ముఖ్యమంత్రి చంద్రబాబు నెమ్మదిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నారు. దాదాపు ప్రతిరోజు కార్యకర్తల్తో సంభాషిస్తూనే ఉన్నారు. ఇంతవరకు తాము సాధించిన విజయాల్ని వివరిస్తూనే ఉన్నారు. భవిష్యత్‌ కార్యాచరణను వారికి తెలియ జేస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్‌ కు వస్తున్న గుర్తింపు వివరిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా, సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకు వెళ్తున్నారు. మరో పక్క, మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్, కేంద్రం చేస్తున్న అన్యాయం. ఇక్కడ వింత ఏంటి అంటే, కేంద్రం పేరు ఎత్తటానికే, ప్రతిపక్షాలకు తడిసిపోతుంటే, ప్రజల సహకారంతో, కేంద్రం పై పోరాటం చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుకు, అన్నిటికంటే ఎన్నికల్లో కలిసి వచ్చే అంశం ఇదే అనే అభిప్రాయం ఉంది. ఇప్పటి నుంచే ఇంత పక్కాగా ఉన్న చంద్రబాబు, ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి, చంద్రబాబు మార్క్ ఎన్నికల స్ట్రాటజీలు ఇంకా చాలా వస్తాయి. ఇక జగన్, పవన్ సంగతి చూద్దాం..

cbn 28062018 2

ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పాదయాత్రకు అనూహ్య స్పందనొస్తోంది అంటూ తన సొంత ఛానల్, పత్రికల్లో ఊదరగొడుతున్నాడు. నదుల పై వంతెనలు జగన్‌ దాటుకుంటూ అక్కడ జనాన్ని పోగేసి, ప్రత్యేకంగా ఒక సినిమా యూనిట్ ని తెప్పించి, అవి కవర్ చేసి, చూసారా మాకు వస్తున్న జనాలు అని చూపిస్తున్నారు. అప్పటి కప్పుడు అవి చూస్తే, ఇక సింహాసనం తమదేనన్న ధీమా ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమౌ తోంది. అయితే జగన్‌ ఆ ఊర్నుంచి వెళ్ళిన తర్వాత అసలా సంగతే జనం మర్చిపోతున్నారు. పాదయాత్రగానీ, జగన్‌ చేసిన ఉపన్యాసాలు, విమర్శలుగాని గుర్తుండడంలేదు. ఎంత సేపు చంద్రబాబు భజన తప్పితే, తాను వస్తే ఏమి చేస్తాను అనే సంగతి కూడా చెప్పటం మరచిపోతున్నాడు. దీంతో పోలింగ్‌కొచ్చేసరికి పరిస్థితి ఏలా ఉంటుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది.

cbn 280620183

ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితి మరీ వెరైటీ. ఎందుకు ఏమి చేస్తున్నాడో తెలీదు. ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలీదు. మోడీ అనే మాట పలకాలి అంటే భయం. ఓ పరిధికి లోబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఆ పార్టీలో, పవన్ తరువాత ఎవరూ అంటే, ఒక్క నాయకుడు పేరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అసలు ఇప్పటి వరకు, పార్టీ ఎన్నికల గుర్తు కోసం కూడా అప్లై చేసుకోలేదు. చివరకు వచ్చే సరికి, అసలు పోటీ చేస్తాడో కూడా డౌట్ గానే ఉంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియ పట్ల దృష్టిసారించడంలేదు. ఇలా ప్రతి పక్ష పార్టీలు రెండూ, చతికలబడి పోయాయి. ఎదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అని చెప్పటానికే కాని, ఒక్కరికి కూడా ప్రజలను తమ వైపుకు తిప్పుకునే లక్షణాలు లేవు. ప్రజలు వీరిద్దరినీ నమ్మి, రాష్ట్రాన్ని వీరి చేతిలో పెట్టే పరిస్థితి లేదు.

మనకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులు అంటే, మనల్ని లంచాల పేరుతో పీక్కుతినటం, ఒక పని చెయ్యటానికి వంద సార్లు మనల్ని తిప్పించుకోవటం, ఇలాంటి అభిప్రాయం మనకు ఉంది. అయితే, అందరూ ఇలాంటి వారు అని చెప్పటానికి లేదు. అన్ని వ్యవస్థల్లో మార్పులు వస్తున్నట్టే, ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుంది. అన్ని వ్యవస్థల్లో మంచి చెడు ఉన్నట్టే, ఇక్కడ కూడా చెడ్డ వారు ఉంటారు. అయితే, ఉద్యోగులు గురించి ఎప్పుడూ మాట్లాడుకునే మనం, వారు చేస్తున్న మంచిని కూడా మెచ్చుకోవాలి. తమకు జీతాలు పెంచినందుకు, మన రాష్ట్ర ఉద్యోగులు కొంత భాగాన్ని అమరావతికి ఇచ్చారు. తమకు విడుదల చేసిన పీఆర్సీ బకాయిల్లో 15 రోజుల వేతనాన్ని అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ఏపీ ఎన్‌జీవో జేఏసీ ఛైర్మన్‌ పి అశోక్‌ బాబు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రిని ఏపీ జేఏసీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్‌ బాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇచ్చిన 15 రోజుల వేతనం విలువ సుమారుగా రూ. 200 కోట్లేమేర ఉంటుందన్నారు.

employees 28062018 2

ఈ మొత్తంతో రాజధాని నిర్మాణంకు అవసరమైన భవన సముదాయాల నిర్మాణాలకు వెచ్చించాలని కోరినట్లు తెలిపారు. అయితే, రాజధానిలోనిర్మించే ఏదో ఒక భవనానికి ఉద్యోగ సంఘ భవనంగా పేరు పెట్టాలని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే అక్కడే ఉన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి నారాయణకు తగు విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 2015న తిరుపతిలో జరిగిన సన్మానం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 10వ పీఆర్సీ బకాయిలు చెల్లించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

employees 28062018 3

సీసీఎస్‌ ఉద్యోగులకు మరియు పెన్షనర్‌లకు మూడు విడతలుగా సెప్టెంబరు, అక్టోబరు, నవరంబరు మాసాల్లో నగదురూపంలో చెల్లించే విధంగా ఉత్తర్వులిచ్చారన్నారు. దాదాపు 4 లక్షల మందికి పెన్షర్లు మరియు 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు మొత్తం 8 లక్షల మందికి ప్రయోజనం చేకూర నున్నట్లు ఆయన వెల్లడించారు. పీఆర్సీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తము బకాయిలు చెల్లించడం ఇదే మొదటిసారన్నారు. షుమారు రూ. 3,940 కోట్లు మొత్తమును చెల్లిస్తారని చెప్పారు. 8 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యా పెన్షనర్లు బకాయిలు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తంచేశారు.

ఈనెల 20 నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి- ఇద్దరూ కడపలోని జడ్పీ ప్రాంగణంలో దీక్షకు దిగారు. వైద్యపరీక్షలు నిర్వహించిన రిమ్స్‌ వైద్యులు.. ఇద్దరి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా బీటెక్‌ రవి పరిస్థితి బాగోలేదని వివరించారు. పరిస్థితిని అంచనా వేసి తదనుగుణ చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కడపకు పంపించారు. ఆయన బుధవారం ఉదయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. చివరగా పోలీసులు 6 గంటల సమయానికి రవి దీక్షను భగ్నం చేశారు. అయితే సీఎం రమేష్‌ దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో, ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు, రకరకాల పద్ధతిలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువవచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

modi 28062018 2

ఇందులో భగంగా, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రమేష్ చేస్తున్న దీక్ష, రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష ప్రధానికి తెలపటానికి, ఆయన అపాయింట్‌మెంట్‌ అడిగారు తెలుగుదేశం ఎంపీలు. అయితే, అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని తిరస్కరించారు. ప్రధాని మిమ్మల్ని కలిసేందుకు టైం లేదని, ఇప్పుడు అపాయింట్‌మెంట్ కుదరదు అంటూ మన ఎంపీలకు తేల్చి చెప్పారు. దాంతో కాసేపట్లో ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. ఉక్కుశాఖ మంత్రిని మరోసారి కలిసి, చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు అందజేయనున్నారు.

modi 28062018 3

మరో పక్క కడపలో దీక్ష చేస్తున్న శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌పై దుమ్మెతి పోశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో జనాలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కడప నారాయణ జూనియర్‌ కళాశాల, జమ్మలమడుగు ఎస్వీ కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు భారీగా హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెదేపా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. మధ్యాహ్నం నుంచి దీక్షాశిబిరానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీక్షాశిబిరానికి ఇరువైపులా రెండు అంబులెన్స్‌లు ఉంచడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠలో అటు కుటుంబీకులు, ఇటు కార్యకర్తలు, శ్రేణులుండిపోయారు. సాయంత్రం సుమారు 200 మంది పోలీసుల వరకు శిబిరం వద్దకు చేరుకుని పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన బీటెక్‌ రవిని అంబులెన్స్‌లోకి చేర్చి రిమ్స్‌కు తరలించారు.

ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక భాగస్వామి. అయినా సరే, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గురించి వేస్తున్న ట్వీట్లు చూసి, ఆవేదన చెంది, ఒక సామాన్యుడిగా, పవన్ కళ్యాణ్ కు అర్ధమయ్యే బాషలో రాసారు.. ఆయన పోస్ట్ ఇదీ " పవన్ కళ్యాణ్ గారూ, నా పదవిలో ఉండి, నేనిలా రాయచ్చో లేదో నాకు తెలియదు. కానీ, ఆంధ్ర రాష్ట్ర విభజన వలన actual గా నష్టపోయిన వాళ్లలో నేనూ ఒకడిని కాబట్టి, ఆ అధికారంతో వ్రాస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ విభజించి, ఉత్తర ఆంధ్రని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలా? అసలు మీరు ట్విట్టర్ ద్వారా మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఆలోచించరా? ఆ సమయంలో మీకేదనిపిస్తే అది వ్రాసేస్తారా? మీరు ఒక నాయకుడు సర్. మీ వెనుకాల మీ ఫాన్స్ మాత్రమే కాదు, మీరు రాజకీయ నాయకుడిగా ఏదో చేస్తారని భావించే ఇంకొందరూ వున్నారు. మీకెన్ని ఓట్లు వస్తాయి అన్నది, ఇప్పుడు, స్పెకులేషన్ మాత్రమే కాబట్టి, దాన్ని పక్కనబెట్టితే, ఆంధ్ర దేశంలో ఈ రోజు వున్న Influencers లో మీరు ఒకరు. అందు చేత మీరు ఇంకా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి? ఇలా మీరు ఉత్తరాంధ్ర విభజన అంటూ క్యాజువల్గా వ్యాఖ్యానించడం, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీకు శోభస్కరంగా లేదు.

ఈవేళ మీరిచ్చిన 'ప్రత్యేక ఉత్తరాంధ్ర' ట్వీట్, ఆ ప్రత్యేకం యొక్క పూర్వాపరాలు,దాని, ఆర్ధిక స్థితిగతులు, ఇక వేళ విడిపోతే, మూడు జిల్లాలుగా మనగలిగిన స్థితి, ఇటువైపు, ఆంధ్ర రాయలసీమ పరిస్థితి, ఇంకా పసిబిడ్డ అని మనం చెప్పుకుంటున్న మన ఆంధ్ర, ఇప్పుడు మళ్లీ మీరు రేకెత్తిస్తున్న, ప్రత్యేక ఉత్తరాంధ్ర కుంపటిని తట్టుకోగల శక్తి ఉన్నదా, అసలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా, కొంత మంది కుహనా మేధావులు, నిరుద్యోగుల సృష్టా, ఇప్పటి వరకు, ఆ ప్రాంతంలో కూడా వినిపించని ఈ సమస్య, మీకు మాత్రమే ఎలా కనిపించింది, కనీసం పిలుపు ఇచ్చే ముందు, పది మందితో చర్చించారా, ఆర్ధిక స్థితిగతులు బేరీజు జరిగిందా, ప్రజా ఆమోదం ఉందా,........... ........ ఇవన్నీ అసలు మీరు ఆలోచించారా? లేక ఆ పిలుపు ఇస్తే passions ని పుట్టిస్తే, ఓట్లు వస్తాయని అనుకొన్నారా?

సమస్యలు లేవని కాదు సర్. వుండే ఉంటాయి. కానీ ఆ సమస్య పరిష్కారానికి, ప్రత్యేక రాష్ట్రం పరిష్కారమా? ఆ సమస్యలు ఏవి, పరిష్కారించాలంటే ఏమి చేయాలి, విభజిస్తే ఎలా పరిష్కారం అవుతుంది, ఇవేవీ ఎంపిరికల్ గా చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించేద్దాం అబ్దం కేవలం బాధ్యతా రాహిత్యం మాత్రమే. మీరింకా రాయలసీమకు యాత్రగా రాలేదు. అక్కడ కూడా ఎవరో, ఒకరో ఇద్దరో, ప్రత్యేక రాయలసీమ అనక మానరు. ఇప్పుడు మీ ప్రత్యేక ఆంధ్ర చూసిన తర్వాత మరీ ఉత్సాహం వస్తుందేమో, ఆ ఇద్దరు ముగ్గురికి. అప్పుడు, 'ప్రత్యేక రాయలసీమ' పిలుపు కూడా ఇలాగే ట్విట్టర్ ద్వారా ఇచ్చేస్తారా? అటు వైపు ప్రత్యేక ఉత్తర ఆంధ్ర, ఇటు వైపు ప్రత్యేక రాయలసీమ, ఇంక, 'ప్రత్యేక గోదావరి జిల్లాలు' మాత్రమే మిగిలి ఉండేది....ఆ పిలుపు కూడా ఇచ్చేయండి....ఆంధ్ర రాష్ట్రాన్ని, నాలుగు భాగాలుగా కోసేయ్యవచ్చు..! నాలుగేళ్ళ క్రితం విడిపోయినప్పుడు, మీకసలు సంభంధం లేదు. పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి, రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో తిరిగి, ఆ ప్రాంతాన్ని 'ప్రత్యేక రాష్ట్రం' చెయ్యాలంటే...మీ అనాలిసిస్ అయినిస్టియన్ కూడా ఉండి ఉండదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, దేనికవి సముద్రంలోని దీవులు కాదు సార్..! పలు ప్రాంతాలు, భౌగోళికంగానే కాదు, సామాజికంగా, వాణిజ్య పరంగా, పరిపాలనా పరంగా, వివాహపరంగా, కుటుంబ పరంగా, వంశాల పరంగా, మనుషుల మధ్య భావావేశాలు పరంగా....ఇలా ఎన్నో రకాలుగా ముడిపడి ఉంటాయి. ఇవేవీ తెలుసుకోకుండా, పట్టించుకోకుండా, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం అంటే, మీ ఓట్లకు కూడా అది ఉపయోగ పడదేమో సారూ...!

పైగా తెలంగాణా తో పోలిక వేరే..! నిజానికి తెలంగాణా అంటే, 1956 లో కలిసాము. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలు, నెల్లూరులు, ఎప్పుడూ, ఒక భాగమే కదా సారూ...! సమైక్యఆంధ్ర పోరాటంలో నాలుగేళ్ళ నాడు, అందరికంటే ఎక్కువ వైలెంట్ గా రియాక్ట్ అయింది.. విజయనగరం వాళ్లనే సంగతి మరచిపోయారా? కర్ఫ్యూ గుర్తులేదా? మీకిష్టమైన శ్రీశ్రీ గారు స్వర్గంలోఎక్కడున్నారో గానీ ...కన్నీళ్లు కార్చడమే కాదు, బెత్తంతో నాలుగు వాయిస్తారు.... మీ ప్రత్యేక ఉత్తరాంధ్ర ప్రతిపాదన వింటే గురజాడ నుంచి రాయప్రోలు దాకా, మిమ్మల్ని, ఇంకో నాలుగు పుస్తకాలు ఎక్కువ చదువు అంటారేమో...! సార్... ఆంధ్ర ప్రజలందరమూ, ఉత్తరాంధ్రతో కలిపి.... మీకు దణ్ణం పెడతాము. మళ్లీ విభజన చిచ్చు రగల్చకండి. మమ్మల్ని ఇలా బ్రతకనీయండి. ఇప్పటికే చచ్చి, బ్రతికి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి నానా చావులు చస్తున్నాము రాష్ట్రమంతా....! రాష్ట్రం మొత్తం మీకు పాదాభివందనం చేస్తాము... మమ్మల్ని విడదీయద్దు.....విభజన చిచ్చు రగల్చద్దు. ....... నమస్తే .....

చంద్రబాబు ప్రభుత్వం టాప్ గేర్ లో ఉంది... ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్.. రెండూ బాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది... పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పటం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం... కాని అవన్నీ పేపర్ లోనే ఉంటాయి.. బయట కనిపించవ్... కాని చంద్రబాబు ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ఇల్లు కాట్టిస్తున్నారు.. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో జులై 5న సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని బుధవారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ గృహ ప్రవేశాలుంటాయన్నారు.

housing 28062018 1

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా గత ఏడాది అక్టోబరులో లక్ష సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, నాలుగేళ్లలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మొత్తం 5.61 లక్షల ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని మంత్రి అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని కోరారు.

housing 28062018 3

ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా రూపాయి అవినీతికు తావు ఉండదు. మొత్తం డబ్బులు బ్యాంకు ఎకౌంటు లో పడతాయి. అంతే కాదు, మొత్తం ప్రక్రియ అంతా, ప్రతి స్టేజ్ రియల్ టైం లో ఆన్లైన్ లో ఉంటుంది. మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి... మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do . ఇలా ప్రక్రియ అంతా ఆన్లైన్ లో ఉంటుంది. అవినీతి అనే ఆస్కారం అసలు ఉండదు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read