మరి కొద్ది సేపట్లో సీనియర్ ఐపిఏ అధికారి, ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. గత కొద్ది రోజులు నుంచి చంద్రబాబు ప్రభుత్వం పెగాసిస్ కొనుగోలు చేసారని, ఏబీ వెంకటేశ్వరరావు, అలాగే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ ని ఏబీ వెంకటేశ్వరరావు హయాంలో కొనుగోలు చేసారని, ఆయన ఇంటలిజెన్స్ చేఇఫ్ గా ఉన్న సమయంలోనే, ఈ పెగాసిస్ సాఫ్ట్ వేర్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ సాఫ్ట్వేర్ తీసుకుని, అప్పట్లో వైసీపీ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసారని కూడా అప్పట్లో వైసీపీ ఆరోపించింది. ఇప్పుడు ఈ రోజు వైసీపీ ఈ ఫేక్ ప్రచారాన్ని బయట చేసింది అంటే అర్ధం చేసుకోవచ్చు, ఏకంగా ఫేక్ ప్రచారాన్ని అసెంబ్లీ వరకు తీసుకుని వచ్చింది. ఈ రోజు అసెంబ్లీ మొదలు కాగానే, ఈ అంశం పైన బుగ్గన రాజేంద్రనద్ రెడ్డి, పెగాసిస్ అంశం పైన సభలో చర్చించాలని, స్పీకర్ ని కోరారు. అలాగే ఇదే అంశం పై చీఫ్ విప్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలో, కేవాలం ఒక గాలి వార్తా ఆధారం చేసుకుని, ఈ అంశం పై ఈ రోజు అసెంబ్లీలో చర్చించనున్నారు.

abv 21032022 2

ఈ నేపధ్యంలో ఏబి వెంకటేశ్వరరావు, ఈ అంశం పైన, వాస్తవాలు బయట పెట్టి, ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక ఆర్టిసి సమాధానంలో, ఈ ప్రభుత్వమే వివరణ ఇచ్చింది. అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, మా పోలీస్ డిపార్టుమెంటు, ఇలాంటి సాఫ్ట్ వేర్ ఏమి కొనలేదని, అని స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అయినా కూడా, వైసీపీ తమ ప్రభుత్వంలోనే ఈ సమాధానం వచ్చినా, ఫేక్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం, ఏబి వెంకటేశ్వరరావుని టార్గెట్ చేయటంతో, ఆయన వివరణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా, ఆయన వివరణ ఇవ్వటమే కాకుండా, తన పై ఆరోపణలు చేసిన వారి పైన, పరువు నష్టం దావా వేయటానికి కూడా ఏబి వెంకటేశ్వరరావు రెడీ అయ్యారు. దీని కోసం ఆయన చీఫ్ సెక్రెటరి అనుమతి కూడా కోరారు. ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు సచివాలయం వచ్చే అవకాసం ఉంది. మొత్తానికి, తన పై ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ ఫేక్ బ్యాచ్ మొత్తానికి, దబిడి దిబిడి వాయించేందుకు ఆయన సిద్ధం అయ్యారు.

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైసిపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. పిచ్చ బ్రాండుల పేరుతో వైసీపీ చేస్తున్న అరాచాకాన్ని ప్రశ్నిస్తూ టిడిపి ఆందోళన చేయటంతో, అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో, ఇతర చోట్ల కౌంటర్ చేస్తూ, పిచ్చ బ్రాండులు అన్నీ చంద్రబాబు హాయాంలోనే వచ్చాయి అంటూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసారు. తమ అనుకూల బ్లూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారు. అయితే దీనికి సంబంధించి, వెంటనే తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇచ్చిన ఒక ఆర్టిఐ సమాధానంతో, వైసీపీ ప్రచారాన్ని తిప్పి కొట్టింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, కేవలం వైసీపీ హాయాంలోనే, వందకుపైగా పిచ్చి బ్రాండులు మద్యం, రిజిస్టర్ అయినట్టు, ఆ సమాధానంలో ఉంది. కేవలం నాలుగు నెలల్లో, పిచ్చి పిచ్చ బ్రాండుల పేరుతో అవి వైసీపీ ప్రభుత్వంలోనే రిజిస్టర్ అయ్యాయి. ఒక పక్క మద్య నిషేధం అని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం, ఇలా విచ్చలవిడిగా బ్రాండులు తేవటమే కాకుండా, ఎదురు అవన్నీ చంద్రబాబు తెచ్చిన బ్రాండులు అంటూ, తప్పించుకునే ప్రయత్నం చేయటం అందరినీ షాక్ కు గురి చేసింది. అధికారంలో ఉండి కూడా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. https://twitter.com/JaiTDP/status/1505565706657869826

brands 21032022 2

ఇక దీని పై టిడిపి తీవ్రంగా స్పందించింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి వైసీపీ మద్యం పైన చేస్తున్న ప్రచారం పై కౌంటర్ ఇచ్చారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుద్ది ఉన్నవాడెవడైనా మద్యపాన నిషేధం చేస్తాడని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు బుద్ధిలేని పనులు చేస్తున్నాడు? నాసిరకం మద్యాన్ని కల్తీసారాని అధిక ధరకు విక్రయిస్తూ ఎందుకు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు? ఆడవారి తాళిబొట్లు తెగుతున్నాయని గతంలో గగ్గోలుపెట్టిన జగన్ రెడ్డి, ఇప్పుడు అవేతాళి బొట్లు తెంపుతూ, తన ఖజానా ఎందుకు నింపుకుంటున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. యథేచ్ఛగా రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రచారం చేసుకొని మరీ మద్యపాన విమోచన కమిటీని ఎందుకు తీసుకొచ్చాడు? తమ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని తాగవద్దని దానివల్ల ప్రాణాలు పోతాయని ప్రజలకు చెప్పలేని కమిటీతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం అమ్మకాలు, మద్యం తయారీ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము ముఖ్యమంత్రికి ఉంటే తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బండారం కేంద్రం మరోసారి బయట పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడింది అంటూ, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ఆర్ధిక నిబంధనలను ఉల్లంఘించినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన ప్రశ్నకు, కేంద్రం పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ, సంచలన విషయాలు తెలియ చేసింది. గతంలో పార్లమెంట్ లోని 377 నిబంధన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆర్ధిక అవకతవకల గురించి, పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో లేవనెత్తారు. రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన అంశాలకు , రాత పూర్వకంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక లేఖను విడుదల చేస్తూ, అందులో అనేక అంశాలు చెప్పారు. అందులో చాలా స్పష్టంగా ఏపి ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడిందని, ఇదే విషయం కాగ్ కూడా నిర్ధారించిందని కేంద్రం తెలిపింది. వైఎస్ఆర్ గృహ వసతి పధకం కోసం వినియోగించిన డబ్బులు, మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని, ఆర్ధిక శాఖ పేర్కొంది. మరో పక్క స్టేట్ డిజాస్టర్ ఫండ్ లో, కేంద్ర వాటాగా 320 కోట్లు, అదే విధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కూడా రాష్ట్రానికి ఇచ్చినట్టు తెలిపారు.

finance 210320222 2

అయితే 2020 మార్చ్ లో ముగిసిన ఆర్ధిక ఏడాదికి సంబందించిన కాగ్ నివేదిక ప్రకారం, వెయ్యి కోట్ల పైన డిజాస్టర్ మ్యానేజ్మెంట్ కింద జమ అయిన నిధులని, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ కు మళ్ళించినట్టు కేంద్ర ఆర్ధికశాఖ స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు పంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కాగ్ తన నివేదికలో పేర్కొంటూ, ఆ నిధులను మాత్రం రైతులకు అందచేయలేదని, కాగ్ చెప్పింది అంటూ, కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ఇది ద్రవ్య వినమయ చట్టాన్ని ఉల్లంఘించటమే అని కేంద్ర పేర్కొంది. ఇలాంటి మళ్లింపు ఆడిటింగ్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంది. అలాగే పేదల గృహాల కోసం, ఖర్చు చేసిన దాన్ని మూలధన వ్యయంగా ఎలా చూపిస్తారని కూడా కేంద్రం ప్రశ్నించింది. ఇలాంటి అవకతవకలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. మొత్తానికి మరోసారి కేంద్రం అసహనం వ్యక్తం చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

రాజధాని అమరావతి రైతులు, ఏపి సీఆర్డీఏకు, ఏపీ రేరాకు నిన్న లీగల్ నోటీసులు జారీ చేసారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం నిమిత్తం, భూ సమీకరణ ఒప్పందం ప్రకారం, భూములు తీసుకున్న రైతులకు, సీఆర్డీఏ, భూసమీకరణ ఒప్పందంలో, కొన్ని అంశాలను నిర్దిష్టంగా పేర్కొంది. ఈ భూములను మూడేళ్ళలో తాము అభివ్రుద్ధి చేసి ఇస్తామని, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నిట్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా ఆ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంది. 9.14 ప్రకారం, ఈ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి, రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా ఏడేళ్ళు అయినా కూడా ఈ రోజు వరకు కూడా తామకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో తాము జీవనోపాధి కోల్పయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తాము మానసిక క్షోభను భరిస్తున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయం చేసుకుని, మూడు పంటలు పండే భూమిని, రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం , ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం, తాము భూములు ఇచ్చామని వారు ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమతో చేసుకున్న భూ సమీకరణలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, వాటిని అభివృద్ధి మాత్రం చేయటం లేదని అన్నారు.

crda 21032022 2

దీంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని చెప్తూ, గజానికి నివాస స్థలానికి 50 రూపాయలు, వాణిజ్య స్థలానికి రూ.75 తమకు నష్ట పరిహారం చెల్లించాలని, ఈ విధంగా తమకు ఎకరానికి మూడు లక్షల వరకు నష్ట పరిహారం చెల్లించాలి, వారు నిన్న ప్రభుత్వానికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపి రేరా ఆక్ట్ అనేది, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం అమలులోకి వచ్చిన సమయంలో, ఏవైతే అసంపూర్తి ప్రాజెక్ట్ లు ఉన్నాయో, అవన్నీ కూడా ఏపి రేరాకు వస్తాయని పలు నిబంధనలలో పేర్కొన్నారని, ఈ విధంగా చూస్తే, సీఆర్డీఏ అనేది భూసమీకరణ చట్టంలో రైతులతో ఒప్పందం చేసుకున్నప్పుడు, ఇది కూడా డెవలప్మెంట్ కు సంబంధించింది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ అసంతృప్తిగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ని రేరా ఎందుకు టెక్ అప్ చేయలేదని కూడా లీగల్ నోటీసులు జారీ చేసారు. హైకోర్టు న్యాయవాది ఇంద్రనీల్ బాబు, నిన్న రైతుల తరుపున లీగల్ నోటీసులు పంపిస్తూ, ఈ వివాదం పరిష్కరించక పోతే, కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని, ఆ నోటీసుల్లో తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read