కత్తి మహేష్ అనే వ్యక్తి గురించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో, అందరికీ తెలిసిందే. సినీ క్రిటిక్ అని చెప్పుకుంటూ, ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ, సమాజంలో అశాంతి సృష్టిస్తూ ఉంటాడు. అయితే, ఇతను ఒక పావుగా, ఒక రాజకీయ పార్టీ ఆడిస్తున్న గేమ్ గా, వార్తలు వస్తూ ఉంటాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్మాదం పై పోరాటం చేసినా, కొంత వరకు ప్రజలు సమర్ధించారు, కాని రోజు రోజుకూ ఎక్కువ చెయ్యటంతో, ప్రజలు కూడా పట్టించుకోవటం మానేశారు. తాజాగా, సాక్షాత్తు శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీని పై హిందూ సమాజం భగ్గు మంది. అయితే, కత్తి మాత్రం, ఎప్పటి లాగే, తన వాదనను సమర్ధించుకుంటూ, పదే పదే అదే వ్యాఖ్యలు చెయ్యటంతో, హిందూ సమాజం భగ్గు మంది.
దీంతో, శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కత్తి మహేష్‌పై హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఛానల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కత్తి మహేష్‌పై విరుచుకుపడ్డారు. కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీరాముని కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే, కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపించటం పై, ఇదేదో కుట్రగా కూడా విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, ఇక్కడ హిందూ సమాజం కూడా, చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చి, కత్తి మహేష్ ను, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బహిష్కరించాలని ఉద్యమాలు చేస్తారు. చంద్రబాబు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, దళితుల పై దాడిగా సృష్టించే ప్లాన్ వేసారని అంటున్నారు. ఒక వేల చంద్రబాబు , కత్తి పై బహిష్కరణ చెయ్యకపోతే, హిందూ ముసుగులో ఉన్న ఒక పార్టీ, హిందూ వ్యతిరేకి చంద్రబాబు అంటూ, వారు ఆందోళనలు చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, తెలంగాణా నుంచి, కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపించటం వెనుక, ఇలాంటి కుట్రలు చాలా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలని అంటున్నారు.