విద్యుత్ రంగంలో వివిధ మైలురాళ్లను సాధించడంలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండోసారి దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో అమలవుతున్న ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం (ఐపీఎస్), దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయుజిజేవై), అగ్రి గ్రేట్ టెక్నికల్, కమర్షియల్ (ఏటీ అండ్ టీ), నష్టాల తగ్గింపు వంటి అంశాలపై మంగళవారం సిమ్లాలో జరిగిన జాతీయ విద్యుత్ మంత్రుల సదస్సులో ఏపీ ప్రశంసలందుకుంది. గతంలో స్టేట్ డిజీగేటెడ్ ఏజెన్సీ (ఎస్డీఏ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో జరిగిన జాతీయ సదస్సులో కూడా ఈ అంశాలపై ఏపీ ప్రశంసలను దక్కించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఇటువంటి ఉత్తమ విద్యుత్ సంస్కరణలను తీసుకువచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళావెంకట్రావు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్లు ఈ సందర్భంగా సదస్సులో వెల్లడించారు.

cbn power 04072018 2

ఏపీ విద్యుత్ రంగం ఎనర్జీ సామర్థ్యం, బొగ్గు కొరతల నివారణ, రెన్యువబుల్ ఎనర్జీ తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యుత్ వినియోగం పెద్దగాలేని సమయాల్లో రోజుకు 500 మెగావాట్ల విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదా చేస్తున్నట్లు తెలిపారు. 2014లో ఇంధన లోటు 8 శాతం కంటే ఎక్కువగా ఉండేదన్నారు. 2016 నాటికి నూరు శాతం గృహ విద్యుదీకరణను సాధించడంలో విజయం సాధించామన్నారు. ట్రాన్స్మషన్ పంపిణీ నషాల తగ్గింపు 12.06 శాతం నుండి 9.72 శాతానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ తగ్గించగలిగిందన్నారు. ఇందులో కూడా ఏపీ ట్రాన్స్ కో 2.32 వాతం తక్కువ ట్రాన్స్మిషన్ నష్టాలను సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రచార రథానికి ఇతర రాష్ట్రాల నుండి మంచి స్పందన లభించిదన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీపై ఏపీ యొక్క ప్రోత్సాహకాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి.

cbn power 04072018 3

ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ విధానంపై ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఈ విధానం ద్వారా విద్యుత్ వాహనాల అభివృద్ధి చేస్తున్న విధానాన్ని వారు ఇతర రాష్ట్రాలవారికి తెలియజేశారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, రోడ్డు పన్ను, విద్యుత్ వాహన తయారీ పార్కులు, అభివృద్ధి, ఛార్జింగ్ వనరులు వంటి అంశాలను వివరించారు. అంతేకాకుండా ఈ విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగానూ ఈ ఏడాది జూలై నాటికి 50 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటుచేసిన 250 గ్రిడ్ ఆధారిత సోలార్ పంప్సెట్ల విధానంపై వివరించారు. రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన ప్రాజెక్టుగా ఆయన దీనిని అభివర్ణించారు. దీనితో పాటు ఏపీలో 11 లక్షల స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పంపసెట్ల విధాన అమలుపై పలు రాష్ట్రాల ప్రతినిధులు ఏపీ పనితీరును ప్రశంసించారు.

చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యామంత్రి అయిన తరువాత, పేదలకు పక్కా గృహాలు కట్టివ్వటమే ఆశయంగా, చాలా కసరత్తు చేసారు. చంద్రబాబుకు తోడు, అప్పట్లో వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి కొంత సహాయం చేసారు. దీంతో చంద్రబాబు మరింత దూకుడుగా, అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో, ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. ఒక్క ఇల్లు కట్టటమే కష్టం అయిన ఈ రోజుల్లో, లక్షల లక్షల ఇల్లు కడుతున్నారు. అదీ పక్కాగా. మనకు తెలిసిన ఇందిరమ్మ గృహాలులా కాదు. అంతా పధ్ధతి ప్రకారం, ఒక్క పైసా అవినీతి లేకుండా కడుతున్నారు. ఈ క్రమంలో, రేపు, జూలై 5వ తారీఖు దాదాపు 3 లక్షల ఇళ్ళల్లో ఒకేసారి గృహప్రవేశాలు జరగనున్నాయి. దీంతో చంద్రబాబు ఈ విషయం పై రివ్యూ చేసారు. నా ఆశయం నెరవేరే రోజు అని, కేంద్రం కూడా ఇన్ని ఇళ్ళు ఎలా పూర్తి చేసారు అనే అంశం పై, మన వైపు చూస్తున్నారని అని అన్నారు.

cbn 04072018 2

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,80,849 ఇళ్ళ నిర్మాణం పూర్తియిందని, మిగిలిన 8-లక్షల ఇళ్ళను రానున్న జనవరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెలకు లక్ష ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని నిర్దేశించారు. 2022 నాటికి రాష్ట్రం లోని పేదలందరికి పక్కా ఇళ్ళు నిర్మిం చడమే ప్రభుత్వ లక్ష్య మని స్పష్టం చేశారు. ఈనెల 5వ తేదీన 3-లక్షల ఇళ్ళ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నామని ఇది ఒక చరిత్ర అని అన్నారు. గతంలో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, అదే తరహాలో ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల ఇళ్లు మాయమయ్యాయని , వీటిని నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఎన్ని ఇళ్లు గల్లంతయ్యాయో వాటి వివరాలను విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశిం చారు.

cbn 04072018 3

అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసేలా చేయాలని సూచించారు. పేదల ఇళ్లను గల్లంతుచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమందికి పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు లేవనే సమాచారాన్ని సేకరించాలని, దీనిలో సాధికార మిత్రలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే భూముల కొనుగోలుకు రూ.750 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనిలో ఎస్సీలకు రూ.250 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. హౌసింగ్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్ళు అందించేలా కృషి చేయాలని సూచించారు.

తలసేమియా బాధితులకు పూర్తి ఉచిత వైద్యం అందిస్తూ, వారికి నెలకు రూ.2 వేల పింఛన్‌ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన తలసేమియా హిమోఫీలియా చికిత్స కేంద్ర భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తలసేమియా, హిమోఫీలియా బారిన పడిన చిన్నారులకు మూడు వారాలకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు. ఈకారణంగా వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడటంతో పాటు మనోవ్యధకు గురవుతున్నారన్నారు. ఆ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అండగా ఉండాలని నిర్ణయించానని, భవిష్యత్తులో వ్యాధి నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు.

cbn 04702018 2

వైద్య ఖర్చులకోసం పేదలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారని, ఇకనుంచి తలసేమియా వ్యాధి సోకిన వారికి వైద్యంతో పాటు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనారోగ్యం కారణంగా పేదలు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ ఆరోగ్య రక్ష, మాతా శిశు సంరక్షణ, ఎన్‌టీఆర్‌ బేబీకిట్స్‌, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, 108, 104 ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు అమల్లోకి తెచ్చామన్నారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

cbn 04702018 3

అనంతరం తలసేమియా బాధిత చిన్నారులను ముఖ్యమంత్రి పలకరించారు. తొలుత భవనం ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రికి రెడ్‌క్రాస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. బాలసుబ్రమణ్యం, భవనం దాత వెలమాటి జనార్దనరావు, రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ మాగంటి ప్రసాద్‌, డీసీహెచ్‌ఎస్‌ శంకరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం రెడ్‌క్రాస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన రెడ్‌క్రాస్‌ సొసైటీ అంతర్జాతీయ వ్యవస్థాపకులు జీన్‌ హెన్సీ డ్యూనాంట్‌ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకుడు ఏవీఆర్‌ మోహన్‌, రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి తన్నీరు మునియా, సభ్యులు మడుమిల్లి మోహనగుప్తా, అల్లూరి ఇంద్రకుమార్‌, మంతెన వెంకటరామరాజు తదితరులు పాల్లొన్నారు.

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తోతాపురి మామిడి కిలోకు రెండున్నర రూపాయల మేర ప్రభుత్వం రైతుకు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యానవన రైతులను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయించారు. దేశంలో ఇప్పటి వరకూ మామిడి రైతులను ఆదుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా ఏపీ నిలిచిపోతుంది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కిలో కు రూ. 7.50 చొప్పున చిత్తూరు జిల్లాలోని 53 ప్రాసెంసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు రూ.5 చెల్లిస్తాయి. కొనుగోళ్ళ వివరాలు అందిన తర్వాత కిలోకి రూ.2.50 చొప్పున ప్రభుత్వం ప్రాసెంసింగ్ యూనిట్లకు చెల్లిస్తుంది.

ap 04072018 2

దీనికిగాను రాష్ట్రప్రభుత్వంపై సుమారు 45 కోట్ల భారం పడనుంది. చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి ఉత్పత్తిదారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉల్లి, పసుపు, మిర్చి పంటలకు ధరలు పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం రంగంలోకి దిగి కొంత ధరను భరించింది. జులై 4 నుంచి 28వరకూ రైతులు తమ తోతాపురి మామిడి దిగుబడులను ప్రాసెంసింగ్ యూనిట్లకు తీసుకెళ్ళి అప్పగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల మామిడి దిగుబడులకు ధరలు ఆశాజనకంగా ఉండగా ఒక్క తోతాపురికి మాత్రం ధరలు బాగా పడిపోయాయి. దాంతో సంబంధిత రైతులకు అశనిపాతంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రప్రభుత్వం తోతాపురి ఉత్పత్తి రైతుల కష్టాలు తీర్చడంలో తక్షణం స్పందించింది. తోతాపురికి చిత్తూరు జిల్లా ప్రసిద్ధి.

ap 04072018 3

చిత్తూరు జిల్లాలో మొత్తం 97000 హెక్టార్లలో వివిధ రకాల మామిడి పంటలను పండిస్తున్నారు..అయితే 34000 హెక్టార్లలో మాత్రం తోతాపురి రకాన్ని పండిస్తున్నారు. గతంలో తోతాపురి కిలో ఒక్కింటికీ రూ.11 ఉంటుండగా ప్రస్తుతం అది రూ.4కు పడిపోయింది. దాంతో తోతాపురి రైతులకు తీవ్ర ఆవేదన కలిగించింది. హతాశులైన తోతాపురి మామిడి రైతుల కష్టాలను తీర్చడానికి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన, వినూత్న తరహా చర్యలు తప్పకుండా వారిని ఒడ్డున పడవేస్తాయనడంలో సందేహం లేదు. జిల్లా కలెక్టరు పర్యవేక్షణలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద రెవిన్యూ, ఉద్యానశాఖ అధికారుల సమక్షంలో కొనుగోళ్ళు జరుగుతాయి.

Advertisements

Latest Articles

Most Read