జగన్ మోహన్ రెడ్డి, లోటస్ పాండ్ బ్యాచ్ ని గత నాలుగేళ్ళుగా చూస్తున్నాం.. ఈ లోటస్ పాండ్ బ్యాచ్ కి, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ కూడా తోడయ్యిన తరువాత, సోషల్ మీడియాలో వెళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో జుబుక్స కలిగించేలా పోస్టర్ లు వేసి, చివరకు మహిళా ఎమ్మల్యేలను కూడా ఎంతో చండాలంగా చూపించారు. ఇప్పుడు ఈ సైకో బ్యాచ్ కు తోడు, పవన్ కళ్యాణ్ బ్యాచ్ తయారు అయ్యింది. వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు, మొత్తం సోషల్ మీడియాలోనే వీళ్ళ హడావిడి. 90 శాతం హైదరాబాద్ నుంచి, ఈవెంట్ మ్యానేజ్మెంట్ చేసే కంపెనీల చేతిలో సోషల్ మీడియాను పెట్టారు. అయితే, పవన్ కళ్యాణ్ చెప్పే సూక్తులు, ఆదర్శ భావాలు విని, అబ్బో, వీరికి మించిన వారు లేరు అని అనుకునేవారు. కాని, ఈయన అభిమానులు మాత్రం, పరమ చెత్త.. జగన్ బ్యాచ్ కనీసం ఫోటో మార్ఫింగ్ అన్నా చేసేది, ఈ బ్యాచ్ అయితే ఏకంగా విదేశాల నుంచి ఫోటోలు లేపుకొస్తున్నారు...

janasena 03072018 2

వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో ఉండే సమస్యలు తీసుకువచ్చి, అవి మన రాష్ట్రంలో ఉండే సమస్యలుగా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు, వాటిని ముఖ్యమంత్రినీ సంబంధిత మంత్రులనూ ట్యాగ్ చేస్తున్నారు. అధికారులు నిజమే అనుకుని, ఆ సమస్య వైపు చేసే లోపు, అవి మన రాష్ట్ర సమస్యలు కాదని, ఎక్కడ నుంచో అవి తీసుకువచ్చి, ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని తెలుసుకుని, ఈ చెత్త రాజకీయం చూసి, అధికారులు కూడా అవాక్కవుతున్నారు. నిజమైన సమస్యలకు స్పందించే వారి, వారి అధికారుల సమయం అంతా ఇలాంటి అసత్య ప్రచారాల కోసం వృధా అవుతుంది. ప్రతి సమస్యనూ చూసి ఆయా ప్రాంతాలకు అధికారులు వెళ్ళడం, అది అసత్యం అని గ్రహించి రిపోర్ట్ చేసి కేస్ మూసివెయ్యడం జరుగుతుంది.

janasena 03072018 3

ఒకటో రెండో అయితే పరవాలేదు, ప్రతి రోజు ఎదో ఒకటి ఇలా చేస్తున్నారు. పాలక పక్షంపై బురద జల్లాలన్న యావతో పై తమకు తెలియకుండానే సమాజానికి ఎనలేని హానిని కలిగిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల నిజమైన సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఇదీ తప్పుడు కంప్లైంటే అయ్యి ఉంటుందిలే అని తామే ఒక నిర్ధారణకి రావడం మొదలు పెడితే నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి కూడా సకాలంలో వాళ్ళ సమస్యలు తీర్చబడవు. హైదరాబాద్ రోడ్లుని, విజయవాడ రోడ్లు గా చూపిస్తారు, కేసిఆర్ పర్యటన కోసం పిల్లలను రోడ్ పై కూర్చోబెడితే, చంద్రబాబు చేసారని చెప్తారు. ఇండోనేషియాని, ఆంధ్రా చేస్తారు, ఒక ఉత్తరాది రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర గా చూపిస్తారు. నిజమైన సమస్యలు ఏమి దొరక్క, ఇలా చేస్తున్నారా, లేక చంద్రబాబుని ఎదుర్కోవటానికి, ఇలా ఫేక్ ప్రచారం తప్ప, ఏమి చేయ్యలమని డిసైడ్ అయ్యారా ?

మాటలు చెప్పే వాడు ఒక వైపు... చేతల్లో చూపించే వాడు ఒక వైపు... సోషల్ మీడియాలో భజన చేపించుకునే వాడు ఒక వైపు.. సోషల్ మీడియాలో హేళన చేసే పైడ్ టీంకు బలయ్యే వాడు ఒక వైపు... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక వైపు... చంద్రబాబు అనే బ్రాండ్ ఇమేజ్ ఇంకో వైపు.. చివరకు సొల్లు చెప్పే వాడు కాకుండా, సమర్థుడు సాధించాడు.. ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్‌’ మన రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీని కోసం తెలంగాణా కూడా పోటీ పడింది. అక్కడ ఐటి మంత్రి కేటీఆర్ మే 25, 2017న అమెరికా వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసి, వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగారు. ఇది తప్పు కాదు కాని, అసలు విషయం ఇక్కడే ఉంది.

lokesh 03072018 2

మే 4, 2017లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన చేసారు. ఆ సందర్భంగా, వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసి, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగారు. మన ప్రభుత్వం తరుపున, ఇచ్చే రాయతీలు అన్నీ వివరించారు. అప్పటి వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/nbpBNnxWEVM . తరువాత లోకేష్ ఫాలో అప్ అవ్వటం మొదలు పెట్టారు. డిసెంబర్ లో అమెరికా వెళ్లి డీల్ క్లోజ్ చేసారు. అయితే, చంద్రబాబు మే 4, 2017లో వెళ్లి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని కలిసినట్టు తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అమెరికా వెళ్లారు. మే 25, 2017న అమెరికా వెళ్లి, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కంపెనీని తెలంగాణాలో పెట్టమని కోరారు. ఈ సందిగ్ధంలో, లోకేష్ చూపిన చొరవ, ఆక్టివ్ ఫాలో అప్ తో, ఈ కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది.

lokesh 03072018 3

ఇది ఇలా ఉంటే, ఈ కంపెనీతో చర్చలు అన్నీ సీక్రెట్ గా సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉండడమే దీనికి కారణం. బెంగళూరు, తిరుపతిలో ఆ సంస్థ ప్రతినిధులను కలిసినప్పుడు కూడా విషయాలు ఎవరికీ వివరించలేదు. తర్వాత ఈ మూడు నెలల కాలంలో పలుమార్లు చర్చలు జరిపినా మీడియాకు చెప్పలేదు. ఒప్పందానికి ఒకరోజు ముందు మీడియాకు సమాచారం ఇచ్చినా.. ఒక పెద్ద కంపెనీ వస్తుందన్నారే తప్ప.. కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు. పెద్ద పెద్ద నగరాలు లేని, సేవా రంగం అంతగా అభివృద్ధి చెందని మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకొచ్చేందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నీతి ఆయోగ్‌ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటో తెలియదు.. మన సచివాలయం ఎక్కడ ఉంటుందో తెలియదు. అన్ని రాష్ట్రాలని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆదేశించే నీతి ఆయోగ్ పరిస్థితి ఇది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కి జ్ఞానోదయం చెయ్యల్సిన పరిస్థితి. అందుకే ,ఆంధ్రప్రదేశ్ సచివాలయం అడ్రస్ మారిందని తెలుపుతూ నీతి ఆయోగ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. వెలగపూడి కేరాఫ్ ఏపీ క్యాపిటల్ హైదరాబాద్ అంటూ ఇటీవల నీతి ఆయోగ్ తప్పుడు చిరునామాతో ఒక లేఖ రాసింది. ఈ లేఖ చూసిన అధికారులు అవాక్కయ్యారు. నీతి ఆయోగ్‌, ఇలా రాయటం ఏంటి అని చర్చించుకుని, ముఖ్యమంత్రికి విషయం చెప్పారు. సియం, ఈ విషయం పై నీతి ఆయోగ్ లేఖ రాయమని అధికారులకు చెప్పారు.

niti 03072018 2

ఆంధ్రప్రేష్ రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చట్టంలో ఉంది. అయినప్పటికీ ప్రజలకు పాలన దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి వెలగపూడి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతి పరిసర ప్రాంతాలకు తరలిపోయాయి. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పాలనంతా అక్కడి నుంచే సాగుతోంది. అయితే ఈ వ్యవహారం అంతా నీతి ఆయోగ్‌కు తెలిసినట్లు లేదు. అందుకే ఏపీ సీఎం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నట్టు భావిస్తోంది.

niti 03072018 3

వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానించాలన్న ప్రతిపాదన పై అధ్యయనానికి ముఖ్యమంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రధాని నామినేట్ చేసినట్టు తెలుపుతూ నీతి ఆయోగ్ లేఖ రాసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరునామాలో సచివాలయంలో ఉన్న వెలగపూడిని హైదరాబాద్‌లో ఉన్నట్లుగా రాయడం దుమారం రేగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మొత్తం 70 శాఖలకు లేఖలు రాసింది. సచివాలయం అడ్రస్ మారిందంటూ తెలిపింది. మరి ఇక నుంచి అయినా, వీరు కరెక్ట్ అడ్రస్ రాస్తారో లేదో...

బెజవాడలో కొత్త రూట్‌ను ఆర్టీసీ ఆవిష్కరించింది. అత్యంత రద్దీగా ఉండే మూడు నియోజకవర్గాలలోని కీలక ప్రాంతాలను కలుపుతూ 24 కిలో మీటర్ల దూరంతో కూడిన సరికొత్త రూటును ప్రవేశపెట్టారు. మాస్‌, క్లాస్‌ ఎక్కువుగా రాకపోకలు సాగించే పొటెన్షియల్‌ రూట్ల వేటలో ఉన్న ఆర్టీసీ అధికారులు కొద్ది రోజులుగా వీటిపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదరణ బాగా ఉంటుందని రూట్‌ నెంబర్‌ 33 హెచ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ రూట్‌ పశ్చిమ నియోజకవర్గంలో హెచ్‌బీ కాలనీ నుంచి ప్రారంభమై మధ్య నియోజకవర్గంలో పైపుల రోడ్డు మీదుగా తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌కు అనుసంధానమౌతుంది.

vijayawada 03072018 2

పశ్చిమ, మధ్య నియోజకవర్గ శివారు ప్రాంత ప్రజలంతా ఆటోనగర్‌కు రావాలంటే నగరం అంతా కలియ తిరిగి రావాల్సి వస్తోంది. ట్రాఫిక్‌ ఇబ్బందులలో చిక్కుకోవాల్సి వస్తోంది. దీని వల్ల సమయాభావంతో పాటు అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. రూట్‌ నెంబర్‌ 33 హెచ్‌ ద్వారా ఈ సమస్యకు తెరపడుతుంది. సమయాభావం కూడా కలిసివస్తుంది. చెంతనే రాజధాని ఏర్పడిన తర్వాత సిటీ డివిజన్‌ పరిధిలో తొలిసారిగా అంతర్గత రూట్‌కు ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. ఇటీవల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫోన్‌కాల్స్‌, ప్రత్యేక విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని రీజియన్‌ అధికారులంతా సమావేశమై ఈ రూట్‌ను సృష్టించారు.

vijayawada 03072018 3

పశ్చిమ నియోజకవర్గంలో 33 హెచ్‌ రూట్‌ ప్రారంభ మౌతుంది. హె చ్‌బీ కాలనీ నుంచి సితార, కబేళల మీదుగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి వె ళుతుంది. అక్కడి నుంచి మధ్య నియోజకవర్గంలో పైపులరోడ్డు మీదుగా డాబాకొట్లు, గవర్నమెంట్‌ ప్రెస్‌ జంక్షన్‌, అల్లూరి సీతారామరారాజు వంతెన మీదుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసు నుంచి ఏలూరు రోడ్డుకు కలుస్తుంది. ఇక్కడి నుంచి రామవరప్పాడు రింగ్‌, రమేష్‌ హాస్పిటల్‌, గురునానక్‌ కాలనీ మీదుగా ఆటోనగర్‌కు బస్సు చేరుకుంటుంది. హెచ్‌బీ కాలనీ నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు , ఆటో నగర్‌ నుంచి ఉదయం 8.15 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయి.

Advertisements

Latest Articles

Most Read