విభజన హామీల విషయంలో సుప్రీం కోర్టులో కేంద్రం మరో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మానవ వనురుల శాఖ తాజా అఫిడవిట్‌ సుప్రీం కోర్టుకు సమర్పించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు మిగతా విద్యాసంస్థల ఏర్పాటు, తరగుతల నిర్వహణ వంటి అంశాలపై వివరణ ఇచ్చింది. అయితే గిరిజన వర్సిటీ, సెంట్రల్ వర్సిటీపై హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పిన మాటకు.. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశానికీ పొంతన లేదు.

modi 300720118

దీంతో కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి వర్సిటీల్లో క్లాసులు ప్రారంభిస్తామని ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం దీనికి విరుద్ధంగా సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. అంతకుముందు దాఖలు కేంద్రం చేసిన అఫిడవిట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌, తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యం కావని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. హోంశాఖ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమయినట్టు తెలిపింది. రాష్ట్రానికి రైల్వేజోన్‌ ఇచ్చి తీరుతామని లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించిన కొన్ని రోజులకే అందుకు భిన్నంగా అఫిడవిట్‌ దాఖలు చేయడం గమనార్హం.

modi 300720118

దీని పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున... ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపైనా భాజపా మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటన్న విషయం అఫిడవిట్లలో తేలిపోయిందన్న చంద్రబాబు...., కేసుల మాఫీపై తప్ప జగన్ దృష్టి మరి దేనిపైగా లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ముస్లిం మైనారిటీలు భాజపాకు పూర్తిగా దూరమయ్యారని.. అలాంటి భాజపాతో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.

టీడీపీ నేతలకు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం తర్వాత తనను టీడీపీ నేతలు బెదిరించారని నోటీసులో పేర్కొన్నారు. వీడియో ఆధారాలు రాజ్యసభ అధికారులకు ఆయన అందజేశారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చిన కంప్లైంట్ లో జీవీఎల్ రాస్తూ, టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నారు. టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను, ప్రెస్ లో వచ్చిన వాటిని రాజ్యసభ సెక్రటేరియట్ కు ఇస్తున్నట్టు జీవీఎల్ చెప్పారు.

gvl 30072018 2

నేను జూలై 24న రాజ్యసభలో, తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన అబద్ధాలు ఎండగట్టాను, అప్పటి నుంచి నా పై పగ పట్టారు, నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు అంటూ జీవీఎల్ ఆ లేఖలో రాసారు. వేమూరి ఆనంద సూర్య నా అంతు చూస్తాను అన్నాడు అంటూ జీవీఎల్ రాసారు. సోషల్ మీడియాలో కూడా నా పై దాడి చేస్తున్నారని, మోర పెట్టుకున్నారు జీవీఎల్. ఇక్కడ కామెడీ ఏంటి అంటే, ఇన్ని రూల్స్ మాట్లాడుతూ, నేను పర్ఫెక్ట్ అనే జీవీఎల్, ఆగష్టు 28, 2018న, తెలుగుదేశం పార్టీ నేతలు నా పై దాడి చేసారని అన్నారు. మనం ఇంకా జూలై నెలలోనే ఉంటే, ఆగష్టు నెలలో తెలుగుదేశం నేతలు చెప్పారు అంటూ జీవీఎల్ రాసిన రాతల పై, నెటిజెన్లు కౌంటర్ లు ఇస్తున్నారు.

gvl 30072018 3

మరోవైపు ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. ‘కుప్పం- కంగుంది’ వీధినాటకం ప్రదర్శిస్తూ ఎంపీ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మేధావులు, కళాకారులు ఎలుగెత్తి చాటుతున్నా మోదీకి చలనం లేదని ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు.

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే రీసౌండ్ ఇంకా బీజేపీ నేతల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రం పై విరుచుకు పడ్డారు. ఈ సారి ఎయిర్ పోర్ట్ ల పై, కేంద్రం చూపిస్తున్న వివక్ష పై జయదేవ్ ప్రశ్నించారు. అంతే కాదు, మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఎలా కక్ష తీర్చుకుంటుంది, వివరించారు. జయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల నుంచి విదేశీ విమానాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ఎంపీ జయదేవ్‌ డిమాండ్ చేశారు. ఏపీ విభజన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు చొరవ తీసుకుంటామని కేంద్రం ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

galla 30072108 2

విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో సౌకర్యాలు కల్పించబడినా ఇప్పటివరకు విదేశీ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 2, 3 సర్వీసులను నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో నేవీ అధికారుల కొత్త ఆంక్షలతో స్పైస్‌జెట్‌, శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ తమ సర్వీసులు నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. నేవీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు గగనతలాన్ని అధికారులు వాడుకుంటున్నారు. విదేశీ విమాన సర్వీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడమేంటి’’ అని జయదేవ్‌ ప్రశ్నించారు.

galla 30072108 3

విజయవాడ కేంద్రంగా కార్గో సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్న హామీ కూడా ఇప్పటివరకు అమలుకాలేదని గల్లా మండిపడ్డారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కార్గో సేవలు అందుబాటులోకి రాలేదని, కార్గో సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు ఉపయోగాలు ఉంటాయన్నారు. ఈ అంశాలను కేంద్ర విమానయానశాఖ వెంటనే పరిశీలించాలని జయదేవ్ డిమాండ్ చేశారు. అశోక్ గజపతి రాజు రాజీనామా చేసిన తరువాత, పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ లు రెడీ అవుతున్నాయి అనుకుంటున్న టైంలో, ఆయన రాజీనామా చెయ్యటంతో, తరువాత అధికారులు , ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా , కేంద్రం మాత్రం ఎదో ఒక సాకులు చెప్పి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ రాకుండా చేస్తుంది.

కాపు రిజర్వేషన్ల పై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అందరూ కలిసి వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా లబ్ది పొందాలని కొన్ని శక్తులు కుట్ర పన్నాయన్నారు. జగన్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుని, తప్పు ప్రచారం చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని మాత్రమే తమ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారని, కాపురిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ హామీ ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని, కాపు రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తునే ఉంటామన్నారు.

ambati 30072018 2

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు బాధాకరమని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు. కేంద్రంతో కలిసి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, జగన్ లాగ స్వచ్చంగా ఉండాలని అంబటి నీతి సూక్తులు చెప్పారు. కాపు ఉద్యమానికి అండగా ఉన్న పార్టీ వైఎస్సార్‌సీపీనే అని, ఈ అంశం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవరికీ లేదని అంబటి అన్నారు. ముద్రగడకు అండగా ఉన్న జగన్ ను, ఇప్పుడు ముద్రగడ ఇలా అనటం చాలా తప్పు అని, జగన్ ఎంతో కమిటెడ్ గా ఉన్నారని, అంబటి అన్నారు. జగన్ వ్యాఖ్యలు ఇలా వక్రీకరించి, ఇలా చెయ్యటం చాలా తప్పు అని అంబటి అన్నారు.

ambati 30072018 3

నిమ్మకాయల రాజప్ప విమర్శలు... కాపులకు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల రాజప్ప విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట సభలో జగన్ స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు, అలా అనలేదని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు విషయంలో న్యాయం చేస్తానని జగన్ తో చెప్పించాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. కాపులకు న్యాయం చేస్తామని చెప్పడానికి జగన్ కు ఉన్న ఇబ్బందేమిటీ? అని ప్రశ్నించారు. నాడు మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ కాపుల సర్వేకు రూ.40 లక్షలు కేటాయించలేకపోయారని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read