అతడి వయసు 21. కానీ ఆ తల్లిదండ్రులకు పసివాడే. ప్రపంచం తెలీదు. పుట్టుకతో వైకల్యం ఉంది. ఉన్నట్లుండి వచ్చే మూర్ఛ. అనారోగ్యం. కుమారుడంటే ప్రాణం. వైద్యంతో పరిస్థితిని కొంతమేర అదుపులోకి తీసుకురావచ్చని వైద్యులు చెప్పడంతో వారు తమ బిడ్డను తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించారు. వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ కన్నీరు మున్నీరయ్యారు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం అడవితక్కెళ్లపాడు యువకుడు షేక్ జాఫర్ షరీఫ్‌కు పుట్టుకతోనే డిఫ్యూజ్ సెరిబ్రల్ ఆట్రోఫీ వ్యాధి ఉంది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకువచ్చి పరిస్థితిని సీఎంకు వివరించడంతో అతడి వైద్యానికి ముఖ్యమంత్రి రూ. 5 లక్షలు మంజూరు చేశారు.

cbnhelp 30072018 2

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సరస్వతుల ఫణీంద్ర కుమారుడు చిన్నారి సరస్వతుల షణ్ముఖ కౌశిక్ కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కౌశిక్ అనారోగ్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించి ముఖ్యమంత్రి బాలుని కాలేయమార్పిడి చికిత్సకు అయ్యే రూ.15 లక్షలు మంజూరు చేశారు. చిత్తూరు జిల్లా భవానీశంకరపురం కండ్రిగ గ్రామానికి చెందిన చెంగయ్య నాయుడు కుమారుడు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ముప్ఫయి మూడేళ్ల సుదర్శనబాలు వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి రూ.2.5 లక్షలు మంజూరు చేశారు.

cbnhelp 30072018 3

నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలం నడిగల్లు గ్రామస్తుడు సర్వేపల్లి రామయ్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో రెండు కాళ్లూ దెబ్బతిన్నాయి. పెద్ద కుటుంబం. పైగా పేదరికం. ఆయన తన సమస్యను ముఖ్యమంత్రికి వివరించగా ఆయన రూ.లక్ష సహాయం ప్రకటించారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మునెప్ప పుట్టుకతోనే దివ్యాంగుడు. మానసికంగా దెబ్బతిని శారీరకంగా కుంగిపోయాడు. అతడికి ఎన్టీఆర్ వైద్య సేవకింద పూర్తి వైద్యం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుప్పం మండలం ఉర్లోబానపల్లి గ్రామం నుంచి వచ్చిన రాముడు,లక్ష్మణుడు అనే కవలలకు సాయంగా రూ.30 వేల వంతున బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

పౌరుల్లో ఆర్ధిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంపొందించేందుకు మొబైల్ ఏటీఎంలను ప్రారంభించినట్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి ప్రజావేదిక ప్రాంగణంలో సోమవారం ఆప్కాబ్ తీసుకొచ్చిన 12 ఏటీఎం వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మినహా 12 జిల్లాలకు 12 మొబైల్ ఏటీఎంలు పనిచేస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి నగదు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలలోని గిరిజన ప్రాంతాలకు ఈ మొబైల్ ఏటీఎంలు ప్రత్యేక సేవలు అందిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

mobileatm 30072018 2

ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌ కలిగి ఉందన్నారు. నాబార్డు ఆర్ధిక సహాయంతో ఈ మొబైల్ ఏటీఎంలను ప్రవేశపెట్టినట్లు పిన్నమనేని తెలిపారు.ఈ ఈ ఏటీఎంలలో మైక్రో ఏటీఎం, పేటిమ్, క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్ సదుపాయాలున్నాయని, ఈ ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తే చార్జీల రూపంలో వసూలు చేసే నగదు మన దేశానికే దక్కుతుందని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పేటీఎంకు చెందుతాయన్నారు.

mobileatm 30072018 3

మైక్రో ఏటీఎం ద్వారా ఈ-పోస్ సేవలు లభ్యమవుతాయని తెతిపారు. దేశంలో మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమన్నారు. వాణిజ్య బ్యాంకుల కన్నా సేవా చార్జీలు తక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆప్కాబ్ ఎండీ భవానీ శంకర్ చెప్పారు. డిజిటల్ అక్షరాస్యతా కేంద్రమని, ఇందులో వినియోగదారులకు సేవలు అందిస్తూ ,మరో పక్క వారిలో డిజిటల్ చైతన్యం తేవడానికి వాహనానికి ఒక కౌన్సిలర్ ఉంటాడని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో టౌన్‌షిప్‌లు, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తిగా వున్నామని జపాన్ ఆతిధ్య రంగ దిగ్గజం యుకో హిరా తెలిపారు. దీంతో పాటు గృహ నిర్మాణం, ప్రజారవాణా, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ‘ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ జపాన్’ (ఐ.సి.ఐ.జె.) చైర్మన్‌గా వున్న యుకో హిరా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి చర్చించారు. హెచ్ఎంఐ హోటల్ గ్రూపు నిర్వహిస్తున్న యుకో హిరా జపాన్‌లో పెరల్ సిటీ, క్రిస్టొన్, క్రౌన్ ప్యాలస్ తదితర ప్రీమియం హోటళ్లకు అధినేతగా వుండటమే కాకుండా ప్రవాస భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.

hmi 30072018 2

ప్రస్తుతం అక్కడ 60కి పైగా హోటళ్లు నిర్వహిస్తున్న యుకో హిరా విశాఖలో తొలుత గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మా పరిశ్రమకు ముఖ్యకేంద్రంగా వున్న జపాన్‌లోని తొయామా నగరంతో ఏపీకి సామీప్యత వుందని, సుదీర్ఘ సముద్రతీరం ఇరు ప్రాంతాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని యుకో వివరించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో రెండు ప్రాంతాల మధ్య పరస్పర సహాయ సహకారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక నాణ్యత గల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ సహకారం ఉంటే ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమని తెలిపారు.

hmi 30072018 3

జపాన్-ఏపీ పరస్పర వాణిజ్య సంబంధాలకు ఇతోధికంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు, వాణిజ్యం వేర్వేరు దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త రాష్ట్రానికి సహకారం అందించేందుకు సింగపూర్ ముందుకు వచ్చినట్టే జపాన్ కూడా చొరవ చూపి రావాలని, ఇక్కడున్న విస్తృత పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐసీఐజే చైర్మన్‌ను కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి కార్య నిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్ పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రాధాన్య ప్రాజెక్టులూ నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం తలపెట్టిన 56 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఇప్పటికి 15 మాత్రమే పూర్తయ్యాయని, పనులు కొనసాగిస్తున్న మరో 26 ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టిన 15 ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్ల రూపకల్పన, టెండర్లు, భూసేకరణ వంటి ప్రక్రియను త్వరగా ముగించాలన్నారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

polavaram review 30072018 2

ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ఇకపై నిర్మాణ ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించనని అన్నారు. ఆగస్టులో అడవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేయాలని, అలాగే సంగం-నెల్లూరు బ్యారేజ్‌లు నిర్దేశిత సమయానికి నిర్మించాలని, వాటి గడువు పెంచేందుకు వీలు లేదని చెప్పారు. తారకరామ తీర్థ సాగర్ వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం మొదటిదశ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా వున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

polavaram review 30072018 3

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి 69వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశీలించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 56.90%, తవ్వకం పనులు 76.60%, కాంక్రీట్ పనులు 31.60% పూర్తయినట్టు ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.41%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.67%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% పూర్తయ్యాయని తెలిపారు. గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయని, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 30 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టారని వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read