జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సభలో ప్రసంగించారు. జగన్ లా నాకు ఎమ్మల్యేలు ఉంటే అసెంబ్లీని ఒక ఊపు ఊపేవాడిని అని అన్నారు (మరి 18 మంది ఎమ్మల్యేలను ఇస్తే ప్రజా రాజ్యం పార్టీ ఏమి చేసారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు). సీఎంను ఎదుర్కొనే దమ్ములేక, శక్తిలేక జగన్ పారిపోతున్నారు అని పవన్ అన్నారు (మొన్నటిదాకా చంద్రబాబుకు జగన్ అంటే భయం అన్నారు పవన్, ఈ రోజు జగన్ కి చంద్రబాబు అంటే భయం అంట). అంతే కాదు తన పై చేసిన వ్యక్తిగత విమర్శలకు కూడా సామాధానం చెప్పారు. నేను లెగిస్తే మనిషిని కాదు, గుండెల్లో అగ్ని గోళాలు పెట్టుకుని తిరుగుతున్నాను. నన్ను రెచ్చగొట్టకండి అంటూ జగన్ తో పాటు లోకేష్ ని కూడా కలిపి వార్నింగ్ ఇచ్చారు (మధ్యలో లోకేష్ ని ఎందుకు అన్నారా అని ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు).

pawan 288072018 2

‘నా జీవితం తెరిచిన పుస్తకం. అరమరికలు లేవు. రహస్యాలు లేవు. అన్ని కోణాల నుంచి పరిశీలిస్తే నేనే ఉత్తముడి’నని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. నేను ఏదైనా ఓపెన్ గా చేస్తానని, అది తప్పో ఒప్పో చేసేస్తానని అన్నారు. కాని చాలా మందికి చీకటి కోణాలు ఉన్నాయని, నాకు అలాంటివి లేవని, పవన్ అన్నారు. ఇప్పుడున్న వారి అందరికంటే నేనే ఉత్తముడిని అని పవన్ అన్నారు. నాకంటే ఉత్తముడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో లేరని పవన్ అన్నారు. జనసేన ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి చేరుతుందని పవన్ అన్నారు.

pawan 288072018 3

‘‘అనుభవం కోసమే 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా ఆగాను. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి... తగిన అనుభవం సాధించాను. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం’’ అని ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇలా ఏ రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా తనపై ఇదే అభిమానం చూపిస్తున్నారని అన్నారు. బాంబులు, వేటకొడవళ్లు భయపెట్టలేవు. గుండె నిండా విప్లవం నింపిన ధైర్యం మాకుంది. జనసైనికుల అండ ఉంది, జనసేన విజయానికి నాంది ఇక్కడ నుంచే పడింది అంటూ, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు, లోకేష్ తో పాటు, రాష్ట్రంలో మిగతా నాయకుల కంటే, నేనే అత్యంత ఉత్తముడిని అని పవన్ స్వయం ప్రకటన చేసుకుని, ఇదే అందరికీ చెప్పమని జన సైనికులకి చెప్పారు.

విభజన చట్టం అమలుపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం, జలవనరులు, ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు కుటుంబరావు, అధికారులు ఆదిత్యనాథ్‌దాస్‌, రవిచంద్ర, ప్రవీణ్‌ప్రకాష్‌, ప్రేమ్‌చంద్రారెడ్డి హాజరైనారు. . రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విడిగా ప్రకటన రూపంలో ఇచ్చిన హామీలు.. వాటి అమలు తీరు, టీడీపీ లోక్‌సభలో అవిశ్వాసం నోటీసు ఇవ్వడానికి కారణాలు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రజెంటేషన్‌ వివరించారు.

rammohan 28072018 2

కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం విభజన వ్యవహారాలు చూస్తున్న అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి, ఢిల్లీలోని రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, మౌలిక వసతుల కార్యదర్శి అజయ్‌ జైన్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేసినా.. హామీ ఇచ్చినా దానికి చాలా విలువ ఉంటుంది. వాటిని అమలు చేయకపోవడం ఏమిటి’ అని చిదంబరం విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర శాఖల అధికారులూ హాజరయ్యారు. వారి వాదనను కూడా కమిటీ నమోదు చేసుకుంది.

rammohan 28072018 3

అయితే ఒక సందర్భంలో, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, చిదంబరం పై ఫైర్ అయ్యారు. ‘అసెంబ్లీ సీట్ల పెంపును రాజ్యాంగం నిబంధనలు అంగీకరించవు. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన కుదరదు’ అని చిదంబరం పేర్కొన్నారు. దీని పై సంఘం సభ్యుడు, టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. రాజ్యాంగం అంగీకరించనప్పుడు చట్టంలో ఎందుకు పెట్టారని గట్టిగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వకుండా చిదంబరం మౌనం దాల్చినట్లు సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను ఇప్పుడున్న 175 నుంచి 225కి పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారని.. కానీ కేంద్రం ఇంతవరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు వివరిస్తున్న సమయంలో చిదంబరం జోక్యం చేసుకుంటూ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మొదటిసారి, తన పుట్టిన రోజు నాడు, ముఖ్యామంటి హోదాలో, ధర్మ పోరాట దీక్ష చేసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్ చేసిన డైవర్షన్ గుర్తుందా ? సరిగ్గా చంద్రబాబు ఉదయం 7 గంటలకు దీక్ష మొదలు పెడతారు అనగా, పవన్ అర్ధరాత్రి నుంచి మ్యూజిక్ మొదలు పెట్టాడు. శ్రీరెడ్డి అనే ఆమె, తన అమ్మని ఎదో అందని, నాలుగు రోజుల తరువాత వచ్చి, దానికి కారణం చంద్రబాబు అని మొదలు పెట్టాడు. అప్పట్లో చంద్రబాబు మొదటి సారి చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అటెన్షన్ చెడగొట్టి, మోడీ పై చంద్రబాబు చేసే విమర్శలు ఎక్కువగా మీడియాలో రాకుండా చెయ్యటానికి, అమిత్ షా వదిలిన బాణం. కాని, ఆ రోజు, పవన్ వ్యాఖ్యలు ఎవరూ ఎక్కువ గుర్తింపు ఇవ్వలేదు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు దీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

pk 27072018 2

అయితే, ఇప్పుడు కూడా ఇదే డైవర్షన్ ఐడియా ప్లాన్ చేసారు. అవిశ్వాస తీర్మానం పై చర్చను గత నాలుగు రోజులుగా ఎలా డైవర్ట్ చేసారో చూసాం. తెలుగుదేశం ఎంపీలు మోడీని ఉతికిన ఉతుకుడు, ఎవరూ ఉతకలేదని, దేశం మొత్తం అభినందించాయి. అనేక పార్టీలు మనకు జరిగిన అన్యాయం పై మోడీని నిలదీశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో పవన్ డ్రామాలు మొదలు పెట్టాడు, అమరావతి రైతుల పేరుతో రెండో రోజుల డ్రామాలు, జగన్-పవన్ తిట్ల డ్రామాలతో, మొత్తం చర్చ డైవర్ట్ అయ్యింది. మోడీని ఒక్క మాట కూడా అనని పవన్, ఇప్పుడు మోడీని తెలుగుదేశం వారు అంటున్నా, వ్యతిరేకత రాకుండా, రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో డైవర్షన్ ప్లాన్ చేసారు.

pk 27072018 3

రేపు ఒంగోలులో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. అవిశ్వాసంలో మోడీని నిలదియ్యటం, వివిధ పార్టీల మద్దతుతో, చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో, మోడీ పై దాడి చెయ్యనున్నారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ కు ఆదేశాలు వెళ్ళాయి. భీమవరంలో ఉన్న పవన్, ఉన్నట్టు ఉండి రేపు అమరావతిలో రైతుల కోసమంటూ, ఒక రోజు దీక్షకు ప్లాన్ చేసారు. రేపు చంద్రబాబు సభ డైవర్ట్ చెయ్యటానికి రెడీ అయ్యారు. గత నాలుగు నెలల నుంచి, పవన్ కళ్యాణ్ తీరు ఇలాగే ఉంది. ఎప్పుడైతే మోడీ పై తెలుగుదేశం దాడి చేస్తుందో, అప్పుడే ట్విట్టర్ లోకి రావటం కాని, దీక్షలు చెయ్యటం కాని చేసి, డైవర్ట్ చేస్తున్నారు. అంతా అమిత్ షా దయ...

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, పవన్ రాజకీయం పై స్పందించారు. ఈ స్పందించిన తీరు అయితే జబర్దస్ట్ కామెడీని మించి ఉంది. జబర్దస్ట్ కామెడీలో రోజా ఎలా నవ్వుతుందో, అలా నవుతున్నారు ప్రజలు. నిజానికి, జనసేన అధినేత పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఒక పార్టీ అధినేతగా జగన్ స్థాయికి తగిన వ్యాఖ్యలు కావని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నోరు జారకూడదని, తొందరపాటులో ఎలా పడితే అలా మాట్లాడకూడదని తెలిపారు. పవన్ వివాహానికి సంబంధించి సరైన అవగాహన లేకుండా జగన్ మాట్లాడారని వ్యాఖ్యానించారు.

nagababu 27072018 2

పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని.. నమ్మించి మోసం చేయలేదన్నారు. ఇద్దరి భార్యల నుంచి విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది భార్యాభర్తల మధ్య జరిగిన విషయమని.. పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని.. దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. పవన్ మొదటి భార్య గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని నాగబాబు చెప్పుకొచ్చారు. చట్టబద్ధంగా విడిపోయి.. న్యాయంగా బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెళ్లిళ్లు చేసుకుని అక్రమ సంబంధాలు నడిపితే తప్పు లేదా అని వ్యాఖ్యానించారు.

nagababu 27072018 3

పవన్‌ను విమర్శించడం వెనుక పొలిటికల్ అజెండా ఉందన్నారు. పవన్‌ను రాజకీయంగా విమర్శించడానికి అవకాశం లేకపోవడంతో వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నారని నాగబాబు చెప్పారు. వైవాహిక జీవితంలో కూడా పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. జగన్ అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లే అలా మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎవరికీ ఇబ్బంది లేదు కాని, ఇక్కడే నాగబాబు చెప్పిన విషయం విని, అందరూ నవ్వారు. కల్యాణ్‌ను టీడీపీ, వైసీపీ తక్కువ అంచనా వేశాయని అభిప్రాయపడ్డారు. ఏపీలో పవన్ బలమైన రాజకీయ శక్తిగా మారుతున్నాడన్నారు. చంద్రబాబు దిగటం ఖాయం అంటూ నాగబాబు స్పందించారు. ఇది కామెడీనో కాదో, ఇక మీరే డిసైడ్ చెయ్యాలి.

Advertisements

Latest Articles

Most Read