నిన్న జీవీఎల్ మాట్లాడిన మాటలు, ఈ రోజు కేంద్రం సుప్రీం కోర్ట్ లో వేసిన అఫిడవిట్ పై ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. నిన్న జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ, డీపీకి చెందిన ప్రతి వెధవ తమను భయపెట్టాలనుకుంటున్నారని, తాము భయపడే ప్రసక్తే లేదని, సోషల్ మీడియా పచ్చ చొక్కాలు జాగ్రత్తా అంటూ, నోటికి ఏది వస్తే అది మాట్లడారు. దీని పై కుటుంబరావు ధీటుగా స్పందించారు. బీజేపీ వాళ్లను వెధవ అంటే ఆ పదాన్ని కూడా అవమానించినట్లే అవుతుందన్నారు. బీజేపీ వాళ్లను వెధవ అని ఆ పదాన్ని తక్కువు చేసే ఉద్దేశం లేదన్నారు. బీజేపీని అందరూ భారతీయ జుమ్లా పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. జుమ్లా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

gvl 04072018 2

రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. సాగరమాల కింద రూ.1800 కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసం రాష్ట్రానికి కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కుటుంబరావు స్పష్టంచేశారు. కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఊసేలేదన్నారు. సాగరమాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3750 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 592 ప్రాజెక్టుల్లో ఏపీకి 104 ప్రాజెక్టులు కేటాయించామని చెప్పడం అబద్ధమన్నారు. కేంద్రానికి మేం రాసిన ఉత్తరాలు చూపిస్తారు.. మీ ఉత్తరాలు ఎందుకు చూపించరని నిలదీశారు.

gvl 04072018 3

ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వచ్చాక ప్రధాని ఇంతవరకు నోరు విప్పలదేన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయం తెలుసు కాబట్టే ఆయన నోరు విప్పలేకపోతున్నారని అన్నారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‌ ఏం హీరోనో తనకు అర్థం కావట్లేదనన్నారు కుటుంబరావు. సినిమా స్క్రిప్ట్‌ మాదిరిగా డైలాగులు చెబితే సరిపోతుందని ఆయన అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తుల వ్యక్తిత్వాలపై బురద చల్లి.. ఆ బురదను తానే అంటించుకున్నారని విమర్శించారు. విశాఖలో తిరుగుతూ రైల్వేజోన్‌పై ఒక్క మాటైనా పవన్‌ మాట్లాడారా? అని ప్రశ్నించారు. అలాగే తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుకు తాను నోటీసులు పంపినట్టు చెప్పారు.

బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ప్రజలు తిరగబడుతున్నారు. అలిపిరిలో సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకే నిరసన గళం వినిపించిన ఆంధ్రులు, సిగ్గు లేకుండా గుజరాతీ సోది చెప్తున్న రాష్ట్ర బీజేపీ నేతల పై కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మా మోడీ లక్షల లక్షల కోట్లు ఇచ్చాడు అంటూ హేళన చేస్తున్నారు. ఎంత సేపు మోడీ, అమిత్ షా భజన, వాళ్ళ స్క్రిప్ర్ట్ ప్రకారం నడుచుకోవటమే కాని, వీరికి ఈ రాష్ట్రంలో పుట్టిన కనీస విశ్వాసం లేదు. ప్రతి రోజు టీవీల ముందుకు రావటం, మీకు అవి ఇచ్చాం, మీకు ఇవి ఇచ్చాం, మా మోడీ పెట్టిన బిక్ష ఇది అంటూ, ఆంధ్రులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే, వీరి ప్రతాపాలు టీవీల్లో మాత్రమే, గ్రౌండ్ లెవెల్ లో, ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు.

kanna 04072018

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు కావలిలో పర్యటన చేస్తున్నారు. ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కావలిలో బీజేపీ ర్యాలీలో పాల్గొన్న ఆయన పై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పు విసిరిన ఉమామహేశ్వరరావుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఉమామహేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు. అయితే, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం, అతను ఎవరో తెలియదు అని, ఒక వేళ బీజేపీనే ఇలా చేపించి, రాచ్చ చేస్తుందేమో అని, పోలీసులు ఈ విషయం పై కూడా విచారణ చెయ్యాలని చెప్తున్నారు.

kanna 04072018

మరో పక్క కేంద్రం ప్రతి రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొడుతూనే ఉంది.. నా చేతిలో అధికారం ఉంటే, నిన్ను ఎన్ని అయినా అంటాడు, నీ బాధని వెటకారం చేస్తాను, హేళన చేస్తాను అంటూ, గత సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం... బాధ్యత, భయం అనేది లేకుండా, అధికార మదంతో బ్రతికేస్తారు... ఈ విషయంలో, మన బీజేపీ నాయకులు, నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.. 2 సీట్లు నుంచి, ఇక్కడ వరకు వచ్చిన బీజేపీ, గతాన్ని మర్చిపోయి, చంద్రబాబు లాంటి నాయకుడుని, 13 జిల్లాల నాయకుడికి, ఒక జాతీయ పార్టీ సమాధానం చెప్తుందా అంటూ హేళన చెయ్యటం చూసాం.. మీ మోఖాలకి, పెద్ద రాజాధాని కావాలా ? మయసభ కట్టుకుంటారా, అంటూ అమరావతి పై హేళన చెయ్యటం చూసాం.. విభజన హామీలు కోసం పోరాటం చేస్తుంటే, మీకు 85 శాతం అన్ని హామీలు ఇచ్చేసాం, లక్షల కోట్లు ఇచ్చాం అంటూ, మాట్లాడటం చూస్తున్నాం... ఇవన్నీ అధికార మదంతో మాట్లడే మాటలే... అందుకే ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి పట్టించిన గతి, ఈ బీజేపీకి కూడా పట్టించటానికి రెడీ అయ్యారు.

ఏపికి విభజన హమీలు, ప్రత్యేక హోదా విషయం పై, సుప్రీం కోర్ట్ లో ఉన్న కేసు విషయంలో, కేంద్రం వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కాల్వ శ్రీనివాస్, ఆనందబాబు, పితాని సత్యనారాయణ, సీనియర్‌ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. దీని పై న్యాయ నిపుణులతో చర్చించి, మన వాదనలు ఎలా ఉండాలి అనే దాని పై చర్చలు జరిపారు.

cbn meet 04072018 2

సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థికశాఖ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదన్న కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. పొంగులేటి పిటిషన్‌లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం.

cbn meet 04072018 3

విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని.. పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ ఎర్రంనాయుడు తనయుడు, రామ్మోహ‌న్‌నాయుడు ఎంపీగా చుర‌గ్గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే... స్వర్గీయ ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీకి, ఢిల్లీలో అన్నీ తానై చూసుకునేవారు... ఢిల్లీలో రాష్ట్రానికి ఏ పనులు కావలి అన్నా, చంద్రబాబు ఆయనకే బాధ్యతను అప్పచేప్పవారు... ఇక స్వర్గీయ ఎర్రంనాయుడు వాక్ చాతుర్యం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు... ఆయన ఆ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వాడు అయిన కన్విన్స్ అవ్వాల్సిందే... అయితే, తండ్రి చనిపోయిన తరువాత, చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకున్నారు... రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ లో ఏంతో చక్కగా మాట్లాడుతూ, అన్ని డిబేట్స్ లో పాల్గుంటూ, అందరి మన్ననలు పొందుతున్నారు... తండ్రిలాగానే, ప్రతి విషయం మీద అవగాహనతో, తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టి పడేస్తూ వస్తున్నారు...

rammohan 04072018 2

ఈ రోజు రైల్వేజోన్‌ కోరుతూ చేపట్టిన తెదేపా ఎంపీల ఒక్కరోజు నిరశన దీక్ష ముగింపు సందర్భంగా, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లడారు. రైల్వే జోన్ వల్ల ఉపయోగాలు ఏంటి, విభజన చట్టం, కేంద్రం చేస్తున్న అన్యాయం ఇలా అన్నీ అర్ధం అయ్యేలా ప్రజలకు వివరించారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి లొంగిపోయి పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం. దాదాపు నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ఉన్నా, రైల్వే జోన్ గురించి కాని, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరు పై కాని, కానీసం స్పందించలేదు. మేధావులతో మీటింగ్ అని చెప్పినా, అక్కడ కూడా ఈ విషయం ప్రస్తావన రాలేదు. కేంద్రం పై ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు పవన్.

rammohan 04072018 3

ఈ సందర్భంలో, రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీలపై నిధులు వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు పవన్‌ జేఎఫ్‌సీ పేరుతో ఓ కమిటీని వేశారని.. రాష్ట్రానికి రూ.74 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలంటూ తేల్చిన ఆ కమిటీ సినిమా ఏమైందని ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పవన్‌కు కేంద్ర ప్రభుత్వం కనపించడం లేదా? అని నిలదీశారు. దిల్లీలో జరిగిన లోపాయికారి ఒప్పందం ఏమిటో ఆ నాయకుడు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎలా లొంగిపోయింది, విభజన హామీల పై కనీసం ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనటం, నోటి వెంట మోడీ, అమిత్ షా అనే పేరు కూడా రాకుండా జాగ్రత్త పడటం చూస్తుంటే, బీజేపీ, పవన్ ను ఎలా ఆడిస్తుందో ఎవరైనా తెలుసుకోవచ్చు... ఇంతకీ ఆ జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి ఏమైందో, ఏమిటో ? అంతా అమిత్ షా మాయ....

Advertisements

Latest Articles

Most Read