2014లో హుజూర్నగర్ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లఘించారు అంటూ, ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం, నాంపల్లి కోర్టులోని, ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే ఈ కేసు విచారణ గత వారం వచ్చిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ, కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి మాత్రం కోర్టు విచారణకు హాజరు కాకుండా, నెల్లూరులో గౌతం రెడ్డి సంస్మరణ సభకు వెళ్లారు. దీంతో కోర్టులో ఈ రోజు ఏమి జరుగుతుంది, జగన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అని అందరూ భావించిన సమయంలో, ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి అడ్వొకేట్ లు కోర్టు ముందు హాజరు అయ్యి, కోర్టుకు చెప్పిన సమాధానంతో ట్విస్ట్ నెలకొంది. తమకు సమన్లు అందలేదని, అందుకే జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాలేక పోయారని, కోర్టుకు తెలిపారు అయితే దీని పై స్పందించిన కోర్టు, ఈ నెల 30వ తేదీ లోపు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 31కి వాయిదా పడింది. 31న జగన్ విచారణకు వస్తారో లేదో చూడాలి. లేకపోతే మరే సాకు అయినా చెప్పి, తప్పించుకుంటారో మరి ?
news
మంత్రి కొడాలి నాని కాలర్ పట్టుకున్న వ్యక్తి ఎవరు ? ఆర్ధిక లావాదేవీలు ఇక్కడ వరకు వచ్చాయా ? సంచలన విషయాలు బయటకు ?
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి చట్టాలు వర్తించవా అని, ఆ నియోజకవర్గంలో తప్పొప్పులు నిర్ణయించేది ఎవరని, అసలు కొన్ని వ్యవస్థలు సదరు నియోజకవర్గంలో పని చేస్తున్నాయా లేదో..ముఖ్యమంత్రిగానీ, రాష్ట్ర స్థాయి అధికారగణమో సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యు లు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లో నే మీకోసం....! గుడివాడి నియోజకవర్గం ఏమైనా మంత్రి కొడాలి నానీ సొంతజాగీరా ? గుడివాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో, దేశంలో ఏమైనా ప్రత్యేక ప్రతిపత్తి ఉందా? కొడాలి నానీ చెప్పిందే ఆ నియోజకవర్గంలో వేదమా..అక్కడేమీ పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖలు ఏమీలేవా? నిన్నటికి నిన్న ఒకన్యూస్ ఛానల్లో ఒక కథనం ప్రసారమైంది. అడపా బాబ్జీ అనే వ్యక్తి కొడాలి నానీకి ముఖ్యమైన అనుచరుడు. అతను చనిపోతే చాలా వేళ్లు మంత్రి వైపే చూపించాయి. అతని మరణానికి మంత్రే కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అడపా బాబ్జీ శవ యాత్ర జరుగుతుండగా, మంత్రి వెళ్లి మృతదేహాన్ని చూసి వస్తుండగా, ఒక యువకుడు మంత్రిపై దా-డి చేసినంత పని చేశాడు. నీ వల్లే అడపాబాబ్జీ చనిపోయాడని సదరు యువకుడు మంత్రిని నిలదీస్తూ, నానీ చొక్కా పట్టుకున్నాడంటున్నారు. సదరు ఘటనపై ప్రభుత్వం విచారించదా? ప్రభుత్వానికి, వ్యవస్థలకు ఆ బాధ్యత లేదా? అడపా బాబ్జీ గుండెపోటుతో చనిపోయాడంటున్నారు. ఎవరి ఇబ్బందులు..ఎవరి ఒత్తిడివల్ల బాబ్జీకి గుండెపోటు వచ్చిందని అతని కుటుంబ సభ్యులను ఆరా తీశారా? న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాన్నిబట్టి, గుడివాడ ప్రజలు అనుకునే దాన్నిబట్టి, అడపా బాబ్జీ బావమరిదైన వంకా విజయ్ గతంలో మంత్రిగారి తరుపున 2014 ఎన్నికల్లో విపరీతంగా ఖర్చుపెట్టి, ఎన్నికల ప్రచారం చేశాడు. ఆ సమయంలో తాను గెలిచాక విజయ్ తన కోసం పెట్టిన ఖర్చంతా తిరిగి చెల్లిస్తానని మంత్రిగారు చెప్పారు. ఈమాట నేను అనడంలేదు.. గుడివాడ ప్రజలంతా అనుకుంటున్నారు. దానికి సాక్ష్యాలేమున్నాయో..అది నిజమోకాదో... విచారించాల్సిన బాధ్యత అధికారులదే కదా! ఏరుదాటేవరకు ఓడమల్లయ్య..ఏరు దాటాక బోడిమల్లయ్య అదేకదా.. మంత్రి కొడాలి నానీ వ్యవహార శైలి. "
"ఆయన నోటికి, బూతులకు భయపడి వ్యవస్థలు అన్నీకిమ్మనకుండా ఉండటం భావ్యమా? అడపా బాబ్జీ బావమరిదైన వంకా విజయ్ రైలు కింద పడి ఆత్మ-హ-త్య చేసుకున్నాడంటున్నారు. ఆ ఘటనను నాటి రైల్వే పోలీసులు ప్రమాదవశాత్తూ మరణించారని చెప్పాడు. ఆనాడు మరణించిన విజయ్ జేబులో సూసైడ్ నోట్ ఉందని, అది చేరాల్సినవారికి చేరలేదని, దానికి సంబంధించిన మరోకాపీ మాత్రం అడపా బాబ్జీకి చేరిందని గుడివాడ గగ్గోలుపెడు తోంది. వంకా విజయ్ సూసైడ్ నోట్ మాయమైతే, అతని మరణాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించడానికి స్వయంగా మంత్రిగారే రంగంలోకి దిగారంటున్నారు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు అడపా బాబ్జీని మంత్రిగారు పిలిపించి, విజయ్ రాసిన సూసైడ్ నోట్ వివరాలు బయట పెట్టవద్దని, విజయ్ తాలూకా బాకీ మొత్తాన్ని తీరుస్తానని మరలా బాబ్జీతో నమ్మ బలికాడు. కానీ మంత్రిగారు తన ప్రామిస్ ను నిలబెట్టుకోలేదు. బాబ్జీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తానని.. అప్పులన్నీతీరుస్తానని చెప్పిన మంత్రి గారు అవేవీచేయలేదు. దాంతో బాబ్జీ పరిస్థితి హృదయవిదారకంగా తయారైంది. దాంతో అతను మనస్తాపానికిగురై భరించలేని ఒత్తిడి తోనే గుండెపోటుకి గురయ్యాడంటున్నారు. అడపాబాబ్జీ బావమరిది వంకా విజయ్ మృతిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని.... అతని కుటుంబసభ్యులను, సన్నిహితులను విచారించి వాస్తవాలు వెల్లడించాలని కోరబోతున్నాను. విజయ్ మృతిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రకరించింది ఎవరు...దాని వెనకాల మంత్రిగారి ప్రమేయముందా అనే దానిపై కూడా ఆరా తీయాలని డీజీపీని కోరబోతున్నాం. అలానే బాబ్జీ శవ యాత్రలో మంత్రిపై యువకుడు దా-డి చేయడానికి కారణమేంటి.. బాబ్జీకి ఎందుకు గుండెపోటు వచ్చింది.. గుండెపోటుతో అతను చని పోయేంతలా అతన్ని ఒత్తిడికి గురిచేసింది ఎవరనేదానిపై కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డీజీపీని కోరాలని నిర్ణయించుకున్నాం." అని వర్ల రామయ్య అన్నారు.
కొత్త మంత్రుల విషయంలో, సరి కొత్త న్యూస్.. ఇలాంటి వింతలు వైసీపీ పాలనలోనే ఉంటాయి...
ఎవరైనా మంత్రి వర్గ విస్తరణ అంటే గంతులు వేస్తారు. ముఖ్యంగా సీనియర్ నేతలు అయితే వేగంగా పావులు కదుపుతారు. తమ పలుకుబడి ఉపయోగించి, ఆర్ధికంగా తమ సత్తా చూపించి, ఎలాగైనా మంత్రి పదవి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది మాత్రం భిన్నం. అన్నీ తెలిసిన సీనియర్ లు, మంత్రి పదవుల పై ఆసక్తి చూపటం లేదు. కొత్తగా వచ్చిన వారు మాత్రం, ఆత్రంగా మంత్రి పదవుల కోసం భజనలు చేస్తున్నారు. ఇక వివారల్లోకి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి, రెండున్నరేళ్ళకు, తాను మంత్రి పదవులను మార్చేస్తాను అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రెండున్నరేళ్ళు దాటి పోయి, మూడో ఏడాది కూడా వచ్చేస్తుంది. జగన్ మాత్రం ఉగాది, ప్లీనరీ అంటూ, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పదవి కోసం ఆశిస్తున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, భజన నెక్స్ట్ లెవెల్ లో చేసారు. అయితే సీనియర్లు మాత్రం, మంత్రి పదవుల కోసం ఆసక్తి చూపటం లేదు. ఇందుకు ప్రధాన కారణం, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం. అభివృద్ధి అనేది ఎలాగూ లేదు, కనీసం పధకాలతో అయినా నెట్టుకుని వద్దాం అనుకుంటే, అది కూడా లేకుండా పోతుంది.
దీనికి తోడు ఇన్నాళ్ళు మంత్రులు ప్రజల్లోకి వెళ్ళకుండా సరిపోయింది, ఇప్పుడు మాత్రం మంత్రులు ప్రజల్లోకి నిత్యం వెళ్ళాల్సిన పరిస్థితి. జగన్ కూడా జనాల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కాలం కూడా. దీంతో ఏమి చేయకుండా, ప్రజల్లోకి వెళ్తే, ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అని వారి భయం. ఇక దీనికి తోడు, మంత్రులు తాము గెలవటమే కాక, ఆ జిల్లలో ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి చెప్పటంతో, ఇదెక్కడి ఫిట్టింగ్ అని, ఇలాంటి మంత్రి పదవులు తీసుకోకపోవటమే నయం అని, సీనియర్లు మాత్రం, మంత్రి పదవులు రాకపోతేనే బాగుండు అని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఉన్న మంత్రులు తమ పదవులు ఎలాగూ పోతాయి కదా, ఇంకా ఎందుకు పని చేయటం అని లైట్ తీసుకున్నారు. ఇక మంత్రి పేషీలో సిబ్బంది కూడా, కొత్త మంత్రులు వస్తే తమను పీకేస్తారేమో అని అభద్రతాభావంలో ఉన్నారు. దీంతో పాలన మొత్తం పడక ఎక్కింది. జగన్ మాత్రం, ప్లీనరీ తరువాతే విస్తరణ అంటున్నారు. అసలు ఇది జరిగే పనో కాదో మరి.
తమ గుట్టు బయటపడటంతో, ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నా, జగన్ ప్రభుత్వం సైలెంట్..
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.48 వేల కోట్ల గోల్ మాల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఒకే ఏడాదిలో జరిగిన దోపిడీ ఇది. లెక్క పక్కా లేకుండా చేసిన ఖర్చు, ఇష్టం వచ్చినట్టు చేసిన చెల్లింపులు, నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేసి, చివరకు రూ.48 వేల కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ వివరాలు అన్నీ కాగ్ బయట పెట్టింది. తాము వివరణ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాగ్ తన రిపోర్ట్ లో పెట్టింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రతిపక్ష తెలుగుదేశం, ఈ అంశం పైన విరుచుకు పడింది. ఇక మీడియాలో కూడా అనేక కధనాలు వచ్చాయి. రూ.48 వేల కోట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తుంది. అయితే అనూహ్యంగా ఈ ప్రశ్నలు మూడు రోజుల నుంచి కోడై కూస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వివరణ రాకపోవటంతో, అందరూ షాక్ తిన్నారు. ఇంత పెద్ద సమస్య పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు ? అందరూ అన్ని విపుల నుంచి విమర్శలు చేస్తున్నా, ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? వీటికి బదులు ఇవ్వటం మొదలు పెడితే, తమ గుట్టు మొత్తం బయట పడి, అసలు దాచిన విషయాలు అన్నీ బయట పడతాయని జగన్ ప్రభుత్వం భావిస్తుందా ?
తాము చేసిన ఆర్ధిక విధ్వంసం బయట పడుతుందని, జగన్ భయ పడుతున్నారా ? తమ గుట్టు మొత్తం బయట పడుతుందనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, వీటికి సమాధానం చెప్పటానికి భయపడుతుందని అర్ధం అవుతుంది. లోతుగా పరిశీలన చేస్తే, ఈ విషయంలో అతి పెద్ద స్కాం బయటకు వచ్చే అవకాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పధకాల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, దొంగ యుసిలు ఇచ్చి, ఈ నిధులు తెచ్చుకున్నారు. అయితే ఆ పధకాలకు సంబంధించి బిల్లులు మొత్తం పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక పక్క యుసిలు ఇచ్చేసి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అంటే, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఆ పధకాలకు కాకుండా, వేరే దేనికో మళ్ళించారు కాబట్టే. ఇక అప్పుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లో భారీ అవకతవకలు జరిగాయి. మరో పక్క పీడీ ఖాతాల వినియోగంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. సస్పెన్స్ ఖాతా వినియోగం కూడా ఎడా పెడా చేసారు. ఈ మొత్తం వ్యవహారాల పై వివరణ ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం ఎందుకో మరి సిద్ధంగా లేదు.