకు తీసుకున్నారు. అక్కడ నుంచే వివేక కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ అధికారులకు షాక్ ఇచ్చింది. కడపలో సిబిఐ ఉంటున్న ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలని ఆదేశిస్తూ, సిబిఐకి షాక్ ఇచ్చింది. వెంటనే గెస్ట్ హౌస్ లో సిబిఐ తీసుకున్న మూడు గదులను ఖాళీ చేయాలని ఆదేశాలు వెళ్ళాయి. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కోసం జగన్ వస్తున్నారని, అందుకోసం ప్రముఖుల కోసం, ఇక్కడ ఏర్పాట్లు చేయాలని, గదులు అన్నీ మరమ్మతులు చేయాలని, అందుకే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరి దీని పై సిబిఐ ఎలా రియాక్ట్ ఆవ్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఎంపీని సిబిఐ విచారణకు పిలవలేదు. ఎదురు మళ్ళీ, ఇలా అవమానాలు పడుతున్నారు. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి మరి.
ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫేక్ చేస్తూ అడ్డంగా దొరికిన వైసీపీ బ్యాచ్..
ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్.. చంద్రబాబు ఉండగా ఈ పదం బాగా వినపడేది. చంద్రబాబు ఉన్న సమయంలో, పెట్టుబడి దారులకు స్వర్గధామంగా ఏపి ఉండేది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చే వారు. దీనికి ప్రత్యేక్ష ఉదాహరణ కియా కంపెనీ. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్, సెల్ కాన్, అశోక్ లేల్యాండ్, విఐటి, hcl, అదనీ డేటా సెంటర్, రిలయన్స్ జియో, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, ఇలా చెప్పుకుంటూ పోతే, బోలెడు కంపెనీలు వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే, చంద్రబాబు హాయంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అనేక పారశ్రామిక పాలసీలు తీసుకుని వచ్చి, చంద్రబాబు ఆ సమయంలో పెట్టుబడులను ఆకర్షించారు. దీని కారణంగానే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. చంద్రబాబు గారు ఇచ్చిన బూస్ట్ తోనే, ఆ కాలానికి, జగన్ మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలో కూడా , ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ అవార్డ్ తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ రోజు సడన్ గా వైసీపీ సోషల్ మీడియా, ఒక ప్రచారం మొదలు పెట్టింది.
ఇందుకు కారణం ఇన్వెస్ట్ ఇండియా అనే కేంద్ర సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ లో, అన్ని రాష్ట్రాల బలా బలాల గురించి చెప్తూ, ట్వీట్లు వేస్తున్నారు. ఏపికి వచ్చే సరికి, మనకు గతంలో ఇచ్చిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ గురించి ప్రస్తావించారు. అందులోనే మనకు వచ్చిన పెట్టుబడులు కూడా పెట్టారు. ఇంకేముంది, మళ్ళీ ఏపికి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ వచ్చిందని, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే, మనకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అంటూ, డబ్బా కొట్టటం మొదలు పెట్టారు. నిజానికి పెట్టుబడులు ఆకర్షించటంలో మనం పెట్టుబడుల్లో 14 వ స్థానంలో ఉన్నాం. ఇక కోవిడ్ కారణంగా, గత ఏడాది కేంద్రం ఎటువంటి EODB ర్యాంకులు వ్వలేదు. 2019-20లో చంద్రబాబు గారి హయాంలో ఇచ్చిన దానికి, ఇప్పుడు ఫేక్ ప్రచారం సెహ్స్తున్నారు. Invest India వాడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పాత (2019) ర్యాంకింగ్స్ వేశాడు. అవి చూసి వైసీపీ పైడ్ బ్యాచ్, పేటీయం బ్యాచ్, బ్లూ మీడియా, కనీసం వెరిఫై చేసుకోకుండా చిడతలు వాయిస్తున్నారు. అయినా, ఇక్కడ నుంచి పెట్టుబడులు అన్నీ వెళ్ళిపోయి, మటన్ షాపులు, చేపలు కొట్లు వస్తుంటే, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటారేంటి ? ఏమి లేని దానికి, జాకీలు వేసుకుని లేపటం ఎందుకు ?