కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు నగర శివారులో రూ.20కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మంగళవారం పొలాన్ని సర్వే చేయించారు. దీని నిమిత్తం వీరికి వరసకు సోదరుడయ్యే ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సుధాకర్‌ అక్కడికి వచ్చారు.

kurnool 31072018 2

వీరంతా భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఓ చోటికి పోగుచేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, సుధాకర్‌ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న జంపాల కుటుంబసభ్యులు, బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలో కలకలం రేపింది.

kurnool 31072018 3

జంపాల కుటుంబీకులకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అందరితోనూ మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మృతులకు కుటుంబసభ్యులను పరామర్శించారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ బాంబులను దాచారా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

శాస్త్రీయ పరిశోధనలకు అత్యాధునిక టెక్నాలజీతో గ్లోబల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ‘ఐ-హబ్‌’ (ఇంటిలిజెంట్‌ హబ్‌)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఎంతో ఆధునికత సంతరించుకునే ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో రూ.245 కోట్ల పెట్టుబడితో చేపట్టి ఐదేళ్ళపాటు విస్తరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. యునెస్కో మహాత్మాగాంధీ శాంతి, సుస్థిర అభివృద్ధి విద్యాసంస్థతో కలిసి ఐ-హబ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవలె ఎంవోయూ కుదుర్చుకుంది. విద్యాసం స్థలు, పాఠశాలలకు అవసరమైన శాస్త్రీయ అవగాహన పెంచేందుకు ఐ-హబ్‌ కార్యక్రమాలు రూపొందించనుంది. ఈ సంస్థ గ్లోబల్‌ డిజైన్‌ యూనివర్సిటీ నిర్వహించేందుకు కూడా ఈ సంస్థకు అనుమతి పొందనుందని అధికార వర్గాలు తెలిపాయి.

ihub 31072018 2

ప్రపంచ విద్యకు 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఉన్నప్ప టికీ, కేవలం 2 శాతం మాత్రమే డిజిటలైజ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐ-హబ్‌ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమైందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రామీణ పాఠశాలల పిల్లలకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఏటా కనీసం 50వేల మందిని తీర్చిదిద్దనున్నారు. అలాగే పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే పిల్లలను తగ్గించేందుకు, అలాగే ఎడ్యుకేషన్‌ టెక్నాలజీని అందిం చేందుకు ఐ-హబ్‌ దోహద పడు తుందని భావిస్తున్నారు. ఐ-హబ్‌ ఏర్పాటుకు 30 లక్షల డాలర్లు వ్యయం కానుం డగా, నిర్వహణకు ఏటా 22 లక్షల డాలర్లు ఖర్చవుతుం దని అంచనా వేశారు.

ihub 31072018 3

కన్సల్టెన్సీ సర్వీసులు, పబ్లికేష న్స్‌, సెమినార్లు, పేటెంట్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టు పెట్టుబడులను తిరిగి సమ కూర్చుకునే అవకాశాలు ఉన్నా యని అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో 40 మంది అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధకులను నియమించనున్నారు. ఇందులో న్యూరో సైన్స్‌, విద్య, మానసికతత్వ శాస్త్రం, డిజిటల్‌ ఇన్‌స్ట్రక్చనల్‌ డిజైన్‌, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డేటా సైన్సెస్‌, గేమింగ్‌లు నిపుణులను నియమించనున్నట్లు తెలిపారు. ఐ-హబ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌గా కేంద్ర ప్రభుత్వం గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుందని అధికారులు తెలిపారు.

సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకుంటే, ఇక అమలు జరిగిపోయినట్టే అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. చివరకు అలాగే జరిగింది. అయితే, ఇదే సందర్భంలో, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, ఆగష్టు 31, 2013న చంద్రబాబు పెట్టిన ఈ ప్రెస్ మీట్ వివారాలు, 5 సంవత్సరాల తరువాత ఇదే రోజు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, చంద్రబాబుని అందరూ విజనరీ అని ఎందుకు పిలుస్తారో అర్ధమవుతుంది. ఈ ప్రెస్ మీట్ సారంశం "తెలంగాణా ఇచ్చేసారు, మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజాధాని లేదు. హైదరాబాద్ కు దీటైన రాజధాని ఆంధ్రాలో నిర్మించుకోవాలి. దానికి 5 లక్షల కోట్లు అవుతుంది" అని...

cbnpress 31072018 2

అప్పట్లో ఈ స్టేట్మెంట్ పై అందరూ ఎగతాళి చేసారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు, వైసిపీ నాయకులు, తెరాస నాయకులు ఏంటో హేళనగా మాట్లాడారు. 5 లక్షల కోట్లు కావలి అంట అంటూ ఎగతాళి చేశారు. కాని ఇప్పుడు పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి. ఆంధ్రల కలల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం. సింగపూర్ సహకారం. లండన్ నుంచి డిజైన్ లు. హేమా హేమీ సంస్థలు రాక. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, కేంద్రం మాత్రం మనకు ఇచ్చింది, కేవలం 1500 కోట్లు. చంద్రబాబు హైదరాబాద్ కు దీటైన రాజధాని కావలి అంటే, ప్రధాని మోడీ వచ్చి, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తా అని మాట ఇచ్చి, చివరకు ఏమి చేసారో చూసాం. 5 కోట్ల ఆంధ్రులు, ఆ నిధులు కోసం పోరాడాల్సిన పరిస్థితి.

cbnpress 31072018 3

5 సంవత్సరాల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు " ఆంధ్రప్రదేశ్ లో మరో రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కు దీటైన రాజధాని కావలి అంటే, రాబోయే పది సంవత్సరాల్లో కనీసం 4-5లక్షల కోట్లు కేంద్రం సాయం చెయ్యాలి. ఎవరినీ అన్యాయం చెయ్యను అంటున్న కేంద్రం, అది మాటల్లో చెప్పి చూపించాలి. కొత్తగా ఏర్పడే రాష్ట్రము నిలదొక్కుకోవాలి అంటే ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలి అంటే మంచి రాజధాని ఉంటేనే సాధ్యం. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు, పెద్ద విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కేంద్ర సంస్థలు, పరిశ్రమలు రావాలి. నేను ఈ సమయంలో రాజకీయల్లోకి పోను, రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చెయ్యండి. భరోసా ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఎవరు బాధ్యులు ? అందుకే అన్నీ బిల్ లో పెట్టండి. నదీ జలాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అన్నీ సీమంధ్ర ప్రజలకు ఉండేలా చూడండి" అంటూ చంద్రబాబు ఆ రోజు అన్నారు.

cbnpress 31072018 4

ఈ సమస్యలే ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నాయి. అప్పట్లో హైటెక్ సిటీ కడుతుంటే, కంప్యూటర్ లు కూడు పెడతయ్యా అన్నారు, జరిగింది ఏంటో చరిత్ర. విభజన సమయంలో, ఆంధ్ర రాష్ట్ర రాజధానికి 5 లక్షల కోట్లు కావలి అంటే హేళన చేసారు, ఇప్పుడు జరుగుతుంది చుస్తే ఆయన మాటలు అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అమరావతి కడుతుంటే, బ్రమరావతి అని హేళన చేస్తున్నారు. ఇలాంటి వారికి చంద్రబాబు విలువ తెలియదు. చంద్రబాబు రెండు తరాల ముందు అలోచించి, ఇప్పటి నుంచే దానికి ప్రణాలికలు వేస్తారు. అప్పుడే అందరూ, చంద్రబాబు చెప్పిన 5 లక్షల కోట్ల ప్యాకేజీ కోసం, చట్టం తెచ్చుకుని ఉంటే, ఇప్పుడు ఈ బాధలు కొంత అయినా తీరేవి. చంద్రబాబు ఏదైనా ఆలోచన చెప్తే నవ్వుతాం, కాని కొన్ని రోజుల తరువాత అదే నిజం అయిన రోజు, మన అలోచేనే నవ్వులపాలు అవుతుంది. ఇప్పటికైనా,అందరం కలిసి పోరాడితే, కేంద్రం నుంచి ఏదన్నా సాధించుకునేది ఉంటుంది. చంద్రబాబుకు ప్రజల అండ ఉంటే చాలు, ఆయనే అన్నీ చూసుకుంటారు.

భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మురళీధరన్‌ దిల్లీ: ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జిగా వి.మురళీధరన్‌ నియమితులయ్యారు. కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో కీలకంగా పనిచేసిన మురళీధరన్.. ఆ తర్వాత భాజపాలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. కేరళ భాజపా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అక్కడ పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించారు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిద్దార్థనాథ్ సింగ్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది ఆయన మంత్రి పదవి చేపట్టడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.

amit 31072018 2

కాగా, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మురళీధరన్‌కు ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా సులీల్‌దేవ్‌ధర్‌ను నియమించారు. మహారాష్ట్రకు చెందిన ఆయన గతంలో త్రిపుర భాజపా ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఇటీవలి త్రిపుర ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో సునీల్‌ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు నేతలూ పార్టీకి దిశానిర్దేశం చేస్తారని అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది.

amit 31072018 3

ఒకటి రెండు మార్పులు, చేర్పులతో మరో రెండు రోజుల్లో కార్యవర్గాన్ని, వివిధ విభాగాల బాధ్యులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శిగా వై.సత్యకుమార్‌ నియమి తులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడి ఆమోదం మేరకు ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద చాలా కాలం పాటు ఓఎస్డీగా పనిచేశారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆయనతో కలిసి పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీలతోనూ సత్యకుమార్‌కు అనుబంధం ఉంది.

Advertisements

Latest Articles

Most Read