ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చింది. వాట్సాప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం కావడం వల్ల అవి నిజమని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పలువురు అమాయకులపై దాడికి దిగుతున్నారు. ఫలితంగా ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

wa 03072018 2

పిల్లలను అపహరించుకుపోతున్నారంటూ వాట్సాప్‌లో నకిలీ వార్తలు వైరల్‌గా మారాయి. ఇటువంటి ఘటనలు అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు చాలా బాధించాయి. రెచ్చగొట్టే విధంగా ఉండే సందేశాలు ఇకపై వాట్సాప్‌లో వైరల్‌గా మారకుండా సదరు సంస్థ తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసాకాండను ప్రేరేపిస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌లపై ఇప్పటికే పదేపదే వాట్సాప్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సాప్‌ సీనియర్‌ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని చెప్పింది.

wa 03072018 3

ఇటువంటి నకిలీ వార్తలు ప్రజల్లోకి వెళ్లడం వల్ల శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రెచ్చగొట్టే సందేశాలు, అబద్దపు వార్తలు వాట్సాప్‌లో వైరల్‌ కాకుండా చూడాలని ఐటీ శాఖ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా వాట్సాప్‌లో వస్తున్న సందేశాలను నమ్మి ప్రజలు అమాయకులపై దాడికి దిగుతున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఇలాగే చిన్నారులను అపహరించుకుపోయే గ్యాంగ్‌ తిరుగుతుందని వాట్సాప్‌లో సందేశం వైరల్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పిల్లలను అపహరించుకుపోయే వారిగా భావించి అక్కడి గ్రామస్థులు వారిని కొట్టి చంపారు.

ఆపరేషన్ గరుడలో ప్రధాన ఉద్దేశం.. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పటం... తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలి.. సంక్షేమం ఆగిపోవాలి.. కంపెనీలు వెళ్లిపోవాలి.. పోలవరం ఆగిపోవాలి.. దీని కోసం, జగన్, పవన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు ప్రజలు నమ్ముతారని, రాష్ట్రంలో ఎదో జరిగిపోయింది అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుందని, అప్పుడు రాష్ట్రంలో శాంతిబధ్రతలకు విఘాతం కలిగించి, రాష్ట్రపతి పాలన ద్వారా, మన రాష్ట్రాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ వేసింది. అయితే, పవన్ పిల్ల ఫాన్స్ మినహా, ఎవరూ పవన్ మాటలు నమ్మటం లేదు. ఇక జగన్ చేసే ప్రతి పని సెల్ఫ్ గోల్ అవుతుంది. రాష్ట్రంలో అవినీతి కేసులో చంద్రబాబుని ఇరికించాలని ఎంత ప్రయత్నం చేసినా, రూపాయి అవినీతి కూడా కనిపెట్టలేకపోయారు. అందుకే, ఏ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వక పోవటం, ఎన్నికల సమయం మించిపోతూ ఉండటంతో, బీజేపీ నేతలు ఒక చచ్చు ఐడియాతో, ఈ రోజు ఆపరేషన్ గరుడలో, మరో పావు కదిపారు..

bjp 03072018 2

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఏపీలో పరిస్థితి అదుపు తప్పిదంటున్నారు. శాంతి భద్రతల సమస్య వచ్చిందని తీర్మానించారు. తమపై దాడులు జరగడమే దానికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకోవాలని కోరుకున్నారు. మన రాష్ట్రంలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్నారు. అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు జరిగిన నిరసన, కొద్ది రోజుల కిందట, అనంతపురం జిల్లా పర్యటనకు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ వచ్చినప్పుడు జరిగిన నిరసన, బూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ బీజేపీ... ఏపీలో శాంతి భద్రత సమస్య ఉందని.. చెప్పుకొస్తున్నారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని... విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో తమ పార్టీ నేతలు ఎక్కడా తిరగలేకపోతున్నారన్న కారణాన్నే ప్రధానంగా చూపించారు. తమ పార్టీ నేతలకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలపై నమోదు చేసిన కేసులను తొలగించాలని కూడా గవర్నర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.

bjp 03072018 3

అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం.. బీజేపీ నమ్మించి చేసిన మోసం కారణంగా.. ప్రజాగ్రహాన్ని వారు ఎదుర్కొంటున్నారని... వారిపై దాడులకు జరగకుండా.. తాము రక్షణ కల్పిస్తున్నామంటున్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే.. బీజేపీ నేతలు ఏపీలో ఎలా తిరుగుతారంటున్నారు. చిన్న చిన్న ఘటనలను పెద్దగా చూపించి... కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ప్రజలు బీజేపీ నేతలను అడ్డుకుంటనే.. శాంతి భద్రతల సమస్య అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేరాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నా... ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

విభజన అనంతరం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఆర్థిక పరంగానూ, ఉపాధి పరంగానూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోంది. కేవలం ఆరునెలల వ్యవధిలో దాదాపు 15 కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందినవి కావడం విశేషం. పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించడం, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడం, కేవలం నెల రోజుల వ్యవధిలో అనుమతులిచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం వంటి కార్యక్రమాలతో ఇవన్నీ సాధ్యపడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, అనుమతులు ఇవ్వడం ఒకెత్తయితే, ఈ కంపెనీల ఏర్పాటుకు భూ కేటాయింపులు మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగిన నేపద్యంలో ఈ కంపెనీలు కోరిన విధంగా భూములు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరకంగా తలకుమించిన భారమే.

electronics 03072018 2

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కష్టాలను వెరవక భూ కేటాయింపులకు ప్రత్యేక డ్రైవ్ పెట్టి మరీ పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తూ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. గత నాలుగేళ్లుగా అనేక దఫాలుగా చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పటికీ అవన్నీ కార్యరూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్న ఆయా కంపెనీలు రెండు నుండి ఆరు నెలల వ్యవధిలో తమ సంస్థల కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.24,802 కోట్ల పెట్టుబడులతో వచ్చే సంస్థల్లో 82, 750 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే 13,900 మందికి ఉపాధి కల్పించినట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ నివేదికను రూపొందించారు.

electronics 03072018 3

వచ్చే ఆరు నెలల్లో, కొత్తగా ఏర్పాటు కాబోయే సంస్థల్లివే...స్పెక్షం ఇల్యూమినస్ అనే ఎల్ఈడీ బల్బులు తయారుచేసే సంస్థ రెండు నెలల్లో తమ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. అదేవిధంగా ఆర్క్ సిస్టమ్స్ అనే ఎనర్జీ మీటర్ల తయారీ సంస్థ రెండు నెలల్లోనూ, సంజ్యాన్ జియాన్ ఎలక్ట్రానిక్స్ అనే ఛార్జర్ల కంపెనీ మూడు నెలల్లోనూ, పారామౌంట్ అనే మెకానిక్ సంస్థ 3నెలల్లోనూ, పీజీ ప్లాస్ట్ అనే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 5 నెలల్లోనూ, ఐజేఏ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీలను తయారుచేసే సంస్థ 5 నెలల్లోనూ, జియామన్ ప్రెసిసన్ అనే కొలతల పరికరాల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, సిగ్టఫుల్ అనే మెడికల్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, విస్టియన్ అనే ఆటో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ సంస్థ 6 నేలల్లోనూ, డబ్ల్యూయూఎస్ ప్రింటెడ్ సర్క్యూట్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, నోబుల్ మౌల్డ్ అనే ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, అప్లైడ్ మెటీరియల్స్ అనే నానోటెక్ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, వర్త్ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ తమతమ కంపెనీల ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

అధికార పార్టీ అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలోకి దూకేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరు పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఆయన చేయించిన సర్వేలను వారి ముందే బయటపెడుతూ వారికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాల సమీక్షలను గత పది రోజులుగా నిర్వహిస్తూ లోటు పాట్లను వారి సమక్షంలోనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతలను సైతం చంద్రబాబు స్వయంగా నిలదీస్తున్నారు.

cbn ennikalyu 03072018 2

ఆరోపణలు ఉన్న మంత్రుల పనితీరును కూడా విశ్లేషిస్తున్నారు. సర్వే ఆధారంగా ఎమ్మెల్యేలకు జిల్లాల సర్వే నివేదికలు అందిస్తున్నారు. గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఉండదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పనితీరు మార్చుకోని పక్షంలో టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రుల్లో యాభై శాతం మంది వరకు టికెట్లు డౌటే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏ సర్వే తీసుకున్నా చంద్రబాబు పై అమితమైన నమ్మకం ఉన్నా, ఆయన కష్టపడే తత్త్వం ఉన్నా, ఎమ్మల్యేల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో, అవినీతి ఆరోపణలు, పని తీరులో తేడా, అలసత్వం ఇలా ఎమ్మెల్యే ల జాతకాలను అన్ని కోణాల్లో ముఖ్య మంత్రి చంద్రబాబు బయటకు తీస్తున్నారు. ఆరోపణల చిట్టాను వారి చేతికే అందించి దీనికి ఏమిటి మీ సమాధా నమని నిలదీస్తున్నారు.

cbn ennikalyu 03072018 3

తప్పులు దిద్దుకొని ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోకపోతే దెబ్బతింటారని, ఆ తర్వాత తనను అనుకుని ప్రయోజనం లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జిలతో సమావేశమవుతున్నారు. అవే విషయాలు ముఖ్యమంత్రి మొహమాటం లేకుండా చెబుతున్నారు. కేవలం ఆరోపణలే కాకుండా వారి పనితీరు, ప్రవర్తన తీరులో లోపం ఉన్నా క్యాడర్, ఓటర్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోలేకపోయినా వివరిస్తున్నారు. వారు తమను తాము దిద్దుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. దిద్దుకుంటే ఇబ్బంది లేదని, ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఈలోపు వారు సరైన దారిలోకి రావాలన్నది ఆయన ఆలోచన అని, అందుకే ఈ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read