ట్విట్టర్‌లో చురుకుగా ఉండే నేతల్లో సుష్మా స్వరాజ్ ఒకరు. సాయం అందించాలన్నా.. ఆకతాయిలకు ఘాటుగా సమాధానమివ్వాలన్నా.. ఆమె ఎప్పుడూ ముందుంటారు. అయితే ఈ సారి సొంత పార్టీ నేతలు చేస్తున్న పనితో తీవ్ర ఆవేదన చెందారు. సుష్మా కుటుంబం అంతా, చాలా బాధపడుతున్నారు. లక్నోలో ఓ హిందూ-ముస్లిం జంటకు విదేశాంగ శాఖ వేగంగా పాస్‌పోర్టు మంజూరు చేయడం, దంపతులను అవమానించిన ఆరోపణలపై ఓ పాస్‌పోర్టు అధికారిని బదిలీ చేయడం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ విషయం పై, బీజేపీ కార్యకర్తలు ఉన్మాదులులాగా సుష్మా పై సోషల్ మీడియాలో దాడి మొదలు పెట్టారు. ముస్లింలకు సహాయం చెయ్యటమే తప్పు అన్నట్టుగా చలరేగిపోయారు.

sushma 03072018 2

‘ఇటీవల ఆమె ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న కిడ్నీ ముస్లింది’ అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. కొందరు ‘సుష్మా బేగమ్‌’ అని సంబోధిస్తున్నారు. ఆమె పాకిస్థాన్‌ జెండా పట్టుకున్నట్లుగా మార్ఫింగ్‌ ఫొటోలు పెడుతున్నారు. ముఖేశ్‌ గుప్తా అనే వ్యక్తి హద్దులు మీరాడు. ‘ఇంటికి వచ్చాక మీ భార్యను కొట్టండి. ముస్లింలను బుజ్జగించడం ఆపమని చెప్పండి’ అని సుష్మ భర్త స్వరాజ్‌ కౌశల్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. ఇలా అనేక రకాలుగా, ఆమెను సొంత పార్టీ నేతలే క్షోభ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు మంత్రివర్గ సహచరులంతా మౌనముద్ర దాల్చారు. తప్పుచేసిన వారికి హోంమంత్రి నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవు.

sushma 03072018 3

విపక్షాల నుంచి ఆమెకు మద్దతు వెల్లువెత్తింది. కశ్మీరు మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆమెకు అండగా నిలిచారు. కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆమెకు మద్దతుగా నిలవకపోవడం దురదృష్టకరమన్నారు. సుష్మాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ వెనుక బీజేపీ సోషల్‌ మీడియా విభాగం ఉందని అసద్‌ ఆరోపించారు. మొత్తానికి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన దేశంలో, కేంద్ర మంత్రిగా ఉంటూ, ఒక ముస్లింకు సాయం చెయ్యటమే, ఆ కేంద్ర మంత్రి తప్పు. బీజేపీ ఉన్మాదానికి, ఇది పరాకాష్ట..

వరల్డ్ హెల్త్ బులిటెన్.. ఇది రిలీజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, చంద్రబాబు కాదు, ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి కాదు, మరే తెలుగు పత్రికో కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ, వరల్డ్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తుంది.. లేటెస్ట్ ఎడిషన్ లో, కిడ్నీ వ్యాధులు, డయాలసిస్ గురించి రాసారు. డయాలసిస్ సేవలు గురించి, ప్రజలకు అయ్యే ఖర్చులు, ఇలా అన్ని విషయాల గురించి రాసారు. ఇదే సందర్భంలో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి రాసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కిడ్నీ రోగులకు, 2500 నెల నెల పెన్షన్ అందిస్తుంది అని, డయాలసిస్ సేవలు అందిస్తుందని, మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని వరల్డ్ హెల్త్ బులిటెన్ లో రాసారు. ప్రపంచం మొత్తం, మన రాష్ట్రం అందిస్తున్న సేవల గురించి ప్రశంసలు అందించటమే కాదు, మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కూడా రాసారు.

whb 03072018 2

మరి మన రాష్ట్రంలో ఎదో జరిగిపోతుంది అని, రాష్ట్రంలో అసలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ఇలా మన రాష్ట్రం గురించి రచ్చ రచ్చ చేసే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చూడాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు మీ అంత జ్ఞానం లేదేమో కాని, వారు రాసింది కూడా ఒకసారి చూడండి. మీకు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉంది కదా, ఇలాంటివి కూడా చదవండి. రాష్ట్రంలో సమస్య లేదు అని కాదు, సమస్యలు ఉంటాయి. కాని వాటిని ప్రభుత్వం అడ్రస్ చెయ్యకపోతే మీరు చెప్పే దానికి అర్ధం ఉంటుంది. ప్రభుత్వం కిడ్నీ రోగుల కోసం ఇంత చేస్తుంటే, మీరు అసలు ఏమి చెయ్యటం లేదు అని, మీ నోటికి ఏది వస్తే అది చెప్తే కుదరదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే, మీరే గొప్ప జ్ఞానులు అని మీరు ఫీల్ అయితే చేసేది ఏమి లేదు. ఇక్కడ చూడవచ్చు http://www.who.int/bulletin/volumes/96/7/18-208207.pdf?ua=1

whb 03072018 3

పేదల బతుకుల్లో వెలుగులు నింపే ధ్యేయంతో ఉచిత డయాలసిస్ సేవల పథకాన్ని 2016 లో ప్రారంభించింది. దీని ద్వారా కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు, పింఛన్లు, సురక్షితమైన తాగునీటిని, మందులను అందజేస్తోంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి 7.6.2018 నాటికి వరకూ 2,666 రోగులకు 1,81,473 డయాలసిస్ సెషన్లు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ల నిర్వహణతోనే ప్రభుత్వం సరిపెట్టడంలేదు. ‘ఉద్ధానం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఉచిత కిడ్నీరోగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం 15 మొబైల్ మెడికల్ క్లినిక్ లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దేశంలోనే మొదటిసారి ఉచిత డయాలసిస్ సేవలను నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద ఈ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 18 డయాలసిస్ సెంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డ్నీ బాధితులకు ప్రభుత్వం సురక్షితమైన నీటిని అందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉద్దానంలోని పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందస మండలాల్లో రూ.16 కోట్లతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా చేస్తోంది.

ప్రస్తుత ఆధునిక జీవితంలో, ఎవరికి వారు బిజీ బిజీ... చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి దాక అంతే.. ప్రపంచం అంతా మొబైల్ ఫోన్ లో, కంప్యూటర్ లు, ఇంటర్నెట్, ఫేస్బుక్.. ఇదే ప్రపంచం... ఆట పాత, సరదా ఏమి లేదు.. ఏది ఉన్నా అంతా సెల్ ఫోన్ లోనే... పాత రోజుల్లో అయితే, ఆ ఆటలే వేరు, ఆ సరదాలు వేరు... ఇప్పుడు సగటు మనిషికి ఇవన్నీ దూరం అవుతున్నాయి.. జనం దూరం చేసుకున్న, ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది విజయవాడలోని పీవీపీ మాల్... పాతతరం ఆటలను నేటి తరానికి దగ్గర చేస్తోంది పీవీపీ మాల్ లో ఉన్న ఆన్షియంట్ లివింగ్ స్టోర్... వీక్ ఎండ్స్ లో, ఈ వారసత్వ ఆటలను మన ముందు ఉంచింది.

pvp 03072018 2

దాడి, పులిమేక, అష్ట చెమ్మ, జిగ్గాట, వామన గుంటలు, పచ్ఛిస్, చైనీస్ చెక్కర్ ఆటలను ఇక్కడ మళ్ళీ అందుబాటులో పెట్టారు. అవి వచ్చిన వాళ్లు సరదాగా ఆడేయొచ్చు...అవసరమైతే అచ్చం అప్పటిలాగే పందాలు కూడా కాయొచ్చు...అంతేకాదు...ఈ ఆటలు రానివాళ్లు...నేర్చుకుందామని ఆసక్తి చూపేవాళ్లకి ఈ ఆటలను నేర్పడానికి శిక్షణ పొందిన సిబ్బంది కూడా అక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. పిల్లలంతా ఒక్కచోటుకి చేరి ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది. చక్కగా స్నేహితులతో ముచ్చటిస్తూ ఆడే ఆటల్లో ఎంత సంతోషం ఉందని ఈతరానికి తెలియాలి అని నిర్వాహుకుకు అన్నారు .

 

pvp 03072018 3

మన నేటివిటీ కి సంబంధించిన ఆటలన్నీ ఆడించడమే కాకుండా సహజసిద్ధ వస్తువలనే వాడాలి అనే సందేశాన్ని అందరికి తెలియచేస్తున్నారు పీవీపీ మాల్ లో ఉన్న ఆన్షియంట్ లివింగ్ స్టోర్ ప్రతినిధిలు. వీకెండ్ సందర్భంగా సరదాగా వచ్చిన వారంతా ఈ ఆటలను చూస్తూ ఆడుతూ సంబర పడిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుతున్న ఈ ఆటలను గురించి వివరించడానికి అక్కడే ప్రతినిధులు ఉండటం తో ఆ ఆటను గురించి తెలుసుకొని మరి సరదాగా బెట్టింగ్లు పెట్టుకొని ఆనంద పడిపోతున్నారు. సిటీ లైఫ్ లో నిత్యం బిజీగా ఉండే పేరెంట్స్ కి.... వారమంతా చదువుల భారంతో అలసిన చిన్నారులకు పాతతరం ఆటలను పరిచయం చేస్తూ రెండుతరాల వారధిగా నిలుస్తోంది పీవీపీ ఆన్షియంట్ లివింగ్ స్టోర్.

జనసేన పార్టీ ఒక్కో అడుగు ముందుకువేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటన ముగిసేలోపు ఈ ప్రాంత నేతల్లో కొందరిని జనసేనలో కలుపుకొనేందుకు చేస్తున్న యత్నాలు ఫలితమిస్తున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రారంభించిన పోరాట యాత్ర పక్కా రాజకీయ వ్యూహంతో సాగుతోంది. వాస్తవానికి పవన్‌కల్యాణ్‌ పర్యటించేది, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేది తక్కువ సమయమే. మిగిలిన సమయం అంతా తన సహచర, అనుచర బృందంతో మంతనాలు సాగిస్తున్నారు. ఎవరో వచ్చి కలుస్తున్నారు. మంతనాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు, చెప్పుకోదగ్గ పేరు ఒక్కటి లేదు. ఊరు పేరు తెలియని వారు, లేకపోతే తెలుగుదేశం, వైసిపీ తీసుకోని వారు వచ్చి చేరుతున్నారు. వీరి వల్ల అసలు పవన్ కు ఉపయోగం ఏంటో, ఆయనకే తెలియాలి.

pk dadi 03072018 2

జనసేన పార్టీలో చేరుతున్న లిస్టు చూస్తే ఇలాగే ఉంది. తెలుగుదేశం నాయకుడు కోన తాతారావు, మాజీ కాంగ్రెస్‌ నాయకుడు బాలసతీశ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందినబొలిశెట్టి సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, ఇలా అందరూ వేరే పార్టీల వారే ఉన్నారు. అయితే, వీరు కూడా అసలు ఎవరో, లోకల్ ప్రజలు కూడా మర్చిపోయారు. ఇలాంటి వారిని తీసుకుని పవన్ ఏమి సాధిస్తాడో మరి. కొత్త రాజకీయం అని చెప్పే పవన్, ఇలా వేరే పార్టీల వారిని తీసుకుని మరో ప్రజా రాజ్యం చెయ్యటం తప్ప ఏమి కనిపించటం లేదు. అయితే, ఈ రోజు మాత్రం, కొంచెం గుర్తింపు ఉన్న నేత దగ్గరకు వెళ్ళాడు పవన్. గుర్తింపు ఉన్నా, ఏ పార్టీ కూడా ఆ నేతను తీసుకోలేదు.

pk dadi 03072018 3

పవన్ కళ్యాణ్ ఈ రోజు దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. దాడి వీరభద్రరావు చాలా కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పోయిన ఎన్నికల్లో జగన్ పార్టీలో చేరారు. అక్కడ జగన్ మార్క్ ట్రీట్మెంట్ తట్టుకోలేక తల బాదుకుని, చంద్రబాబు వద్దకు రావటానికి ప్రయత్నం చేస్తే, ఈయన హోసే ఫుల్ బోర్డు పెట్టారు. దీంతో రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే, పవన్ రాకతో, మళ్ళీ ఆక్టివ్ అవటానికి రెడీ అవుతున్నారు. జగన్ ని తట్టుకోలేదు, చంద్రబాబు రానివ్వడు, అందుకే పవన్ వెంట నడవటానికి రెడీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లిలోని దాడి నివాసానికి వెళ్లిన పవన్‌.. ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పవన్‌ను దాడి వీరభద్రరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. మొత్తానికి, ఇలాంటి వారిని చేర్చుకుని, పవన్ కొత్త తరహా రాజకీయం ఏమి చేస్తాడో మరి. మధ్యతరగతి వారికి టికెట్ లు ఇస్తా అని ట్వీట్ చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే. ఇలాంటి అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుల కోసం కొత్త పార్టీ పెట్టాడు అంటే, అది పవన్ దుస్థితి...

Advertisements

Latest Articles

Most Read