మనసులో ఎంతో బాధ ఉన్న వ్యక్తి, ఆ బాధ అంతా వేరే వారికి చెప్పుకుంటే ఎలా ఉంటుంది ? వారు మన సమస్య తీర్చకపోయినా, మన మనసులో ఉన్న బాధ కొంత అయినా తగ్గుతుంది. నాలుగేళ్ల నుంచి మనం పడుతున్న బాధ, ఈ రోజు అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 5 కోట్ల ఆంధ్రుల తరుపున, ఈ దేశానికి చెప్పారు గల్లా జయదేవ్. మన ఆక్రోశం, మన వేదన, మన రోదన, మన బాధ, నాలుగేళ్ళ నుండి పంటి బిగువునా అదిమి పెట్టుకున్న దుఃఖం, అన్నీ ఈ రోజు పార్లమెంట్ లో, ఈ దేశం ముందు ఉంచారు గల్లా. ఇక న్యాయం చెయ్యాల్సిన వారు ఏమి చేస్తారో చూడాలి.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, మరోసారి, మరింత గట్టిగా 5 కోట్ల ఆంధ్రుల ఆక్రోశం దేశానికి వినిపించిన గల్లా... టీడీపీ నాలుగు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని గల్లా జయదేవ్ చెప్పారు.

galla 20072018 2

కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోవడం మొదటి కారణమని, నమ్మకం లేకపోవడం రెండో కారణమని తెలిపారు. ఏపీకి ప్రాధాన్యం దక్కకపోవడం మూడో కారణమని, ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్ష నాలుగో కారణమని గల్లా జయదేవ్ వివరించారు. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని గల్లా చెప్పుకొచ్చారు. అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదని.. మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలపై నిలబడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తలుపులుమూసి మరీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘటనను ఆయన సభలో మరోసారి ప్రస్తావించారు. ఏపీ ప్రజల ధర్మ పోరాటాన్ని పెద్దలు గ్రహించాలన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ఎంపీలు మధ్యలో జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.

galla 20072018 3

రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ ఆరు హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమకు లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. అంతే కాదు, మోదీ ముందే మోదీ అంటే మోసం..మోసం అంటేనే మోదీ అని -సభలో తెలుగుదేశం ఎంపీల నినాదాలు చేసారు. ఆంధ్రోడి ఆక్రోశం, ఈ దేశానికి వినిపించారు జయదేవ్..

కేంద్రంలో 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. సంపూర్ణ బలముందన్న ధీమాలో ఎన్డీయే, ఏమైనా జరగొచ్చంటూ విపక్షాలు చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు అని, అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. చర్చను ఎంపీలందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని.. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నామని, దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోందని మోదీ ట్వీట్ చేశారు.

moditweet 20072018 2

అయితే ప్రధాని ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. ఇన్ని కబురులు చెప్పే ప్రధాని గారు, విపక్షాలకు మాట్లాడటానికి ఎంత టైం ఇచ్చారు ? అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి 13 నిమషాలు ఇచ్చి, దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 38 నిమషాలు ఇచ్చి, బీజేపీ మాత్రం 3 గంటలు 33 నిమషాలు తీసుకుని, ప్రతిపక్షాలు గొంతు నొక్కేలా చేసి, ప్రధాని ఇంత అద్భుతంగా ట్వీట్ చెయ్యటం పై విమర్శలు వస్తున్నాయి.

moditweet 20072018 3

విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలులో కేంద్రం విఫలమైనందున ప్రభుత్వ వైఖరిని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో తెలుగు దేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటింగ్‌ జరుగుతుంది. మిత్రపక్షాలతో కలిసి కేంద్రానికి 316 మంది మద్దతు ఉంది. ప్రతిపక్ష పార్టీలకు 146కు మంచి బలంలేదు. దీంతో ఓడిపోతామనే భయం ప్రభుత్వానికి లేదు. గెలుస్తామని ప్రతిపక్షాలూ అనుకోవడం లేదు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీలైంతగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాగా చర్చలో తమకు లభించిన సమయంలో ప్రతిపక్షాలను ఎండగట్టాలని కేంద్రం అనుకుంటోంది.

నరేంద్రమోడీ ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. ఉదయం 11గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానానికి తొలుత నోటీసు ఇచ్చిన టీడీపీకి మొదటగా చర్చను ప్రారం భించే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ చర్చ ఉదయం 11 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం ఏడుగంటల సమయం కేటాయించారు. అయితే ఎంపీలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున సమయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చర్చకు సమాధానమిస్తారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ నేపథ్యం లో తమ ఎంపీలకు ఆయా రాజకీయ పార్టీలు విప్‌ జారీ చేశాయి. పార్టీ ఎంపీలంతా విధిగా లోక్‌సభకు హాజరుకావాలని పేర్కొన్నాయి.

modi 20072018 2

ఎన్‌డీఏ భాగస్వా మ్య పార్టీ శివసేన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని విప్‌ జారీ చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయాలని విప్‌ జారీచేసింది. టిఆర్‌ఎస్‌ పార్టీ తమ వైఖరిని సభలోనే వెల్లడిస్తామని పేర్కొంది. అన్నాడిఎంకె అవిశ్వాసానికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని తమిళనాడు సీఎం పళనిస్వా మి స్పష్టం చేశారు. బిజూ జనతాదళ్‌ ఇంకా తన వైఖరిని వెల్లడించలేదు. సీపీఎం, ఎన్‌సీపీ, సమాజ్‌వా దీ, ఆర్జెడి, ఆర్‌ఎస్‌ఫి , డీఎంకే, ఎంఐఎం తదితర యూపీఏ పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలబడ నున్నాయి. ఎంపీలందరూ సభకు హాజరయ్యేలా చూసేందుకు బీజేపీ ఎంపీలందరికీ పార్లమెం టులోనే ప్రత్యేకంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది.

modi 20072018 3

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. ఆ పార్టీకి మాట్లాడేందుకు మూడున్నర గంటల సమయం దక్కడంతో ప్రతిపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ నుంచి సుమారు 14 నుంచి 16 మం ది సభ్యులు మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. అందరూ కాంగ్రెస్ పైనే దాడి ఎక్కుపెడతారు. ఈ మేరకు ఆయా ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని చేరవేసింది. ఏపికి సంబంధించి, విభజన చట్టంలో తాము 85 శా తం అంశాలను అమలు చేశామని అదే విషయాన్ని సభలో చెప్తాం అంటున్నారు. ఇక్కడ జీవీఎల్ లాంటి నేతలు ఎలా మాట్లాడుతున్నారో, పార్లమెంట్ లో కూడా అదే చెప్తారు. అంటే, మన ఏపి విషయం పై గట్టిగా ఒక పది నిమషాలు మాట్లడతారు. అన్నీ ఇచ్చేసాం అంటారు. పెండింగ్ లో ఉన్నవి త్వరలో ఇస్తున్నాం అంటారు. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అంటారు. మోడీ, ఏపి విషయంలో ఇంతకు మించి ఏమి చెప్పలేరు. ఒక ఎమోషనల్ డ్రామా నడుపుతారు. మిగతా అంతా కాంగ్రెస్ పై దాడి చెయ్యటమే. బీజేపీకి ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో వాళ్లకి దిక్కు లేదు కాబట్టి, ఇంతకు మించి మన రాష్ట్రం గురించి ఏమి చెప్పరు.

లోక్‌సభలో సమరానికి అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. మాటల కత్తులు దూసుకోవడానికి వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి. తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం శుక్రవారం తొలి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం అధికార, విపక్ష శిబిరాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో, మద్దతు కూడగట్టుకోవడంలో తలమునకలయ్యాయి. విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్‌ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం 6కు ముగుస్తుంది.

shivsena 20072018 2

ప్రతిపక్షాలపై సంఖ్యాపరంగా ఆధిక్యతను నిరూపించేందుకు బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలంతా సభకు రావాలని అధిష్ఠానం విప్‌ జారీ చేసింది. మధ్యాహ్న భోజనాలు, విందుల ద్వారా నేతలు సంఘటితమై చర్చకు సిద్ధం కావాలని చెప్పింది. సభకు రానివారి పై చర్య తీసుకుంటామని హెచ్చరించింది. అన్నాడీఎంకే, బీజేడీలు మౌనంగా ఉండటంతో ఆ రెండు పార్టీల వ్యూహమేమిటనేది ఆసక్తికరంగా మారింది. అవి కూడా తమకే మద్దతిస్తాయని, తమ బలం 350కి చేరుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌తో కూడా మాట్లాడామని అంటున్నారు. అన్నాడీఎంకే తన సభ్యులకు విప్‌ జారీ చేయకపోవడం గమనార్హం. విప్ ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు.

shivsena 20072018 3

అన్నాడీఎంకే, బీజేడీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ రెండు పార్టీల నేతలు అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు పలువురు మిత్రపక్షాల నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. మొదట ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడిన శివసేన అర్ధరాత్రి ప్లేటు ఫిరాయించింది. మద్దతు విప్‌ను ఉపసంహరించుకుంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగానే వైఖరి చెబుతామని ప్రకటించింది. సెంట్రల్‌ హాలులో అరుదుగా కనిపించే అమిత్‌షా శుక్రవారం సెంట్రల్‌ హాలుకు కూడా వచ్చి ఎంపీలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలది అవకాశవాదమని, యూపీఏ హయాంలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని చెప్పేందుకు బీజేపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏలో లుకలుకలు లేవనే విషయాన్ని, ఎన్డీఏను సమర్థించే వారి సంఖ్య పెరుగుతోందని నిరూపించుకోవడానికి ఈ అవిశ్వాసం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.

 

Advertisements

Latest Articles

Most Read