18 విభజన హామీలు గాలికి వదిలేసారు... 4 ఏళ్ళ మోడీ మోసం... ఢిల్లీ మన పై చూపుతున్న వివక్ష... దీనికి మనకు ఇచ్చిన సమయం 13 నిమషాలు... 13 నిమషాల్లో ఇన్ని సమస్యలు ఎలా చెప్తారు ? ఎదో సినిమా డైలాగ్ చెప్పినట్టు, ఎప్పుడు వచ్చాం కాదు అన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా అని... ఎంత టైం మాట్లాడం అన్నది కాదు, ఇచ్చిన టైంలో, ఢిల్లీతో డీ కొట్టామా లేదా అనేది ముఖ్యం... తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసును చర్చ కు అనుమతించాలని లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్దమైంది. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడంలో కేంద్రం నిర్వాకాన్ని ఎండగట్టాలని నిర్ణయించిన టిడిపి ఇతర రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టింది.
అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టిడిపి ఎం.పి.లకు మరోసారి దిశానిర్దేశం చేశారు. మొత్తం 18 విభజన డిమాండ్లతో పాటు పార్లమెంట్‌లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను తక్షణమే ఆమోదించే విధంగా కేంద్రాన్ని డిమాండ్ చేయడం, కేంద్రంపై మరింతగా ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని ఖరారు చేసింది. కాగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎం.పి.లు మాట్లాడాల్సిన అంశా లపై ఒక స్పష్టతకు రావడం జరిగింది. విశాఖ-చెన్నై కారిడార్‌కు ని ధులు విదిల్చలేదని ప్రశ్నించడంతో పాటు ఢి ల్లిd-ముంబై ఇండస్ట్రియల్‌కారిడార్ కు ఎంత మొత్తం ఇచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించనున్నారు. అదే విధంగా దేశానికి మొత్తం వచ్చిన జైకా నిధులు ఒక్క రాష్ట్రానికే ఇవ్వడంపై నిలదీయడంతో పాటు ఏ.పి విషయంలో వడ్డీల బాదుడు, బుల్లెట్ ట్రైన్ ఒక్కదానికే జైకా నిధులు వాడటం, కేంద్రం రాబడులతో రాష్ట్రం నష్టాలబారిన పడటం, 16 వేల కోట్ల లోటులో వున్నా రాష్ట్రాన్ని మరిన్ని నష్టాలలోకి నెట్టడం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు 250 కోట్ల విలువైన భూమి, విజయవాడ ఎయిర్‌పోర్టులకు వెయ్యి కోట్ల విలువైన భూమి ఇవ్వగా, నాలుగేళ్ళు గడి చినా అమరావతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపకపోవడం, ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వడానికి కూడా మీనమేషాలు లెక్కించడం, రాజధానికి 50 వేల కోట్ల విలువైన భూమిని ఇస్తే కేంద్రం కేవలం 1500 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఇవ్వడాన్ని చర్చ సందర్భంగా టిడిపి గట్టిగా నిలదీయనుంది.
తిరుపతి ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపనలో ప్రధాని చెప్పిన మాటలు గుర్తు చేయడం తో పాటు వివిధ సంస్థల శంకుస్థాపనల సందర్భంగా కేంద్ర మంత్రులు చేసిన ప్రసంగాలను గుర్తు చేయడం, కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను, గత ఫిబ్రవరి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో ఇచ్చిన హామీలను ప్ర స్తావిం చాలని, తలుపులు మూసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించారని మోడీ అన గా, మరి గత నాలుగేళ్ళలో బిజెపి ప్రభుత్వ నిర్వాకమేమిటనేది నిలదీయాలని, లెక్క లతో సహా దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడంలో ఎం.పి.లు తమ సామర్థ్యానికి పదును పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 500 కోట్ల రూపాయల విలువైన భూమి ఇవ్వగా , దానిని కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీగా మారుస్తామన్నారని, నిధులు కూడా కేవలం వంద కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని నిలదీయనున్నారు. నష్టాలలో వున్న ఏ.పి డబ్బులతో కేంద్రం మరిన్ని లాభాలు పొందాలని చూస్తోండగా, నష్టాలలో వున్న రాష్ట్రాన్ని మరింత నష్టాలలో ముంచాలని చూడటాన్ని టిడిపి ఎం.పి.లు ఎండగట్ట నున్నారు. కాగా కామన్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ఇచ్చిందీ నిలదీయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఏ మేరకు ఇచ్చిన విషయ మై ప్రశ్నించనున్నారు. విభజన చట్టం కింద ప్రత్యేకంగా ఏ.పి కి ఎంత ఇవ్వాలనే విషయమై కూడా కేంద్రం నుంచి వివరణ కోర నున్నారు. గత నాలుగేళ్ళలో ఎంత ఇచ్చిందీ పార్లమెంట్ వేదిక గా దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని సంకల్పించడం జరిగింది.