తమిళనాడు రాష్ట్రంలో, ఏమన్నా సమస్య వస్తే, అందరూ కలిసి ఎలా పోరాడుతారో చూస్తూ ఉంటాం. మన రాష్ట్రంలో మాత్రం, మోడీతో డీ కొడుతుంటే, ఆ డీ కొట్టే వాడిని బలహీన పరుస్తూ ఉంటారు. ఎందుకంటే, వీళ్ళు ఉండేది తెలంగాణాలో కాబట్టి, వీరికి ఏపిలో పార్ట్ టైం రాజకీయాలు కావలి కాబట్టి. జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఫార్మ్ హౌస్ ల్లో ఉండే వీళ్ళకి, ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరికి కావలసింది రాజకీయం, డబ్బు. దీని కోసం, ఢిల్లీ ముందు బానిసత్వం చేస్తారు. నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఎలా మోడీ పై విరుచుకుపడ్డారో చూసాం. ఇలా, కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ మోడీని టచ్ చేసే సాహసం చెయ్యలేదు. అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్న గల్లా జయదేవ్, ఏ మాత్రం భయం లేకుండా, రాష్ట్రమే ముఖ్యమని, 5 కోట్ల మంది గొంతు నిర్భయంగా మోడీ ముందు వినిపించి, మోడీని దోషిగా నిలబెట్టగలిగారు.

pk 21072018 2

ఈ పరిణామంతో, మా బాసునే ఇలా మాట్లాడతారా అంటూ హర్ట్ అయిన, పవన్, జగన్, పురంధేశ్వరి, ఇతర బీజేపీ నాయకులు, ఈ రోజు ఉదయం నుంచి చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు. మా అమిత్ షా, మోడీని అంటే, మేము ఎందుకు ఊరుకుంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంగతి, ప్రజలు చేసే పోరాటం సంగతి మాకెందుకు, మా టార్గెట్ చంద్రబాబు అంటూ, చంద్రబాబు పై ఉదయం నుంచి ఒకరి తరువాత ఒకరు విరచుకుపడుతున్నారు. అదే సమయంలో, మోడీని , అమిత్ షా ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యలేక పోతున్నారు. జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు వైఖరికి నిరసనగా, ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కుపిలుపునిచ్చారు. చంద్రబాబు వేస్ట్ అంటూ, ఒక గంట సేపు ప్రెస్ మీట్ లో, 100 సార్లు చంద్రబాబు భజన చేసారు.

pk 21072018 3

ఇక పవన్ కళ్యాణ్ అయితే, అందరికంటే పాపం ఈయనే ఎక్కువ కష్టపడుతున్నారు. నిన్నంతా జగన్ కోర్ట్ లో ఉండటంతో, జగన్ డ్యూటీ కూడా పవనే తీసుకుని, నిన్నటి నుంచే చంద్రబాబు పై ట్వీట్లు పెట్టారు. గల్లా జయదేవ్ స్పీచ్ చాలా వీక్ గా ఉంది, ఇదేమీ స్పీచ్ అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్ తీసుకున్నారని, నేను ఒక్కడినే ముందు నుంచి మోడీతో పోరాడుతున్నా అని, నిన్న తెలుగుదేశం వృధా ప్రసంగాలు చేసింది అన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, పురందేశ్వరి స్పందించారు. నిన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా బీజేపీ పై టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేని అన్నారు. మోడీ అన్నీ నిజాలే చెప్పారని అన్నారు. ఈ విధంగా, నిన్నటి నుంచి, ఈ ముగ్గురు కలిసి, నానా తిప్పలు పడి, చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ, మోడీ అనే మాట పలకటానికి కూడా వణికిపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ నిన్న అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్పిన అబద్ధాలని, ప్రతి విషయం ఆధారాలతో సహా నేషనల్ మీడియాకు చెప్తూ, మోడీని చాకిరేవు పెడుతున్నారు... ఇప్పటి వరకు, దేశంలో ఎవరూ చేయిని విధంగా, రెండో సా,రి ఇలా మోడీని దేశ రాజధానిలోనే తూర్పారబడుతున్నారు... ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు, అమరావతి వచ్చి ఢిల్లీకి మించిన రాజధాని కడతాను అనటం, ఇచ్చిన డబ్బులు వెనక్కు తీసుకోవటం ఇలా అన్ని విషయాలు సెహ్ప్పారు...

cbnpress 21072018

అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పారని అన్నారు... ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పి, ఆ తరువాత హోదాకు బదులు, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించామని చంద్రబాబు అన్నారు.. అయితే, అది కూడా మూడేళ్ళు అయినా పైసా ఇవ్వలేదు అని చెప్పారు... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోందని విమర్శించారు... అలాగే హోదా లేదు అంటూనే, మిగతా రాష్ట్రాలకు ఇచ్చారని చెప్పారు.. అందుకే, ఇవన్నీ మాకు వద్దు, మా హోదా మాకు ఇవ్వండి అని అడుగుతున్నామని చెప్పారు...కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు..

cbnpress 21072018

అలాగే, బిల్ లో పెట్టిన 19 అంశాలు ఒక్కొక్కటి వివరించారు... పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధాని చేసిన ఆరు హామీలు కూడా వివరించారు... అవి ఏంటి, కేంద్రం ఇప్పటి వరకు ఏమి ఇచ్చింది, ప్రస్తుత స్థితి ఏంటి అనేది వివరించారు.. అలాగే నిన్న ప్రధాని చేసిన చౌకబారు ప్రసంగం పై కూడా చంద్రబాబు స్పందించారు. "నన్ను , వైఎస్ జగన్ తో పోలుస్తూ, కెసిఆర్ నాకంటే ఉత్తముడు అంటూ, ప్రధాని అంటున్నారు. వైఎస్ జగన్ ఒక దొంగ. నిన్న కూడా కోర్ట్ లో ఉన్నాడు. ఇలాంటి దొంగని, నాతో పోలుస్తూ, పార్లమెంట్ లో చెప్తారు. మేము అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి. ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, ఇంత చిల్లరగా మాట్లాడటం చూడలేదు. 5 కోట్లు మంది అడుగుతుంటే, ఇలాంటి సమాధానమా చెప్పేది" అంటూ మోడీ పై విరుచుకుపడ్డారు.

 

నిన్నటి అవిశ్వాసం పై పోరాటం కొనసాగింపుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కూడా ఒత్తిడి కొనసాగించనున్నారు. ఢిల్లీ వెళ్లి మళ్ళీ హీట్ కొనసాగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెప్పనున్నారు. లోక్‌సభలో అవిశ్వాసం, ప్రధాని చెప్పిన అబద్ధాలు, తదనంతర పరిణామాల పై సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడతారు. మరో పక్క, నిన్న రాత్రి 11:20 వరకు పార్లమెంట్ లో చర్చ జరిగింది. 11:30 కల్లా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు గంట సమయం మాట్లడారు. జగన్ ఉదయం మాట్లడతాను అని చెప్పి, పవన్ ట్వీట్ లు వేస్తుంటే, చంద్రబాబు మాత్రం అర్ధరాత్రి అయినా ప్రధాని చెప్పిన అబద్ధాలను ఖండించారు.

cbn delhi 21072018 2

‘‘విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే... చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చెప్పాల్సిందిపోయి, ప్రధాని మాట్లాడిన తీరు చాలా బాధ కలిగించింది. నేనేదో యూటర్న్‌ తీసుకున్నానన్నట్టుగా మాట్లాడుతూ, రాజకీయ ఎదురుదాడికి దిగారు. ప్రధానిని గద్దె దించడానికి సంఖ్యా బలం లేకపోయినా, అహంకారంతో అవిశ్వాసం పెట్టామన్నట్టు మాట్లాడారు. ప్రధానే పెద్ద అహంకారి. అధికారం ఉంది, తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారం ఆయనది’’ అని మండిపడ్డారు. తనకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య గొడవులున్నాయన్నట్టుగా ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు.

cbn delhi 21072018 3

‘‘కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని చెబుతున్న మీరు ఎక్కడ న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? ఐదు కోట్ల ఆంధ్రులంటే అంటే అంత చులకనా? 25 మందే ఎంపీలున్నారు, మీరు ఓటేయకపోతే నాకేంటన్న ధీమానా? అహంభావమా? పైగా మేం తెలంగాణ ఆస్తులపై గురిపెట్టామన్నట్టు మాట్లాడతారా? 60 సంవత్సరాలు కష్టపడి, కట్టుబట్టలతో నెత్తిన అప్పుపెట్టుకుని వచ్చినప్పుడు కోపం, బాధ ఉంటాయి కదా? 60 సంవత్సరాల కష్టార్జితం వదులుకుని వచ్చినప్పుడు, పెద్ద తరహాలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఆ రోజు మీరు కూడా సహకరించబట్టే రాష్ట్ర విభజన జరిగింది. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ దేశంలో మేం భాగం కాదా? మేం సుహృద్భావ వాతావరణంలో సమస్యల సాధన కోసం ప్రయత్నిస్తుంటే... కేంద్రం లెక్కలేని ధోరణిలో, మనల్ని అణచివేయాలని చూస్తోంది’’ అని సీఎం మండిపడ్డారు.

బీజేపీకి సంపూర్ణ బలం ఉందని అందరికీ తెలుసు. అవిశ్వాసం పెట్టినా బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదని అందరికీ తెలుసు. అయినా అవిశ్వాసం మన పెట్టాం అంటే దానికి కారణం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన బాధ ఈ దేశానికి చెప్పటానికి. ఇంత వరకు ఎప్పుడూ కూడా, మన సమస్య పై, నిన్న గల్లా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినంత సేపు ఎవరూ మాట్లాడలేదు. మన సమస్య పై అంత సేపు చెప్పుకునే అవకాశం వచ్చింది. విభజన ఎలా జరిగింది, మనకు ఇచ్చిన హామీలు ఏంటి, చట్టంలో ఏమి ఉన్నాయి, నరేంద్ర మోడీ ఈ నాలుగు ఏళ్ళలో మనకి ఏమి చేసారు, ప్రజలు ఎందుకు మోడీ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇలా అన్ని విషయాలు మనం పార్లమెంట్ వేదికగా, ఈ దేశానికి చెప్పం.

tweet 21072018 2

సహజంగా ఆంధ్రా ఎంపీలు ఎవరన్నా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే, ఎవరూ పట్టించుకోరు. నిన్న అవిశ్వాసం పై చర్చ ఉండటం, మన ఆంధ్రా ఎంపీలు ముందు మాట్లాడటంతో దేశం మొత్తం, టీవీల ముందు కూర్చుంది. ఈ సందర్భంలో గల్లా జయదేవ్, ఎంతో స్పష్టంగా జరిగన మొత్తాన్ని ఈ దేశానికి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసాయో చెప్పారు. దాదాపు గంటకు పైగా, ఏ విధమైన రాజకీయ ఆరోపణలు చెయ్యకుండా, మోడీ చేసిన మోసాన్ని వివరించారు. ఇదే సందర్భంలో దేశం మొత్తం మన బాధ విన్నది. అసలు మన సమస్య ఏంటో తెలియని వారికి కూడా, మన ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బంది తెలిసింది. దేశ వ్యాప్తంగా చాలా మంది మన పట్ల సానుభూతి చూపించారు.

tweet 21072018 3

ఇదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం వింటుంటే బాధగా ఉంది, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్లము కాకపోయినా, మీ బాధ తెలుసుకున్న తరువాత, మీకు మద్దతు ఇస్తున్నాం అని చాలా మంది పోస్ట్ లు పెట్టారు. కొంత మంది గల్లా బాగా మాట్లడారు అని పెట్టారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మన పట్ల సరిగ్గా స్పందించకపోయినా, దేశం మొత్తం మన వాణి మాత్రం వినిపించ కలిగాం అనేది మాత్రం నిజం. ఇది ఒక్కటే మనకు ఊరట. మన మనసులో ఉన్న బాధ అంతా, ఈ దేశం ముందు పెట్టాం. వివధ పార్టీలు కూడా, నిన్న పార్లిమెంట్ లో మాట్లాడుతూ మనకు మద్దతు పలికారు. మొత్తానికి, అవిశ్వాసంతో దేశం మొత్తం మన బాధ విన్నారు. కాని, మన రాష్ట్రంలో ఉన్న పవన్, జగన్ మాత్రం, బీజేపీ ని ఒక్క మాట కూడా అనకుండా, మోడీతో పోరాడున్న వారి పై, దాడి చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read